సంకలనాలు
Telugu

18 ఏళ్ల షాలిన్‌ జైన్ బెడ్‌ రూం స్టార్టప్.. ఇప్పుడో అంతర్జాతీయ సంస్థ

ashok patnaik
12th Jul 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

దశాబ్ద కాలం నుంచి భారతీయుల ఆలోచనా ధోరణి మారుతోంది. సంప్రదాయ ఉద్యోగాలకు బదులు ఆంట్రప్రెన్యూర్‌గా మారేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కావాలనేది ఒకప్పటి మాట. చిన్న వయసు నుంచే పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు తాపత్రయపడ్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మరింత వేగం పెరిగింది. మౌలిక సదుపాయాలు, మెంటార్షిప్, పబ్లిక్ రిలేషన్స్ / మీడియా.. ఇలా అన్నీ అందుబాటు ఉండటంతో విషయాలు జనానికి మరింత చేరువవుతున్నాయి. 

image


టెన్ మైల్స్ అనే పేరుతో (ఇప్పుడు హ్యాపీ ఫాక్స్) కస్టమర్ సపోర్ట్‌తో సాఫ్ట్‌వేర్ సాయం అందించడానికి షాలిన్ జైన్ ఓ సంస్థను ప్రారంభించారు. చెన్నై కేంద్రంగా 2000 లో దీనికి బీజం పడింది. ఆశ్చర్యం ఏంటంటే.. జైన్ అప్పటికి ఇంకా ఓ కాలేజీ స్టూడెంటే. పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. కానీ అతనిలో ఉండే ఆ ప్యాషన్‌కు వయస్సు ఏ మాత్రం అడ్డంకి కాలేదు. 1999లో వంద మంది ఉద్యోగులున్న సంస్థలో తానొక ఉద్యోగి. ఆ కంపెనీలో తానే అతి పిన్నవయస్కుడు. ఇష్టమైన పని కావడంతో చాలా కష్టపడి పనిచేసేవాడు. కాలేజీలో తానకు నచ్చని క్లాస్ సైతం వదిలేసి.. పనిచేసేవారు. కానీ చదువుతూ.. ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం వల్ల అటెండెన్స్ తగ్గింది. మొదటికే మోసం వస్తుందని.. లెక్చరర్లు సూచించారు. దీంతో చేసేది లేక... ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కానీ వారం రోజులకే షాలిన్‌కి మరో అవకాశం వచ్చింది. కానీ దాన్ని స్వీకరించలేదు. మరోసారి ఉద్యోగంలో చేరాలని అనుకోలేదు.

ఈ సారి సొంతంగా ఏదైనా చేద్దామనే అనుకున్నారు. అప్పుడు ప్రారంభమైందే 'టెన్ మైల్స్'. అయితే ఇందుకేదో.. ఆఫీస్ తీసుకోవడమో.. లేక. ఓ నలుగురైదుగురు ఫ్రెండ్స్‌తో జత కట్టడమో చేయలేదు. సింపుల్‌గా తన బెడ్ రూం నుంచే టెన్ మైల్స్ సంస్థను ఆపరేట్ చేశారు. కొత్త తరంతో దూసుకొచ్చిన ఆ కంపెనీ ఎంతో వేగంగా ఎదిగింది. ఆ సంస్థే ఇప్పుడు 'హ్యాపీ ఫాక్స్' గా ఎదిగింది.

షాలిన్‌ జైన్‌తో యువర్ స్టోరీ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ-మెయిల్స్ , స్కైప్ ద్వారా షాలిన్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. తాను ఎదుర్కొన్న సవాళ్లు, భారత్ నుంచి తమ బేస్‌ని అమెరికాకు మార్చడం, సంగీతంపై మమకారం పెంచుకోవడం లాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను జైన్ వివరించారు.

'' నా జీవితంలో బెస్ట్ ప్రొగ్రామర్ అంటే చెన్నైలో మా పక్కింటి వ్యక్తి. కోడ్,యాప్స్‌పై నా కోసం పనిచేసిన వ్యక్తి అతను. ఇద్దరం వీకెండ్‌లో పనిచేసేవాళ్లం. తన ఐడియా ప్రోడక్టుగా మారింది కూడా అక్కడే. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కంపెనీ ప్రారంభించాను. నా స్టార్టప్ ఏర్పాటుకు మా పక్కింటి అబ్బాయి ఎంతగానో హెల్ప్ చేశాడు. విస్తృతమైన మార్కెట్‌కు అవసరమమయ్యే ప్రొడక్టులు తయారు చేయడం అంటేనే నాకు ఇష్టం '' - షాలిన్ జైన్. 

2001 లో హ్యాపీ ఫాక్స్ నుంచి స్క్రీన్ వైఫై వెలువడింది. జనం ఇష్టపడే ఎన్నో ప్రాడక్టులను తాము తయారు చేశామని చెబుతారు షాలిన్. వినూత్నమైన ప్రొడక్టులు విడుదలయ్యాకే... చాలా మంది తమతో కలసి పనిచేయడానికి ముందుకొచ్చారని, ఇప్పటికీ వస్తూనే ఉన్నారని చెబుతారు జైన్. గతంలో బెడ్ రూం నుంచి ప్రారంభమైన కంపెనీయే ఇప్పుడు గ్లోబల్ సంస్థగా మారిందంటే అదో అరుదైన అనుభూతి.

image


ఏంటీ హ్యాపీ ఫాక్స్ ?

హ్యాపీ ఫాక్స్ అనేది ఓ ప్రాక్టికల్ హెల్ప్ డెస్క్ , కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్. క్లైంట్లకు కంపెనీకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి మెరుగైన సేవలను అందించేందుకు ఇది దోహదపడ్తుంది. ఈమెయిల్స్,వెబ్, చాటింగ్, ఫోన్ వంటి వివిధ మార్గాల ద్వారా క్లైంట్ల నుంచి వచ్చిన సమాచారాన్ని ఒక్క చోటికి చేర్చడం ఈ సాఫ్ట్‌వేర్ పని. ప్రతీ క్లైంట్‌కూ ఓ టికెట్ నెంబర్ ఇవ్వడం.. దాని స్టేటస్ ఏంటో తెలుసుకోవడం ఇందులో సులువు. దీని వల్ల కస్టమర్ అవసరాన్ని 2 గంటల్లో పూర్తిచేసేందుకు 95 శాతం వరకూ సులువు అవుతుందనేది హ్యాపీ ఫాక్స్ మాట. క్లౌడ్ బేస్డ్ కావడం, మొబైల్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయడం, 35 భాషలనూ ఈ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ చేయడంతో వివిధ దేశాలకు ఈ సాఫ్ట్‌వేర్ పరిచితమైంది. ప్రస్తుతం వార్నర్ బ్రదర్స్, సైనైజర్, వాల్‌పూల్ వంటి అంతర్జాతీయ సంస్థలు వీళ్లకు క్లైంట్లుగా ఉన్నారు.

image


'' నేనింకా ప్రారంభంలోనే దశలోనే ఉన్నానని... ప్రతీ రోజూ అనుకుంటా. చేయాల్సింది ఇంకా చాలా ఉందని సమాధాన పర్చుకుంటాను. దేన్నైనా గొప్పగా చేయకపోతే.. కోట్ల మంది జనాభాలో నువ్వూ ఒకడిగా మిగిలిపోతావు. వాళ్లకూ నీకూ తేడా ఉండదు.. అనే సిద్ధాంతాన్ని గొప్పగా నమ్ముతాను '' - షాలిన్

బద్దకం వల్లే.. వర్క్ ఫ్రమ్ హోం అన్నారు

'కాలేజి అటెండెన్స్ కోసం నా ఉద్యోగాన్ని వదులుకున్నా. మంచి గ్రేడ్‌తో పాస్ అయితే ఫ్యాన్సీ బి-స్కూల్ ఎంట్రీ దొరుకుతుందని ఉద్యోగానికి వెళ్లలేదు. తర్వాత ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ తో వచ్చిన తర్వాతి ఉద్యోగాన్ని కూడా వెళ్లాలని అనిపించలేదు. ఆ క్షణంలో ఎవరికైనా టెన్ మైల్స్ క్లిక్ అవుతుందని చెప్పితే నవ్విపోయే వారు. బద్దకం వల్లో... బయట పనిచేయడం ఇష్టం లేకో.. వర్క్ ఫ్రమ్ హోం అనేపేరు చెప్పి తప్పించుకుంటున్నాడు.. అనే విమర్శలూ విన్నాను.. ' అంటూ.. ఆ రోజులను గుర్తుచేసుకుంటారు జైన్. టెన్ మైల్స్ కోసం ఉద్యోగులను తీసుకోవడం కూడా అప్పట్లో ఓ పెద్ద సవాలుగా మారింది. తన ఆలోచనను అర్థం చేసుకుని... పనిచేసే వారు దొరక్క నానా పాట్లుపడినట్టు చెప్తారు. జీవితంలో మరచిపోలేని సవాలేదైనా ఉందా... అంటే.. అదే అంటూ నవ్వుతారు షాలిన్.

“నాకు సంగీతం అంటే ప్రాణం. పియానో ప్లే చేయడం అంటే మహా ఇష్టం. నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆల్బమ్‌లు చేయడానికి కొంత మంది గొప్ప గొప్ప వ్యక్తులను కలిసాను ' అంటూ తనలో దాగి ఉన్న మరో యాంగిల్‌ను బయటపెట్టాడు.

image


హ్యాపీ ఫాక్స్ అనేది కస్టమర్ సపోర్ట్‌తోపాటు ఆంట్రప్రెన్యూర్ , స్టార్టప్‌లకు కూడా హెల్ప్ డెస్క్‌లా పనిచేస్తుంది. టెన్ మైల్స్ నుంచి వెలువడిన ఈ ప్రోడక్టు ఎంతో వేగంగా ఎదుగుతోంది. అమెరికా నుంచి వీళ్లకు పెద్ద సంఖ్యలోనే కస్టమర్లు ఉన్నారు. అందుకే ఇండియా నుంచి ఆఫీసును అమెరికా మార్చారు.

స్టార్టప్ ప్రారంభించి సరిగ్గా నడవడం లేదని భయపడొద్దు.

  • తొందరగా మీ ప్రాడక్ట్ అమ్మడం మొదలు పెట్టండి. దీంతో మీ ప్రొడక్టు మార్కెట్‌కు ఎంత అవసరమో తెలిసిపోతుంది.
  • మీ ఐడియా గ్లోబల్ మార్కెట్‌కు సరిపోయేదే అయితే వెనకడుగు వెయ్యొద్దు. గ్లోబల్ గా ఆలోచించి స్థానికంగా పనిచేయాలి.
  • మీ స్టార్టప్‌లో అందరినీ కస్టమర్ సపోర్ట్‌గా ఉండేలా తయారు చేయండి. అని ముగించారు.

website

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags