సంకలనాలు
Telugu

శిశువుల్ని కాపాడే బ్రేస్ లెట్ కనిపెట్టిన మెకానికల్ ఇంజినీర్

విప్లవాత్మక ఆవిష్కరణతో విదేశీ ప్రభుత్వాల ఫండింగ్ పొందిన "బెంపు"

SOWJANYA RAJ
22nd Apr 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share


"బీప్..బీప్" మని ఆగకుండా శబ్దం చేస్తోంది రితీక్షకు పెట్టిన బ్రేస్ లెట్..

రితీక్ష రెండు నెలల పాప. ఏడో నెలలోనే దివ్యకు కాన్పు కావడంతో శిశువును కొద్ది రోజులు ఇంక్యుబేటర్లో ఉంచి జాగ్రత్తలు చెప్పి డాక్టర్లు ఇంటికి పంపించేశారు. అప్పట్నుంచి కంటి మీద కునుకులేదు దివ్యకు.

బాడీ టెంపరేచర్ తగ్గినప్పుడల్లా బ్రేస్ లెట్ శబ్దం చేస్తుంది.. అప్పుడు పాపను గట్టిగా హత్తుకో అని డాక్టర్లు చెప్పారు. కానీ అలా హత్తుకుని పడుకున్నా బీప్ శబ్దం ఆగడం లేదు. మూడు, నాలుగు, ఆరు గంటల తర్వాత కూడా అదే సౌండ్. కంగారు పడిన దివ్య బ్రేస్ లెట్ ఇచ్చినవారికి ఫోన్ చేసింది. వారు ఉన్నపళంగా డాక్టర్ వద్దకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించింది. రితీక్షకు జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ సోకిందిన్నారు డాక్టర్లు. చికిత్స ప్రారంభించారు. ఐదు నెలల్లో రితీక్ష పూర్తిగా కోలుకుంది. ఆరు నెలల్లో ఐదు కేజీల బరువు పెరిగింది.

<br>ప్రాణదానం చేసే బ్రెస్ లెట్

రితీక్షకు ఓ రకంగా ప్రాణదానం చేసింది బ్రేస్ లెటే. అసలేంటీ రిస్ట్ బ్యాండ్. దానివల్ల ఉపయోగమేంటి? పసిపాపల ఆరోగ్యానికీ దానికీ సంబంధమేంటి?

బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైంది "బెంపు" అనే మెడికల్ డివైజ్ సోషల్ ఎంటర్ ప్రైజ్ సంస్థ. ఈ బ్రేస్ లెట్ రూపకల్పన కూడా వారి ఐడియానే. అప్పుడే పుట్టిన శిశువులకు, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ కి శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడం అనేది చాలా తీవ్రమైన సమస్య. దీన్ని హైపో థెర్మియా అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శిశువుల మరణానికి ఇదే అతి పెద్ద కారణమని లెక్కలు తేల్చాయి. అయితే ఈ టెంపరేచర్ ఎప్పుడు తగ్గిపోతుందో.. ఎప్పుడు నార్మల్ గా ఉంటుందో తెలుసుకోవడమే అసలు సమస్య. దాన్ని పరిష్కరించే మేథోమథనంలో పుట్టిందే బ్రేస్ లెట్ ఐడియా. ఈ బ్రేస్ లెట్ శిశువు చేతికి పెడితే చాలు శరీర ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా బీప్ శబ్దం చేస్తుంది. ఇంకా తీవ్రమైన సమస్య ఉంటే ఆగకుండా శబ్దం చేస్తూనే ఉంటుంది. తల్లిదండ్రులు అలర్ట్ కావడానికి ఈ బ్రేస్ లెట్ ఎంతో సాయం చేస్తుంది.

శిశువు పుట్టిన మొదటి నెలలో బాడీ టెంపరేచర్ మెయిన్ టెయిన్ చేయడానికి, ఆరోగ్యకరంగా బరువు పెరగడానికి, మెదడు సహా అన్ని అవయవాలు ఎదగడానికి ఈ బ్రేస్ లెట్ ఉపయోగపడుతుంది. శిశువు శరీరంలో 0.5 శాతం ఉష్ణోగ్రత తగ్గినా ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. టెంపరేచర్ తగ్గిందంటే వెంటనే బేబీ ఫ్యాట్ కరుగుతుంది. దీనివల్ల బేబీ వెయిట్ ఆగిపోతుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ శిశువు శరీరంలో యాసిడ్ ఉత్పత్తికి కారణమవుతుంది. దీని వల్ల శిశువు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. ఈ ప్రభావం శిశువు శరీరంలో ఉన్న అవయవాలపై పడుతుంది. ప్రీమెచ్యూర్ బేబీస్ కి పూర్తి స్థాయిలో అవయవాలు డెవలప్ కావు కాబట్టి.. ఇలాంటి పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. ప్రీమెచ్యూర్ చిన్నారులకే హైపోథెర్మియా వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాంటి సమయంలో వచ్చే సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి.

image


స్టాన్ ఫోర్డ్ టు బెంగంళూరు..

బ్రెస్ లెట్ రూపొందించిన బెంపు సంస్థ ఫౌండర్ రతుల్ నరైన్. ప్రతిష్టాత్మక బయోమెకానికల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ లో కార్డియో వాస్క్యూలర్ విభాగంలో ఆరేళ్లపాటు పనిచేశారు. తర్వాత నియోనాటర్ హెల్త్ రంగంలో ఎంబ్రాస్ ఇన్నోవేషన్స్ సంస్థ కోసం ఏడాది పాటు వర్క్ చేశారు. ఈ సమయంలోనే శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన నియోనాటర్ విభాగంలో ఉన్న స్కోప్ ను గుర్తించి.. అందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

" ఎంబ్రాస్ లో పనిచేస్తున్నప్పుడు నియోనాటల్ హెల్త్ ప్రాముఖ్యతను గుర్తించా. ఈ రంగంలో ఓ మాసివ్ ఇంపాక్ట్ చూపించేలా ఎదైనా చేయాలనుకున్నాను. ఇలా చేస్తే ప్రజల ఆరోగ్య జీవితాల్లో భారీ మార్పు తేగలం. ఎందుకంటే శిశువుగా ఉన్నప్పుడు వచ్చే సమస్యల ప్రభావం 60, 70 ఏళ్ల పాటు ఉంటుంది" రతుల్ నరైన్, బెంపు ఫౌండర్

రతుల్ నరైన్, బెంపు ఫౌండర్ <br>

రతుల్ నరైన్, బెంపు ఫౌండర్


సుదీర్ఘమైన పరిశోధన

లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన రతుల్.. 2013లో దేశవ్యాప్తంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల దగ్గర్నుంచి పట్టణాల్లోని గవర్నమెంట్ ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లోని పీడియాట్రిక్ విభాగాల్లో గంటల తరబడి గడిపారు. డాక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది..? పేషంట్ జీవితం ఎలా ఉంటుంది..? డాక్టర్, పేషంట్ కు మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఉంటుంది..? అనే అంశాలను అధ్యయనం చేశారు. శిశువు చనిపోయిన తర్వాత ఆస్పత్రికి తీసుకువస్తున్న సందర్భాలు అనేకం రతుల్ కంటపడ్డాయి. భారత్ లో తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య ఎక్కువ. అదే అమెరికాలో ప్రతి పన్నెండు మందిలో ఒకరు మాత్రమే అండర్ వెయిట్ బేబీస్ ఉంటారు.

" అమెరికాలో అండర్ వెయిట్ తో పుట్టే చిల్డ్రన్స్ సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యేవరకూ ఇంక్యుబేటర్లో ఉంచుతారు. కానీ ఇక్కడ మాత్రం కేజీ కన్నా కొద్దిగా బరువు రాగానే పంపిచేస్తున్నారు. ఇలాంటి శిశువులకు హైపోథెర్మియా, ఇన్ ఫెక్షన్ రిస్కులు ఎక్కువ. మనకు ఇంక్యుబేటర్లు ఉందుబాటులో ఉండవు. కానీ మానిటరింగ్ ద్వారా థెర్మల్ ప్రొటెక్షన్ ఇవ్వగలం" -రతుల్ నరైన్, బెంపు ఫౌండర్

image


సులువుగా ఉపయోగించే బ్రేస్ లెట్

డాక్టర్ ప్రిస్కిప్షన్ మీద బెంపు బ్రేస్ లెట్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 150 ఆస్పత్రుల్లో దాన్ని శిశువుల కోసం వినియోగిస్తున్నారు. గుర్గావ్ లోని క్లౌడ్ నైన్, పుణె లోని సూర్యా హాస్పిటల్స్, బెంగళూరులోని మీనాక్షి హాస్పిటల్స్ లాంటి ప్రముఖ ఆస్పత్రులతో పాటు మరికొన్ని విరివిగా ఈ బ్యాండ్ వాడకాన్ని ప్రొత్సహిస్తున్నాయి. నాలుగు వారాల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఎలాంటి చార్జింగ్ అవసరం లేదు. తర్వాత డిస్పోజ్ చేయవచ్చు. లేదంటే చార్జింగ్ పెట్టుకుని వేరే బేబీకి కూడా వాడవచ్చు. అయితే ఇలా రీసైక్లింగ్ చేయడం వర్కౌట్ కాదని రతుల్ చెబుతున్నారు. ఇండియాలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల వారు కాన్పు కోసం ఆస్పత్రికి వస్తారు. ఆ తర్వాత వారు బేబీతో వెళ్లిపోతారు. నాలుగు వారాల తర్వాత మళ్లీ ఆ బ్రేస్ లెట్ తీసుకురావడం.. వెనక్కి ఇవ్వడం లాంటివి జరగవు. అలాగే ఈ డిజైన్ సేఫ్ గా, క్లీన్ గా ఉంచడం, రీచార్జ్ చేయడం, రీ ఇష్యూ చేయడం కూడా అత్యంత కష్టమైన వ్యవహరమే అంటారు రతుల్. అందుకే త్వరలో అంగన్ వాడీ, ఆశా వర్కర్లతో కలసి పనిచేయాలని ఆలోచిస్తున్నారు.

image


మరింత స్మార్ట్ గా మార్చవచ్చు కానీ...

వైఫైతోనో లేదంటే బ్లూటూత్ తో అనుసంధానం చేసి ఆటోమేటిక్ గా అలర్ట్ పంపేలా స్మార్ట్ గా తీర్చిదిద్దవచ్చు కదా అనే సలహాలు రతుల్ కి చాలా సార్లు వచ్చాయి. కానీ అతను మాత్రం వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. అలా చేయడం చాలా ఈజీనే కానీ.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అంటాడాయన. అలా చేయడం కరెక్ట్ కూడా కాదంటాడు. బెంపు టార్గెట్ దిగువ మధ్యతరగతి ప్రజలే. అలాంటి ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు స్మార్ట్ డివైజస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటారు. అలాగే కొత్తగా తల్లి మహిళ అసలే టెన్షన్లో ఉంటుంది. దానికి తోడు బ్లూ టూత్.. వైఫై అంటే ఇంకా ఎక్కువ కన్ ఫ్యూజ్ అవుతుంది. అలా కాకుండా సింపుల్ గా ఉంచడమే మంచిదంటారు రతుల్. అవసరం లేదని వాటితో తల్లిదండ్రులను అనవసరమైన ఆందోళనకు గురి చేయడం కూడా కరెక్ట్ కాదంటారు.

"టెంపరేచర్ ఎంత ఉందో బ్రేస్ లెట్ మీద ఉండే స్క్రీన్ లో కనిపించేలా చేయవచ్చు. కానీ ఇది తల్లిదండ్రుల్లో మరింత కన్ఫ్యూజన్ కు గురి అయ్యేలా చేస్తుంది" రతుల్ నరైన్, బెంపు ఫౌండర్

ప్రీమెచ్యూర్ బేబీస్ విషయంలో తల్లిదండ్రులు అప్పటికే చాలా ఆందోళనతో ఉంటారు. అందుకే రెండే రెండు సిగ్నల్స్ తో సింపుల్ గా అర్ధమయ్యేలా బ్రేస్ లెట్ డిజైన్ చేశారు. బ్లూ లైట్ వెలుగుతూ ఉంటే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. రెడ్ లైట్ వెలిగి, బీప్ శబ్ధం వస్తే టెంపరేచర్ తగ్గుతున్నట్లు అర్ధం చేసుకోవాలి. బీప్ శబ్దం అదే పనిగా వస్తూంటే శిశువుకి వైద్యసాయం అవసరమని ఫిక్సయిపోవాలి. 

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

బ్రేస్ లెట్ ఆవిష్కరణ చేసినందుకు బెంపుకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. 2014 మే లో సోషల్ అంట్రప్రెన్యూర్ షిప్ విభాగంలో ఎకోంగ్ గ్రీన్ ఫెలోషిప్ ను అందుకున్నారు. అదే ఏడాది జూలైలో విల్ గ్రూ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. అదే ఏడాది నవంబర్ లో గేట్స్ ఫౌండేషన్, గ్రాండ్ చాలెంజెస్ కెనడా నుంచి నిధులు పొందారు. వీటితో ఉద్యోగుల్ని నియమించుకున్న రతుల్ వెనక్కి తిరిగి చూడలేదు. 2015జూలైలో USAID సేవింగ్స్ లైవ్ ఎడ్ బర్త్ విభాగంలో అవార్డు అందుకున్నాడు. దీంతో నార్వే ప్రభుత్వం, కొరియా ప్రభుత్వాలు కూడా బెంపుకు నిధులు సమకూర్చాయి.

పేదలకే ప్రథమ ప్రాధాన్యం

బ్రేస్ లెట్లను పేదలకు అందుబాటులోకి తేవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది సంస్థ. ఇందుకోసం ప్రభుత్వంతో కలసి పనిచేయాలని నిర్ణయించుకుంది. అత్యంత సురక్షితంగా ఉపయోగించగలిగిన డివైజ్ గా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకే వీటి అవసరం ఎక్కువగా ఉందంటారు రతుల్. కేంద్ర ప్రభుత్వం కూడా నియోనాటల్ హెల్త్ పై అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలే రతుల్ కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ అధికారులను కలిసి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రాసెస్ అంత తేలిగ్గా జరిగేది కాదని రతుల్ కూడా అంగీకరిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో కొంత సమయం పడుతుందని అంటున్నారు. ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి.. విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదించే ప్రయత్నంలోఉన్నారు.

వెబ్ సైట్: 

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags