సంకలనాలు
Telugu

వండర్ స్కూల్ క్లాసులు వింటే వండర్స్ చేయొచ్చు !

నువ్వు క‌ల‌గ‌న్న‌ట్ట‌యితే అది త‌ప్ప‌క నెర‌వేరుతుంది. క‌ల‌గ‌న‌డ‌మే ఆల‌స్య‌మ‌ని అంటాడు వాల్ట్ డిస్నీ. కానీ ఈ ప్ర‌పంచంలో అలా ఎక్క‌డ జ‌రుగుతోంది? ఎంత మంది క‌ల‌లు నెర‌వేరుతున్నాయి? వృత్తీ ప్ర‌వృత్తీ ఏక‌మైన వాళ్ల‌ను వేళ్ల మీద లెక్కించ‌వ‌చ్చు. ప్ర‌తి ఒక్కరి మొహాల్లో అనుకున్న‌ది ఒక్క‌టీ అయిన‌ది ఒక్క‌టీ అన్న ఫీలింగ్ వ‌ద్ద‌న్నా క‌నిపిస్తుంది. డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర‌యిన వాళ్లే ఎక్కువ శాతం క‌నిపిస్తుంటారు. ఎంత కాలం మారినా ఈ ప‌ద్ధ‌తిలో మాత్రం మార్పురాలేదు. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు విజయం సాధించిన వాళ్లు ఇప్ప‌టికీ అరుదుగానే ఉన్నారు.

team ys telugu
17th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నేను నాలా జీవించాలి. నేను అనుకున్న‌ది సాధించాలి.. ఈ కోర్సు చేయాలంటే చేయాలి. ఈ జాబ్ కొట్టాలంటే కొట్టాల‌నే వాళ్ల సంఖ్య‌ బాగా త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం మ‌న చుట్టూ ఉన్న వాళ్లంద‌రూ డాల‌ర్ల‌తో త‌మ ఫీలింగ్స్ క‌న‌బ‌డ‌కుండా క‌ప్పేస్తున్నారుగానీ నిజంగా అనుకున్న‌ది అనుకున్న‌ట్టు చేయ‌గ‌లిగే వారు చాలా చాలా త‌క్కువ మంది..

ఎందుకిలా జ‌రిగింది? అనుకున్న‌ది అనుకున్న‌ట్టు ఎందుకు చేయ‌లేక పోయారు? మీ చేప ఎందుకు ఎండ‌లేదు? అంటే త‌మ‌కెవ‌రూ ఆ స‌మ‌యంలో స‌రైన గైడెన్స్ ఇవ్వ‌లేద‌ని కంప్లైంట్ చేసేవారు బోలెడు మంది. నిజ‌మే ఎంత‌టి అర్జ‌నుడికైనా ఓ శ్రీకృష్ణ ప‌ర‌మాత్మ దిశానిర్దేశం అస‌రం.. ఇలాంటి ఆలోచ‌న‌ల్లోంచి పుట్టిన‌దే వండ‌ర్ స్కూల్.

ఈ అవ‌స‌రం 9 నుంచి 12 వ త‌రగ‌తి చ‌దువుతున్న వాళ్ల‌కే ఎక్కువ‌. వీళ్ల‌కు త‌మ శ‌క్తి సామ‌ర్ధ్యాలేమిటి? తాము జీవితంలో సాధించాల‌నుకుంటున్న‌ది ఏంటి? అదెలా వీల‌వుతుంద‌ని తెలియ‌దు. వాళ్ల బ‌లాబ‌లాల‌ను తెలియ చేస్తే కార్య‌రంగంలో దూసుకు పోతారు. భ‌విష్య‌త్తును చ‌క్క‌గా తీర్చిదిద్దుకుంటారు. అన్న ఆలోచ‌న చేశారు కొంద‌రు యువ‌కులు. వండ‌ర్ స్కూల్ స్థాపించారు.

అభిషేక్, సౌరభ్, ప్రతీక్ - వండర్ స్కూల్ వ్యవస్థాపకులు

అభిషేక్, సౌరభ్, ప్రతీక్ - వండర్ స్కూల్ వ్యవస్థాపకులు


చ‌దువు చెప్పే స్కూళ్లే కాక‌.. ఏ చ‌దువు చ‌ద‌వాలో చెప్పే స్కూలు.. వారెవ్వా.. ఏం ఐడియా! ఒక ఐడియా జీవితాన్ని మార్చేయ‌డం పాత స్టైల్.. ఒక ఐడియా కొన్ని వంద‌లు.. వేల మంది జీవితాల‌ను మార్చేయ‌డం మ‌న స్టైలంటారు ఈ స్కూలు వ్య‌వ‌స్థాప‌కులు. మూడేళ్ల క్రితం రెండు స్కూళ్ల‌తో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించారు. నార్త్ ఇండియాలో ఇప్పుడు మొత్తం 20 స్కూళ్ల‌య్యాయి. విద్యార్ధుల‌కు త‌గిన స‌ల‌హా సూచ‌న‌లు అందిస్తూ నిర్మాణాత్మ‌కంగా ప‌నిచేసుకుపోతున్నారు.. వండ‌ర్ స్కూల్ నిర్వాహ‌కులు.

ప్ర‌తీక్ క‌పూర్, సౌర‌భ్ గుప్తా అనే బీటెక్ చేసిన యువ‌కులు, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఇన్ స్టిట్యూట్ లో ఎంబీఏ చేరారు. క్యాంప‌స్ ప్లేస్ మెంట్లో భాగంగా వాళ్లు లిబ్ సిస్ కి సెలెక్ట‌య్యారు. ఇది లైబ్ర‌రీ ఆటోమేష‌న్ కి చెందిన రంగం. ఇక్క‌డే వారికి అభిషేక్ మిట్ట‌ల్ ప‌రిచ‌య‌మ‌య్యాడు. మేనేజ్ మెంట్ సాఫ్ట్ వేర్ డెవ‌లప్ మెంట్లో అభిషేక్ ది కీ రోల్. అగ్నికి వాయుదేవుడు తోడ‌వ‌టం అంటే ఇదేనేమో. ఒక ఆలోచ‌న‌కు కార్య‌రూపం ఇచ్చే మ‌రొక శ‌క్తి తోడ‌వ‌డం వ‌ల్ల ఆ ఆలోచ‌న ఎక్క‌డికో వెళ్తుంద‌న‌డానికి వీరి కాంబినేష‌నే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

2013లో వీరికి ఎడ్యుకేష‌న్ ఫీల్డ్ లో ఉన్న గ్యాప్ ఏంటో అర్ధ‌మైంది. ఎవ‌రు ప‌డితే వాళ్లు.. ఏది ప‌డితే అది చ‌దివేస్తున్నారు. త‌ప్ప‌. ఎవ‌రికి వాళ్లు తాము ఏది చ‌ద‌వాలో అది చ‌ద‌వ‌ లేక పోతున్నార‌న్న‌ది క‌నిపెట్టారు. ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ప్ర‌తీక్‌ త‌న జాబ్ వ‌దుల‌కున్నాడు. అప్ప‌టికే సౌర‌భ్ ఎడ్యుకేష‌న్ మార్కెటింగ్ లో ఐదేళ్ల అనుభ‌వం పూర్తి చేసున్నాడు. ఇద్ద‌రూ క‌లిసి వండ‌ర్ స్కూల్ స్థాపించారు. ఇందుకు గూగుల్ లో ప‌నిచేస్తున్న అభిషేక్ టెక్నిక‌ల్ స‌పోర్ట్ అందింది. ప్ర‌తీక్ మార్కెటింగ్, ప్రొడెక్ట్ డిజైన్ అండ్ డెవ‌ల‌పింగ్ కి నాయ‌క‌త్వం వ‌హించాడు. ఇటు సౌర‌భ్ అటు అభిషేక్ అండ‌దండ‌లతో వండ‌ర్ స్కూల్ కి రూప‌క‌ల్ప‌న చేశాడు. మెరిక‌ల్లాంటి సూప‌ర్ వైజ‌ర్ల‌ను త‌యారు చేశారు. స్కూల్ మొద‌లు పెట్టాడు.

image


వండ‌ర్ స్కూల్ అందించే మెయిన్ కోర్స్ క్యాప్. అంటే కెరీర్ అవేర్ నెస్ ప్రొగ్రాం. ఇందులో 9 నుంచి 12వ త‌ర‌గ‌తి చ‌దివే విద్యార్ధుల‌కు వారి శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను క‌నుగొనే ప‌రీక్ష‌లు పెడ‌తారు. ఎవ‌రికి ఎందులో ఎలాంటి టాలెంట్ ఉంద‌ని ప‌రిశోధ‌న చేసి క‌నుగొంటారు. ఆయా రంగంలోని నిపుణుల స‌ల‌హా సూచ‌న‌ల‌తో ఈ కార్య‌క్రం సాగుతుంది. ఎవ‌రికి వారు స్వీయ విశ్లేష‌ణ సైతం చేసుకోవ‌చ్చు. త‌మ బ‌ల‌మేంటో బ‌ల‌హీన‌త ఏంటో బాహ‌టంగా చ‌ర్చించి ఒక నిర్ణ‌యానికి రావ‌చ్చు. ఇదంతా శాస్త్రీయంగా సాగుతుంది. ఇందులో ఒక్కో త‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ఒక్కో ర‌క‌మైన శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తుంటారు. తొమ్మిదో త‌ర‌గ‌తి వారికొక లాగా.. ప‌దో త‌ర‌గ‌తి వారికొక‌లాగ‌.. ప‌ద‌కొండు, ప‌న్నెండో త‌ర‌గ‌తి చ‌దివే వారికి మ‌రొకలాగా కార్య‌క్ర‌మాలు రూపొందించారు. వ‌ర్క్ షాపుల‌ను నిర్వ‌హిస్తారు. ఎవ‌రెవ‌రు ఎందులో రాణించ‌గ‌ల‌రో ఒక సూచ‌న చేస్తారు. ఛాయిస్ వాళ్ల‌దే అయినా.. మీరెందులో ఫిట్టో చెబుతుంది వండ‌ర్ స్కూల్..

మ‌న విద్యారంగంలో విద్య‌నైతే నేర్పుతారుగానీ, మీరిందులో రాణిస్తార‌ని ఎవ‌రూ ఎవ‌రికి చెప్ప‌రు. ఇది ఎవ‌రికి వారు తేల్చుకోవ‌ల్సిన స‌మ‌స్య‌. కానీ ఇక్క‌డ అలా జ‌ర‌గ‌డం లేదు. స‌రైన గైడెన్స్ లేక అంద‌రూ క‌లిసి ఒకే దారిలో న‌డిచేస్తున్నారు. లేకుంటే ఇప్ప‌టికీ ఎవ‌రే బ్రాంచ్ చ‌దివినా.. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు కావ‌డం ఏంటి? ఇందులో ఏదో పొర‌బాటు ఉంది. వృత్తంటే అదొక్క‌టే కాదు క‌దా? నిపుణులు, మేధాశ‌క్తి సంప‌న్నుల అవ‌స‌ర‌మున్న రంగాలు ఇంకా చాలానే ఉన్నాయి. గొర్రెల్లా అంద‌రూ క‌లిసి ఒక రంగంలో దూకితే మిగిలిన రంగాలు వెల‌వెల పోవ‌ల్సిందే.

దీనికి కార‌ణం.. తామేంటో త‌మ‌కు తెలీయ‌క పోవ‌డం. ఇంట‌ర్మీడియ‌ట్ లో లైఫ్ ట‌ర్న్ తీసుకుంటుంది. ఆ వ‌య‌సులో వారికి జీవితం మీద పెద్ద అవ‌గాహ‌న ఉండ‌క పోవ‌చ్చు. ఇది మంచి.. ఇది చెడ్డ‌..అన్న‌ బేధాలు తెలీక పోవ‌చ్చు.. రాణించ‌డ‌మంటే రాణిస్తారుగానీ త‌మ‌కు ఇష్ట‌మైన రంగంలోనా కాదా? అన్న‌ది ఆస‌మ‌యంలో వారికి పెద్ద‌గా తెలీదు. గ‌ట్టిగా మాట్లాడితే వారిని వారి త‌ల్లిదండ్రులు దిశానిర్దేశం చేస్తుంటారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను పిల్ల‌ల్లా చూడ్డం బాగా త‌క్కువ‌. వారికోసం పెడుతున్న ఖ‌ర్చు పెట్టుబ‌డిగా భావించ‌డ‌మే ఎక్కువ‌. పెట్టుబ‌డి పెడుతున్నాం కాబ‌ట్టి.. త‌మ పిల్ల‌లు ఈ చ‌దువే చ‌ద‌వాలి.. ఈ జాబే చేయాల‌న్న మంకు ప‌ట్టు ప‌డుతుంటారు. ఇది సరైంది కాదు.. వాళ్లేం కావాల‌నుకున్నారో వాళ్ల‌ను అదే కానివ్వాలి. ఎప్పుడైతే వృత్తీ ప్ర‌వృత్తీ క‌లుస్తాయో.. అదే అస‌లు సిస‌లైన జీవ‌న సాఫ‌ల్య‌త‌.. ఇది నూటికో కోటికో ఏ కొంద‌రికి మాత్ర‌మే ద‌క్కుతుంది. అది అంద‌రికీ ద‌క్కేలా చేయాల‌న్న‌దే వండ‌ర్ స్కూల్ నిర్వాహ‌కుల ఆకాంక్ష‌.

వీరి క్యాప్ ప్రొగ్రాంలో ముఖ్యంగా ఆరు కార్య‌క్ర‌మాలుంటాయి. అందులో మొద‌టిది. ఏదైనా సాధించాలంటే ఓపిక ఎంతో అవ‌స‌రం.. అందుకే బీ పేషెంట్ అంటారు. పిల్లి ఎలుక‌ను ప‌ట్ట‌డానికి ఎంతో సేపు కాపు కాస్తుంది. మ‌నం కూడా అంతే.. కోరుకున్న‌ది ద‌క్కించుకోవాలంటే అంత సేపు ఓపిక ప‌ట్ట‌క త‌ప్ప‌దు. రెండోది .. అసాధ్యం అన్న మాటే మ‌రిచిపోమంటారు. ఇంపాజిబుల్ అనే మాట‌ను మీ డిక్ష‌న‌రీలోంచి తీసేయ‌మ‌ని చెబుతారు. ఏదైనా సాధించాల‌నుకున్న‌ప్పుడు నోట్స్ రాయండి.. దానికి సంబంధించిన పుస్త‌కాలు చ‌ద‌వండి.. స్నేహితుల‌తో క‌లిసి ఆ విష‌యంపై డిస్క‌స్ చేయండి.

అనుకున్న‌ది సాధించ‌డానికి ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్దు.. మ‌న ల‌క్ష్యాల‌ను రాసుకుని వాటినెలా సాధించాల‌న్న‌దానిమీదే ధ్యాసంతా పెట్టాలి. వాటి అనుబంధంగా ఉన్న వాటిపైనా దృష్టి నిల‌పాలి. మ‌నం అనుకున్నది ఎప్పుడూ ప‌ద్మ‌వ్యూహం మ‌ధ్య‌లోనే ఉంటుంది. దాన్ని దాటుకుని వెళ్లాలంటే క‌ఠిన‌మైన మార్గాలేమిటో.. సుల‌భ‌మైన మార్గాలేమిటో మొద‌ట గుర్తించ‌గ‌ల‌గాలి. మ‌న సామ‌ర్ధ్యాన్ని అందుకు త‌గిన విధంగా అంచ‌నా వేసుకోవాలి. ఈ దారిలో వెళ్తే మ‌న‌కు సాధ్య‌మ‌వుతుందో లేదో చూసుకోవాలి. ఏది వీలైతే ఆ మార్గంలో పయ‌నించ‌డానికి సిద్ధ‌ప‌డాలి.

అన్నిటిక‌న్నా మించిన గుణ‌పాఠ‌మేంటో తెలుసా? ఓట‌మి నుంచి నేర్చుకునేది. ముందుగా ఓట‌మిని ఒప్పుకోవాలి. మ‌న త‌ప్పొప్పుల‌ను గుర్తించి స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఈ ప్ర‌పంచం ఎవ‌రికీ అనుకూలంగా ఉండ‌దు. ఎవ‌రికి వారు త‌మ‌కు తాము అనుకూలంగా మార్చుకోవ‌ల్సిందే.

అలా జ‌ర‌గాలీ అంటే ఎంతో జాగురూక‌త‌తో వ్య‌వ‌హ‌రించాలి. ఆల్వేస్ బీ అలెర్ట్.

ఇక అన్నిటిక‌న్నా ముఖ్య‌మైన పాఠం.. కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట ప‌డ‌కుండా అనుకున్న‌ది సాధించ‌లేం. స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చ‌డానికి ఏసీ ఆన్ చేసుకుంటే స‌రిపోదు.. అలా ఇల్లు వ‌దిలి బ‌య‌టికొచ్చి.. అది కూడా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఊర‌వ‌త‌ల‌కు వ‌స్తేగానీ ఆ గాలి ముక్కు పుటాల‌ను చేర‌దు. చిన్న గాలి పీల్చుకునేందుకే ఇంత ఎక్స‌ర్ సైజ్ చేయాల్సి ఉంటే, ఇక భ‌విష్య‌త్తును తీర్చిదిద్దుకునే విష‌య‌మై మ‌న‌మెంత‌గా క‌ష్ట‌ప‌డాలి? ఇది గుర్తించాల‌ని అంటారు వండ‌ర్ స్కూల్ నిర్వాహ‌కులు.

ఈ మూడేళ్ల‌ల్లో ప్ర‌తీక్ బృందం సాధించింది చాలా త‌క్కువ‌. సాధించాల్సింది ఎంతో వుంది. అయితే సంస్థ ఆరంభం బాగానే ఉంది కాబ‌ట్టి భ‌విష్య‌త్తు ఇంకా బావుంటుంద‌ని భావిస్తున్నారు. అస‌లే ఇది భ‌విష్య‌త్తును చ‌క్క‌దిద్దే కార్య‌క్రమం. ఒక విద్యార్ధి జీవితంలో త‌ల్లిదండ్రీ-గురువూ-దైవం పాత్ర ముఖ్య‌మైందంటారు. వీరితోపాటు విద్యార్ధుల జీవితాల్లో. మ‌రీ ముఖ్యంగా వారి మొహాల్లో వెలుగులు నింప‌డానికి వండ‌ర్ స్కూల్ నిర్వాహ‌కులు సైతం వ‌చ్చి క‌లిశారు.. ఎవ‌రైతే అనుకున్న‌ది అనుకున్న‌ట్టు సాధిస్తారో వారి మొహం వెలిగిపోతుంది. అలా వెల‌గాలీ అంటే అందుకు స‌రైన దిశానిర్దేశం జ‌ర‌గాలి. అలాంటి బృహ‌త్త‌ర బాధ్య‌త త‌మ భుజ‌స్కందాల‌పై ఉంద‌ని వండ‌ర్ స్కూల్ నిర్వాహ‌కుల‌కు బాగా తెలుసు!!!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags