సంకలనాలు
Telugu

క్లౌడ్ టెక్నాలజీ రంగంలో బ్లూమెరిక్ దూకుడు

GOPAL
19th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


క్లౌడ్ కంప్యూటింగ్‌.. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న టెక్నాలజీ. ఈ-కామర్స్ రంగానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో క్లౌడ్ టెక్నాలజీ అవసరం కూడా పెరిగిపోతున్నది. నెట్‌వర్క్స్, సర్వర్స్, స్టోరేజ్, అప్లికేషన్స్, సర్వీసెస్ వంటివాటి కోసం చాలా సంస్థలు థర్డ్ పార్టీ సేవల పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వినోదిని రాజు బ్లూమెరిక్ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ టెక్నాలజీలో సేవలందిస్తున్నారు.

పెళ్లయిన పదేళ్ల తర్వాత మహిళలు ఏం చేస్తారు. పిల్లల ఆలనా పాలనా చూస్తుంటారు. లేకుంటే ఏదో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. మరికొందరు ఆధ్యాత్మిక చింతనలో పడిపోతారు. అయితే కొద్దిమంది మాత్రమే తమలో ఉన్న టాలెంట్‌ను నమ్ముకుని, కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటివారిలో వినోదిని రాజు కూడా ఒకరు. 

దశాబ్దం పాటు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసి, టెస్టింగ్ నెట్‌వర్క్ ప్రొటోకాల్స్‌ను వృద్ధి చేసిన వినోదిని దృష్టి క్లౌడ్ టెక్నాలజీవైపు మళ్లింది. ఈ సమయంలో టెక్నాలజిస్ట్‌ల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. ఓ కార్పొరేట్ కంపెనీ సమాచారాన్ని సుదూర ప్రాంతాల్లో ఉన్న డాటా సెంటర్లలో ప్రైవేట్ లేదా పబ్లిక్ క్లౌడ్‌లో భద్రపర్చడం సరైనదేనా అన్నది సబ్జెక్ట్. చాలా మంది క్లౌడ్ టెక్నాలజీ అవసరం గురించి మాట్లాడారు. సరైన స్టోరేజీ విధానం లేకపోవడంతో కంప్యూటింగ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆటోమెటిక్‌గా కన్జూమర్ రెవల్యూషన్ మొదలవుతోందని, దీంతో భవిష్యత్‌లో క్లౌడ్ టెక్నాలజీ నిపుణుల అవసరం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. వినోదిని కూడా ఈ విషయాన్ని గుర్తించారు. ఆటోమేషన్ విధానంలో క్లౌడ్ సర్వీస్‌లను ఆపరేట్ చేసేవారికి డిమాండ్ ఉంటుందని గ్రహించారు. 

అలా 2011లో ఆమె బ్లూమెరిక్ సంస్థను ప్రారంభించారు. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత పరికరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ పూర్తిగా మార్చాలనుకుంటే ఏ సంస్థ సీఐఓ అయినా ఏం చేస్తారు? ఎవరైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానిక్‌ను పిలుస్తారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది బ్లూమెరిక్ సంస్థ. ఇదో డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ (డెవ్‌ఆప్స్) ఇంజినీరింగ్ కంపెనీ. ఒక్కోసారి అనుకోకండా స్టార్టప్ కంపెనీకి ఎక్కువమంది వినియోగదారులు వస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ట్రాఫిక్ నియంత్రించడం కష్టమై.. వెబ్‌సైట్ జామ్ అవుతుంది. వ్యాపారం కుప్పకూలుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా నియంత్రిచొచ్చు. స్టార్టప్‌ను ఓ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేట్ చేసి, మొత్తం పరిస్థితిని ఒకేసారి అంచనా వేయొచ్చు. ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిన సమయంలోనే సంస్థకు చెందిన మౌలిక వసతులను అంచనా వేసి, అప్పటికప్పుడు దాన్ని అప్‌గ్రేడ్ చేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పని కొనసాగించేలా చేయడమే క్లౌడ్ టెక్నాలజిస్ట్‌ల పని.

ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎందుకు మారానంటే.. నేను నిరంతరం.. బిజినెస్, ఐడియాస్ అంటూ చర్చిస్తుంటాను. అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి, రాత్రికి రాత్రే కంపెనీని ప్రారంభించానుంటున్నారు వినోదిని. తమిళనాడులోని ఈరోడ్‌లో ఆమె స్కూలింగ్‌ పూర్తి చేశారు. కొన్నాళ్లపాటు బెంగళూరులోని మరాథల్లి ప్రాంతంలో ఆన్‌లైన్‌లో చపాతీలు కూడా విక్రయించారు. ఆ తర్వాతే ఆమెకు టైమ్ కలిసొచ్చింది. 

వినోదిని బిజినెస్‌ను ప్రారంభించాలనుకోవడం వెనుక కారణం చాలా సింపుల్. వెబ్/మొబైల్ ఈ-కామర్స్ మార్కెట్, సర్వీస్‌కు మనదేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో క్లౌడ్ టెక్నాలజీకి అవసరం ఎంతో ఉంటుంది. టెక్నాలజీ రంగంలో కొత్త కళ అయిన క్లౌడ్ టెక్నాలజీని అర్థం చేసుకునే ఇంజినీర్ ఎవరైనా ఈ కెరీర్‌లో సక్సెస్ కావొచ్చు. ఇదే ఐడియాతో ఆమె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో ఆమె కంపెనీలో ఇద్దరు ఇంజినీర్లుండేవారు. ఇప్పుడా సంఖ్య 25కు చేరింది. వీరంతా క్లౌడ్ టెక్నాలజీ మీద పనిచేస్తూ అమెరికాలోని పలు ఈ-కామర్స్ సంస్థలకు సేవలందిస్తున్నారు.

బ్లూమెరిక్ వ్యవస్థాపకురాలు వినోధిని రాజు

బ్లూమెరిక్ వ్యవస్థాపకురాలు వినోధిని రాజు


మార్కెట్ సైజ్.. అవకాశాలు

క్లౌడ్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలున్నాయి. ఎంతో డబ్బు సంపాదించొచ్చు.ప్రపంచవ్యాప్తంగా లక్షన్నర ఈ-కామర్స్ వెబ్‌సైట్లున్నాయి. చాలా ఈ కామర్స్ కంపెనీలు ట్రాఫిక్‌ను తట్టుకోలేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సర్వర్లు ఈ కస్టమర్ల ట్రాఫిక్‌ను తట్టుకోలేకపోతే, షాపింగ్ ప్రాసెస్ మొత్తం తలకిందులవుతుంది. అలాంటి సమయంలో సంస్థపై కస్టమర్లకున్న విశ్వాసం సన్నగిల్లుతుంది. సర్వర్ ఒక్క నిమిషం డౌన్ అయినా, ఈ-కామర్స్ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గార్ట్‌నర్ అంచనా ప్రకారం గంటకు 14 వేల అమెరికా డాలర్ల వరకు నష్టం జరగొచ్చు. సర్వర్ డౌన్ అయితే కస్టమర్లు వెళ్లిపోతారు. తద్వారా సంస్థ ఆదాయం భారీగా పడిపోతుంది.

డెవ్‌ఆప్స్ మార్కెట్ సైజ్ గత ఏడాది 2.3 బిలియన్ డాలర్లు. 2014లో 1.9 బిలియన్ డాలర్లుంటే అది 21.1 శాతం వృద్ధి చెందింది. ఓ నివేదిక ప్రకారం 2016 చివరికల్లా గ్లోబల్ 2000 సంస్థల్లో 25 శాతం సంస్థలకు డెవ్‌ఆప్స్ సంస్థ క్లౌడ్ ప్రొవైడర్‌గా ఉండే అవకాశముంది.

బిజినెస్ మోడల్..

బ్లూమెరిక్ బిజినెస్ మోడల్ కూడా చాలా సింపుల్. ప్రాజెక్ట్-టైమ్ ఆధారంగా బిజినెస్ మోడల్ ఉంటుంది. పెద్దపెద్ద కంపెనీలు, లేదా చిన్న మధ్యతరహా కంపెనీలతో బ్లూమెరిక్ లాంగ్‌టర్మ్ కాంట్రాక్ట్స్‌ను చేసుకుంది. ఇప్పటికైతే ఈ సంస్థ సొంత మూలధనంతోనే ఏర్పాటై, లాభాల్లో నడుస్తున్నది. వినోదిని రాజు 20 వేల డాలర్ల కంటే తక్కువ పెట్టుబడితోనే సంస్థను ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఓ కోర్ టెక్నాలజీ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థకు గట్టిపోటీదారైన ఐడియాడివైస్ 2013లో నాలుగు మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. 8 కేపీసీ, రెలెవన్స్ ల్యాబ్స్ వంటి కంపెనీలు కూడా ఈ రంగంలో గట్టి పోటీనిస్తున్నాయి.

ఐటి ప్రపంచంలో అవాంతరాలు అత్యంత సహజం. ఈ నేపథ్యంలో వెస్ట్రన్ కంట్రీస్‌లో క్లౌడ్ టెక్నాలజీకి ఆదరణ పెరిగిపోతున్నది. ఈ రంగలో డేవ్ఆప్‌ది హై వాల్యూమ్స్‌తో కూడిన లో మార్జిన్ బిజినెస్’ అని గ్రేహౌండ్ రీసెర్చ్ సీఈఓ సంచిత్ విర్ గోగియా తెలిపారు.

గార్ట్‌నర్ అంచనా ప్రకారం 2015లో 1.9 బిలియన్ మొబైల్స్ షిప్సింగ్ అయ్యాయి. అదే సంవత్సరంలో 2.4 బిలియన్ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. పరికరాల సంఖ్య పెరిగిపోతుంటే దానికి తగ్గట్టుగానే వాటిని ఉపయోగించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. సమస్యలు పెరిగితే క్లౌడ్ టెక్నాలజిస్ట్‌ల అవసరం కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డేవ్‌ఆప్స్ వంటి స్టార్టప్ కంపెనీలకు పని పెరుగుతుంది. డాటా సెంటర్‌లో అప్లికేషన్స్‌ను అంచనా వేసేందుకు ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌లో విరివిగా ఉపయోగించే కుబెర్నెట్స్, డాకర్ టూల్స్‌ ఆధారంగా బ్లూమెరిక్ ఓ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సంస్థకు అవకాశాలు అపారంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు పెరుగుతున్న కొద్దీ ఈ సంస్థకు అవకాశాలు కూడా అదే సంఖ్యలో పెరిగిపోతాయి. క్లౌడ్ టెక్నాలజీ రంగంలో అవకాశాలను సొంతం చేసుకుంటున్న బ్లూమెరిక్ మరింత వృద్ధి చెందాలని యువర్‌స్టోరీ కోరుకుంటోంది.

వెబ్‌సైట్ 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags