సంకలనాలు
Telugu

కారు,ఫ్రిజ్,కెమెరా,పిల్లల బొమ్మలు.. ఏవి కావాలన్నా రెంట్‌షెర్‌లో అద్దెకు దొరుకుతాయ్

కొనడానికి మనసు రాకుంటే అద్దెకు వస్తువులుచిన్నారి ఆడుకొనే బొమ్మల దగ్గరి నుంచి రిఫ్రజిరేటర్ల దాకాబెంగళూరులో ప్రారంభమైన రెంట్ షేర్ స్టార్టప్ ఏడాది చివరికల్లా మరో ఐదు ప్రధాన నగరాల్లో విస్తరించే యోచనకొత్త మార్కెట్ తో జనంలోకొచ్చిన రెంట్ షేర్

ashok patnaik
27th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
రెంట్‌షెర్‌లో అధ్దెకు లభించే వస్తువుల జాబితా

రెంట్‌షెర్‌లో అధ్దెకు లభించే వస్తువుల జాబితా


ఆన్ లైన్లో వస్తువుల అమ్మకం జోరందు కుంటుందనే మాట ఎంత వాస్తవమో.. అందులో పదిశాతం రెంట్ మార్కెట్ ఉందనేది అంతే వాస్తవం. దీన్ని గ్రహించిన ఇద్దరు దంపతులు ప్రారంభించిందే రెంట్ షేర్. అయితే ఇది పీర్ టు పీర్ మొడల్ వ్యాపారం. పీర్ టు పీర్ బిజినెస్(అందరితో కలుపుకుంటూ చేసే వ్యాపారం) అనేది దేశ ఆర్థిక పెరుగుదలకు ఉపయోగపడే ఒక సాధారణ వ్యవస్థ. ఇప్పుడిప్పుడే భారత్ లో ఇది ప్రాచుర్యంలోకి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది పదేళ్ల క్రితమే తన ద్వారాలను తెరిచింది. ప్రస్తుతం ఈరంగం 26బిలియన్ డాలర్ల మార్కెట్ ఉందని బోట్స్ మన్ అభిప్రాయడ్డారు. పీర్ టు పీర్ సబ్జక్ట్ పై ఈయన ఎన్నో ఆర్టికల్ రాసారు. దీన్ని వెలుగులోకి తెచ్చిన రచయితల్లో ఈయన్నే ప్రధానంగా చెప్పుకొచ్చు. భవిష్యత్ లో ఈరంగం మరింత మందికి ఉపాధి కల్పించబోతోందన్న మాట.

image


ఈ మార్కెట్ లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టింది రెంట్‌షెర్. రెంట్‌షెర్ అనేది హోమ్ డెలివరి తోపాటు పిక్అప్ సర్వీసును అందిస్తోంది. 2014లో ఇది ప్రారంభమైంది. క్రిస్మస్ ముందు ప్రారంభమైన ఈ సర్వీసు కస్టమర్ల ఇంటి దగ్గరకే సేవలను తీసుకొచ్చింది. తమ సేవలు ఎంతో పారదర్శకంగా ఉంటాయని వాటిని వినియోగించుకోవడం కూడా ఎంతో సులభం అని టీం చెప్పుకొస్తోంది.

అభిజిత్

అభిజిత్


చాలా గ్లోబల్ కంపెనీలు ఈ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నాయి. ఫ్యాషన్, కార్లు, పుస్తకాల క్యాటగిరీలో ఎన్నో స్టార్టప్ లు పనిచేస్తున్నాయి. ఫైదా,రెంటోగో,ఐరెంట్ షేర్ ... పీర్ టు పీర్ లో ఉన్న ఇతర కంపెనీలు. రెంట్‌షెర్ ఫౌండర్లలో ఒకరైన అనుభ వర్మ అభిప్రాయప్రకారం ఇతర ఈరంగంలో ఉన్న ఇతర కంపెనీలన్నీ పిటుసి స్పేస్ లో మాత్రమే ఉన్నాయి. ప్రొడక్ట్ ఆర్డర్, డెలివరి, యాడ్ ఆన్ సర్వీసుల విషయంలో ఎదురయ్యే సమస్య(లూప్)కు వారింకా పరిష్కారం చూపలేకపొతున్నారు. 

కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తాము పనిచేస్తున్నామని టీం భావిస్తోంది. ఇదే టీంలో స్పూర్తిని నింపే అంశంగా చెప్పుకొవచ్చు. టెక్నాలజీ విభాగంలో ఓ కేజి బరువైన ప్రొడక్ట్ బయటకు రావాలంటే 3,700కేజిల వేస్ట్ చేయాల్సి వస్తోంది అని రెంట్ షేర్ ఫౌండర్లలో కేతకి అభిప్రాయపడ్డారు. ఈ వేస్ట్ పర్యవరణానికి నష్టంగా తయారువుతోందని అన్నారామె.

“మనం వాడే చాలా వస్తువుల తయారీలో వ్యర్థాల శాతం ఎక్కువ ఇవన్నీ భూమిలోనే కలిపేస్తున్నాం. లేదా సముద్రంలో పడేస్తున్నాం. మొబైల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, టీవీలు, ఫ్రిజ్ లతో అధికశాతం టాక్సిన్ లను విడుదల చేస్తున్నాయి.”- కేతకి

కేతకి, అభిజిత్ లు తల్లిదండ్రులు అయిన క్షణం వారికి కొత్త ఆలోచన వచ్చింది. తమ చిన్నారిని ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ దారిలో పెంచాలని నిశ్చయించుకున్నారు. బొమ్మలు, పిల్లలు ఉపయోగించే పరికరాలను అద్దెకి తీసుకొని వాటిని ఉపయోగించాలని అనుకున్నారు. ఇది ఒక్క చిన్నారి బొమ్మలతో తీరేది కాదు. దీంతో ఇంటి సామగ్రి, ట్రావెల్ యాక్ససరీస్, ఆటవస్తువులు లాంటివి కూడా ఇదే పద్దతిలో రెంట్ కు ఇవ్వొచ్చనే అభిప్రాయానికి వచ్చారు.

“ ఈ వస్తువులన్నీ కొనడం కంటే రెంట్ కి తీసుకోవడమే ఉత్తమం. ఇంటిలో ఖర్చులు కూడా తగ్గుతాయి,” కేతకి

ఆ తర్వాత అనుభ, హర్షాలు వీరితో జతకట్టారు. రెంట్‌షెర్ పురుడుపోసుకుంది. దాదాపు నలభై వేల డాలర్ల బిజినెస్ చేస్తున్నారు. దాదాపు అన్ని రకాల వస్తువులు వారి సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

అనుభ, కేతకి

అనుభ, కేతకి


బిజినెస్ ఎలా ?

రోజుకి వెబ్ సైట్ కి 100కి పైగా విజిటర్లు వస్తున్నారు. ఇప్పటి వరకూ 300ల రకాల వస్తువులను రెంట్ కి పెట్టాం. ప్రస్తుతానికి బెంగళూరులో నడుస్తోన్న ఈ కంపెనీ భవిష్యత్ లో పూణె, చంఢీఘడ్, గుర్గావ్ లో విస్తరించే యోచనలో ఉంది. ప్రస్తుతానికైతే పిటుపి రెంటల్ మోడల్‌లో నడుస్తోంది. లిస్టింగ్ చేయడానికి రెంట్ షేర్ కస్టమర్ల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. డెలివరీ సర్వీసును ఇస్తుంది. ప్రతి లావాదేవీలో 20 శాతం కమిషన్‌ను ప్రాడక్ట్ ఓనర్ దగ్గర వసూలు చేస్తారు.

ముందు మా వస్తువులను మాత్రమే రెంట్ కి ఇవ్వాలని ప్రారంభించాం. తర్వాత చాలా మంది తాము కూడా మాతోపాటు కలవడంతో రెంట్ షేర్ విస్తరించింది. ఇదిలా ఉంటే వస్తువుకి ఎంతవరకు రెంట్ నిర్ణయంచాలనే ప్రశ్న ఉత్పన్నమైందని అనుభ అన్నారు.

20నుంచి 30 శాతం రెంట్ వసూలు చేస్తే సరిపోతుందని టీం నిర్ణయించింది. బెంగళూరు మార్కెట్ అంచనా ప్రకారం ఇది బాగా వర్కవుట్ అయింది. బెంగళూరులో 120 మిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్ ఉంది. అయితే దీనిలో 25మిలియన్ అమెరికన్ డాలర్ల వరకూ తమకు పొటెన్షియల్ ఉందని గుర్తించగలిగారు. టూటైర్ సిటీల్లో 400నుంచి 500 మిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఈ కామర్స్ మార్కెట్ ప్రకారం ఇది పెరగడంతో పాటు తగ్గడానికి అవకాశాలున్నాయని హర్ష వివరించారు. వచ్చే మూడేళ్లలో ఆన్ లైన్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. దాంతో పాటే రెంటల్ మర్కెట్ సైతం దూసుకు పోనుంది. భారతీయ రిటైల్ మార్కెట్ 500 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోబోతోందని విశ్లేషకులు అంచానా వేస్తున్నారు. ఇందులో 10నుంచి 20శాతం రెంటల్ మార్కెట్ ఉన్నప్పటకి 500మిలియన్ డాలర్లకు చేరనుందన్న మాట. ఈ ఏడాది చివరికల్లా మరో ఐదు నగరాలకు విస్తరించాలని రెంట్ షేర్ చూస్తోంది. మరికొన్ని డిఫరెంట్ ఫీచర్లను యాడ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ప్రాడక్ట్ లను అప్ లోడ్ చేయడానికి సులువైన మొబైల్ యాప్ ఎంతగానో సహరించనుందని అనుభ ముగించారు.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags