సంకలనాలు
Telugu

ఇక ట్రక్కులూ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు

మాజీ ఫ్లిప్‌కార్ట్, సంగ్ ఉద్యోగుల కొత్త వెంచర్మార్కెట్ అవసరాలను పసిగట్టిన ది క్యారియర్బెంగళూరు కేంద్రంగా లాజిస్టిక్ సేవల కంపెనీమరో రెండు మెట్రో నగరాల్లో వ్యాపార విస్తరణ

ashok patnaik
7th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

సాంకేతికత అటు కస్టమర్లతో పాటు సర్వీస్ ప్రొవైడర్ల జీవితాలను ఎంతో సులభతరం చేస్తోంది. అసమర్థ నిర్వహణలో ఉన్నఎన్నో రంగాలు ఇప్పుడు నిలదొక్కుకున్నాయంటే దానికి కారణం టెక్నాలజీనే. ట్రావెల్ రంగంలో ఇదే టెక్నాలజీ ఓ ఉద్యమంలా దూసుకుపోతోంది. ఈ-కామర్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై సాంకేతికత ప్రభావం చాలా ఎక్కువనే చెప్పాలి. సర్వీస్ సెక్టార్లో ప్రవేశించిన ది క్యారియర్ (TheKarrier). ట్రక్‌లను చక్కగా నిర్వహిస్తూ లాజిస్టిక్ స్పేస్‌లో తనదైన మార్కును చూపించాలనే లక్ష్యంగా పనిచేస్తోంది.

image


గిరాకీకి తగ్గట్టు సరఫరా లేదనే గుర్తింపే బిజినెస్ ఐడియా

అర్వింద్ (మాజీ ఫ్లిప్ కార్డ్ ఉద్యోగి), పవన్ గుంటుపల్లి (మాజీ సామ్‌సంగ్ ఉద్యోగి)లు బాల్యమిత్రులు. సొంతంగా ఏదో వ్యాపారం చేయాలని అనుకున్నారు. 2014 వేసవిలో రిషికేష్ రామనాథ్‌తో పరిచయం వారి జీవితాలను మలుపు తిప్పిందనే చెప్పాలి. ది క్యారియర్ స్థాపన జరిగిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో అర్వింద్ పనిచేసిన కాలంలో మార్కెట్లో లాజిస్టిక్ అవసరాలకు కావల్సినన్ని ట్రక్కులు దొరక్కపోవడాన్ని గమనించారు. ఈ అంతరాన్ని పూరించేలా వ్యాపారం చేస్తే లాభాలు సాధించొచ్చని అనుకున్నారు.

లాజిస్టిక్స్‌లో నాణ్యత లోపించి ఏటా 45 బిలియన్ డాలర్లను దేశం నష్టపోతోంది. ఈ నష్టాలను ఆపడంలో లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ లాంటివి తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు 5 నుంచి 10 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ కలిగి ఉందని తెలుస్తోంది. ఈ ఇండస్ట్రీలో నాణ్యతా లోపానికి ప్రధాన కారణం సాంకేతికను ఉపయోగించుకోవడంలో వెనకబడి ఉండటమే. బెంగుళూరు కేంద్రంగా ప్రారంభమైన క్యారియర్ చరిత్రను తిరగరాస్తానంటోంది. లాజిస్టిక్స్‌లో ఉన్న డిమాండ్‌కు సరిపడా సరఫరా చేస్తానంటోంది. సిటీ మొత్తం మీద కొంతమంది భాగస్వాములతో కలసి ప్రస్తుతం 300 లైట్ కమర్షియల్ వెహికల్స్(LCVs) ను ది క్యారియర్ కలిగి ఉంది. ఈ రంగంలో గుర్తించదగిన ఫలితాలను సాధిస్తోంది. డ్రైవర్ల కోసం ఒక యాప్‌ను కూడా లాంచ్ చేశారు. ఇది కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. వందల్లో కస్టమర్లు లాగిన్ అవుతున్నారు. కస్టమర్లు ట్రక్ బుకింగ్ కోసం కాల్ చేయడం లేదా +91 8050327147 నంబర్ కు వాట్సాప్ చేయొచ్చు.

ది క్యారియర్ బృందం

ది క్యారియర్ బృందం


ది కెరియర్ ప్రతి లావాదేవీ నుంచి కొంత శాతంగా సర్వీస్ చార్జీని వసూలు చేస్తుంది. డ్రైవర్ల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వినియోగదారులకు అందించడంతోపాటు వారికి మద్దతుగా నిలుస్తుంది. చక్కగా పనిచేసే డ్రైవర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. వెహికల్ అందుబాటులో లేని కారణంగా ఒక్క ఆర్డర్ కూడా మేము క్యాన్సిల్ చేయలేదని గర్వంగా చెబుతాను పవన్. 300 వాహనాలున్న కంపెనీ లీడ్ టైం 45 నిముషాలు మాత్రమేనట. మొదటి 3 కిలోమీటర్లకి 350 రూపాయిలు వసూలు చేస్తారు. అటు తర్వాత కిలోమీటర్‌కు రూ. 30 వసూలు చేస్తారు. ప్రతి 15నిముషాలకు రూ. 30 వెయిటింగ్ చార్జీ తీసుకుంటారు. లోడింగ్, అన్ లోడింగ్‌కు గంట సమయం నిర్ణయించుకున్నారు.

image


ఎదురైన సవాళ్లు

టాక్సీకి మాత్రమే టెక్నాలజీని వాడుతున్నారు తప్పితే.. ట్రక్కులను బుక్ చేయడంలో ఇంకా టెక్నాలజీ సాయం తీసుకోవాలని జనం గుర్తించలేదు. కాకపోతే దానిలో విపరీతమైన డిమాండ్ ఉంది. అంత తొందరగా సాంకేతికను అడాప్ట్ చేసుకోకపోవడాన్ని ది క్యారియర్ గుర్తించింది. మొదట ఎదురైన సవాలు ఇదే. దీంతో కింది స్థాయి నుంచి ఒక్కో విషయాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. మొదట మార్కెట్‌కు తెలియడానికి సోషల్ మీడియాతోపాటు ఆఫ్ లైన్ మార్కెట్ పద్దతులను ఉపయోగించారు. 40శాతం కస్టమర్లు రిఫరెవన్స్ ద్వారా వచ్చిన వారే. ఎక్కువ మందికి రీచ్ కావడానికి డ్రైవర్లు కూడా తమదైన మార్కెటింగ్ స్కిల్‌ను ఉపయోగించారనే చెప్పాలి. ట్రక్కులపై కంపెనీ పేరుండటం కస్టమర్ల వద్దకు బ్రాండ్ సులభంగా తీసుకుపోయే అవకాశం లభించింది.

ఇదే రంగంలో ఉన్న పోటీదార్లు

ఈ రంగంలో స్థానిక, అంతర్జాతీయ కంపెనీలు పోటీలో ఉన్నారు. హాంకాంగ్ కు చెందిన గోగోవ్యాన్, బ్లోహొమ్, షిప్పర్, రిటర్న్ ట్రక్స్ ఇందులో ప్రధానమైనవి. మరికొంతమంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

30 సెకెండ్లలో ఆర్డర్‌ని కన్ఫర్మ్ చేయడం, లీడ్ టైం 30నిముషాలు దాటకూడదనే విషయాలపై ది క్యారియర్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు వచ్చే ఆరుమాసాల్లో మరో రెండు మెట్రో నగరాల్లో తమ సేవలను విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతానికి 7 x 4 x 6 వైశాల్యం గల మధ్యస్థ ట్రక్ లను కలిగింది. దాదాపు 800 కిలోల బరువును తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయీ ట్రక్కులు. కస్టమర్ల డిమాండుకు తగినట్లు మరిన్ని ట్రక్ లను సిద్ధం చేసే పనిలో ఉంది ఈ టీం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags