4 లక్షల మందికి ఉద్యోగాన్వేషకులకు వేదిక మేరాజాబ్
ప్రతి సంవత్సరం, కొన్ని వేల మంది ప్రజలు పల్లెటూళ్ల నుండి వారి జీవనోపాధి కోసం పట్టణాలకి వలస పోతున్నారు. పెట్టె బేడ సర్దుకుని వారి కుటుంబాలకి వీడ్కోలు చెప్పి భవిష్యత్ బాటలో వారి జీవితాలు ఏ విధంగా రూపాంతరం చెందుతాయో తెలియని పట్టణ జనారణ్య పోటీ ప్రపంచం లోకి ప్రవేశిస్తూ వుంటారు. ఇది నాణానికి ఒక వైపు అయితే, ఇంత మంది ప్రజలు పట్టణాలకి వలస వస్తున్నా కొన్ని సంస్థలు సరైన అర్హతలు, నైపుణ్యం కలిగిన అభర్ధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. మరి వలసలు అంతగా కొనసాగుతున్నా వ్యాపార సంస్థలకు ఉద్యోగాలకి అభ్యర్దులను పొందటం కష్టసాధ్యం ఎందుకు అయ్యింది ?
మేరా జాబ్ సంస్థాపకుడు పల్లవ్ సిన్హా ఇదే ప్రశ్నను తనను తాను ప్రశ్నించుకున్నాడు. నేను 2008 లో ఇండియాకి రాగానే అర్ధమయింది అర్హులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవటం ఎంత కష్టమో. నాకు టీమ్ బిల్డింగ్‌లో వున్న అనుభవంతో తెలుసుకుంది ఏంటంటే మన దేశంలో ఎంతో ప్రతిభ వుంది కాని సరైన యాజమాన్య అవగాహనా లేదు. ఏ ఒక్కరు కూడా ఈ వలసలకు ఉపాధి కల్పించే విషయం లో శ్రద్ద చూపించటం లేదు అని గమనించినట్టు చెబుతారు. అందుకని ఆయనే ఈ అపారమైన పనికి పూనుకుని 2012 లో మేరా జాబ్‌ని స్థాపించారు.
మేరా జాబ్ అనేది సకల స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థ. ఇది అభ్యర్దులను online లో మరియు offline లోనూ ఎంపిక చేసుకోవచ్చు. ప్రతిభ పాటవాలను కలిగిన అభ్యర్దులను ప్రత్యక్షంగాను పరోక్షంగాను తీసుకోవచ్చు. టెలీమార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు రిసెప్షనిస్ట్ లాంటి ఎన్నో వైట్ కాలర్ జాబ్స్ని సమర్దవంతంగా అందించగలుగుతుంది. అలాగే డ్రైవర్స్‌కి డెలివరీ బాయ్స్‌కి కూడా ఉపాధి కల్పిస్తుంది. మార్కెట్లో ఇలాంటి ఉపాధి కల్పించే సంస్థలతో మేరా జాబ్‌ని పోలిస్తే ఎంత తేడా ? మేరా జాబ్ మాత్రమే ఏకైక ప్రీ స్క్రీనింగ్ పద్ధతిని కలిగివుందని పల్లవ్ చెబ్తారు. ఈ ప్రీ స్క్రీనింగ్‌లో యజమాని యొక్క అవసరానికి సరిపడే ప్రతిభ అభ్యర్ధికి... వుందా లేదా సరిచూస్తారు. ఆ పరీక్షను అభ్యర్ధి online లోనే పాల్గొనచ్చు లేదా టెలీ రిక్రూట్మెంట్ సెంటర్‌తో ఫోన్ సంభాషణ లోనూ పొందవచ్చు.
ఈ సంస్థ వారి టెక్నాలజీ సహాయంతో వారి డేటా బేస్‌ని ఒక్కటిగా చేసి అందులో రిజిస్టర్ అయిన వారి భవిష్యత్‌లో అభ్యర్ధులకు ఏ విధంగా ఉపయోగ పడటం అని పరిశీలించే కార్యక్రమం కూడా ఉంది. ఒకసారి డేటాబేస్‌లో నిక్షిప్తం అయిన తరువాత వారి ఇష్టానికి తగ్గట్టుగా ఉపాధి కల్పిస్తాం. అంతే కాని ఎక్కడో గుంటూరు వ్యక్తికి గజియాబాద్‌లో ఉద్యోగం చూపించం వంటివి చేయబోమని చెబ్తున్నారు. అభ్యర్థి ఇష్టానికి విరుద్దంగా రికమండ్ చేయబోమని, దీని వల్ల అటు అభ్యర్ధి, ఇటు యజమాని సమయం కూడా ఆదా అవుతుంది అంటున్నారు.
మేర జాబ్‌కి ముందు పల్లవ్ Fullerton Securities (ఇప్పుడు Dunia Finance) కి co-founder గా చేసారు. Fullerton లో ఒక ప్రాజెక్ట్ కోసం మేరా జాబ్ కో ఫౌండర్స్ గిరీష్ ఫన్సాల్కర్, రామన్ త్యాగరాజన్ ఇద్దరినీ McKinsey లో కలిసారు.
నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు ఒక పారిశ్రామికవేత్త అవుతాను అని. నేను ఇప్పటికి అనుకుంటూ వుంటాను దేశంలో కొనసాగుతున్న పరిశ్రమల స్థాపనలో నేనే చాలా ఆలస్యంగా ఇలా ఒక సంస్థను ప్రారంభించాను అని అన్నారు పల్లవ్ నవ్వూతూ.
ఇరవై మూడేళ్ళ అనుభవంతో గిరీష్ టీమ్‌లో వున్నారు, వినియోగదారుని మార్కెట్‌కీ సంబంధించిన జ్ఞానం పల్లవ్ కి చాలా వుంది. అతను ఆలోచనల గని. రామన్ అతి క్లిష్టమైన ఇబ్బందులను తనకు వున్న అనుభవంతో ఎదుర్కొనగలడు. ఇక నాకు వున్న అపార టెక్నాలజీ మరియు నిర్వహణ అనుభవాలతో సంస్థను ముందుకు నడిపిస్తున్నాము అని చెప్తారు IIM-A మరియు IIT-B పట్టభద్రుడు పల్లవ్.
10,00,000 profiles ని భద్రపరిచి సంస్థలకు అందజేయటం మేరా జాబ్ మొదటి ఆలోచన. కానీ కేవలం అంతమంది ప్రొఫైల్స్ సేకరించటం వాళ్ళ ఉపయోగం లేదు వారిని ఉపయోగించుకునే యాజమాన్యం లేనప్పుడు ఇది వృధా ప్రాయస అవుతుంది అని మా టీమ్ తక్కువ సమయంలో గ్రహించాం. ఈ సమస్యకు పరిష్కారంగా క్రమబద్ధమైన ప్రీ - స్క్రీనింగ్ పద్దతిని రూపొందించారు. త్వరలో మొబైల్ యాప్‌నూ ఆవిష్కరించనున్నారు. ఈ చర్చలు జరుగుతున్న సమయంలో పల్లవ్ ఆసక్తికరమైన ఒక చిన్న సంఘటనను మాతో పంచుకున్నారు. ఆ ఒక్క ఉదాహరణ తో మార్కెట్ మీద నాకు ఉన్న దృక్పదం మారింది. అదేంటంటే మార్కెట్లో ఉద్యోగ అన్వేషకులలో దాదాపు 80 % మంది స్మార్ట్ మొబైల్స్ కలిగివున్నారు. వలసలు వచ్చిన తొలి రోజుల్లో ఒక స్మార్ట్ మొబైల్ కొంటారు ఎందుకంటే వారికి సన్నిహితులు వుండరు. వారికి మొబైల్ ఒక్కటే వినోదం అందించే సాధనం.
మేరా జాబ్ సంస్థ మొత్తం 70 మంది టీమ్ తో, 4,00,000 మంది ఉద్యోగార్హత కలిగి ఉద్యోగం కావాల్సిన వాళ్ళతో, 12 పట్టణాలో పని చేస్తూ ఒక ప్రైవేటు పెట్టుబడి దారుడి నుండి 30,00,000 డాలర్లను పెట్టుబడిగా పొందగలిగింది. ఈ సంవత్సరం చివరకు ఇంకా ఎక్కువ పెట్టుబడి వస్తుంది అని ఆశిస్తున్నారు.
నిరుద్యోగులు అందరికి అన్ని సర్వీసెస్‌ని ఉచితంగా ఇస్తూ వ్యాపారవేత్తలతోనే లావాదేవీలు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. నిరుద్యోగుల ప్రతిభని పెంపొందించే దిశగా మా అడుగులు సాగించాలి అని మేము అనుకుంటున్నాం. ఆ విషయమై మేం NSDCతో కౌన్సిలింగ్ మరియు భాషకు సంభందించిన శిక్షణా తరగతుల ఒప్పొందాన్ని కుదుర్చుకున్నాం అని చెప్పారు పల్లవ్. ఏది ఏమైనపట్టికి సరైన అభ్యర్ధిని సరైన సమయంలో పొందటం అతి పెద్ద సవాల్. ఏ వ్యాపారాలలో అయినా మెళకువలను అన్ని స్థాయిలలో వ్యాప్తి చెందించటం చాల కష్ట సాధ్యమైన కార్య నిర్వాహణ.
ఒక నూతన పారశ్రామికవేత్తగా ఒత్తిడి ని అనుభవించటం కూడా మంచిదే అంటారు పల్లవ్. అది నీకు నీ పరిశ్రమ వికాసానికి మంచిది అని. “ఏదోక కారణంగా వైఫల్య భయం వుంటుంది, నేను ఇంతకు ముందు ఒక వ్యాపారం చేశా. అప్పుడు నేను ఓటమి గురించి అంతగా భయపడలేదు ఎందుకంటే ఎవరి సహాయం లేకుండా నాకు నేను గా చేసిన వ్యాపారం. అందులో నేను ఒక్కడినే భాగస్వామిని. ఇప్పుడు భయం ఎక్కువ అయ్యింది నాలో ఎందుకంటే నమ్మి పెట్టుబడి పెట్టిన వారి ధనం ఒకవైపు మరియు ఉద్యోగస్తుల భవిష్యత్తు ఒకవైపు” అని చెప్పారు గిరీష్.
ఇండియాలో రిక్రూట్మెంట్ మార్కెట్ విలువ అక్షరాలా 800 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. Matrix partners లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం అది 20% వరకూ పెరిగే అవకాశముంది. naukri, monster era సంస్థలు చేపట్టిన online విధాన ఉద్యోగ అభ్యర్ధుల ఎంపిక మొదలైన తరువాత మరోసారి ఈ online ఎంపిక ఊపందుకుంది.
ఇండియన్ స్టార్ట్ అప్ ఎకో సిస్టం అతి తక్కువ సంవత్సరాల్లో 300,000 కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశముంది. అయినా రిక్రూటర్స్కి మాత్రం సరైన అర్హతలు, నిలకడలేని అభ్యర్ధులతో కాలయాపన జరుగుతూనే ఉంది. కింది స్థాయి ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్ధులు ఆ విధి నిర్వహణలో ఎంత కాలం కొనసాగుతారో కూడా ఒక సవాల్‌గా మారింది.