సంకలనాలు
Telugu

వీళ్లు టెంట్ ఇచ్చారంటే.. మరో ప్రపంచాన్ని రెంటుకి తీసుకోవచ్చు..!!

team ys telugu
20th Feb 2017
1+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

శిశిర రుతువు. పత్రవిరహంతో చెట్లు దిగాలుగా ఉండే సమయం. మధ్యాహ్నమంతా కణకణమండే అగ్నిజ్వాలలు పుష్పించాయా అన్నట్టుగా రోడ్డుకి ఇరువైపులా మోదుగు చెట్లు. సాయంత్రం కొండగాలి మనసుని అల్లరి పెడుతుంది. సూరీడు పడమట కొండ దిగగానే చుక్కలు చలిమంటను రేపుతాయి. 

ఆ టైంలో లోనావాలా లాంటి ఒక హిల్ స్టేషన్ లో ఉంటే ఎలా వుంటుంది..?! సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ నిచ్చెలితో ఏకాంతంగా గడిపితే..?! ఒకపక్క చరచరమంటూ మండే కర్రలు..! ఎగసిపడే నిప్పురవ్వలు..! పక్కనే చిన్నటెంట్..! సన్నగా కీచురాళ్ల రొద..! అదే పనిగా అల్లరి చేసే సోమరిగాలి..! అనంత విశ్వంలోని పాలపుంతలన్నీ మనకోసమే దారికట్టినట్టు..!! తుంటరి జాబిలి టెంట్ లోకి దూరి అల్లరి చేసినట్టు..!! ధగధగలాడే తారలన్నీ మన నెత్తిమీద ఫ్రీజ్ అయినట్టు..!1 ఆ ఏకాంత రాత్రిలో..! లావెండర్ బ్యాక్ డ్రాప్ లో..! లేజీ స్టార్ గేజింగ్ క్యాంప్..!! ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి...!!

image


జన్మలో మరిచిపోలేని ఇలాంటి అద్భుతమైన అనుభూతుల్ని ఎన్నో మూటగట్టి ఇస్తోంది గెట్ సెట్ క్యాంప్. రెగ్యులర్ హోటల్ కాకుండా క్యాంపింగ్ స్టయిల్ అకామిడేషన్ ఇవ్వడం దీని ప్రత్యేకత. నేచర్ తో మమేకమై అందమైన లొకేషన్ లో రెండు మూడు రోజులు గడపాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే చిన్నవి పెద్దవి కలిపి క్యాంపింగ్ ఆప్షన్స్ చాలానే కనిపిస్తాయి. కానీ అందులో ఏది సేఫ్, ఏది బెస్ట్ తేల్చుకోలేం. అయితే ఇక్కడే గెట్ సెట్ క్యాంప్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వెబ్ సైట్ లోకి లాగిన్ అవగానే ఛాయిస్ కి తగ్గట్టుగానే వెరిఫైడ్ క్యాంప్ సైట్స్ కనిపిస్తాయి. అన్నీ ఒరిజినల్ పిక్చర్లతో కూడిన డిటెయిల్స్ ఇస్తారు. ఒకవేళ ఏమైనా డౌట్లుంటే హెల్ప్ డెస్క్ ఉంటుంది. అన్ని సందేహాలు తీరిన తర్వాతే లొకేషన్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గెట్ సెట్ క్యాంప్ వెరిఫైడ్ క్యాంప్ సైట్స్ అగ్రిగేటర్.

నిమేశ్ నవేశ్ ఇధ్దరు అన్నదమ్ముల వెంచర్ ఇది. టిపికల్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. అందరిలాగే వీళ్ల ఇంట్లో కూడా బిజినెస్ కంటే ఉద్యోగానికి ప్రియారిటీ ఇచ్చేవారు. మొదట్లో ఇలాంటి వెంచర్ మీద పార్ట్ టైం వర్క్ చేసేవాళ్లు. 2016లో ఉద్యోగాలు వదిలేసి ఫుల్ టైంకి మారిపోయారు. స్టార్టింగ్ లో పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒక ఆరునెలలు టైం ఇవ్వండి.. మేమేంటో నిరూపిస్తాం అని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఫెయిలైతే మీరన్నట్టుగా ఉద్యోగమే చేస్తాం అని ప్రామిస్ చేశారు. అలా మొదలై ఏడాది తిరక్కుండానే ట్రిమిండస్ గ్రోథ్ సాధించారు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

image


గెట్ సెట్ క్యాంప్ ఫిబ్రవరి 2013లో మొదలైంది. ముంబై వేదికగా మొదట రెంటల్ బేసిస్ లో స్టార్ట్ చేశారు. మెల్లిగా మార్కెట్ మీద పట్టుసాధించి లాభాల బాట పట్టారు. ఆ తర్వాత 2015లో పూర్తిస్థాయి క్యాంపింగ్ అకామిడేషన్ మోడల్ లోకి మారిపోయారు. ఇప్పుడు ఇండియా అంతటా విస్తారించాలని ప్లాన్ చేస్తున్నారు.

గెట్ సెట్ క్యాంప్ కమిషన్ బేసిస్ మీద నడుస్తుంది. కస్టమర్ ఒక సైట్ బుక్ చేసుకుంటే వెండార్ కు కొంత కమిషన్ ఇస్తారు. అది ప్రాంతాన్ని బట్టి, వెండార్ ని బట్టి ఉంటుంది. దేశమంతా విస్తారించాలనే ప్రణాళికతో ఉన్న ఈ బూట్ స్ట్రాప్డ్ వెంచర్ బ్యాంకు నుంచి కొంత లోన్ కూడా తీసుకుంది.

నిమేశ్ డిజిటల్ ఆర్టిస్ట్. మార్కెటింగ్ లో క్రియేటివ్ విభాగం, ఆన్ లైన్ వ్యవహారమంతా తను చూసుకుంటాడు. రత్నేశ్ టీం మెంబర్లలో ఒకరు. ఆపరేషన్స్, వెండార్ మేనేజ్ మెంట్ అతని బాధ్యత. శిఖ దయాని ప్రొఫెషన్ కంటెంట్ రైటర్. ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫాం చూసుకుంటుంది.

మార్కెట్ ఎలా వుందంటే..

2016 నివేదిక ప్రకారం గ్లోబల్ అడ్వెంచర్ టూరిజం 2015లో 7.88 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ చేసింది. దీన్ని బట్టి భవిష్యత్ లో 2020 కల్లా అది మరో 46 శాతం పెరిగే అవకాశం ఉంది. గత ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే గెట్ సెట్ క్యాంప్ 100 శాతం గ్రోథ్ సాధించింది. రెవెన్యూ రూ. 45 లక్షలు నమోదు చేసింది. ఇండియా అంతా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో 2017-18 సంవత్సరంలో గ్రోథ్ రేట్ 200 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు ఫౌండర్లు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1+ Shares
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags