Telugu

చెక్క గడియారాలతో బోలెడు సంపాదిస్తున్నారు

team ys telugu
22nd Jan 2017
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

చిన్న కన్ఫ్యూజన్. మనం టెక్నాలజీని నడిపిస్తున్నామా? టెక్నాలజీ మనల్ని నడిపిస్తోందా? ఇదంతా ఆలోచిస్తూ కూచుంటే 1947లోనే ఉండిపోతాం. అందుకే అందిపుచ్చుకోవడమే మనం చేయాల్సిన పని. కళ్లముందే అలాంటి మార్పులెన్నో చూశాం. అందులో ఒకటి చేతిగడియారం. చూస్తుండగానే అనలాగ్ నుంచి డిజిటల్ కు మారిపోంది. కాకపోతే ఆ కొత్త ట్రెండు మనదగ్గర కాస్త లేటయింది. అయితే, విచిత్రం ఏంటంటే డిజిటల్ వాచీల నుంచి మళ్లీ అనలాగ్ కు మారిపోతున్నారు. అదికూడా స్టయిలిష్ గా.అలాంటి స్టార్టప్ తోనే మార్కెట్లో కస్టమర్ల నాడీని పట్టుకోగలిగింది వుడిన్ వాచెస్.

నడుస్తున్న డిజిటల్ యుగంలో మళ్లీ జనాలను అనలాగ్ టేస్టుకి మళ్లించడంలో సక్సెస్ అయ్యారు ఇండోర్‌కు చెందిన భార్యాభర్తలు. అనలాగ్ వాచీ అంటే అదేదో రెగ్యులర్ లెదర్ స్ట్రిప్ టైప్ కాదు. వాచీకి చెక్కతో ఒక స్టయిలిష్ లుక్ తెచ్చారు. కర్రతో చేసిన వాచీలా అని తీసిపారేయలేం. జపాన్ ఇంపోర్టెట్ క్వార్ట్జ్ కంపెనీతో అఫిలియేట్ అయి, గడియారాన్ని క్లాసిక్ గా, ఫ్యాషనబుల్ గా తీర్చిదిద్దారు. వుడెన్ వాచీని చూస్తే చాలు వావ్ అనాల్సిందే. ప్రస్తుతం మూడు వేర్వేరు కలర్స్ లో అందుబాటులోకి తెచ్చారు. గడియారం పెద్దగా బరువుండదు. స్ప్లాష్ ప్రూఫ్, అద్దంమీద గీతలు పడవు.

image


వాచీలను తయారుచేసేందుకు మంచి చెక్క కోసం ప్రపంచమంతా గాలించారు. కెనాడ నుంచి మాపుల్ వుడ్, సెంట్రల్ అమెరికా నుంచి వెరా వుడ్, ఎబోనీ చెక్కను మధ్య ఆఫ్రికా నుంచి, ఎర్రచందనం కర్రలను సౌతిండియా నుంచి తెప్పించారు.

భర్త సమర్ధ్ అంతకు ముందు విప్రోలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్. ఉద్యోగం అంతగా నచ్చలేదు. కొత్తగా, తనకంటూ సొంతంగా ఏదో బిజినెస్ చేయాలని మనసులో పడింది. తయారుచేసే ప్రాడక్ట్ యూనిక్ గా, ఇకో ఫ్రెండ్లీగా ఉండాలని, రకరకాల బిజినెస్ ప్లాన్లు వేశాడు. స్టార్టప్ ఐడియాకోసం సమ్మిట్లు, సెమినార్లు తిరిగాడు. అలా శోధించగా, శోధించగా అమెరికాలోని ఒక వాచ్ కంపెనీ ప్రాడక్ట్ పిచ్చిపిచ్చిగా నచ్చింది. అలాంటిది ఇక్కడ ఎందుకు తయారు చేయడకూడదు.. అది తామే ఎందుకు కాకూడదు అనుకున్నాడు. అమెరికాలో వుడెన్ వాచీలు చాలా పాపులర్. ఇండియాలో అలాంటి చేతిగడియారాలు లేవనే చెప్పాలి. వుడెన్ వాల్ క్లాక్స్ ఉన్నాయిగానీ, రిస్టు వాచీలు లేవు. అందుకే ఆ కాన్సెప్టుమీద ఫిక్సయ్యాడు. అలా 2015 నవంబర్ లో వుడిన్ వాచెస్ అనే స్టార్టప్ ప్రారంభించాడు.

స్టార్టప్ అయితే నెలకొల్పాడు కానీ మొదట్లో లెక్కలేనన్ని సవాళ్లు. ఒక వాచీ తయారు చేయడానికే ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టింది. ఇండియాలో అయితే లాభం లేదనుకుని గడియారాల తయారీ అంతా హాంగ్ కాంగ్ లో చేశారు. అయినా బిజినెస్ సవ్యంగా లేదు. తయారైన వాచీలు ఇక్కడికి తెచ్చే క్రమంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. డెలివరీరూ ఆరు నెలల సమయం పట్టేది.

image


ఇటు ఉద్యోగం లేదు. అటు.. అనుకున్న టైంకి వాచీలు రావడం లేదు. అంతా గందరగోళం. రాత్రింబవళ్లు స్టార్టప్ మీదనే ధ్యాస. ఇవన్నీ ఒకెత్తయితే గడియారం ధర మరో ప్రాబ్లం. రీజనబుల్ రేట్లలో అమ్మితేగానీ వర్కవుట్ అయ్యేలా లేదు. దానికి ఒక బ్రాండ్ కల్పించి అమ్మితేగానీ కుదరదని భావించి, 2016లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ తో టై అప్ అయ్యారు. ఆ తర్వాత సొంతంగా వెబ్ సైట్ రూపొందించి అమ్మకాలు జరుపుతున్నారు.

ఇప్పుడిప్పుడు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. స్టార్టప్ బూట్ స్ట్రాప్డ్ అయింది. పెద్దగా మార్కెటింగ్ బడ్జెట్ కేటాయించకపోవడం మూలంగా, గూగుల్, ఫేస్ బుక్ యాడ్స్ ను నమ్ముకున్నారు. ప్రస్తుతానికి ఆ రెండు సోర్సుల ద్వారా 180 గడియారాలు అమ్ముడయ్యాయి. మొదటి మూడు నెల్లో రూ.6లక్షల రెవెన్యూ వచ్చింది. దాంతో స్టార్టప్ కంపెనీకి ఒక రూపమొచ్చింది. టీంలో పదిమంది పనిచేస్తున్నారు.

గత ఐదు నెలలుగా మొత్తం 240 వాచీలు అమ్మగా రూ. 8 లక్షలు వచ్చాయి. డిమానిటైజేషన్ వల్ల కొంత బిజినెస్ మందగించింది. పైగా జనం క్యాష్ ఆన్ డెలివరీకే మొగ్గుచూపుతున్నారు. దానిక్కారణం కస్టమర్లకు నమ్మకం లేకపోవడం. ఈ కామర్స్ బిజినెస్ అంటే అంతే, మొదట్లో ఎవరూ నమ్మరు. అప్పటిదాకా ఇలాంటి తిప్పలు తప్పవు అంటారు నటాషా.

ప్రపచం వ్యాప్తంగా వుడెన్ యాక్సెసిరీస్ మార్కెట్ ప్రీమియం అనే చెప్పవచ్చు. ఉదాహరణకు టీఎస్ఏఆర్ బ్రాండునే చూసుకుంటే, వాటి వస్తువులు రూ. 4,500 నుంచి 20వేల వరకు ఉంటాయి. స్క్రాప్ వుడ్ నుంచి ఐటెమ్స్ తయారుచేసే ఇటాలియన్ కంపెనీ వీవుడ్ కూడా అంతే. అయితే వుడిన్, వీ వుడ్ కంపెనీలు ఒక వాచీ అమ్మగానే, దానికి ప్రతిగా ఒక మొక్కను విధిగా నాటుతారు. చెప్పాలంటే వుడిన్ వాచెస్ ఇండియాలోనే ఒక సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

ఇంటర్నేషనల్ షాపింగ్ వీరి భవిష్యత్ కార్యాచరణ. ఒక్క వాచీలే కాకుండా, మరిన్ని వుడెన్ యాక్సెసిరీస్.. ప్రీమియం క్వాలిటితో, యూనిక్ డిజైన్లతో తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు డిజైనింగ్, ఫోటోగ్రాఫర్, మార్కెటింగ్, డెవలపర్ కోసం సొంత టీం ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. వాటితో పాటు సొంత తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారీ భార్యభర్తలు.

వుడిన్ వాచీల వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags