సంకలనాలు
Telugu

ఫుడ్ ట్రక్ పెట్టాలనుకుంటున్నారా..? అయితే ఈ కథ మీ కోసమే!!

ఓపిక ఉండాలేగానీ ఫుడ్ బిజినెసంత బిందాస్ మరోటి లేదు..  

team ys telugu
10th Nov 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఈ రోజుల్లో బిందాస్ బిజినెస్ ఏదైనా ఉందీ అంటే అది ఫుడ్ బిజినెసే. విదేశాల్లో ఏనాడో దీని కిటుకు కనిపెట్టారు కానీ మనదగ్గర ఇప్పుడిప్పుడే వ్యాపారం ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ప్రజల జీవన శైలి మారినాకొద్దీ బిజినెస్ పొటెన్షియల్ పెరుగుతూ ఉంటుంది.

ఇవాళ రేపు జనం ఎలా వున్నారంటే.. తీరిగ్గా హోటల్ కు వెళ్లి ఫుడ్ ఆర్డరిచ్చి, అది వచ్చేదాకా ఫోన్లో ఫేస్ బుక్ చూసుకుంటూనో, వాట్సప్ లో చాట్ చేసుకుంటూనో వెయిట్ చేసే రోజులు పోయాయి. పబ్లిక్ కు అంత టైం లేదు. వాళ్ల ప్రియారిటీలు, అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లో రాకుంటే అసహనం ప్రదర్శిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు క్లిక్ కావడానికి ఇదొక మెయిన్ రీజన్. అలాగని జనం ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినేద్దాం అనుకోవడం లేదు. ఇన్‌ స్టంట్‌ గా, క్వాలిటీగా, ధర అందుబాటులో ఉండే ఫుడ్ ఎక్కడైతే దొరుకుతుందో.. అక్కడికి రెక్కలు గట్టుకుని వాలిపోతున్నారు.

పెద్దగా రిస్క్ లేని వ్యాపారాల్లో ఫుడ్ బిజినెస్ ఒకటి. కాకపోతే కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే బిజినెస్ ఎక్కడికో పోతుంది. అవేంటో ఒకసారి తెలుసుకోండి.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంటే ఏం చేయలేం. అందుకే మన దగ్గర చేయి తిరిగిన వంటవాడు ఉన్నా.. ఫుడ్ ట్రక్ పెట్టాల్సిన చోట పెట్టకుంటే వ్యాపారం మటాష్. అందుకే బెస్ట్ ప్లేస్ ను ఎంచుకోవడంలోనే ఉంది మన మొదటి విజయం. ట్రక్ మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా ఉండకుండా.. బేసిక్ మోడల్ ఎంచుకుంటే బెటర్. 7 నుంచి 11 లక్షల్లో అయిపోతుంది.

మనం ఏదైతే మెనూ అనుకుంటామో దాన్ని బట్టే వంట సామాను ప్లాన్ చేసుకోవాలి. అవసరం లేని సామాగ్రితో కిచెన్ గందరగోళం చేయొద్దు. రైస్ ఐటెమ్స్ లాంటివి మెనూలో ఉంటే, దాన్ని ఇంటిదగ్గర వండి తీసుకుని వస్తే ఇంకా బెటర్. రవాణా భారం ఎంతోకొంత తగ్గుతుంది.

ఇక్కడో చిన్న ఉదాహరణ. అహ్మదాబాద్‌ లో ఒక మొబైల్ ఫుడ్ ట్రక్ ఉంది. చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక ఓపెన్ ఆటోలోనే మొత్తం సెటప్ దించేశాడు. క్వాలిటీ విషయంలో కొశ్చనే లేదు. ఐటెమ్స్ జబర్దస్త్‌. స్టవ్, కొన్ని గిన్నెలు, మసాలా దినుసులు.. ఇలా బేసిక్ మెటీరియల్ తోనే ఐటెమ్స్ చేస్తాడు. అద్దిరిపోద్దంటే నమ్మండి. జస్ట్ మౌత్ పబ్లిసిటీతోనే ఆ ఫుడ్ ట్రక్ బీభత్సంగా క్లిక్కయింది.

సరే, ట్రక్ విషయంలో ఎందుకు రాజీపడాలని అనుకుంటే, కాస్త ఖర్చుపెట్టి డిజైన్ చేయించొచ్చు. పబ్లిసిటీకి అదొక మంచి అవకాశం. అలాగని ఏదో రెండు రంగులేసి నాలుగు అక్షరం ముక్కలు రాస్తే సరిపోదు. క్రియేటివ్ గా ఆలోచించాలి. చూడగానే ఆకర్షించేలా ఉండాలి.

image


సాధారణంగా హోటల్లో అయితే దోశ మాస్టర్ అనీ, టీ ఎక్స్ పర్ట్ అనీ, ఇడ్లీల కోసమని ఒకరు, చపాతీ పిండి పిసికేందుకు మరొకరు.. ఇలా ప్యాంట్రీ నిండా మనుషులే కనిపిస్తారు. అయితే ఫుడ్ ట్రక్ విషయంలో అలా కాదు. మల్టీ టాలెంటెడ్ చెఫ్ ఒక్కరిని తీసుకుంటే చాలు. మరీ కష్టమనిపిస్తే ఇద్దరితో మాగ్జిమం మేనేజ్ చేయాలి. ఎడాపెడా సిబ్బందిని పెడితే సంచీ లాభం చిల్లుకే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఈ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి.

లైసెన్స్ ఇంపార్టెంట్

ఫుడ్ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా లైసెన్స్ మటుకు ఇంపార్టెంట్ సుమా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తప్పనిసరి. దాంతోపాటు ఫుడ్ ట్రక్ కమర్శియల్ వెహికిల్ కిందకి వస్తుంది కాబట్టి స్థానిక ఆర్టీయే నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అంతేకాదు ఫైర్ డిపార్టుమెంట్ నుంచి కూడా లైసెన్స్ అవసరం. చాలామంది దాన్ని లైట్ తీసుకుంటారుగానీ, రేపు ఏదైనా జరగరానిది జరిగితే ఫైర్ గైడ్ లైన్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తారు.ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్మాలిటీ- ట్రక్, కిచెన్ ఎక్విప్ మెంట్ ఇన్షూరెన్స్.

మార్కెట్ అన్వేషణ

ఇదే విజయానికి చివరి మెట్టు. ట్రక్ ఎక్కడ పెట్టాలి, ఎలాంటి మెనూ రూపొందించాలి, ఏ వయసు వారిని ఆకర్షించాలి, ఏమేం వెరైటీలు చేయాలి, అవెంత హెల్దీగా ఉండాలనేది కీలకం. ఈ విషయాలే మన మార్కెట్ టార్గెట్ ని విజయవంతంగా ఛేదిస్తాయి.

ఉదాహరణకు ట్రక్ ని స్కూల్ దగ్గర పెట్టాలని ప్లాన్ చేశారనుకో, సాయంత్రాలే బిజినెస్ కు అనుకూలం. స్కూల్ వేళల్లో ఓపెన్ చేస్తే ఫాయిదా ఉండదు. ఒకవేళ కమర్శియల్ ఏరియాలో.. అంటే షాపింగ్ కాంప్లెక్సుల దగ్గర పెట్టాలనుకుంటే రోజంతా బిజినెస్ యాక్టివ్ గా ఉంటుంది. లేదూ వీకెండ్, లేట్ నైట్స్ మాత్రమే అనుకుంటే మ్యూజిక్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్, మాస్ గేదరింగ్ ప్రదేశాలు బెటర్. ఇతర వ్యాపారాల్లో ఆప్షన్లు ఉండొచ్చు ఉండకపోవచ్చుగానీ, ఫుడ్ ట్రక్ లో మాత్రం అవకాశాలకు, ఆప్షన్లకు కొదవలేదు. టాలెంట్, ఓపిక ఉండాలేగానీ ఫుడ్ బిజినెసంత బిందాస్ మరోటి లేదు. 

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags