సంకలనాలు
Telugu

వృద్ధులకు అవసరమైన ప్రత్యేక వస్తువులన్నింటికీ కేరాఫ్ అడ్రస్ 'ఓల్డ్ ఈజ్ గోల్డ్'

అసహాయ వృద్ధులకు బాసటగా ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ ఓ తల్లి బాధ నుంచి పుట్టిన వినూత్న ఆలోచనవృద్ధుల కోసమే ప్రత్యేకంగా డిజైన్ అవుతున్న పరికరాలు

team ys telugu
23rd Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సోమ్‌దేవ్‌ పృథ్వీరాజ్‌ తల్లి అనారోగ్యంతో ఎన్నో ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. తల్లికి ఊరట నివ్వాలని, తన పనులను తాను చేసుకునేలా పరికరాలను కొనివ్వాలని ఆరాటపడ్డారు పృథ్వీరాజ్‌. ఆయన ఆరాటమంతా వృధా ప్రయాసగా మిగిలింది. ఆ సమయంలో, పృథ్వీరాజ్‌ నిస్సహాయ వృద్ధుల అవసరాలను తీర్చేలా ఒక వ్యాపారాన్ని ఆరంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సాగించారు. దాని ఫలితమే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ ఈ రోజున దేశంలో సీనియర్‌ సిటిజన్ల అవసరాలను తీరుస్తున్న ప్రత్యేక విక్రయ కేంద్రం. వీరు అటు ఇటూ తిరగడానికి అనువుగా మొబిలిటీ పరికరాలు, టాయిలెట్‌ అవసరాలకు, భద్రతకు సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వృద్ధులకు, రోగులకు వారి దైనందిన అవసరాలకు అనువైన ఉత్పాదనలు, దుస్తులు, మధుమేహ పరికరాలు, వేసుకుని-తీసుకునేందుకు సులభంగా ఉండే బట్టలు, కీళ్ల నొప్పులవారికి సపోర్టు పరికరాలు, బాత్‌ రూమ్‌ పరికరాలు, తినుబండారాలు, ఫర్నీచర్‌ వంటివన్నీకూడా ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ స్టోర్‌లో లభ్యమవుతుంటాయి.

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ స్థాపకులు సోమ్‌దేవ్‌ పృథ్వీరాజ్‌, ఆయన భార్య కె.పి.జయశ్రీ, కంపెనీ ఈ-కామర్స్‌ అధిపతి సంజయ్‌ దత్తారి

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ స్థాపకులు సోమ్‌దేవ్‌ పృథ్వీరాజ్‌, ఆయన భార్య కె.పి.జయశ్రీ, కంపెనీ ఈ-కామర్స్‌ అధిపతి సంజయ్‌ దత్తారి


తల్లిదండ్రులను, వయోవృద్ధులైన వారి తల్లిదండ్రుల ఆలనాపాలనా చూస్తుంటే వారిపట్ల అభిమానం మరింత పెరుగుతుంది. ఇటీవల చాలామంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగ ఉపాధి నిమిత్తం వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. వారి తల్లిదండ్రులు స్వదేశంలోనే ఒంటరిగా ఉండిపోతున్నారు. దానివల్ల వారి బాగోగులు స్వయంగా చూసుకోవడానికి ఎన్నారైలకు వీలుపడదు. అలాంటివారికి మా స్టోర్‌ చాలా అనుకూలంగా మారింది. మా ఉత్పత్తుల ఆవశ్యకతను ఎన్నారైలు అర్థం చేసుకున్నారు. మా కస్టమర్లలో విదేశాల్లో ఉంటున్నవారే ఎక్కువ' అని సంజయ్‌ దత్తారి చెప్పారు. ఈయన ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ సంస్థ ఈ-కామర్స్‌ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతానికి చెన్నైలో ఒక ఈ-స్టోర్‌తోపాటుగా రెండు ఆన్‌లైన్‌ స్టోర్లను నిర్వహిస్తున్నారు. అనేక అనుభవాలు, ఉదాహరణల దరిమిలా ఉత్పాదనల్లో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు. పృథ్వీరాజ్‌, ఆయన భార్య కె.పి.జయశ్రీ ఒకరికొకరు తోడుగా సంస్థ ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంటారు. వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీవనసంధ్యలో హాయిగా జీవించడానికి అనువైనవి అమ్ముతున్నారు. కంప్యూటర్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందాక, కొన్నాళ్లు జర్నలిస్టుగానూ, కొంతకాలం సేల్స్‌ రంగంలోనూ పనిచేశారు. ఆ సమయంలోనే వృద్ధులకు సేవ చేయాలన్న తలంపు మొదలై క్రమంగా వ్యాపారంగా పరిణతి చెందింది. పృథ్వీరాజ్‌ నిరంతర కృషి ఫలితంగా దేశ విదేశాల్లోని కస్టమర్లకు సంస్థ చేరువ కాగలుగుతోంది.

ఇప్పటివరకు అందరూ వాడుతున్న సాధారణ పరికరాలకు సైతం వీరు కొత్త రూపాన్నిస్తున్నారు. అలాంటివాటిల్లో ఆధునిక వీల్‌ చైర్‌ కూడా ఉంది.

సంస్థ రూపొందించిన ప్రత్యేక వీల్ చైర్

సంస్థ రూపొందించిన ప్రత్యేక వీల్ చైర్


'మా సంస్థకు ఇప్పటివరకు కస్టమర్లనుంచి ఎలాంటి ఇబ్బందీ కలగలేదంటే నమ్మండి. మన దేశంలో చిలిపి దొంగతనాలు సహజం. అలాంటివి కూడా మా రిటైల్‌ స్టోర్‌లో ఎన్నడూ చోటు చేసుకోలేదు. మేము తీసుకునే చెక్కులుసైతం ఎప్పుడూ బౌన్స్‌ కాలేదు' అంటూ తమ కస్టమర్ల నిజాయితీ గురించి ఘనంగా చెప్పుకున్నారు పృథ్వీరాజ్‌.

ఆన్‌లైన్‌ అమ్మకాలు

ఆఫ్‌లైన్‌ అమ్మకాలు చేపట్టిన కొద్దిరోజులకే ఆన్‌లైన్‌ అమ్మకాలు జరపాలన్న నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, చెన్నైలోని అడయార్‌, అన్నానగర్‌లలో రెండు స్టోర్‌లు ఆరంభించిన మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడమైంది. చిరకాల కుటుంబ మిత్రుడైన సంజయ్‌ దత్తారి సలహా మేరకు ఈ-వాణిజ్య విభాగంలో ప్రవేశించారు. సంజయ్‌ ఈ వ్యవహారాలను చూసుకుంటున్నారు.

ఆన్‌లైన్‌ అమ్మకాలు పెరగడానికి కాస్త సమయం పట్టింది. ఎందుకంటే, మన దేశంలో ఏ వస్తువునైనా స్వయంగా చూసి, పరిశీలించిగానీ కొనరు. అందువల్ల ఆన్‌లైన్‌ అమ్మకాలకంటే స్టోర్‌లోకి వచ్చి కొనేవారి సంఖ్య కొద్దిగా ఎక్కువగానే ఉండేవి. క్రమేపీ ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు పుంజుకున్నాయి. మొదట్లో 20, 30 మంది స్టోర్‌కి వస్తే, మరో 20, 30మంది టెలిఫోన్‌ద్వారా ఆర్డర్‌ చేసేవారు. ఆన్‌లైన్‌లో మాత్రం 10, 15 ఆర్డర్లకు మించకపోయేవి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ అమ్మకాలు పుంజుకున్నాయి. ఈ మూడేళ్లలోనూ దాదాపు 20 వేల మంది వినియోగదారులకు సేవలు అందించామని చెప్పారు.

image


వీరు వృద్ధులకు జాగ్రత్తగా, అనువుగా సేవలందించడానికి తీసుకోవలసిన ఆరోగ్య సూత్రాలనుకూడా బోధిస్తారు. వృద్ధులలో చాలామంది శస్త్రచికిత్సల అనంతర స్థితిలో ఉంటారు. తమ స్టోర్‌కి వచ్చినవాళ్లందరికీ గైడెన్స్‌ అవసరం లేకపోవచ్చు, కానీ కస్టమర్లు తమ ఉత్పాదనల పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి ఉపకరిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

వృద్ధుల సౌలభ్యంకోసం అనేక ఉత్పాదనలు

దేశంలోని దాదాపు అన్ని మూలలకు తమ వస్తువులను అందజేయగలుగుతున్నారు. వీరి ఉత్పాదనలు చేరుతున్న ప్రాంతాల్లో ఉత్తరాంచల్‌, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌ వంటివి ఉన్నాయి. అండమాన్‌కు సైతం షిప్పింగ్‌ చేస్తున్నారు. సాధారణంగా విదేశాల్లో నివసిస్తున్నవారు అక్కడి నుంచే ఆర్డర్‌ బుక్‌ చేసి, స్వదేశంలో ఉన్న తమ పెద్దలకు అందజేయమని కోరుతుంటారు.

సవాళ్లు

కొన్ని కొన్ని వస్తువులపట్ల ఏమాత్రం అవగాహన లేకపోవడమే తాము ఎదుర్కొనే ప్రధాన సవాలు అంటున్నారు దత్తారి. 'వయసు మీరితే వ్యాధులు నొప్పులు రావా ? అనుభవించాల్సిందే' అనే భావన భారతీయుల్లో బాగా పాతుకుపోయిందంటున్నారు. 'ఆఖరికి, డైపర్‌ అనే పదం సైతం ఉచ్ఛరించడానికి ఇబ్బంది పడేవాళ్లుంటారు. వీటిని ఉపయోగించేలా వాళ్లను ఒప్పించగలగాలి. అందుబాటులో ఉన్న పరికరాలు, వస్తువుల గురించి చెప్పాలి' అన్నారు దత్తారి.

మరో పెద్ద సమస్య... తమకంటూ ఖర్చు చేయడానికి వృద్ధులు ఒప్పుకోరు. వాళ్ల పిల్లలు తమ అవసరాల నిమిత్తం ఏమయినా కొనడానికి తయారుగా ఉన్నాగానీ, పెద్దలు అంగీకరించరు. వృద్ధుల వాడకానికి సంబంధించినవి దేశంలో అంతగా తయారు కావడం లేదు. చాలామటుకు చైనానుంచి తెచ్చుకోవలసి వస్తుంది.

వృద్ధులకోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాక్‌ రెస్ట్‌

'ఈ సమస్య మాకుకూడా ఎదురైంది. మేము నిరంతరం వయోవృద్ధులకు ఉపకరించే వస్తువుల కోసం అన్వేషిస్తూనే ఉంటాం' అని దత్తారి తెలిపారు. తేలికగా వేయడానికి తీయడానికి అనువైన అడాప్టింగ్‌ బట్టల తయారీలో ఈ సంస్థ ప్రవేశించింది. వృద్ధులకు, వికలాంగులకు హుందాతనాన్నిచ్చేలా వాటిని రూపొందిస్తున్నారు. దేశంలో వ్యాపార విస్తరణకు చాలా అవకాశముందని, ఇక్కడ క్రమంగా సీనియర్‌ సిటిజన్ల సంఖ్య పెరుగుతోందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

image


ఆదాయ మార్గం

ఈ వెంచర్‌ పూర్తిగా రిటైల్‌ వ్యాపారమే కావడంతో చౌక ధరలతోనే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయిస్తున్నారు. ముఖ్యంగా పించన్‌దారులు భరించేలా శ్రద్ధ చూపుతున్నారు. ఈ వెంచర్‌లో పెట్టుబడినంతా స్థాపకులు ముగ్గురే భరించారు.

WEBSITE

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags