రూపానికి ప్రతిరూపమిచ్చే 3డీ ప్రింటర్

By Sri
17th Mar 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


'ఐదేళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు?' ఏ ఇంటర్వ్యూకెళ్లినా ఈ ప్రశ్న కామన్ గా వినిపిస్తుంది. మరి మీరు రాబోయే ఐదేళ్లలో గొప్పగా ఏదైనా సాధించాలనుకుంటున్నారా? అయితే త్రీడీ ప్రింటింగ్ ట్రై చేయండి. అవును... ఇది నమ్మకమైన, ఆశాజనకమైన రంగం అన్నది మార్కెట్ వర్గాల మాట. అయితే, ఈ ఫీల్డ్ లోకి దూకేద్దామనుకునే వాళ్లు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. త్రీడీ ప్రింటింగ్ ప్రపంచంలో ఇప్పటివరకు ఆదర్శవంతమైన, మార్గదర్శకంగా నిలిచే మోడల్ ఏదీ లేదు. సో సొంత వ్యూహాలతో మార్కెట్ ని ఈదాల్సిందే. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం, చిన్నచిన్న విడిభాగాల తయారీ కోసం, ప్రొడక్షన్ కు ముందు నమూనాలను పరీక్షించేందుకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఇప్పటికే వాడుకుంటున్నాయి తయారీ పరిశ్రమలు. 

152 బిలియన్ డాలర్ల ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ పలు త్రీడీ ప్రింటర్లు, త్రీడీ సిస్టమ్స్ పై పెట్టుబడులు పెట్టాయి. త్రీడీ ప్రింటింగ్ సదుపాయం ఉండటంతో నమూనాల కోసం ఇంజనీర్లు పనిముట్లపై ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని బదులు త్రీడీ ప్రింటర్ లో నమూనాను ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే... 69 బిలియన్ డాలర్ల ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్ బస్ గ్రూప్ ఎస్ఈ కూడా విమానాల తయారీకి ఉపయోగించే చిన్నచిన్న విడిభాగాల కోసం త్రీడీ ప్రింటింగ్ కంపెనీలతో చేతులు కలిపింది. అయితే ఇవన్నీ పెద్దపెద్ద కంపెనీలు. మరి ఈ రంగంలో స్టార్టప్ పరిస్థితేంటీ?

బ్లూప్రింట్

సిద్దార్థ్ రాథోడ్, కమలేష్ కొఠారి... ఇద్దరికీ త్రీడీ ప్రింటింగ్ అంటే ఇష్టం. ఇప్పటికే కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారం, సొంతగా పొదుపు చేసిన డబ్బులన్నీ కలిపి రెండు కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కలిసి 2015 చివర్లో స్టార్టప్ ప్రారంభించారు. బడా కార్పొరేట్ కంపెనీల దగ్గరున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే వీరి తాపత్రయమంతా. పేరు క్లోన్ మి. మెడికల్, లైఫ్ స్టైల్ సెగ్మెంట్లకు త్రీడీ ప్రిటింగ్ సేవలు అందిస్తున్న స్టార్టప్ ఇది. లైఫ్ స్టైల్ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరైనా తమ ప్రతిరూపం కావాలనుకుంటే... వీళ్లకు ఆర్డరిస్తే చాలు. వెంటనే మీలాంటి చిన్న విగ్రహాన్ని తయారుచేసిస్తారు. క్లోన్ మి యాప్ లేదా వెబ్ సైట్ లో ఫోటోలు స్కాన్ చేసి త్రీడిఫికేషన్ కోసం పంపాలి. వాళ్లు దానికి తగ్గట్టుగా చిన్న విగ్రహాలను తయారు చేస్తారు.

"యూకేలో ఆంట్రప్రెన్యూర్ షిప్ లో నేను నా మాస్టర్స్ చేస్తున్న సమయంలో మొదటిసారి ఓ షాపింగ్ సెంటర్ లో త్రీడీ ప్రింటింగ్ చూశాను. అక్కడ మొహాన్ని స్కాన్ చేసి, సూక్ష్మ ప్రతిరూపాలు తయారుచేసే అప్లికేషన్ ఉందక్కడ" అంటూ త్రీడీ ప్రింటింగ్ పై ఎలా ప్రేమలో పడ్డానో వివరిస్తారు సిద్దార్థ్.

అంతే. అప్పట్నుంచీ అలాంటి అఫ్లికేషన్ లు ఏమేం ఉన్నాయన్న దానిపై లోతుగా పరిశోధన చేయడం మొదలుపెట్టారు సిద్దార్థ్. త్రీడీ ప్రింటింగ్ పై సెమినార్లకు హాజరయ్యారు. ఈ టెక్నాలజీకి ఫ్యూచర్ ఉంటుందని అప్పుడే అర్థమైంది. ఫేషియల్ సర్జరీల కోసం త్రీడీ ప్రింటర్స్ ఎలా ఉపయోగపడతాయని తెలుసుకునేందుకు సింగపూర్ లో నిర్వహించిన త్రీడీ ప్రింటింగ్ ఎక్స్ పోను సందర్శిచారు కమలేష్. అక్కడే కలిశారు సిద్దార్థ్. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తిరిగి ఇండియాలో కలుసుకొని బిజినెస్ మోడల్ గురించి, ఇండియాలో త్రీడీ ప్రింటింగ్ ను ఎలా కమర్షియల్ చేయాలన్న దాని గురించి చర్చిద్దామని నిర్ణయించుకున్నారు. రెండు బిజినెస్ మోడల్స్ ను రూపొందించారు. ఒకటి లైఫ్ స్టైల్ సెగ్మెంట్. ఇందులో సాధారణ ప్రజలు, సంస్థల కోసం బెంగళూరులో త్రీడిఫికేషన్ సెంటర్ సేవలందిస్తుంది. మరొక బిజినెస్ మోడల్ హాస్పిటళ్లు, సర్జన్లకు త్రీడీ ప్రింటింగ్ ను అందుబాటులోకి తీసుకురావడం. పలు హాస్పిటల్స్ తో ఒప్పందాలు చేసుకుందీ స్టార్టప్.

"ఓ పెషెంట్ కి శస్త్ర చికిత్స చేసే ముందు డాక్టర్ కు ఆ పేషెంట్ మొహం ఎలా ఉంటుందో తెలియాలి. ఇందుకు త్రీడీ ప్రింటెడ్ ఫేస్ ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఆకారాలు, లక్షణాలు తెలుసుకోవచ్చు. సర్జరీ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు ఇవన్నీ అవసరం కూడా" -సిద్దార్థ్ రాథోడ్.

హైఎండ్ త్రీడీ ప్రింటర్ ఖరీదు 70 లక్షలుంటుంది. అందుకే బాగా డబ్బులున్న వారే ఎక్కువగా ఈ టెక్నాలజీని వాడుతుంటారు. కానీ 3డిఫికేషన్ లాంటి స్టార్టప్ కు మంచి అవకాశాలున్నాయి. ఎందుకంటే త్రీడీ ప్రింటర్ ను పార్ట్ టైమ్ కోసం ఉపయోగించుకోవాలనుకునే వ్యక్తులు, సంస్థల సంఖ్య ఎక్కువే. చిన్న కార్పొరేట్లు కూడా వీరి ప్రింటర్లను ఉపయోగించుకొని డిజైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. 3డీ సిస్టమ్స్ ప్రింటర్ ను జర్మనీ నుంచి తెప్పించారు.

image


ఆదాయ మార్గాలు

గిఫ్టింగ్ కోసం కార్పొరేట్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అందించడం, ఇన్ స్టిట్యూట్లతో కలిసి పనిచెయ్యడం ద్వారా ఆదాయం వస్తుంది. క్యాడ్ సిస్టమ్ ద్వారా ప్రొడక్ట్ ని స్కాన్ చేసిన తర్వాత క్లోన్ మి పోర్టల్ లేదా క్లోన్ మి యాప్ ద్వారా అప్ లోడ్ చేస్తారు. స్కాన్ చేసిన ఫోటోను 3డిఫికేషన్ కన్వర్ట్ చేసి త్రీడీ మోడల్ ప్రింట్స్ తీస్తుంది. వ్యక్తిగతంగా ఎవరైనా హై రెజల్యూషన్స్ ఫోటోలను అప్ లోడ్ చేయొచ్చు. లేదా క్లోన్ మిలో త్రీడీ స్కాన్ చేయొచ్చు. సైజును బట్టి ప్రింట్ ఇవ్వడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ప్రింటింగ్ ధర కూడా సైజును బట్టి ఉంటుంది. రెండు అంగుళాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కోసం కనీసం రూ.970 అవుతుంది. అదే 14 అంగుళాల నిలువెత్తు విగ్రహం కావాలనుకుంటే ధర రూ.35 వేలు కావాలి. పరిశోధనా నమునాల కోసమూ ఈ మెషీన్ అందుబాటులో ఉంటుంది. సంస్థలు మెషీన్ వాడుకున్న సమయం, తీసుకున్న ప్రింట్లను బట్టి 3డిఫికేషన్ కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

మెడికల్ బిజినెస్ కూడా ఉంది. ఇదీ మంచి మోడలే. ఆపరేషన్లు చేసే ముందు నమూనాల తయారీకి ఉపయోగపడుతుంది. ఈ వ్యాపారం పుంజుకోవడానికి ఇంకొంత సమయం పడుతుందని ఒప్పుకుంటున్నాడు సిద్దార్థ్. వీరి మెషీన్ స్కాన్ చేసిన ఇమేజెస్ ని ప్రింట్ తీసుకోవడానికి "జిప్సమ్"ని ఉపయోగిస్తున్నాయి. మొహం, ఎముకల స్ట్రక్చర్ తయారు చేసేందుకు మెడికల్ ఫీల్డ్ లో జిప్సమ్ ని ఉపయోగిస్తారు. జిప్సమ్ అంటే... ప్లాస్టర్ ఆఫ్ పారిస్. అయితే ఇది కేవలం తెలుపు రంగులోనే ఉండదు. వేర్వేరు రంగుల్లో ఉంటాయి.

3డిఫికేషన్ కు కాంపిటీషన్

బెంగళూరుకు చెందిన DF3D కంపెనీ నుంచి కాంపిటీషన్ ఉంది. ఇది ఇప్పటికే మెడికల్ ఫీల్డ్ లో బిజినెస్ చేస్తోంది. వారికి బయో టెక్నాలజీ డిపార్ట్ మెంట్ నుంచి రూ.50 లక్షల నిధులు వచ్చాయి. వీరితో పాటు త్రీడీ ప్రింటింగ్ బిజినెస్ లో మార్కు చూపించేందుకు మరికొందరు కూడా ఉన్నారు. ఆహా!3డి లాంటి స్టార్టప్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ రంగానికి ఇంకా ప్రత్యేకమైన బిజినెస్ మోడల్ అయితే లేదు. వచ్చే దశాబ్దంలో మార్కెట్ వ్యూహాలను చూడొచ్చు.

అవకాశాలు

ఓ నివేదిక ప్రకారం 2013లో లక్షా ఎనిమిది వేల త్రీడీ ప్రింటర్లు ఉన్నాయి. 2018 నాటికి ప్రింటర్ల సంఖ్య 23 లక్షలకు పెరుగుతుందని అంచనా. 2015 నుంచి 2018 వరకు ఏటేటా అమ్మకాలు పెరుగుతాయని, ఈ నాలుగేళ్లలో ఆరు బిలియన్ డాలర్ల మార్కెట్ జరుగుతుందని ఆ నివేదిక సారాంశం. భారతదేశంలో త్రీడీ ప్రింటర్లు ఎక్కువగా మెడికల్, ఆటోమొబైల్ రంగంలో వాడుతున్నారు. ఈ ప్రింటర్లు యూనివర్సిటీ విద్యార్థులకూ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ జిరాక్స్ మెషీన్లు కనిపించినట్టు... రాబోయే పదేళ్లలో త్రీడీ ప్రింటింగ్ మెషీన్లు కనిపిస్తాయి. ఫొటో కాపీయింగ్ కు జిరాక్స్ అనే పదం ఎలా ఫిక్సయిందో... త్రీడీ ప్రింటింగ్ ప్రపంచంలో 3డిఫికేషన్ అలాంటి ట్రెండ్ సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India