సంకలనాలు
Telugu

స్టాండ‌ప్ కామెడీ అత‌ని స్టార్ట‌ప్...!

సోమ‌వారాలు సాయంత్ర‌మ‌యిందంటే చాలు, బెంగ‌ళూరు న‌వ్వుల్లో మునిగిపోతుంది. విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు, ప్రొఫెస‌ర్లు, ఇత‌ర‌త్రా ఉద్యోగులు .. అంద‌రూ ఓపెన్ మైకుల ముందు హాజ‌రైపోతారు. స్టాండ‌ప్ కామెడీలో త‌మ స‌త్తా పరీక్షించుకుంటారు. కెన్నెత్ సెబాస్టియ‌న్, ప్ర‌వీణ్ కుమార్, సందీప్ రావ్, క‌న‌న్ గిల్, బిస్వ క‌ల్యాణ్ ర‌థ్, సంజ‌య్ మన‌క్టాలా .. ఇప్పుడు బెంగ‌ళూరులో ఫేమ‌స్ స్టాండ‌ప్ క‌మెడీయ‌న్స్ గా పేరుతెచ్చుకున్న వీళ్ళంతా.. ఇలాంటి ఓపెన్ మైకుల ముందు రాటు తేలిన వాళ్ళే. వీరిలో సంజ‌య్ గురించి మ‌నం ఇప్పుడు మాట్లాడుకోవాలి.

bharathi paluri
13th Sep 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

బెంగ‌ళూరులో నేను ఈ స్టాండ‌ప్ కామెడీ మొద‌లుపెట్టేస‌రికి అస‌లెవ‌రికీ దీని గురించి తెలియ‌దు. ఒక‌ద‌శ‌లో నేను ప్ర‌వీణ్, సందీప్ మాత్ర‌మే వుండే వాళ్ళం... అని చెబుతారు సంజ‌య్. ఉపాధి కోసం బెంగ‌ళూరు వ‌చ్చాడు సందీప్. మొద‌ట్లో కైరో అనే ప‌బ్‌లో స్టాండ‌ప్ కామెడీ చేసేవాడు. అక్క‌డే అత‌నికి ప్ర‌వీణ్, సందీప్ ప‌రిచ‌య‌మ‌య్యారు.

ప్ర‌తి మంగ‌ళ‌వారం కైరోలో సందీప్ ప‌ర్ఫార్మెన్స్ వుంటుంది. ఒక నెల అయిన త‌ర‌వాత ఆ ప‌బ్ ఓన‌ర్ మ‌రో వ్య‌క్తిని తీసుకొచ్చారు. అత‌ని పేరే సందీప్. సందీప్ ద్వారా మ‌రికొంద‌రు మిత్రులు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇటు ప్ర‌వీణ్‌కి మ‌రో ఫ్రెండున్నాడు..అత‌నే బ్ర‌య‌న్. ఒక ర‌కంగా బెంగ‌ళూరులో స్టాండ‌ప్ కామెడీని బిజినెస్‌గా చూడ‌గ‌లిగింది.. సందీప్, ప్ర‌వీణ్‌లే.


న్యూయార్క్ లో పుట్టిన సంజ‌య్, అమెరికాలోనే కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసారు. ఆ త‌ర్వాత సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీలో ఎనిమిదేళ్ళు ప‌నిచేసారు. మొద‌టి నాలుగేళ్ళు మ‌న‌సు పెట్టి ప‌నిచేసిన సంజ‌య్‌కి ఆ త‌ర్వాత ఆ ఉద్యోగం బోర్ కొట్టేసింది. స్టాండ‌ప్ కామెడీ మీద మొద‌టి నుంచి ఆస‌క్తి వున్న సంజ‌య్ .. ఎక్క‌డ ఓపెన్ మైక్ దొరికితే అక్క‌డికి వెళ్ళిపోయేవాడు. రాన్రాను అత‌నికి త‌న ఉద్యోగం బోర్ కొట్టేసి ఈ స్టాండ‌ప కామెడీనే ఫుల్ టైమ్ చేయాల‌నిపించింది. అలా ఉద్యోగానికి రాజీనామా చేసేయాల‌నుకుంటుండ‌గా, అదే స‌మ‌యంలో ఇండియాలో ఉద్యోగం వ‌చ్చింది. అప్పుడ‌ప్పుడే బెంగ‌ళూరులో స్టాండ‌ప్ కామెడీకి ఆద‌ర‌ణ వ‌స్తున్న ప‌రిస్థితుల్లో సంజ‌య్‌కి బెంగ‌ళూరుకు రావ‌డం మంచిదే అనిపించింది.

లాస్ ఏంజిల్స్‌లోని ఓ పిజ్జా రెస్టారెంట్‌లో సంజ‌య్ త‌న మొద‌టి స్టాండ‌ప్ షో ఇచ్చారు. అక్క‌డ ప‌న్నెండు మంది క‌మెడియ‌న్స్ వుంటే, ప‌ది మందే ప్రేక్ష‌కులు. అయిదు నిముషాలు షో ఇవ్వాల‌ని స్టేజి ఎక్కిన సంజయ్ .. మూడు నిముషాల‌కి మించి న‌డ‌ప‌లేక‌పోయాడు. కాళ్ళు వ‌ణికి పోయాయి. మాట త‌డ‌బ‌డిపోయింది. మొత్తం మీద ఒక‌రు న‌వ్వారు. ఈ అనుభవం అదొక్క‌సారే కాదు.. మొద‌ట్లో ఆయ‌న చేసిన 25 షోల‌లో న‌వ్విన వాళ్ళ‌ని వేళ్ళ మీద లెక్క‌పట్టొచ్చు.

సంజ‌య్

సంజ‌య్


అలా అని సంజ‌య్ అధైర్య ప‌డ‌లేదు. ఒక ప‌ని చేయాల‌నుకున్న‌ప్పుడు, అందులో అణుమాత్రం స‌క్సెస్ అయినా.. దాన్ని అంత‌కంత‌కూ పెంచుతూ పోవాల‌నేది సంజ‌య్ న‌మ్మ‌కం. అందుకే మొద‌ట్లో ఒక నిముషం న‌వ్వితే, మెల్ల‌గా దాన్ని మూడు నిముషాల‌కు పెంచ‌గలిగాడు. అక్క‌డి నుంచి షో .. షోకూ నవ్వే వాళ్ళ సంఖ్య‌, నిడివి పెరుగుతూనే వున్నాయి. అత‌నితో మొద‌లైన స్నేహితులు మ‌ధ్య‌లోనే ఈ స్టాండ‌ప్ మ‌న వ‌ల్ల కాద‌ని వ‌దిలేసారు. సంజ‌య్‌కి మాత్రం ప్ర‌తిరోజూ చేసినా.. ఈ ప‌నిలో విసుగురాలేదు.. స‌రిక‌దా.. రోజు రోజుకూ అందులో కొత్త సంతోషం దొరికేది.

సంజ‌య్ బెంగ‌ళూరులో స్టాండ‌ప్ కామెడీ మొద‌లు పెట్టేసరికి అస‌లు ఆ న‌గ‌రంలో అదేంటో కూడా తెలిదు. ర‌సెల్ పీట‌ర్ చేసిన ఒక‌టో రెండో షోస్ త‌ప్ప బెంగ‌ళూరు వాసుల‌కు స్టాండ‌ప్ కామెడీ గురించి పెద్ద‌గా తెలియ‌దు. నిజానికి ఇదే సంజ‌య్‌కి మంచిద‌యింది. ఒక ఖాళీ కాన్వాస్ దొరికింది. జ‌నాల‌కు ఇదో కొత్త వినోదంలా క‌నిపించింది. దాంతో సంజ‌య్ రోజు రోజుకూ త‌న ప‌నితీరును మ‌రింత మెరుగుప‌ర‌చుకున్నాడు.

నిజానికి అతను ఇండియాలో పెర‌గ‌లేదు. ఇక్క‌డ సినిమాలు, అడ్వ‌ర్ట‌యిజ్‌మెంట్లు, మ్యూజిక్ ఆల్బ‌మ్స్ ఏవీ తెలియ‌వు. సాధార‌ణంగా ఇండియాలో ఎక్క‌డైనా హిందీ ఇంగ్లీష్ క‌లిపి కామెడీ చేస్తుంటారు. హిందీలోనే పంచ్‌లు వేస్తుంటారు. ఇది మొద‌ట్లో సంజ‌య్‌కి పెద్ద స‌మ‌స్య అయిపోయింది. అత‌ను కామెడీ ఎక్క‌డి నుంచి తీసుకురావాలి...? అందుకే అత‌ను త‌న జీవితంలోకే తొంగి చూసాడు. త‌న‌కెదురైన అనుభ‌వాలు, ప‌రిస్థితులతోనే కామెడీ ని సృష్టించాడు.

సంజ‌య్ మొద‌లు పెట్టిన‌ప్పుడు ప‌రిస్థితులు వేరు. ఇప్పుడు ఇండియాలో ప‌రిస్థితులు వేరు. ఇప్పుడు క‌మెడియ‌న్ల‌కి ఇండియాకంటే మంచి దేశం దొర‌క‌దు. టీవీ చానెల్స్, కార్పొరేట్ ఈవెంట్స్.. ఇలా ఒక్క‌టేంటి.. ఎక్క‌డ చూసినా క‌మెడియ‌న్ల‌కు ఎక్క‌డ లేని డిమాండ్. ఇక బెంగ‌ళూరు లాంటి క కాస్మొపాలిట‌న్ న‌గ‌రాల్లో హిందీలో కంటే, ఇంగ్లీష్ లోనే కామెడీ ఎక్కువ పండుతుంది.

బెంగ‌ళూరులో ఓపెన్ మైక్ లు కూడా ఎక్కువే. కొత్త‌గా క‌మెడియ‌న్లు కావాల‌నుకునే వాళ్ళ‌కి ఇది మంచి అవ‌కాశం. పాలిష్డ్ బాట‌మ్స్ అనే చోట‌, సంజ‌య్, ప్ర‌వీణ్, సందీప్‌లు మొద‌ట్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చే వాళ్ళు. అయితే, త‌ర్వాత వీళ్ళు ముగ్గురూ, దీని పేరు బెంగ‌ళూరు కామెడీ క్ల‌బ్‌గా మార్చేసి.. క‌మెడియ‌న్ కావాల‌నుకునే వాళ్లంద‌రికీ అవ‌కాశం క‌ల్పించారు. ఇప్పుడు ఇందులో ప్ర‌ద‌ర్శ‌న‌లివ్వ‌డానికి ప్ర‌పంచం నలుమూల‌ల నుంచీ ఎంక్వ‌యిరీలొస్తున్నాయంటే, ఇదెంత పాపుల‌ర్ అయిందో వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

Sanjay Manaktala with Russell Brand

Sanjay Manaktala with Russell Brand


ప్ర‌స్తుతానికి పెద్ద‌గా పోటీ లేదు క‌నుక‌, క‌మెడియ‌న్ల మ‌ధ్య స‌త్సంబంధాలున్నాయి. ఒక‌రికొక‌రు స‌హాయ‌స‌హ‌కారాలు ఇచ్చి పుచ్చుకుంటారు. క‌మెడియ‌న్లే కాదు.. వీరి అభిమానులు కూడా ఇప్పుడో క‌మ్యూనిటీగా ఏర్ప‌డ్డారు. ఈ షోలూ, ఇక్క‌డ వాతావ‌ర‌ణం న‌చ్చి, వ‌ర‌స‌గా మూడేసి వారాలు వ‌చ్చే ప్రేక్షకులు కూడా వుంటార‌ని సంజ‌య్ చెప్తున్నారు.

స్కిట్స్ ఎలా రాసుకోవాలో ఓ అమెరిక‌న్ క‌మెడియ‌న్ ద‌గ్గ‌ర కొన్ని చిట్కాలు నేర్చుకున్నాడు సంజ‌య్. ఒక తెల్ల‌కాగితాన్ని తీసుకోండి.. మీ ప‌రిస‌రాల్లోనే నవ్వు తెప్పించే అంశాలు ఏమేమున్నాయో ఆలోచించండి. నేనూ అలాగే మొద‌లుపెట్టాను. అమెరికాలో ప‌నిచేసే భార‌తీయ యువ‌కుడి ద‌గ్గ‌ర‌కి కేవ‌లం టెక్నాల‌జీ ప‌ర‌మైన విష‌యాలు తెలుసుకోవ‌డానికే అమెరిక‌న్ అమ్మాయిలు ఎలా వ‌స్తారో ఊహించుకున్నాను. అదే ఒక కామెడీ స్కిట్ అయింది. రాన్రానూ, మ‌రిన్ని విభిన్న మైన ఐడియాల‌తో ముందుకెళ్లాను. అని త‌న ప్ర‌యాణాన్ని వివ‌రించారు.

ఇప్పుడు త‌న జీవితాన్నే స్టేజ్ షోగా మార్చుకునే ప‌నిలో వున్నాడు సంజ‌య్. త‌న‌కు ఎదురైన ప్ర‌తి అనుభ‌వాన్ని నోట్ చేసుకుంటాడు. దాన్నుంచే కామెడీ స్క్రిప్టులు రాసుకుంటాడు. ఇలాంటి అనుభ‌వాల‌తో ప్రేక్ష‌కులు కూడా తొంద‌ర‌గా క‌నెక్ట్ అవుతారు క‌నుక‌, న‌వ్వులు బాగా పండుతాయి.

“కామెడీ అంటే స్టేజ్ మీద నిల్చుని న‌న్ను ఎవ‌రు తీసుకుంటారా అని ఎదురు చూడ్డం కాదు. నిన్ను నువు మార్కెట్ చేసుకోవాలి. బ్లాగ్‌లు, యూట్యూబ్ వీడియోలు, సోష‌ల్ మీడియా.. ఇలా అన్ని ర‌కాలుగా ప్ర‌చారం చేసుకోవాలి. ఎంత బాగాలేక‌పోయినా.. ఒక వీడియోకి త‌క్కువ‌లో త‌క్కువ వెయ్యి వ్యూస్ వచ్చినా.. మీ స్టేజ్ మీద చూసే వంద మంది కంటే 900 ఎక్కువే క‌దా. ” అని త‌న స‌క్సెస్ సీక్రెట్ చేస్పారు సంజయ్.

అందుకే ఇప్పుడొస్తున్న కుర్రాళ్ళు. కేవ‌లం స్టేజీని, ఓపెన మైక్‌ల‌నీ న‌మ్ముకోవ‌డం లేదు. రోజు రోజుకూ మారిపోతున్న టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటున్నారు. స్టేజ్ మీద కామెడీ చేయ‌డమంటే కామెడీ ఏం కాదు. స్టేజ్ మీద ఏం చేయడానికైనా సిద్ధపడితేనే సక్సెస్ అవుతావని ఎవ‌రో క‌మెడియ‌న్ చెప్పిన మాట‌ల్ని సంజ‌య్ గుర్తు తెచ్చుకున్నారు. “ నీకు స్టేజ్ మీద ఊహించిన దానికంటే ఎక్కువ న‌వ్వులు పూసాయంటే, ప్రేక్ష‌కుల్లో నీ స్నేహితులు అయినా వుండివుండాలి.. లేదా నువ్వో సెలిబ్రిటీ అయినా అయివుండాలి” అని కామెడీ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో వివ‌రించారు సంజ‌య్.

దేని మీదా ఆస‌క్తి చూపింని కార్డియోల‌జిస్టుల ముందు కూడా పెర్ఫార్మ్ చేయ‌గ‌లిగిన‌ప్పుడే నిజ‌మైన క‌మెడియ‌న్ అనిపించుకుంటాడ‌ని సంజ‌య్ చెప్తారు. ఇటు షోలు చేస్తూనే అటు బ్రాండ్స్‌కి ప్ర‌క‌ట‌న‌లు రాయ‌గ‌ల‌గాలి. ఇటు యూ ట్యూబ్‌కి వీడియోలు తీయ‌గ‌ల‌గాలి... ఈ రంగంలో తృప్తి ఎంతుంటుందో.. ఎదురు దెబ్బ‌లు కూడా అంతే వుంటాయ‌ని చెప్తారు సంజ‌య్.

ఇత‌ర క‌మెడియ‌న్ల‌ను చూసి నేర్చుకోవ‌డంలో త‌ప్పులేదు కానీ, కాపీ కొట్టొద్దంటారు సంజ‌య్. కామెడీ అంటే స్టేజ్ మీద వుండే గంట సేపు చేసే ఉద్యోగం కాదు. రోజంతా ప్ర‌తి సంఘ‌ట‌న‌నూ ప‌రిశీలించ‌డం, రాసుకోవ‌డం, చ‌దువుకోవ‌డం, అధ్య‌య‌నం చేయ‌డం .. ఇదంతా కమెడియ‌న్ చేసే ఉద్యోగ‌మే.. అని కొత్తగా ఈ రంగంలోకి వ‌చ్చే వారికి స‌ల‌హా ఇస్తున్నారు. . సంజ‌య్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags