సంకలనాలు
Telugu

బిర్యానీతో బస్తీ మే సవాల్ అంటున్న హాట్ హాట్ హలీం ! మిలియన్ డాలర్లు దాటుతోన్న రంజాన్ ఫుడ్ మర్కెట్

హైదరాబాదీ ఫుడ్ లవర్స్ హాట్ ఫేవరెట్ హలీంబిర్యానీకి నెలరోజుల పాటు పోటీ ఇచ్చే రంజాన్ డిష్ఒకప్పుడు కేవలం ప్రసాదంగా మాత్రమే హలీం, ఇప్పుడు ఇదే మెయిన్ కోర్స్మధ్య ఆసియా నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో తిష్ట వేసిన ఈ సూపర్ డిష్ప్రపంచ ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ హలీం

ashok patnaik
16th Jul 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా హలీం వర్సస్ బిర్యానీ అనే మాటే వినిపిస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా జనం ముందుకొచ్చిన హలీం వంద కోట్ల బిజినెస్ చేసినట్లు అంచనా. దాదాపు నెలరోజులుగా అందుబాటులో ఉన్న ఈ రంజాన్ డిష్ భాగ్యనగరంలోని ఫుడ్ లవర్స్‌ని మెస్మరైజ్ చేస్తోంది. సర్వీ, పిస్తాహౌస్, ప్యారడైజ్, 555 లాంటి పెద్ద పెద్ద హలీం మేకింగ్ రెస్టారెంట్‌లతో పాటు చాలా రకాలైన ఇతర హైదరాబాదీ రెస్టారెంట్‌లు రంజాన్ నెలలోనే చేసే బిజినెస్ మార్కెట్ అంచనాలను పటాపంచలు చేసింది. మొత్తంగా రంజాన్ నెలరోజుల ఫుడ్ మార్కెట్ వందకోట్లు దాటిందని అంచనా.

సాధారణంగా రంజాన్ మాసంలో సాయంకాలం అయితే మార్కెట్ కళకళలాడుతుంటుంది. ఉదయం నుంచి రోజా(ఉపవాసం) చేస్తారు. దీంతో సూర్యాస్తమయం కాగానే రోజా విడుస్తారు. సాయంకాలానికల్లా స్థానిక రెస్టారెంట్‌లన్నీ కళకళలాడుతాయి. ఫ్రూట్ మార్కెటుల్లాంటివి ఇక సరేసరి. మొత్తంగా చూస్తే ప్రతిరోజూ సాయంకాలానికి అయ్యే వ్యాపారం దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు దాటుతుంది. ఈ లెక్కన నెలరోజులపాటు జరిగే బిజినెస్ వందకోట్లు దాటిందని చెప్పొచ్చు.

హైదరాబాద్ ఇరానీ హలీం

హైదరాబాద్ ఇరానీ హలీం


సీజనల్ స్పెషల్ హలీం

ఏడాదిలో నెలరోజులపాటు లభించే ఈ రంజాన్ డిష్ కోసం జనం ఎగబడతారు. మధ్య ఆసియా నుంచి హలీం ఇక్కడకు వలస వచ్చిందని చరిత్ర చెబ్తోంది. స్థానిక టేస్ట్ యాడ్ చేసిన ఈ హలీం హైదరాబాదీ డిష్‌గా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నెల రోజుల్లో పెద్ద పెద్ద హలీం సెంటర్లు పది నుంచి 15 కోట్ల బిజినెస్ చేస్తాయి. వీటితోపాటు చిన్నా చితకా హలీం దుకాణాలు చేసే వ్యాపారం కూడా ఎక్కువే. వందరూపాయిల నుంచి రెండువదల మధ్యలో హలీం ప్లేట్ ధర నడుస్తోంది. స్పెషల్ హలీం, ఫ్యామిలీ ప్యాక్ లు ఇక సరేసరి.

“మా కస్టమర్లలో 70నుంచి75శాతం మంది హిందూ కస్టమర్లే ఉన్నారు. ఏడాదిలో ఒక నెలపాటు వారంతా మా హలీం టేస్ట్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి వ్యాపారం భారీగా అయితే పెరగలేదనే చెప్పాలి. కానీ కస్టమర్లు మాత్రం వచ్చి ఓ సారి రుచి చూస్తే వెళ్తారు” మిర్జా హుస్సేన్.

మిర్జా హుస్సేన్ బంజారాహిల్స్ సర్వీకి మేనేజింగ్ పాట్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇరానీ టీతోపాటు సమోసా, బిర్యానీ, కబాబ్స్‌కు సర్వీ ఫేమస్. ఏడాది పొడవునా తమ కస్టమర్లకు బిర్యానీయే ఫేవరేట్ . కానీ రంజాన్ సీజన్ లో హలీం మాత్రమే హాట్ ఫేవరేట్ అని ఆయన చెబ్తున్నారు. తొంబై ఏళ్ల క్రితం షియా ముస్లిం తెగలు మొహర్రం జరుపుకొన్న పదిరోజుల తర్వాత ప్రసాదంగా హలీంను స్వీకరించారు. దీన్ని ఉస్మాన్ అలీ బా హైదరాబాద్ కు పరిచయం చేశారు. మొదటి సారి మదీనా హోటల్ రంజాన్ సీజన్‌లో ప్రతిరోజు అమ్మకానికి పెట్టి దీన్నో కమర్షియల్ ఫుడ్ చేసింది. ఆ రకంగా భాగ్యనగరంలో హలీం అమ్మిన మొదటి రెస్టారెంట్‌గా మదీనా హోటల్ నిలిచింది. ఇప్పుడిది వందకోట్లను దాటిన ఫుడ్ బిజినెస్ చేస్తోంది. ఇదే హలీం అసలు కధ.

హైదరాబాద్ దమ్ బిర్యానీ

హైదరాబాద్ దమ్ బిర్యానీ


బిర్యానీ వర్సస్ హలీం

హైదరాబాద్ అనగానే మొదటగా గుర్తొచ్చేది ఇక్కడి దమ్ బిర్యానీనే. కానీ రంజాన్ మాసంలో మాత్రం జనం బిర్యానీకి బదులు హలీంకే ఓటేస్తారు. నెలలో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా హలీం తినే హైదరాబాదీలు చాలా మందే ఉన్నారు. అలా భాగ్యనగర ఫుడ్ లవర్స్‌కు హాట్ ఫేవరేట్‌గా నిలుస్తోంది హలీం. ఇదిలా ఉంటే బిర్యానీకి ఉన్న మార్కెట్ బిర్యానీదే. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో హలీం దొరకదు. హలీం తయారు చేయడానికి 5 నుంచి6 గంటల సమయం పడుతుంది. సాయంకాలానికి మాత్రమే హలీం సిద్ధమవుతుంది. దీంతో మధ్యాహ్నం తీసుకొనే డిష్ బిర్యానీ. సాయంకాలం హలీం మాత్రమే కోరుకునే ఫుడ్ లవర్స్ బిర్యానీని మధ్యాహ్నానికే పరిమితం చేస్తున్నారు.ఈ రకంగా సేల్స్‌లో హైదరాబాద్ బిర్యానీకి హలీం మంచి పోటీ ఇస్తోంది. దీంతో బిర్యానీ వర్సస్ హలీం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్.

హలీంలో వచ్చిన మార్పులు

మొదటిసారి హైదరాబాద్‌లో ప్రవేశించిన హలీం కి , ఇప్పటి హలీంకి ఎన్నో తేడాలున్నాయంటారు మిర్జా అలీ. అప్పుడు హలీం అంటే ప్రసాదం మాత్రమే. దీనిలో ఉండే ప్రొటీన్ వ్యాల్యూస్ చూసి దీన్ని ప్రతిరోజు విక్రయించాలనే ఆలోచన మొదలైంది. ఉపవాసం చేసి రోజంతా ఏమీ తినకుండా ఉండే వారికి సాయంకాలం బలమైన, ప్రొటీన్‌లతో కూడిన డిష్ అందించాలనే ఉద్దేశంతో హలీం కమర్షియల్ ఫుడ్ అయిపోయింది. ఎన్నో రకాలైన సుగంధ ద్రవ్యాలు దీనికి తోడై హైదరాబాద్ వాతావరణానికి వీలుగా రుచిని మార్చుకొని, హైదరాబాదీల ఫేవరేట్ డిష్ అయిపోయింది.

సిద్ధంగా ఉన్న హలీం హండీ లు

సిద్ధంగా ఉన్న హలీం హండీ లు


అటు బిర్యానీ, ఇటు హలీం దేని టేస్ట్ దానిదే. దీంతో పాటు రంజాన్ సీజన్ లో దొరికే ఇతర పండ్లు, ఖర్జూరాలు , డ్రైఫూడ్స్ అన్ని కలగలసి నెలరోజుల్లోనే వందకోట్లను దాటే వ్యాపారాన్ని చేస్తున్నాయి. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత మాత్రమే ఇక్కడి ముస్లింలు ఫుడ్ తీసుకుంటారు. దీంతో ఆసమయంలో వేడివేడి హలీంతో పాటు టేస్టీ బిర్యానీలను సిద్ధం చేస్తున్నారు వ్యాపారులు. వీరికి తోడుగా స్థానికంగా ఉండే ఇతరులు కూడా టేస్టీ రంజాన్ ఫుడ్ లను ఆరగిస్తున్నారు. అన్ని కలగలిసి హైదరాబాద్ ఫుడ్ మార్కెట్ ని వందకోట్ల జాబితాలో చేరుస్తోంది.

image


బంజారాహిల్స్ లోని సర్వీ రెస్టారెంట్

బంజారాహిల్స్ లోని సర్వీ రెస్టారెంట్


“ఈ ఏడాది భారీగా రంజాన్ ఫుడ్ వ్యాపారం జరక్కపోయినా.. సాధారణ వ్యాపారంతో సరిపెట్టుకున్నప్పటికీ భాగ్యనగర వాసులు హాట్ ఫేవరేట్‌గా మాత్రం హలీమే నిలిచింది - మీర్జా''.

ఇది మొత్తం చదివిన తర్వాత మీకూ హలీంను ఓ పట్టుపట్టాలని ఉంది కదూ.. ! మనకు తెలియకుండానే నోరూరుతోంది కదా ? ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా స్వచ్ఛమైన నెయ్యితో లాగించేయండి మరి.. !

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags