సంకలనాలు
Telugu

మీరు సెల్ఫీ దిగి మాకు పంపండి..! మేం మీకు డబ్బులిస్తాం..!!

SOWJANYA RAJ
28th Feb 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

సెల్ఫీ..! బ్రష్ చేసుకునే దగ్గర్నుంచి బెడ్ టైం వరకు- అదొక పిచ్చి! ఊ.. అంటే సెల్ఫీ దిగడం..! ఫేస్ బుక్ లోనో, ట్విటర్లోనో పెట్టడం..!! లైకులు, కామెంట్లు సంపాదించడం..!! అవి చూసుకుని మురిసిపోవడం..! ఇంతకు మించి సెల్ఫీతో వచ్చేదేముంది!?   

ఇక్కడే మీరు పొరపడుతున్నారు ! సెల్ఫీతో అంతకు మించి ఇస్తామంటున్నారు వాళ్లు! సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పెడితే లైక్స్ వస్తాయి! అదే వారికి పంపితే లైక్స్ తో పాటు లక్స్ సబ్బు కూడా ఇస్తారు! సెల్ఫీ దిగి ట్విటర్లో పెడితే మహా అయితే కామెంట్స్ వస్తాయి..! అదే వారికి పంపితే కత్తిలాంటి డ్రస్ ఇప్పిస్తారు! మొబైల్ రీచార్జ్ కూపన్ నుంచి వేడివేడి పిజా దాకా..!! సెల్ఫీకో గిఫ్ట్ వోచర్!! అవును. మీరు విన్నది నిజమే! సెల్ఫీ దిగితే స్వీయానందలహరే కాదు..! పైసానందలహరి కూడా...!  

సెల్ఫీతో మనీ సంపాదించుకోవచ్చు. సెల్ఫీతో రివార్డ్ పాయింట్లు వెనుకేసుకోవచ్చు. సెల్ఫీతో రిటైల్ షాపుల్లో డిస్కౌంట్లు పొందవచ్చు. "మ్యాజిక్ పిన్" అనే యాప్ చేస్తున్న మాయాజాలం ఇది. 

"చిన్నీ"పాల ప్యాకెట్ తీసుకు రామ్మా...! " చిన్నా " కందిపప్పు అయిపోయాయి షాపుకెళ్లొస్తావా..? రామూ ... సేఠ్ జీ షాపుకెళ్లి ఆయిల్ ప్యాకెట్ తే.. ! ఇలాంటి మాటలు ప్రతి ఇంట్లోనూ కామనే. కొంతమంది ఆ పురమాయింపులను ఆఫర్ గా భావిస్తారు. ఎందుకంటే అమ్మ ఇచ్చినదాంట్లో ఎంతో కొంత మిగులు జేబుకు చేరుతుంది కాబట్టి. ఆ మిగులుకు రివార్డు పాయింట్లు జత చేసుకుని వాల్యూ యాడ్ చేసుకోమంటోంది "మ్యాజిక్ పిన్". అలా కిరాణా కొట్టుకో... హోటల్ కో... పిజ్జా షాపుకో మరో దానికో వెళ్లినప్పుడు షాపు ఎదుట నిలబడి ఓ సెల్ఫీ తీసుకుని, షాపులో కొన్న బిల్లు ఫోటోతో సహా " మ్యాజిక్ పిన్" కు పంపిస్తే చాలు. మీకు రివార్డు పాయింట్లొచ్చేస్తాయి. ఎన్ని వచ్చాయన్నది నిమిషంలోనే మీకు తెలిసిపోతుంది. వాటిని రెడిమ్ చేసుకోవచ్చు.

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ కు ఇప్పుడు మ్యాజిక్ పిన్ యాప్ హాట్ ఫేవరేట్ . ఎంతగా అంటే ఆరు నెలలు కాకుండానే నాలుగు లక్షకుపైగా సెల్పీలను మ్యాజిక్ పిన్ లో అప్ లోడ్ చేసేశారు. అవి అలా పెరుగుతూనే ఉన్నాయి. వారంతా రివార్డు పాయింట్లు ... వాటితో వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారు. ఇదే ట్రెండ్ చాలాచోట్ల కంటిన్యూ అవుతోంది. ఆఫ్ లైన్ రిటైలింగ్ లో మ్యాజిక్ పిన్ ఓ సంచలనం సృష్టించడం ఖాయమని మ్యాజిక్ పిన్ టీం కాన్ఫిడెంట్ గా ఉంది. చిన్న వ్యాపారస్తులకు మరింత వ్యాపార ప్రయోజనం కల్పిస్తూ వారికి వినియోగదారులపై పూర్తి అవగాహన కల్పించేలా మ్యాజిక్ చేయగలమని వారంటున్నారు.

పెద్ద పెద్ద వ్యాపారసంస్థలు, సూపర్ మార్కెట్లలో రివార్డ్ పాయింట్లు కామన్. ఇందుకోసం ప్రత్యేక కార్డులు కూడా జారీ చేస్తున్నాయి. షాపర్స్ స్టాప్ సంస్థ డెబ్భై ఐదు శాతం ఆదాయం తన ఫస్ట్ సిటీజన్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారానే ఆర్జిస్తోంది. అయితే వ్యవస్థీకృతం కాని రిటైల్ వ్యాపారులకు మాత్రం లాయల్టీ ప్రోగ్రాం వల్ల వచ్చే ప్రయోజనాలు అందడం లేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అన్షు శర్మ, బ్రిజ్ భూషణ్ కలిసి మ్యాజిక్ పిన్ కు అంకురార్పణ చేశారు. గతంలో ఇన్వెస్ట్ మెంట్ సంస్థల్లో పనిచేసిన వీరిద్దరూ భారతీయ రిటైల్ మార్కెట్ పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత్ మ్యాజిక్ పిన్ యాప్ ను మార్కెట్ లోకి వదిలారు.

undefined

undefined


భారతీయ రిటైల్ మార్కెట్ 2020కల్లా ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం అది 600 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృతమైన రీటైలింగ్...ఆన్ లైన్ షాపింగ్ తో కలిపి పదిశాతమే. మిగతా 90శాతం మార్కెట్ అంతా వ్యవస్థీకృతం కానిదే. అవకాశం కల్పిస్తే వీరంతా మార్కెట్ పెంచుకోవడాని, వినియోగదారులను ఆకర్షించడానికి ఉత్సాహం చూపించడం ఖాయం. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అత్యంత వేగంగా అందుబాటులోకి వస్తున్న సమయంలో వీరందర్నీ సమీకృతం చేయడం పెద్ద సమస్య కాదన్నది మ్యాజిక్ పిన్ రూపకర్తల నమ్మకం

చిన్న వ్యాపారస్తులు తమ వినియోగదారులకు మరింత మంచి సర్వీసు అందించేలా చేయాలన్నదే మా లక్ష్యం. ఆఫ్ లైన్ మార్కెట్ ని కనెక్ట్ చేయడం ద్వారా చైనాలో మేటువాన్, డయాపింగ్ అమెరికాలో గ్రూప్ఆన్ భారీ వాల్యూని క్రియేట్ చేశాయి. ఇండియా మార్కెట్ వాటితో పోలిస్తే ప్రత్యేకం. ఎదుగుదలకు ఇంకా భారీ అవకాశాలు ఉంటాయి అంటారు మ్యాజిక్ పిన్ సీఈవో, కో ఫౌండర్ అన్షు.

మ్యాజిక్ పిన్ వ్యవస్థీకృతం కాని ఆఫ్ లైన్ మార్కెట్లలో వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని సునాయాసంగా పరిష్కరిస్తోంది. వారికి పైసా ఖర్చు లేని ప్రచారాన్నీ తెచ్చిపెడుతోంది. మ్యాజిక్ పిన్ వల్ల వ్యాపారులకు వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

1. వ్యాపారసంస్థ ప్రత్యేకతకు వినియోగదారు ద్వారానే ఆ లోకాలిటీలో... అతని ఫ్రెండ్స్ లో ప్రచారం వస్తుంది. అంటే రిఫరెల్ నెట్ వర్క్

2. కొత్త కస్టమర్లను సులువుగా ఆకర్షించవచ్చు

3. పెద్దగా బిజినెస్ లేని సమయాల్లోనూ ట్రాన్సాక్షన్స్ పెంచుకోవచ్చు.

4. పాత వినియోగదారుల్ని మరింత తరచుగా స్టోర్ ని వచ్చేలా చేసుకోవచ్చు

5. షాపు ఉన్న లొకాలిటీలో ఇంట్రెస్టింగ్ పీపుల్, ట్రెండింగ్ ఈవెంట్స్, యాక్టివిటీస్ తెలుసుకోవచ్చు.

6. లొకాలిటీలో ప్రత్యేకమైన గుర్తంపు వస్తుంది.

వ్యాపారస్తులు, బ్రాండ్ల ద్వారా ప్రస్తుతానికి ఆదాయాన్ని పొందుతున్నామని అన్షు చెబుతున్నారు. వినియోగదారులికి పర్సనలైజ్డ్ ఆఫర్స్ పంపడానికి మ్యాజిక్ పిన్ ను ఫ్లాట్ ఫాంగా వ్యాపార సంస్థలు, బ్రాండ్లు ఉపయోగించుకుంటున్నాయి. వాటి నుంచి వసూలు చేస్తున్న ఫ్లాట్ ఫామ్ ఫీతో మ్యాజిక్ పిన్ ను రన్ చేస్తున్నారు. పెట్టుబడులు వస్తే మరింత వేగంగా వృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

మ్యాజిక్ పిన్ ప్రారంభించిన మూడు నెలల్లోనే ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో దాదాపుగా కోటిన్నర మంది యాక్టివ్ యూజర్స్ ని నమోదు చేసుకుంది. జైపూర్, ఢిల్లీ, బెంగళూరులో 30 వేల మంది చిన్న తరహా వ్యాపారులు మేజిక్ పిన్ తో ఒప్పందం చేసుకున్నారు. వ్యవస్థీకృతం కాని ఆన్ లైన్ మార్కెట్ లో రివార్డు పాయంట్లు అందిస్తున్న వూప్లర్, వూనిక్ సంస్థలు ఇటీవల చెరో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించగలిగారు. కానీ సంస్థలు ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ విభాగాలకే పరిమితం. వాటితో పోలిస్తే మ్యాజిక్ పిన్ కు ఎదగడానికి ఎంతో అవకాశం ఉంది.

మ్యాజిక్ పిన్ యాప్ స్టార్ట్ అవడానికి, సక్సెస్ బాటలో నడవడానికి లైట్ స్పీడ్ సంస్థ మూడు మిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టింది. దీని విజయంపై వారు ఎలాంటి అపోహలూ పెట్టుకోలేదు.

సృజనాత్మకత కలిగిన వ్యవస్థాపకులు, భారీ మార్కెట్ రెండు ముఖ్యమైన అంశాలు. వినియోగదారుడ్ని, వ్యాపారస్తుడ్ని ఓ విభిన్నమైన కోణంలో కనెక్ట్ చేసే విదానం కరెక్ట్ వేలో ఉంది. వరల్డ్ క్లాస్ విజయానికి మ్యాజిక్ పిన్ ఆలోచనలు సరిపోతాయి- బేజుల్ సోమయా, ఎండీ, లైట్ స్పీడ్ వెంచర్స్

దేశవ్యాప్తంగా 12 మిలియన్లు ఉన్న చిన్న వ్యాపారస్తులు ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు. దీంతో మ్యాజిక్ పిన్ .... తన జెండా పాతడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags