సంకలనాలు
Telugu

పన్నెండేళ్ల వయసులోనే పదిమందికీ సేవ

పేదలకు 400 సైకిళ్లు పంపిణీ చేసిన అమెరికన్సైకిళ్లపై స్కూళ్లకు వెళ్తున్న వందలాది విద్యార్థులుచదువుకునే వయసులోనే సేవ చేస్తున్న థామస్

CLN RAJU
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

తొలిసారి భారత్ వచ్చినప్పుడు థామస్ హిర్కాక్ వయసు పన్నెండేళ్లు. బచ్ పన్ బచావో ఆందోళన్ (సేవ్ చైల్డ్ హుడ్ మూవ్ మెంట్) లో అతని తండ్రి డేవిడ్ చురుగ్గా పాల్గొన్నాడు. బిజినెస్ ట్రిప్ పై వచ్చిన డేవిడ్ జార్ఖండ్, బిహార్ లలో బాలకార్మికుల విముక్తికోసం పోరాడాడు. ఇక్కడ అక్షరాస్యత 20 శాతానికి లోపే..! చాలా మంది బాలికలు ప్రాథమికోన్నత విద్య కూడా పూర్తి చేయలేదు.


సైకిళ్లు పంపిణీ చేస్తున్న థామస్

సైకిళ్లు పంపిణీ చేస్తున్న థామస్


ఝార్ఖండ్ పూర్తిగా అడవులతో నిండిన రాష్ట్రం. దేశంలో అత్యంత విలువైన ఖనిజాలు ఇక్కడ లభిస్తాయి. అడవుల్లో ప్రయాణం చాలా కష్టం. గనులు... ఇక్కడ బాల కార్మికులను పెంచి పోషిస్తున్నాయి. ఖనిజ సంపద విరివిగా ఉన్న ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా మంది బాలికలు చదువుకు దూరంగా ఉంటున్నారు. ఇందుకు అనేక కారణాలు.. స్కూళ్లు లేకపోవడం, ఉన్నా దూరంగా ఉండడం, మరుగుదొడ్లు లేకపోవడం, బాలికల విద్యపై పెద్దల్లో అపోహలు.. ఇలా ఎన్నో..! ఇక్కడ బాలికల అక్షరాస్యత 20 శాతానికి లోపే. చాలా గ్రామాల్లో అమ్మాయిలు మిడిల్ స్కూల్, హైస్కూల్ కు కూడా వెళ్లలేదు.

ఒకవేళ వెళ్లినా ఆ ప్రయాణం చాలా దుర్భరంగా ఉండేది. స్కూల్ కు వెళ్లే మార్గంలో పాములు, చిరుతలు కనిపించేవి. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగలేదని కూడా చెప్పలేం. అయినా అమ్మాయిలు స్కూల్ కు వెళ్లాలని భావిస్తున్నారు. కానీ వెళ్లడానికి 10 కిలోమీటర్లు వెళ్లాల్సిందే.. రావాలంటే అంతేదూరం నడక తప్పదు.

థామస్ ఈ దుస్థితిని చూసి చలించిపోయాడు. ఎలాగైనా పేదరికంలో ఉన్న వీళ్లకు సాయం చేయాలనుకున్నాడు. అయితే దానికి సమధానం పేపర్లు, పెన్సిళ్లు కాదు.. సైకిళ్లు. చాలా స్కూళ్లు గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటే వాళ్లు స్కూల్ కు వెళ్లడమే సరైన మార్గం. డేవిడ్ కుమారుడు వీళ్లకు సాయపడేందుకు సిద్ధపడ్డాడు.

సొంతూరు ఫిలడెల్ఫియా వచ్చేసిన థామస్.. తను చదువుతున్న స్ట్రాట్ పోర్డ్ ఫ్రెండ్స్ స్కూల్ కు వెళ్లాడు. స్నేహితులను పోగేసి.. 36వేల రూపాయలు సేకరించి 10 సైకిళ్లు కొన్నాడు. ఇది 2008లో జరిగింది. థామస్ మొదటి ప్రయత్నం సక్సెస్ అయింది. ఇప్పటి వరకూ అతడు 400కు పైగా సైకిళ్లని పిల్లలకు పంపిణీ చేశాడు. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ గ్రూప్ కు 'బైక్ క్లబ్' అని పేరు పెట్టాడు. 2011 నాడికి 54 వేల రూపాయాలు సేకరించాడు. భారత్ లోనే తయారైన ఈ సైకిళ్ళు.. అటవీ ప్రాంతాల్లో ప్రయాణాలకు వీలుగా రూపొందించారు. ఎక్కువకాలం మన్నేందుకు వీలుగా ప్రతి సైకిల్ తో రిపేర్ కిట్ కూడా అందించారు. బైక్ లాంటి ఈ సైకిల్ పై నలుగురు సులువుగా ప్రయాణించవచ్చు. అందుకు తగ్గట్టుగా దీన్ని రూపొందించారు.

థామస్ కు పిల్లల ఆశీర్వాదం

థామస్ కు పిల్లల ఆశీర్వాదం


చాలా మంది పిల్లలకు ఈ బైక్ ను ఎలా నడపాలో తెలీదు. దీంతో వాళ్లకు నేర్పించాలని థామస్ నిర్ణయించుకున్నాడు. “సైకిళ్లు ఇచ్చేది వాళ్లను మరింత బలోపేతం చేయడానికే. వాళ్లను శక్తిమంతులుగా తీర్చిదిద్దడం చాలా అద్భుతమైన విషయం” అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు థామస్.

అన్నిటికంటే ముఖ్యంగా భారత్ లో కొంతమంది పిల్లలకు ప్రయాణ సౌకర్యం కలిగింది. బైకుల వల్ల వాళ్లు చదువుకునే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా ఝార్ఖండ్, బిహార్ లలో బాలికలకు తమ భవిష్యత్తుపై భరోసా ఏర్పడింది. ఇప్పుడు వాళ్లంతా సమీప గ్రామాలకు వెళ్లి ఇతరులకు వాళ్ల మానవ హక్కులపై చెప్పగలుగుతున్నారు.

థామస్ వయసు ఇప్పుడు పదహారేళ్లు. వీలయినప్పుడల్లా తండ్రితోపాటు భారత్ వస్తున్నాడు.. ఝార్ఖండ్ వెళ్లి సైకిళ్లు పంపిణీ చేస్తున్నాడు.. గ్రేట్ కదా..!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags