యువతలో సామాజిక చైతన్యమే ఈ కుర్రాడి లక్ష్యం

ముందు కడుపు నింపుకో తర్వాత వీలైతే సేవ చేయి.. అని సూచించే వాళ్లు చాలా మందే ఉంటారు. సేవే మార్గం అంటూ ఇతరులకు ఇతోధిక సాయం అందించే వాళ్లు కొంతమంది ఉంటారు. యువతలో నిరంతరం తొణికిసలాడే నూతనోత్తేజాన్ని జాగృతం చేసి వారి ప్రయోజనాలను వారే కాపాడుకునేందుకు కృషి చేస్తున్న నవ యువకుడు ప్రకార్ భర్తియా. ఆయనే ఈరోజు మనకు స్పూర్తి…

యువతలో సామాజిక చైతన్యమే ఈ కుర్రాడి లక్ష్యం

Monday June 22, 2015,

2 min Read

మనకు అసౌకర్యం కలిగిస్తున్న అంశాలను పరిష్కరించుకునేందుకు ఏదోటి చేయాలన్న తపన నిత్యం మదిలో మెదలకపోవచ్చు. ప్రకార్ భర్తియా మాత్రం అందుకు విరుద్ధం. నిత్య కృషీవలుడిగా పేరు తెచ్చుకోవడమే ఆయన లక్ష్యం. యూత్ అలయన్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడాయన. సామాజిక అంశాలతో యువతకు దగ్గరకావడం ఆయనకు చాలా ఇష్టం. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఎన్జీవోలలో యువతను వాలంటీర్లుగా చేర్చడం కూడా భర్తియాకు తెలిసిన విద్య. బడిలో చదువుకునేప్పుడే తనకు ఈ ఆలోచన వచ్చింది. . “మా బడికి ఎదురుగా ఒక మురికివాడ ఉండేది. నేను రోడ్డుపై నడుస్తూ ఎప్పుడూ ఐస్ క్రీమ్ తినేవాడిని కాదు. అలా తినడం బావుండదని కాదు. మురికి వాడల పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిచ్చే డబ్బులు నా దగ్గర లేకపోవడమే అందుకు కారణం” అని చెబుతారు ప్రకార్ భర్తియా.

ప్రకార్ భర్తియా, యూత్ అలయన్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు

ప్రకార్ భర్తియా, యూత్ అలయన్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు


డిగ్రీ మూడో సంవత్సరంలో ఆయన యూత్ అలయన్స్ ప్రారంభించారు. అప్పట్లో నిదానంగా సాగిన ఉద్యమం అది. 2009లో ఆ సంస్థకు నూతనోత్తేజం లభించింది. జాగో రే అనే ప్రచార కార్యక్రమ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో ఓటర్ రిజిస్ట్రేషన్‌కు చేయూతనిచ్చారు. కళాశాలల్లో చదివే 6,000 మంది ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో, ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యం గణనీయంగా పెరిగినట్లయ్యింది.

టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కార్యక్రమంలో భాగస్వామి అయిన తర్వాతే క్రింది స్థాయిలో పనిచేయడం వల్ల కలిగే సంతృప్తి ఆయనకు అర్థమైంది. సలహాదారు హోదా ఎంత ముఖ్యమైనదో కూడా తెలిసింది. టీచ్ ఫర్ ఇండియా టు యూత్ అలయెన్స్‌లో తన మిత్ర బృందాన్ని కలుపుకుపోవడంతో దాని సభ్యుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం యూత్ అలయన్స్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరు నాయకత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

సలహాలతోనే మార్పు సాధ్యం

పట్టణ ప్రాంతాల్లో మార్పుకు శ్రీకారం చుట్టే దిశగా లీడ్ ది ఛేంజ్ అనే ఫెలోషిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదీ ఎనిమిది వారాల కార్యక్రమం. ఢిల్లీలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలపై మక్కువ చూపే పాతిక, ముప్పై మంది యువతీయువకులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. గూంజ్ సంస్థ వ్యవస్థాపకుడు అనిష్ గుప్తా, టీచ్ ఫర్ ఇండియా సీఈఓ షహీన్ మిస్త్రీ, మాంఝీ వ్యవస్థాపకుడు రవి గులాటీ లాంటి వారితో సంప్రదింపుల ద్వారా వారికి మార్గదర్శనం, సలహాలు ఇచ్చారు. గ్రామ్య మంథన్ అనే మరో కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు నాయకత్వ లక్షణాలు నేర్పించారు. యాభై మందిని ఎంపిక చేసి గ్రామీణ ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా దేశాటనకు తీసుకెళ్లారు.

విద్యార్థులతో అనుభవాలను పంచుకుంటున్న గూంజ్ వ్యవస్థాపకుడు అన్షుగుప్తా

విద్యార్థులతో అనుభవాలను పంచుకుంటున్న గూంజ్ వ్యవస్థాపకుడు అన్షుగుప్తా


ప్రభావం

ఇంతవరకూ 200 మంది యువకులు లీడ్ ది ఫెలోషిప్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అందులో పదకొండు మంది పూర్తి స్థాయి కార్యకర్తలుగా ఎన్జీవోల్లో చేరారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు మరో 25 సంస్థలను స్థాపించారు. 14 మంది పార్ట్ టైమ్ స్థాయిలో సామాజిక సంస్థల్లో చేరారు. మరో నలభై మంది వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు.

నేర్చుకున్న గుణపాఠాలు, భవిష్యత్ ప్రణాళికలు

ప్రకార్ భర్తియా తన భవిష్యత్ కార్యక్రమాల కోసం అనేక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. మార్పు కోసం యువత పాటుపడే విధంగా కళాశాల్లో అనువైన వాతావరణం సృష్టించాలని ఆయన భావిస్తున్నారు. ఏడాది పాటు సాగే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నారు. దీని పేరు ఓనస్- సోషల్ ఛేంజ్ ల్యాబ్. దీనిలో అనేక దశలుంటాయి. వ్యక్తిగత పరివర్తనకు ప్రయత్నించడం ఒక వంతు అయితే…. నమూనాలు అమలు చేసి సమస్యలు పరిష్కరించడం మరోటి. ఈ కార్యక్రమం ఒక కళాశాలలో మొదలై..విజయావకాశాలను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. వైఫల్యానికి నిరాశచెంది పక్కకు తప్పుకుని నాయకత్వ బాధ్యత మరొకరికి అప్పగించడం సరికాదని ప్రకార్ అంటారు. అప్పుడే మేలైన విజయాలు సాధించడం కుదురుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.