సంకలనాలు
Telugu

పక్షి ప్రేమికులకు పనికొచ్చే యాప్ 'కిలి'

బర్డ్ లవర్స్ కోసం ప్రత్యేకమైన యాప్ 'కిలి'పక్షులను టీవీల్లో చూసేవాళ్ల కోసం కాదిది...పక్షులను ప్రాణంగా ప్రేమించేవారికోసం ఇది...ఏ పక్షి.. ఏ జాతిదో తెలుసుకోలేకపోతున్నారా ?

ABDUL SAMAD
22nd May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
“పక్షులకు నేను కావాలని వాటికి ఆహారం ఇవ్వను. నాకు పక్షులు కావాలి కాబట్టి అందిస్తాను” ―కాథీ హటన్

పక్షులను చూస్తూ రోజులకు రోజులు గడిపేయచ్చు... ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంత సీన్ లేదు. మనకు పక్షులేవైనా కనిపిస్తున్నాయంటే, మనం వాటిని చూసేందుకు కొంత టైం వెచ్చిస్తున్నామంటే.. అది డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫిక్, యానిమల్ ప్లానెట్ లాంటి టీవీ ఛానళ్లలోనే. కానీ ఇప్పటికీ ఇలాంటి బర్డ్ లవర్స్ ఉన్నారు. చెట్టుమీద నుంచో, చెరువుగట్టు మీదో, పొదల మాటునో, బైనాక్యులర్స్‌లోంచో నక్కినక్కి ఓ అరుదైన పక్షిని చూడ్డం, వాటికోసం గంటలు-రోజులు ఎదురుచూడ్డం చాలామందికి అలవాటు. అదో సాహసకృత్యం కూడా.

image


కానీ తొలినాళ్లలో చాలామంది పక్షి ప్రేమికులకు ఎదురయ్యే సమస్య వాటిని గుర్తించడం. ఎన్‌సైక్లోపీడియాలు, రిఫరెన్స్ బుక్స్, మ్యాగజైన్స్ తిరగేసి... అది ఏ జాతి పక్షో తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేరళలోని కోజికోడ్ ఓ బర్డ్ లవర్స్ గ్రూప్... ఓ పరిష్కారం ఆలోచించింది. స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని వివరాలు అందించేలా 'కిలి' అనే యాప్‌ను రూపొందించింది. డాక్టర్ సలీమ్ ఆలీ 118వ జయంతి రోజున ఈ యాప్‌ను రిలీజ్ చేశారు ఆ టీం.

అసలేంటీ కిలి ?

కిలి అనేది ఓ మొబైల్ యాప్. ఫీల్డ్‌లో ఉండే పక్షుల సందర్శకుల కోసం తయారు చేసిన ఓ క్విక్ రిఫరెన్స్ ఇది. అనేక మంది బర్డింగ్ విభాగాలను, గ్రూపులను, మలబార్ నేచురల్ హిస్టరీ సొసైటీ వంటి సైంటిఫిక్ ఫోరమ్స్‌ను సంప్రదించి రూపొందించారు 'కిలి'ని.

“ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్ సంస్థ సహాయంతో కిలి యాప్‌ను డెవలప్ చేశాం. దీనికోసం కొన్ని నెలలు వెచ్చించాం. అంకితభావంతో చాలా కష్టపడి దీన్ని పూర్తిచేశామం”టారు రాప్టర్స్ టీం సభ్యుడు నవీల్ లాల్.

image


కిలిలో ఏముంటాయ్ ?

మనం ఓ పక్షిని చూస్తే... అది ఏ జాతిదో గుర్తించేందుకు అనేక మార్గాలుంటాయి ఇందులో. అలాగే దాని ప్రత్యేకతలు, శాస్త్రీయ నామాలు, దాని నివాస స్థలాలు, అది ప్రముఖంగా కనిపించే ప్రాంతాల వివరాలు కూడా ఉంటాయి. అలాగే పక్షి ఆకారం, రంగు, రూపం, గ్రూప్, సైజు ఆధారంగా పక్షి జాతిని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది.

ఈ యాప్‌లో ఫోటోలు, దాని స్థితి, గుర్తించేందుకు తగిన విధానాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ సమాచారం మొత్తం ఇంగ్లీష్, మళయాళం భాషల్లో లభ్యమవుతుంది. పక్షుల సర్వేల్లో భాగంగా టీం మెంబర్లు తీసిన ఫోటోలే కిలి యాప్‌లో మనకు కనిపిస్తాయి. అభినందన్ చంద్రన్, నవనీత్ నాయర్, విజేష్ వల్లికున్ను, జాలీ కషేరి... రాప్టర్స్ టీంలోని ఇతర సభ్యులు. ప్రారంభంలో 100రకాల పక్షుల వివరాలతో రిలీజైన ఈ యాప్... త్వరలోనే 350 పక్షుల డీటైల్స్‌తో హైఎండ్‌కి అప్‌డేట్ కానుంది.

image


యాప్‌లో ఏం బాగుంది ?

కిలి యాప్‌ను ఉపయోగించడం చాలా తేలిక కావడం విశేషం. యూజర్ ఇంటర్‌ఫేస్, అలాగే యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా సున్నితంగా సౌకర్యవంతంగా ఉంటాయి. వివరాలు అందించే తీరు కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని క్షణాలపాటే చూసినా మనలో చాలా మంది ఆ పక్షి ఆకారాన్ని మాత్రమే గుర్తుంచుకుంటాం. ఆకారాన్ని అనుసరించి జిచ్ సెర్చ్ చేయడం ద్వారా ఎవరైనా సులభంగా ఆ పక్షి ఏంటో తెలుసుకోగలిగేలా చేసిన డిజైన్... యూజర్లను ఆకట్టుకుంటుంది.

ఈ యాప్‌లో ఆకట్టుకునే మరో ఫీచర్.. చెక్ లిస్ట్. జీపీఎస్ ట్యాగ్ చేయడం, అక్షాంశం, రేఖాంశం, తేది, టైం, ఎంతమంది ఆ పక్షిని చూశారు, ఎంతసేపు కనిపించింది, ప్రయాణంలో ఉండగానే, ఏదైనా స్టేషన్‌కి వెళ్లినపుడా వంటి వివరాలతో కూడా... ఆపక్షి ఏ జాతికి చెందినదో తెలుసుకునే ఏర్పాటు.. అద్భుతం అనిపిస్తుంది.

ఇంకేం కావాలి 'కిలి'లో?

ఆయా పక్షుల గురించిన వివరాలు మరింత పరిశోధనాత్మకంగా ఉండాలి. చరిత్రాత్మకంగా వివరాలు అందిస్తే బాగుంటుంది. ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకే ఉన్నా... దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్స్ తరహాలో ఎంపిక చేస్తే మరింత ప్రయోజనం కనిపిస్తుంది. కేవలం ఇంగ్లీష్, మళయాళంలోనే ఉన్న సమాచారం... ఇతర భారతీయ భాషల్లోనూ, కనీసం హిందీలో అయినా అందుబాటులోకి తెస్తే కిలి యాప్‌ను ఉపయోగించేవారు మరింతగా పెరుగుతారు.

ఒక్కమాటలో చెప్పాలంటే పక్షిప్రేమికుల దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన యాప్ ఇది. ప్రజల్లో ఉండే ప్యాషన్ ఆధారంగా ఉన్నత స్థాయికి చేరే లక్షణాలున్నాయి కిలికి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags