సంకలనాలు
Telugu

లింగ‌రీ షాప్ అంటే..ఇరుకైన డ‌బ్బాలాంటి దుకాణం కాదంటున్న జివామీ ఫిటింగ్ లాంజ్ !!

hari prasad
7th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అందమైన లేసీ లింగరీల మధ్య కూర్చుని, చక్కగా వైన్ సిప్ చేస్తూ అక్కడికి వచ్చిన మగువలు బాడీ టైప్స్, కప్ సైజులు, షేప్స్, గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుకోవడం గురించి మీరెప్పుడైనా విన్నారా? మీరు చదవబోయే కథ అలాంటిదే. లింగ‌రీ షాప్ అనగానే- ఇరుకైన డ‌బ్బాలాంటి దుకాణంలోకి వెళ్లి- గుట్టుచప్పుడు కాకుండా- కొనుక్కొని వచ్చే ప్రదేశం కాదంటున్న జివామీ ఫిటింగ్ లాంజ్- మగువల కోసం మరెన్నో విశేషాలు చెప్తోంది !!

image


మీకు తెలుసా.. ఆరు నెలలకు ఒకసారి ప్రతి స్త్రీ ఆకృతి కాస్తోకూస్తో మారుతుందని. దానితో పాటు ఆమె బ్రా సైజ్ కూడా చేంజవుతుందట. ఈ లెక్కన చూసుకుంటే, ఓ మహిళ సగటున ఏడాదిలో కనీసం మూడుసార్లైనా తన బ్రా సైజ్ ని మార్చుకోవాలి. నిజానికి, వేసుకునే బ్రా బట్టి, బాడీ షేప్ లుక్ కూడా మారుతుంది. కానీ చాలామంది మహిళలకు దానిపై అవగాహన లేదు. లోదుస్తులు అంటే రహస్యంగా తీసుకుని రహస్యంగా మాట్లాడుకునే వస్తువులనేది భారతీయుల్లో వున్న ఒక అపోహ‌. అలాంటి అభిప్రాయాన్ని మార్చాలనే లింగరీ లాంజ్ ని ప్రారంభించామంటున్నారు రిచాకర్. ఈ ఓపెనింగ్ లో పాల్గొన్న రిచా కర్, జివామీ వ్యవస్థాపక సిఈవో ఇలా అన్నారు- 

“ ఈ లాంజ్ ను సేల్స్ కోసమో లేక బ్రాండ్ ప్రమోషన్ కోసమో నేను మొదలుపెట్టలేదు, కేవలం మహిళల్లో అవగాహన తీసుకురావడానికి మాత్రమే ప్రారంభించాను. ఇప్పటికీ చాలామంది స్త్రీలకు ఎటువంటి లింగరీ ఫిట్, సైజ్ లను తీసుకోవాలో సరిగ్గా తెలియదు.”

స్టోర్ కాదు ఫిట్టింగ్ లాంజ్

ఒకటా రెండా వేర్వేరు డిజైన్స్, కేటగిరీల్లో 16 డిఫరెంట్ సైజులు, కొలతలకు కేరాఫ్ ఈ ఫిట్టింగ్ రూమ్స్. ప్రొఫెషనల్ ఫిట్టర్స్, ఎక్స్ పర్ట్స్ కోసం కస్టమర్లు ఇక్కడికి వచ్చి అందుబాటులో ఉన్న ట్యాబ్ లో వాళ్ల డీటైల్స్ ని ఎంటర్ చేస్తే చాలు. ఆ తర్వాత, వాళ్ల ఫిట్టింగ్స్ తీసుకుంటారు. అంతే ఇక నచ్చిన బ్రాలను ట్రై చేయవచ్చు. ఒకవేళ నచ్చితే అప్పటికప్పుడు ఆన్ లైన్లో ఆర్డర్ చేయవచ్చు లేదా తర్వాత కొనుక్కోవచ్చు. లాంజ్ లో కేవలం జివామీ ఇన్ – హౌజ్ బ్రాండ్ కు సంబంధించిన బ్రాండ్సే అందుబాటులో ఉండగా, ఆన్ లైన్ లో కొనేటప్పుడు మాత్రం కస్టమర్లు వివిధ బ్రాండ్స్ ను సెలెక్ట్ చేసుకునే వీలుంది.

ఫిట్టింగ్ లాంజ్ ఎందుకు ?

జివామీ నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు బ్రాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వారికి కరెక్ట్ సైజ్ ఉన్న బ్రాలను కాకుండా ఏదో ఒక సైజును వాడుతున్నారు, అది కూడా జీవితకాలం పాటు. సరైన బ్రాను ఎంచుకోవడంలో సుమారు 82% మంది భారతీయ మహిళలు ప్రొఫెషనల్ హెల్స్ ను అందుకోలేకపోతున్నారు. 

లింగరీ షాపింగ్ అంటే ఒక చిన్న ఇరుకైన డబ్బాలాంటి దుకాణానికి వెళ్లి, బడ్జెట్ లో వచ్చే బ్రాను సెలెక్ట్ చేసుకోవడంగా మారిపోయింది. దీంతో వినియోగదారులు దుకాణానికి వెళ్లి బ్రాను కొనుక్కోవడంలో ఉన్న ఇబ్బందులను జివామీ ముందుగా తెల్సుకోవాలనుకుంది. 

“మా దగ్గర చాలా సైజులు, వెరైటీలు, బ్రాండ్స్ ఉన్నాయని మేము చెప్పినా, ఎక్కడా కూడా ఒక మహిళ దుకాణానికి వెళ్లి డి, లేదా డిడి కప్ గురించి తెల్సుకునే ప్రయత్నం, అసలు వాటి మధ్య ఉన్న తేడా గురించి అడిగే సాహసం చేయట్లేదు” - రిచా.

వాస్తవానికి జివామీ ప్రారంభించాలనుకోవడానికి వెనకున్న విజన్, ఐడియా వేరే అన్నారు ఆమె. ఆన్ లైన్ స్టోర్ తో పోటీపడేలా ఈ స్టోర్ లో మహిళలకు కావాల్సిన పర్ ఫెక్ట్ టచ్ అండ్ ఫీల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనుకున్నామంటారు.

image


“ఆఫ్ లైన్ స్టోర్ లో, ఇన్వెన్టరీ, ఆపరేషన్స్ గురించి కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ ఈ లాంజ్ ప్రారంభించాలనుకోవడానికి కారణం … బ్రా లింగరీ కొనే ఎక్స్ పీరియన్స్ ను మరింత సులభతరం చేయడానికే” - రిచా.

సీరీస్ సి కి సెప్టెంబర్ లో ఫండింగ్ అందుకున్న జివామీ ప్రస్తుతం, నిమిషానికి ఒక బ్రాను విక్రయిస్తున్నట్టు చెబుతోంది. సుమారు 60% ఆదాయం వాళ్ల ఇన్ హౌజ్ బ్రాండ్స్ వల్లే వస్తున్నాయి. టైర్ 2, టైర్ ౩ సిటీల నుంచి మరో 30%. కేవలం ఒక్క ఏడాదిలోనే షేప్ వేర్ సుమారు 336% అభివృద్ధిని సాధించింది.

యువర్ స్టోరీ కథనం

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఫిట్టింగ్ లాంజ్ ఐడియా అంత కొత్తదేమీ కాదు. కొన్ని కొన్ని దేశాల్లోని విక్టోరియాస్ సీక్రెస్, మరికొన్ని లింగరీ స్టోర్స్ లో ఫిట్టింగ్ లాంజ్ ఉండడం అన్నది సర్వసాధారణం. బట్టర్ కప్స్ టూ లాంటి బ్రాండ్స్ కు కూడా ఫిట్టింగ్ లాంజ్ ఉంది. జివామీ పెట్టడానికి కారణం, మహిళలు బెస్ట్ క్వాలిటి లింగరీని ఎంచుకోవడానికి దోహదపడడమే అని రిచా చెబుతారు. అంతేకాదు వాటిని కొనడడంలో ఉన్న అపోహలను దూరం చేయడం కూడా. వచ్చే మూడేళ్లల్లో దేశవ్యాప్తంగా మరో 10 ఫిట్టింగ్ లాంజ్ లను ఏర్పాటు చేయడమే వీరి లక్ష్యం. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ కంపైల్ చేసిన గ్లోబల్ లింగరీ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ ఆన్ లైన్ లింగరీ మార్కెట్ 18.18% CAGR అభివృద్ధితో దూసుకుపోతుంది. యూరోప్, APAC, ఉత్తర అమెరికా, ఇతర ప్రపంచదేశాలను ఈ రిపోర్ట్ కవర్ చేసింది. కేవలం యూఎస్ లోనే మార్కెట్ 16% పెరుగుతోంది. 

“ఆ రోజులు నాకు గుర్తున్నాయి, నేను కారిడార్ సైజున్న దుమ్ముకొట్టుకుపోయిన దుకాణాలకు వెళ్లి నాకు సరిపడా లింగరీని వెదుక్కోవడానికి అవస్థలు పడేదాన్ని. కమర్షియల్ స్ట్రీట్ లోని ఆ స్టోర్స్ లో గడిపిన క్షణాలే .. జివామీ ఎందుకు సక్సెస్ అవుతుందో నాకు తెలియజెప్పింది.” -రిచా.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags