కుకింగ్ మీద మక్కువతో బ్రిస్టో అండ్ టీ ప్రారంభించిన అక్కాచెల్లెళ్లు
అక్కడి వాతావరణం మీ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకుతెస్తుంది. చిన్ననాటి సంగతుల్ని తిరిగి గుర్తుచేస్తుంది. అక్కడి ఊయల, మామిడి చెట్లు మీ గత కాలపు స్మృతుల్ని జ్ఞప్తికితెస్తాయి. ఇక అక్కడ లభించే ఆహార పదార్ధాలు చిన్నతనంలో మీ ఊరిలో తిన్న రుచిని అందిస్తాయి. కట్టెల పొయ్యి మీద వండిన ఆహారం తెచ్చే సువాసన మిమ్మల్ని తిరిగి పాత రోజులకు తీసుకెళ్తుంది.
కుకింగ్ అంటే ఇష్టమున్న ముగ్గురు అక్కా, చెల్లెళ్ల ఆలోచనలకు దృశ్య రూపమే "అవర్ స్టోరీ - బ్రిస్టో అండ్ టీ రూం". పిచ్చెక్కించే రద్దీ, జనాలనుంచి కాస్త దూరం చేస్తూ, మధురమైన జ్ఞాపకాల్ని, జీవితాన్ని గుర్తుచేసేలా ఆ ప్రాంతాన్ని డిజైన్ చేశారు ముగ్గురు అక్కా, చెల్లెళ్లు, మేఘ్నా రాథోర్, మోహితా శహి, మౌసమి సింగ్‌లు. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే ప్రారంభమైన ఈ కేఫ్‌లో ఈ ముగ్గురి టేస్టులకు సమ్మేళనంగా అక్కడి రుచులుంటాయి. అక్కడి మెనులో ఎక్కువ ఆహార పదార్ధాలు ఉండనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆహార పదార్ధాలు లభిస్తాయి.
మోహిత - మౌసమి - మేఘ్న
"ఈ కేఫ్‌కు మా స్టోరీకి సంబంధం ఉంది. దీంతో మాకు ఎమోషనల్, సెంటిమెంటల్ కనెక్షన్ ఉంది. మరిచిపోయిన గత కాలానికి వెళ్లాలని ప్రతీసారి అనుకునే వాళ్లం. అందుకే అవర్ స్టోరీని ప్రారంభించాం. ఇక్కడికొచ్చే వారికి ఇక్కడున్న పరిసరాలు వారి చిన్నతనాన్ని గుర్తుచేస్తాయి". అంటుంది అవర్ స్టోరీ - బ్రిస్టో అండ్ టీ రూం డైరెక్టర్ అయిన మేఘ్న.
ముగ్గురు అక్కా చెల్లెళ్ల అనుభవాల్ని, అవకాశాల్ని ఈ కేఫ్ రూపంలో షేర్ చేసుకుంటూ, తమ స్టోరీలను ఇతరులతో పంచుకోవాలని అనుకునేవారి కోసం ఒక వేదికగా ఈ కేఫ్‌ను మలిచారు ముగ్గురు సిస్టర్స్. ఈ కేఫ్ మేఘ్న కల, దానికి మోహిత, మౌసమి కలిసి వచ్చి ఒక రూపాన్ని అందించారు. ఆహారం అంటే ఉన్న మక్కువతో ఈ ముగ్గురూ, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా పాత రుచుల్ని మేళవించి అందిస్తున్నారు.
"మాలాగే ఇతరులు కూడా వారి చిన్నతనంలోకి వెళ్లాలని భావించాం. చిన్నతనంలో వాళ్లు చూసిన ఊయల, మామిడి చెట్లు, ఇతర వస్తువులు ఇక్కడ ఉండడంతో, ఇక్కడికి రాగానే వారు తమ గతించిన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటారు. ఈ ప్లేస్ వారి సొంతంలా భావిస్తారు" అంటుంది మేఘ్న.
సాంప్రదాయ పెంపకం
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఈ ముగ్గురు సిస్టర్స్, సంప్రదాయ రాజ్‌పుట్ కుటుంబానికి చెందినవారు. తండ్రి వృత్తిరిత్యా టీచర్ అయినప్పటికీ, ఆహార విషయాలన్నీ తెలిసినవారు. 12 ఏళ్ల వయసులోనే తమ ఊర్లో వంట చేయడం ప్రారంభించింది మేఘ్న. " కుకింగ్ అంటే ఇష్టమున్న నాకు మా ఫాదర్ ప్రోత్సాహాన్ని అందించారు. అంచి ఆహారాన్ని ఇష్టపడే మా కుటుంబం కొత్త రెసిపీలను నేర్చుకోవడానికి అవకాశాన్నీచ్చింది" అంటున్నారు మేఘ్న.
"నేను తయారుచేసే రెసిపీలు పర్ఫెక్ట్‌గా ఉండాలని ప్రతీసారీ అనుకునేదాన్ని. దాంతోనే మా కేఫ్‌లో ఉండే పదార్ధాలు ప్రెష్ గా, డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉంటాయి" అంటుంది మేఘ్న.
తండ్రి వ్యవసాయదారుడు కావడం, తల్లి గృహిణిగా ఉన్నా ఈ అక్కా చెల్లెళ్లు ఇండిపెండెంట్‌గా అలోచించేలా పెరిగారు. అది వారి ఎదుగుదలకి తోడ్పడింది. దీంతో చిన్నతనంలో వాళ్లంతట వాళ్లే ఏదో ఒకటి ప్రత్యేకంగా తయారుచేయాలని అనుకునేవారు. వచ్చే ఆరు నెలల నుంచి, ఏడాది కాలంలో వారి కేఫ్ మంచి పేరు తెచ్చుకుని, నిడా జనాల్తో వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
మోహిత పబ్లిక్ రిలేషన్స్ వృత్తి చేపట్టింది. తను అనుకున్నది సాధించే వరకు ఎన్ని అవరోధాలు ఎదురైనా పోరాడుతుంది. ఇక మౌసమి పాజిటివ్ యాక్షన్‌ను నమ్ముతుంది, ఇంటలెక్చువల్ థింకర్. ఈ కేఫ్ లోని క్రియేటివ్ జోన్స్ కోసం పెట్టుబడి పెట్టింది.
నేర్చుకున్న అంశం
ముందుగా నిర్ధారించుకున్న సమయంలోనే పనిని పూర్తిచేయడం పెద్ద సవాల్ అని ఈ కేఫ్ వ్యవస్థాపకులు నమ్ముతారు. అందుకు తగ్గట్లుగా టై ఫ్రేంలో పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నారు. అనేక నగరాల్లో ఈ కేఫ్ అవుట్‌లెట్లు ప్రారంభించాలని భావిస్తున్నా, ప్రస్తుతమున్న దానిపైనే దృష్టి పెట్టారు.
"మా దగ్గరకు వచ్చే వారికి వాళ్ల చిన్నప్పటి రోజుల్ని గుర్తుచేస్తున్నామనే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఏదో ఒకదానితో వారు తమ చిన్నతనాన్ని స్మరించుకుంటారు" అంటూ సంతోషంగా చెప్తున్నారు మేఘ్న.
"ప్రస్తుత సమయాన్ని, కలల్ని, మధుర స్మృతుల్ని తమ స్నేహితులు, కుటుంబంతో కలిసి నెమరువేసుకునేందుకు ఈ ప్లేస్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది" అంటున్నారు అక్కా చెల్లెళ్లు.