అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలే అత్యుత్తమైనవి..!

రెండు స్టార్టప్ లు ఫెయిలైన ఓ అంట్రపెన్యూర్ అనుభవాలు

19th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


"ఇవాళ తప్పు అనుకున్నది రేపు కరెక్ట్ అవుతుంది.. 

..ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడవుతుంది"

కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని.. చివరికి అవే నిర్ణయాలతో సక్సెస్ అయిన ప్రదీప్ గోయల్ అనే ఆంట్రప్రెన్యూర్ తన జీవిత అనుభవాలను యువర్ స్టోరీతో ఇలా పంచుకున్నాడు.. అవేంటో ఆయన మాటల్లోనే చదివేయండి..

నేను చాలా లాజికల్ గా ఆలోచిస్తా. నా జీవితం మొత్తం ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నాను. దేని కోసమైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా చాలా ఆలోచిస్తాను. కూరగాయలు కొనడానికి మార్కెట్ వెళ్తే గీచిగీచి బేరమాడతాను. ముందుగా అన్ని షాపుల్లో కూరగాయల ధరలు కనుక్కుంటాను. చివరిగా అతి తక్కువ ధర ఉన్న వ్యాపారి దగ్గర మరింత తక్కువకు ఇచ్చేలా బేరమాడి ధర తగ్గించుకుంటాను. ఆ సమయంలో నన్ను నేను ఆ కూరగాయ మార్కెట్ లో ఉన్న నెంబర్ వన్ స్మార్టెస్ట్ పర్సన్ గా భావించుకుంటాను.

రెండేళ్ల క్రితం అనాలోచితంగా నేనో నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రారంభించాలకుంటున్న స్టార్టప్ కోసం మరింత సమయం కేటాయించడం కోసం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. సంతృప్తికరమైన జీతం అందిస్తున్న ఉద్యోగం అది. అప్పటికి నా భార్య కూడా ఉద్యోగం చేయడం లేదు. గొప్ప జీతం.. అంతకు మించి ఇతర ఇన్ కమ్ సోర్స్ ఏమీ లేని పరిస్థితి. పైగా స్టార్టప్ కి ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి ఇంకా రెండు నెలలకుపైగానే సమయం ఉంది. ఇలాంటి సందర్భంలో నేను తీసుకున్నది స్టుడిప్ డెసిషన్ అని అందరూ ఏకపక్షంగా నిర్ణయించేస్తారు. ఒక సొంత ఇల్లు కొనకుండా.. రిటైర్ మెంట్ ప్రణాళికలు ఏమీ వేసుకోకుండానే ఓ లాజికల్ మైండెడ్ పర్సన్ ఉద్యోగాన్ని ఎలా వదిలివేయగలడు..?

నా ఆనాలోచిత నిర్ణయానికి ప్రధాన కారణం.. ఎలాంటి బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్టప్ బిజినెస్ ప్రారంభించాలనే లక్ష్యం. అయితే నా స్టార్టప్ కు ఎన్నో వీక్ పాయింట్లున్నాయి. నా స్టార్టప్ ఎడ్యుకేషన్ సంబంధింత ఉత్పత్తుల్ని స్కూళ్లకు అమ్మాలని ప్లాన్. కానీ నా కో ఫౌండర్స్ లో ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ నుంచివచ్చిన వారు లేరు. మాకు ఐఐటీ నుంచి వచ్చిన నింజా డెవలపర్ కూడా లేరు. మంచి ప్రూవెన్ రికార్డు ఉన్న గ్రోత్ హ్యాకర్ అంతకన్నా లేరు. పైగా విద్యారంగంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి మద్దతు కాదు కదా.. కనీసం పరిచయాలు కూడా లేవు. అయినా మేము స్కూళ్లకు ప్రాడక్ట్స్ తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లాం.

తొందరపడి ఉద్యోగానికి రాజీనామా చేశానా అని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంత కాలం ఉద్యోగం చేస్తే బాగుండేది కదా అని మనసులో ఏ మూలో ఫీలింగ్ బయటపడుతూ ఉంటుంది. మరికొంత పొదుపు చేసి.. ఓ ఇల్లు కొనుక్కొని... స్టార్టప్ వెంచర్ కోసం పని ప్రారంభించే ముందు వైఫ్ ని జాబ్ లో చేరేలా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది. లేకపోతే నా స్టార్టప్ కు కొంత మంది పెయిడ్ కస్టమర్లు లేకపోతే వెంచర్ క్యాపిటల్ సంస్థల ఫండింగ్ వచ్చే వరకూ ఆగి ఉన్నట్లయితే ఎలా ఉండేదనే ఆలోచనలు పదే పదే వస్తూంటాయి. సరైన సమయంలోనే ఉద్యోగానికి రిజైన్ చేశానా అనిపిస్తుంది. 

అయితే నేను అనాలోచితంగా నిర్ణయం తీసేసుకున్నాను. నా సేవింగ్స్ లో సగానిపైగా స్టార్టప్ లో పెట్టుబడిగా పెట్టేశాను. మా స్టార్టప్ ప్రొడక్ట్ ఇంకా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోకముందే.. ఒక్క రూపాయి కూడా ఆదాయం లేనప్పుడే నేను జాబ్ ను వదిలేశాను. అయితే నేను తీసుకన్న మంచి నిర్ణయం ఏమిటంటే.. ఏడాది, ఏడాదిన్నర ఇంటిఖర్చులకు సరిపోయాలా కొంత మొత్తాన్ని పక్కకు తీసి పెట్టా. ఉద్యోగానికి రాజీనామా చేసిన నా నిర్ణయంపై కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొంచెం జాలి కూడా చూపారు. కానీ నా భార్య మాత్రం నన్ను అర్థం చేసుకుంది. ప్రొత్సహించింది. నిజానికి నాకు ఆ సమయంలో కావాల్సింది కూడా అదే.

అయితే ప్రయత్నాలు అన్నీ సక్సెస్ కావు. ఎన్నో వీక్ పాయింట్లు ఉన్న స్టార్టప్ సక్సెస్ కావడం అంత సులువేమీ కాదు. నిజం చెప్పాలంటే నేను ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలో నా స్టార్టప్ కి ఇన్ని వీక్ పాయింట్లు ఉన్న సంగతి నాకు అంగా తెలియలేదు. వీటన్నింటిని స్టార్టప్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రెండేళ్ల తర్వాతే గ్రహించగలిగాను.

నా స్టార్టప్ పెద్దగా ఆశలు పెట్టకుండానే ఆగిపోయింది. పెట్టిన రూ.15లక్షల పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు. ఏడాదిలో మొత్తం కరిగిపోయింది. కుటుంబసభ్యులు, స్నేహితులు ఇదే సందు అని క్లాసులు పీకడం ప్రారంభించారు. మేం చెబితే వినలేదు కదా.. అని దెప్పిపొడిచారు. కొత్తగా సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. వారు చెప్పిందంతా మౌనంగా విన్నా కానీ ... వారి సలహాలేమీ నా చెవికి ఎక్కలేదు. నా మనసు మాత్రం ఫెయిలైనా సరే.. స్టార్టప్ డైరక్షన్ లైనే వెళ్లాలని పదే పదే చెబుతోంది. దానికి నేను కూడా సిద్దంగానే ఉన్నా.

image


నిజానికి అలాంటి సమయంలో లాజికల్ డెసిషన్ ఏమిటంటే.. ఉద్యోగంలో చేరడమే. నష్టాలను, అప్పులను తీర్చుకోవడం. అయితే నాకు అప్పటికి ఇంకో పది నెలలు ఇల్లు గడవడానికి కావాల్సినంత డబ్బు ఉంది. అందుకే నేను స్టార్టప్ జర్నీలో మరో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను.

నేనేమీ గ్యాంబ్లింగ్ చేయడంలేదు. ఇది అందరి ఆమోదంతో తీసుకున్న నిర్ణయం కాదు. కానీ నమ్మకంతో తీసుకున్న నిర్ణయం. జీవితానుభవాలతో మరింత మెరుగ్గా మారే ప్రయత్నంలో తీసుకున్న నిర్ణయం. స్టార్టప్స్ లోనే కొనసాగాలని డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. స్టార్టప్స్ మెంటార్ షిప్ నెట్ వర్క్ లో అత్యంత గౌరవనీయమైన సంస్థ.. ద మార్ఫియస్ తో నేను కనెక్ట్ అయ్యా. మరో స్టార్టప్ లో కో ఫౌండర్ గా జాయినయ్యా. అయితే అది ప్రారంభమే కాలేదు. అయితే వైఫల్యాల నుంచి వచ్చే అనుభవాలు విలువ కట్టలేనివి.

స్టార్టప్ ఫెయిల్యూర్స్ అనుభవాలు

1. మంచి జీతం మిస్సయింది.. కానీ బోరింగ్ ఉద్యోగం వదిలిపోయింది.

2. రెగ్యులర్ శాలరీ రాకుండానే ఎలా బతకవచ్చో నేర్చుకున్నాను.

3. ప్రతిభావంతమైన అంట్రపెన్యూర్లను కలుసుకోగలిగాను

4. డిజిటల్ మార్కెటింగ్ రంగంతో మరింత అనుబంధం పెరిగింది ( ఇది నాకెంతో ఇష్టమైన వ్యాపకం )

5. నాలో ఉన్న రచయితను కనిపెట్టగలిగాను

6. ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోగలిగాను

7. వ్యాపారం - అధ్యాత్మికత మధ్య అనుబంధాలు తెలిశాయి

స్టార్టప్ ఫెయిల్యూర్స్ తర్వాత నేను స్టార్టప్స్ కోసం కంటెంట్ మార్కెటింగ్ ను ఫ్రీలాన్స్ బేసిస్ లో చేయడం ప్రారంభించాను. కుటుంబ నెలవారీ ఖర్చుల కోసం నేను ఇలా సంపాదించగలిగాను. అదే సమయంలో నా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి తగినంత తసమయం కూడా లభించింది.

ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను తీసుకున్న అనాలోచిత నిర్ణయమే.. నా జీవితంలో అత్యంత విజయవంతమైన నిర్ణయంగా కనిపిస్తోంది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం నాకు ఇదే మొదటిసారి కాదు. కాలేజీ లో ఉన్నప్పుడు పదిహేను కంపెనీల క్యాంపస్ రిక్రూట్ మెంట్ ఆఫర్స్ ను తిరస్కరించాను. చాలా మంది క్లాస్ మేట్స్ నన్ను పిచ్చోడిలా చూశారు. కొంతమంది నేను వారికి చెప్పకుండా మంచి కంపెనీలో జాబ్ పొందానని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. కొన్నాళ్ల తర్వాత నేను కోరుకున్న కంపెనీలో నేను జాబ్ తెచ్చుకోగలిగాను. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలే స్కూల్, కాలేజీ సమయంలోనూ తీసుకున్నాను. కాలేజీ డేస్ లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను ఇంగ్లిష్ మీడియంలో చదవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నేను ఇంగ్లిష్ లో చాలా వీక్. 

నిర్ణయాలు తీసుకునేటప్పుడు నా సామర్థ్యాన్ని... నా మీద నాకు ఉన్న నమ్మకాన్ని అంచనా వేసుకుంటాను. దీన్నే అంతర్ దృష్టిగా పేర్కొనవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనసు మాట వినండి. నిజానికి లాజికల్ గా ఆలోచిస్తే నిర్ణయం తీసుకోవడం ఆపేస్తారు. కానీ అనాలోచితంగా ఆలోచిస్తేనే పర్ ఫెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతారు. కొంతకాలం తర్వాత అదే సరైన నిర్ణయమని మీకు అర్థమవుతుంది.

రచయిత: ప్రదీప్ గోయల్, www.startupkarma.co ఫౌండర్

అనువాదం: సౌజన్య

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India