సంకలనాలు
Telugu

వీళ్లు సృష్టించిన‌ ప్రపంచం మనతో మాట్లాడుతుంది..!

ఇన్నోవేర్ సొల్యూషన్స్ చేసిన అద్భుతం

team ys telugu
1st Dec 2016
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

సెవెంటీస్ లో వచ్చిన పాంగ్ అనే వీడియోగేమ్ తెలిసే వుంటుంది. అదొక టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ గేమ్. టూడీ గ్రాఫిక్స్ తో చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఆ టైంలో అదొక వండర్. అప్పటి నుంచి వీడియో గేమ్ అనే కాన్సెప్ట్ టెక్నాలజీని యాడ్ చేసుకుంటూ మనల్ని ఎంటర్ టైన్ చేస్తునే ఉంది. గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటి రూపం మారిపోయింది. ఫోటో రియలిజమ్ పెరిగిపోయింది. కొత్త కొత్త పరిశోధనలు.. వింత వింత ఆవిష్కరణలు.. గాడ్జెట్ల నుంచి టీవీ తెరల్లోకి, కంప్యూటర్ స్క్రీన్లలోకి ప్రవేశించి కళ్ల ముందు మరో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

ఆ కోవలోకి వచ్చిందే ఆగ్మెంటెడ్ రియాలిటీ. మన కళ్లను మనమే నమ్మలేనంత వాస్తవం. చూడొచ్చు. మాట్లాడొచ్చు. వినవచ్చు. ఆస్వాదించొచ్చు. వాసన పసిగట్టవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ టెక్నాలజీ వాస్తవానికి దగ్గరగా ఉండే మరో ప్రపంచాన్ని మన కళ్లముందు నిలబెడుతుంది. స్కూలు పిల్లలు మొదలుకొని సైనికుల దాకా ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు.

వర్చువల్ రియాలిటీ అనేది ఆర్టిఫిషియల్ ఎన్విరాన్ మెంట్ క్రియేట్ చేసి చూపిస్తుంది. కానీ ఆగ్మెంటెడ్ అలా కాదు. సమస్త సమాచారాన్ని మనముందు ఉంచుతుంది. అందుకే ఈ తరహా టెక్నాలజీని హెల్త్ కేర్, పబ్లిక్ సేఫ్టీ, గ్యాస్, ఆయిల్, టూరిజం, మార్కెటింగ్ వంటి రంగాల్లో నిత్యావసరంగా మారిపోయింది.

ఇన్నోవేర్ సొల్యూషన్స్ టీం

ఇన్నోవేర్ సొల్యూషన్స్ టీం


ఉదాహరణకు మనం రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్నాం. అకస్మాత్తుగా మబ్బులు కమ్మాయి. వర్షం పడుతుందా పడదా అని తెలుసుకోవాలనిపిస్తుంది. వెదర్ ఫోర్ కాస్ట్ ఉన్నా అదంత పక్కా సమాచారం ఇవ్వదు. కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీ చేతిలో ఉంటే చిటికెలో పని. ఏ టైంకి ఎంత టెంపరేచర్ నమోదవుతుందో ఆక్యురేట్ గా చెప్పేస్తుంది. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్.. అందులో ఏఆర్ యాప్ ఉంటే చాలు. క్లిక్ చేసి ఆకాశానికేసి చూస్తే.. ఏ గంటకు ఎంత ఉష్ణోగ్రత రికార్డవుతుందో స్రీన్ మీద కనిపిస్తుంది.

ఇంకో ఎగ్జాంపుల్. వందకు పైగా అంతస్తులున్న ఒక బిల్డింగ్ ఉందనుకోండి. అందులో ఏ ఫ్లోర్లో హోటల్ ఉందో, అందులో ఏ సూట్ ఖాళీగా ఉందో తెలసుకోవాలంటే.. అందులోకి వెళ్లి రిసెప్షన్లో అడిగితేగానీ తెలియదు. అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. అదే మన ఫోన్లో ఏఆర్ యాప్ ఉందనుకోండి.. బిల్డింగ్ అల్లంత దూరాన ఉండగానే క్లిక్ చేసి ఫోకస్ చేస్తే చాలు. టవర్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయి.. మనం అనుకునే హోటల్ ఏ అంతస్తులో ఉంది.. అందులో ఏఏ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి.. వాటి రేటెంత.. ఇలాంటి వివరాలన్నీ క్షణాల్లో ఫోన్ స్రీన్ మీద కనిపిస్తాయి. ఇదే ఆగ్మెంటెడ్ రియాలీటీ స్పెషాలిటీ.

అయితే మన ఫోన్లో యాప్ వుండగానే సరిపోదు. ఆ బిల్డింగ్ కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీకి అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఇలాంటిది సాధ్యమవుతుంది. పాశ్చాత్య దేశాలననీ ఈ టెక్నాలజీని ఏనాడో అందిపుచ్చుకున్నాయి. కస్టమర్ల టైం వేస్ట్ కాకుండా బిజినెస్ లో దూసుకుపోతున్నాయి. ఇండియాలో ఈ టైప్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది.

image


హైదరాబాదుకు చెందిన ఇన్నోవేర్ ఐటీ సొల్యూషన్స్ అనే సంస్థ సౌతిండియాలోనే మొదటిసారి ఈ తరహా ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని మనకు పరిచయం చేస్తోంది. మొదటగా స్కూలు పిల్లలు టార్గెట్ గా ఒక అద్భుతమైన ఎడ్యుటైన్మెంట్ ప్రాడక్ట్ ని ఇటీవలే లాంఛ్ చేశారు. ఆర్నిమల్ పేరుతో తెచ్చిన ఈ ప్రాడక్ట్ ఆల్పాబెట్స్, డ్రాయింగ్ కార్డ్స్ పిల్లల తెలివితేటల్నే కాకుండా మానసిక వికాసానికి కూడా తోడ్పడేలా చేస్తున్నది. సైఫికిడ్స్ అనే యాప్ ద్వారా ఆల్పాబెట్ కార్డుల్లో పొందుపరిచిన యానిమల్స్ త్రీడీ రూపంలో కనువిందు చేస్తాయి.

ఉదాహరణకు డి అనే లెటర్ తీసుకుంటే.. డీ ఫర్ అనగానే పిల్లలు ఠక్కున డాగ్ అంటారు. కానీ అక్కడ డైనోసార్ ప్రత్యక్షమవుతుంది. కనిపించడమే కాదు.. అది పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అవుతుంది. రన్ బటన్ నొక్కితే పరిగెత్తుతుంది. వాక్ ప్రెస్ చేస్తే నడుస్తుంది. హిస్టరీ టచ్ చేస్తే దాని చరిత్ర అదే చెప్తుంది. అలా ఏ టు జడ్ లెటర్స్ ద్వారా అన్ని రకాల యానిమల్స్ గురించి పిల్లలకు ఎంటర్టయిన్మెంట్ రూపంలో నాలెడ్జ్ అందిస్తున్నారు. ఇదే కిట్ లో కొన్ని డ్రాయింగ్ షీట్స్ కూడా ఉంటాయి. పిల్లలతో వాటికి కలరింగ్ చేయించి యాప్ క్లిక్ చేసి చూస్తే.. రంగులు నింపిన బొమ్మ త్రీడీలో లేచి ఆడినట్టు కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది అరచేతిలో ఇమిడిపోయిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. నెక్స్ట్ జెనరేషన్ కిడ్స్ కోసం తయారు చేసిన డైనమిక్ ఫ్యూచర్ ప్రాడక్ట్.

image


చదువంటే బుక్ నాలెడ్జ్ అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు కాన్సెప్ట్ మారింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద అడుగుపెట్టాం. మూస పద్ధతులకు గుడ్ బై చెప్తున్నారు. రకరకాలుగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ చదువు చెప్తున్నారు. అయితే ఈ తరహా ఏఆర్ టెక్నాలజీ టీచింగ్ మాత్రం మొట్టమొదటిదే అని చెప్పాలి. అన్నప్రాసన రోజే ఆవకాయ తినేసినట్టు.. పిల్లలు అంత చిన్న వయసులోనే ఒక క్వాలిటీ టైంతో గడిపేస్తారు. అది వారి మైండ్ లో ఒక చెరగని ముద్రవేస్తుంది.

ఆగ్మెంటెడ్ రియాలిటీ విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తోందనడంలో సందేహం లేదు. ఇది భవిష్యత్ లైవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నాలుగ్గోడల మధ్య బోర్డు మీద రాసే మొరటు పద్ధతిని బద్దలుకొట్టి త్రీడీ రూపంలో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది.

ఒక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాత్రమే కాదు.. అన్ని సెక్టార్లలోనూ ఈ తరహా టెక్నాలజీని పరిచయం చేయాలన్నది ఇన్నోవేర్ సొల్యూషన్స్ లక్ష్యం. ఆల్ఫాబెట్స్ నుంచి ఆంత్రోపాలజీ దాకా అన్ని ఏరియాల్లో టెక్నాలజీని ప్రవేశపెట్టాలే చేయాలనేది ఇన్నోవేర్ సొల్యూషన్స్ టార్గెట్.

ఇన్నోవేర్ సొల్యూషన్స్  ఫౌండ‌ర్లు శివాజీ, స‌త్య‌బ్ర‌త ఆచార్య‌

ఇన్నోవేర్ సొల్యూషన్స్  ఫౌండ‌ర్లు శివాజీ, స‌త్య‌బ్ర‌త ఆచార్య‌


ఇక టీం గురించి చెప్పాలంటే..ఇన్నోవేర్ సొల్యూషన్స్ ఫౌండ‌ర్లు శివాజీ, స‌త్య‌బ్ర‌త ఆచార్య‌. శివాజీ ఎథికల్ హ్యాకింగ్ లో ప్రపంచంలో 31వ ర్యాంకర్. మొత్తం 20 మందితో కూడిన టీం ప్రాడక్ట్స్ డెవలప్ మీద తలమునకలై ఉన్నారు. వీళ్లంతా ఐఐటీ స్టూడెంట్స్. ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు.. వర్చువల్ రియాలిటీ, లీప్ మోషన్, యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, వెబ్ యాప్స్ సర్వీస్ కూడా ఇస్తున్నారు. ప్లాన్ దగ్గర్నుంచి లాంఛ్ వరకు ఒక టీం వర్క్ గా టాస్క్ కంప్లీట్ చేస్తారు.

స్టార్టప్ దశను దాటిన ఈ కంపెనీ.. ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.. అవి సఫలమయితే వ్యాపారాన్ని అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు అనేక దేశాల్లో విస్తరించాలని చూస్తున్నారు. 2017 కల్లా 2 లక్షల యూనిట్లను టార్గెట్ గా పెట్టుకున్నారు. వైజాగ్, చెన్నయ్, బెంగళూరులో డెమో ప్లాన్స్ పెట్టుకున్నారు.

image


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సైఫి కిడ్స్ యాండ్రాయిడ్ యాప్ 

సైఫి కిడ్స్ ఐఓఎస్ యాప్

 

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags