Telugu

చిన్న సంస్థల హెచ్ఆర్ కష్టాలకు పరిష్కారం 'క్విక్‌చెక్స్‌'

GOPAL
2nd Nov 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఏ సంస్థకైనా హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ చాలా ముఖ్యం. సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ జీతభత్యాలపై టెన్షన్ లేకుండా పనిచేయాలంటే హెచ్ఆర్ విభాగం సమర్థవంతంగా పనిచేయాలి. కానీ చాలా సంస్థలు సరైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తాయి. తాము రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో సంస్థలకు ఎలాంటి సమస్యలు ఉండవంటోంది క్విక్‌చెక్స్.

ప్రతి ఒక్క ఉద్యోగికి సోమవారం కూడా వీకెండ్‌లానే కనిపిస్తుంది. చెక్ లిస్ట్, బకెట్ లిస్ట్ మాదిరిగా, కేఫ్ కార్నర్‌లో టీ టైమ్ కూడా ఇటాలియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అది నెల ఆరంభమైతే ప్రతి రోజు పార్టీనే. కానీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో సమర్థులైన ఉద్యోగులు లేకపోతే. ఇక అంతే సంగతులు. జీత భత్యాల్లో కోత తప్పదు. నెలంతా పగలూ, రాత్రిళ్లు పడ్డ కష్టం వృథా అవుతుంది.

క్విక్‌చెక్స్ వ్యవస్థాపకుడు నైజెల్ లోబో

క్విక్‌చెక్స్ వ్యవస్థాపకుడు నైజెల్ లోబో


కానీ ఓ వార్టన్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ మాత్రం ఇకపై అలాంటి పరిస్థితులు రావని అంటున్నారు. ‘‘వేసవి సెలవుల్లో మా కుటుంబ వ్యాపార కలాపాల్లో పాలు పంచుకున్నాను. హెచ్ఆర్ ప్రాసెస్‌ను పూర్తిగా మ్యానువల్‌గా ఎక్సెల్ షీట్స్‌లో చేయడాన్ని గ్రహించాను. హెచ్ఆర్ అవసరాలకు తగిన పరిష్కారం కోసం మార్కెట్‌లో సరైన సాఫ్ట్‌వేర్ దొరుకుతుందేమోనని ఎంతో ప్రయత్నించాను. కానీ ఉన్న కొన్ని సాఫ్ట్‌వేర్లు సైతం సంస్థ అవసరాలకు తగ్గట్టుగా లేవు. అయితే సంక్లిష్టంగా, లేదంటే చాలా ఖరీదుగా, మరోవైపు అన్ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. భారత్‌లో సాంకేతిక ఆవిష్కరణలు కస్టమర్లకు లేదంటే పెద్ద సంస్థలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. మధ్య, చిన్న తరహా పరిశ్రమలను పట్టించుకునేవారే లేరు. ఆ సంస్థలను సవతి పిల్లల్లా నిర్లక్ష్యంగా చూస్తున్నారు. అందువల్లే ఎస్‌ఎంఈల్లో తక్కువ స్థాయిల్లో టెక్నాలజీ ఉపయోగం ఉంటుంది’’ అని క్విక్‌చెక్స్ వ్యవస్థాపకుడు నైజెల్ లోబో అన్నారు.

దీంతో ఎస్ఎంఈలు వాడుకునేందుకు వీలుగా టెక్నాలజీని అవసరమైన స్థాయిలో, వారి బడ్జెట్‌కు తగ్గట్టుగా రూపొందించాలని ఆయన నిర్ణయించారు.

‘‘క్విక్‌చెక్స్ ఆలోచన వార్టన్‌లో చదువుతున్నప్పుడే వచ్చింది. వార్టన్ ఇండియా ఎకానమిక్ ఫోరమ్ స్టార్టప్ కాంపిటిషన్‌లో ఫైనల్ జాబితాలో కూడా చోటు పొందింది. వార్టన్ బిజినెస్ ప్లాన్ కాంపిటిషన్‌లో సెమీ ఫైనల్ జాబితాలో ప్లేస్ దక్కించుకుంది. వార్టన్‌లో చదువు పూర్తయి భారత్ తిరిగి వచ్చి క్విక్‌చెక్స్‌ను డెవలప్ చేయడం ఆరంభించాను’’ అని ఫౌండర్, సీఈవో అయిన లోబో తెలిపారు.

చాలావరకు చిన్న సంస్థల్లో హెచ్ఆర్ ప్రాసెస్ అంత సమర్థవంతంగా ఉండదు. పేరోల్ సైకిల్ పూర్తయ్యే సమయంలో హెచ్ఆర్ మేనేజెర్‌కు ఉండే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంటెండెన్స్, లీవ్ డాటా కోసం బయోమెట్రిక్ డివైజ్‌లపైన, ఎక్సెల్ షీట్స్ కోసం, అకౌంట్స్ టీమ్ పంపే ఈమెయిల్స్ పైన ఆధారపడతారు. అకౌంట్స్ టీమ్ పేరోల్‌ను మాన్యువల్‌గా కానీ లేదంటే ఆర్చియాక్ పేరోల్ సాఫ్ట్‌వేర్ ఆధారంగాగాని నిర్వహిస్తుంటాయి. ఆ తర్వాత ఫీఎఫ్, పీటీ, ఈఎస్‌ఐసీ వంటి వాటి కోసం కన్సల్టెంట్‌కు పేరోల్ వివరాలను ఫైనాన్స్ మేనేజర్ పంపిస్తుంటారు.

క్విక్‌చెక్స్ మాత్రం విభిన్నమైన క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. అటెండెన్స్, లీవ్, పేరోల్‌లతోపాటు ఇతర వివరాలను కూడా నిర్వహిస్తుంది. పేరోల్ రన్ అవుతున్న సమయంలో ట్యాక్స్, కంప్లయెన్స్ రిపోర్ట్ ఆటోమెటిక్‌గా జనరేటవుతాయి. క్విక్‌చెక్స్ సపోర్ట్ టీమ్ ట్యాక్స్, కాంప్లయెన్స్ ఫైలింగ్స్ బాధ్యతలను చూస్తుంది. ఒకే పని రెండుసార్లు చేయకుండా, ఒకేసారి హెచ్ఆర్, పేరోల్, కాంప్లియెన్సెస్ వంటి పనులను పూర్తి చేస్తుంది.

క్విక్‌చెక్స్ నిర్వహిస్తున్న ఓ కంపెనీ ప్రొఫైల్స్

క్విక్‌చెక్స్ నిర్వహిస్తున్న ఓ కంపెనీ ప్రొఫైల్స్


‘‘మా ప్రాడక్ట్ వాడే విధానంలోనూ, విస్తరణలోనూ మిగతావాటితో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది. చాలా వరకు సాఫ్ట్‌వేర్లను డొమైన్ ఎక్స్‌పర్ట్స్ కోసం రూపొందిస్తారు. కొన్నేమో సింపుల్‌గా ఉన్నప్పటికీ స్కోప్ పరిమితంగా ఉంటుంది. కానీ మేం మాత్రం నాన్ హెచ్‌ఆర్ డొమైన్ ఎక్స్‌పర్ట్స్ కోసమే ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. ఏదైన కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి ఉపయోగించుకోవాలనుకుంటే, వారి ఉద్యోగులను శిక్షణ కోసం పంపిస్తే, నేర్చుకోవడానికి సిబ్బందికి రెండు వారాల నుంచి రెండు నెలల వరకు పడుతుంది. కానీ మా ప్రాడక్ట్‌ను గంటలో నేర్చుకుని ఎక్స్‌పర్ట్స్‌గా మారొచ్చు’’ అని నైజెల్ వివరించారు.

ఒక్కో సంస్థకు ఒక్కో ప్లాన్..

సంస్థను బట్టి క్విక్‌చెక్స్ తమ ఉత్పత్తులను రూపొందిస్తున్నది. ఒక్కో సంస్థకు ఒక్కో ప్లాన్‌ను రూపొందిస్తోంది. ‘‘మా ప్రాడక్ట్‌ను ఎవరైనా తీసుకుంటే వారికి అన్ని విధాలుగా సహకరిస్తాం. మూడు వేర్వేరు ప్లాన్స్ ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్ ప్లాన్‌లో మైగ్రేషన్‌తోపాటు సపోర్టు కూడా అందిస్తాం. ఇక హైబ్రీడ్ ప్లాన్‌లో కంపెనీ పేరోల్‌ను నిర్వహిస్తే, మా టీమ్ పీఎఫ్, ఈఎస్ ఐసీలతోపాటు మిగతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఇక మూడో ప్లాన్‌లో పూర్తి స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. మేమే ఓ అకౌంట్స్ మేనేజర్‌ను అసైన్ చేస్తాం. అతను పేరోల్‌ను నిర్వహించడంతోపాటు ఇతర వ్యవహారాలు కూడా చూసుకుంటాడు’’ అని నైజెల్ తెలిపారు. లీవ్, అటెండెన్స్, పేరోల్ అన్ని సమర్థవంతంగా ఒకే సాఫ్ట్‌వేర్‌లో ఉండటంతో హెచ్ఆర్ టీమ్‌కు నియామకాలు, వెట్టింగ్, సేఫ్టీ గైడ్ లైన్స్, ట్రైనింగ్ వంటి ఇతర వ్యవహారాలపై దృష్టిపెట్టేందుకు వీలు దొరుకుతుంది.

ఈ సాఫ్ట్‌వేర్‌ను ట్రై చేయాలనుకుంటే కస్టమర్ క్విక్‌చెక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ట్రయల్ అకౌంట్‌లో సైనప్ అవ్వాలి. క్రెడిట్ కార్డ్ డీటైల్స్ ఇచ్చి అప్లికేషన్ పూర్తి చేయాలి. ‘‘దురదృష్టవశాత్తూ భారత్‌లో బీటూబీ సెల్లింగ్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఎప్పుడూ విక్రయించడమే తప్ప కొనుగోలు చేయడమంటూ ఉండదు. ప్రస్తుతం తాము ఉన్న పొజిషన్ నుంచి మారేందుకు కస్టమర్లు అంతగా ఇష్టపడరు. ఇతర ప్రాడెక్ట్‌పై మరీ ఆకర్షణకు గురైతే తప్ప వాటివైపు చూడరు. దీని కారణంగా అనుకున్నదాని కంటే మా సాఫ్ట్‌వేర్ అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్నాయి’’ అని నైజెల్ పేర్కొన్నారు.

ఇలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ 2014 ఏప్రిల్ లో మార్కెట్‌లోకి ప్రవేశించిన క్విక్‌చెక్స్ వేగంగా వృద్ధి చెందుతున్నది. తన ప్లాట్‌ఫామ్‌పై 15 వేల మంది ఉద్యోగుల వివరాలు ఉన్నాయి. వార్షికంగా సుమారుగా 550 కోట్ల రూపాయల విలువైన పేరోల్ వివరాలను పొందుపర్చారు. టినీ ఓల్, కూపన్ ధునియా, కవర్ ఫాక్స్ వంటి స్టార్టప్ కంపెనీలతోపాటు, వివిధ కంపెనీలకు సేవలందిస్తున్నది.

విస్తరణ

వచ్చే 18 నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను 18 వేల నుంచి 50 వేలకు పెంచుకోవాలనుకుంటున్నది. అలాగే తమ ప్లాట్‌ఫామ్ వేదికగా పేరోల్ మొత్తాన్ని కూడా 1800 కోట్లకు విస్తరించాలని భావిస్తున్నది.

‘‘మా లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మా ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుంది. సేల్స్ రిప్రజంటేటివ్స్ సంఖ్యను భారీగా పెంచాలి. ప్రస్తుతానికైతే థర్డ్ పార్టీ క్లౌడ్ సొల్యుషన్స్‌తో మా సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి’’ అని నైజెల్ వివరించారు.

వెబ్ సైట్: http://www.quikchex.in/

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags