సంకలనాలు
Telugu

టేస్టీఫుడ్ కావాలంటే ’డయల్ ఆర్గానిక్ ’

ఆరోగ్యకరమైనది రుచిగా ఉండదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టేముంబై వాసుల నోరూరిస్తున్న ఫుడ్ స్టార్టప్ఫోన్ కొట్టు, ఫుడ్డు పట్టు అంటున్న డయల్ ఆర్గానిక్సేంద్రీయ ఆహారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం

ashok patnaik
21st May 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ముంబై లో ఆర్గానిక్ ఉత్పత్తులకూ ఆహారానికీ కేంద్ర బిందువు కావాలన్నదే డయల్ ఆర్గానిక్ మోటో. అదే వారి నినాదం కూడా. తాజా పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు.. మౌస్ తో ఒక్క క్లిక్ చేసినా, ఒక్క ఫోన్ కొట్టినా చాలు మీరు అడిగింది మీ గుమ్మం దగ్గరికి చేరుస్తారు. దీని ఫౌండర్ నమితా అంబానీ తన లక్ష్యం ఒక్కటేనంటారు - ప్రతి ఒక్కరికీ ఆర్గానిక్ ( సేంద్రియ ) అనే పదాన్ని పరిచయం చేయటం. అత్యంత సరసమైన ధరలకు వినియోగదారులకు సేంద్రియ ఆహార ఉత్పత్తులు అందిస్తామంటున్నారు నమిత. ప్రకృతి సహజంగా లభించినదాన్ని మించినది లేదని నిర్థారించుకోవటానికి గడిచిన ఏడాది మొత్తం ఆమె రైతులతోనూ, సేంద్రియ ఉత్పత్తిదారులతోనూ, వ్యాపారులతోనూ గడిపారు. అందుకే వినియోగదారులకు సహజమైన ఉత్పత్తులను అందించాలన్న పట్టుదలతో ఉన్నారామె. చదువు రీత్యా ఆమె మేనేజ్‌మెంట్‌లోనూ కంపెనీ సెక్రెటరీ కోర్సులోనూ గ్రాడ్యుయేట్. గతంలో ఆమె పాంటలూన్ రిటైల్ ఇండియా లిమిటెడ్‌లో కోర్ ప్లానింగ్ విభాగంలోనూ, ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్‌లో స్ట్రాటెజీ విభాగంలోనూ పనిచేశారు.

ఆమె పరిశోధించటం ప్రారంభించిన ప్రాజెక్టులలో ఒకటి ఆర్గానిక్. నిజానికి పసిపిల్లవాడైన కొడుక్కి తన పాలు మాన్పించి మార్కెట్లో నాణ్యమైన పాలు వెతకుతున్నప్పుడు ఈ ఆలోచన మొదలైంది. అదే సమయంలో తన తండ్రి నడిపే సేంద్రియ పెరటి తోట కూడా ఈ వ్యాపారాభిలాషికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఫలితంగా, ఆమె సేంద్రియ రంగం మీద పరిశోధన మొదలుపెట్టారు. రైతులను కలుసుకున్నారు, ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలతో చర్చించారు. ఈ రంగంలో వ్యాపారానికి ఉన్న అవకాశాన్ని చాలా త్వరగా పసిగట్టారు. పైగా, ముందుగా ప్రవేశించడం వల్ల కలిగే ప్రయోజనాలూ ఆమెకు తెలుసు.

డయల్ ఆర్గానిక్ ఫౌండర్, నమితా అంబానీ ,  లంచ్ బాక్స్ నమూనాలలో ఒకటి (కుడి )

డయల్ ఆర్గానిక్ ఫౌండర్, నమితా అంబానీ , లంచ్ బాక్స్ నమూనాలలో ఒకటి (కుడి )


“ నేను పనిచేయాల్సింది ఇక్కడేనని నాకు నమ్మకం కుదిరింది”

ఆ తరువాత తన ముందున్న అతిపెద్ద సవాలు... మనుషుల ఆలోచనాధోరణిలో మార్పు తీసుకురావటం. నిజానికి తాను కొంత కాలం ఆ రంగంలో పనిచేసిన తరువాత సొంతంగా ఈ రంగంలో దిగటం మంచిదని గట్టిగా అనుకున్నప్పటికీ వాస్తవంలో అలా చేసినప్పుడు ఆమె దిగ్భ్రాంతికి గురికాక తప్పలేదు. కారణమేంటంటే తనకు తానే బాస్‌గా, ఉద్యోగిగా శిక్షణ ఇచ్చుకుంటూ పనిగంటలు కూడా తానే నిర్దేశించుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత పనులన్నీ సులభమయ్యాయి. స్థలంతో, కాలంతో సంబంధం లేకుండా ఆమె మనసు ఎప్పుడూ తన ప్రాజెక్ట్ లో కొత్త ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉండేది.

డయల్ ఆర్గానిక్ లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్

డయల్ ఆర్గానిక్ లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్


సేంద్రియ ఆహారం తెలివిగా తినండి బరువు తగ్గండి

ఈ మధ్యనే నమిత తన డయల్ ఆర్గానిక్ వెబ్ సైట్ కి తోడుగా ఈ సరికొత్త సర్వీసు ప్రారంభించారు. ఇందుకోసం ఆమె పోషకాహార నిపుణురాలైన కింజల్ షా సాయం సలహాలు తీసుకున్నారు. ఆ విధంగా నమిత తన ఆర్గానిక్ లంచ్ బాక్స్ సర్వీసు మొదలుపెట్టారు. ఒక భోజనం కావాలన్నా, వారం మొత్తానికి డైట్ ప్లాన్ కావాలన్నా అందజేస్తారామె. ఇక వంటకాల విషయానికొస్తే రష్యన్ సలాడ్ లేదా కీర దోసకాయ సలాడ్ ఉంటుంది. ప్రధాన ఆహరంలో వెజిటబుల్ కోఫ్తా, మేథీ మటర్ మలై నుంచి అమృత్‌సర్ ఆలూ వరకూ ఉంటాయి. దాల్ రైస్ కాంబినేషన్ కూడా ఆర్డర్ చేయవచ్చు. దీనికి ఒక స్టార్టర్ లేదా డిజర్ట్ లేదా గట్టి స్నాక్ ఐటెమ్ ఐదేనా అదనపు ధర చెల్లించి అడగవచ్చు.

వెంచర్ ప్రారంభంలో ఎదురయ్యే సవాళ్ళు

ఒక వెంచర్ ప్రారంభించటంలో ఎన్నో సవాళ్ళు ఎదురుకాక తప్పవు. సిబ్బంది దొరకటం, నిర్వహణ మూలధనం అందులో కొన్ని. అయితే, తాను ఎదుర్కున్న అతిపెద్ద సవాలు మాత్రం మనుషుల ఆలోచనా ధోరణిని మార్చటంలోనే ఉందంటారు నమిత.

“ సేంద్రియ ఆహారం మీద కొన్ని బలమైన అభిప్రాయాలున్నాయి. చాలా ఖరీదెక్కువని, వాటిని నమ్మటం కుదరదని“

పొలం నుంచి నేరుగా ఇళ్లకే తాజా సేంద్రియ కూరగాయలు, పండ్లు మోసుకొచ్చే వాన్లనే డయల్ ఆర్గానిక్ బృందం వాడుతుంది. పంపిణీ విషయానికొచ్చేసరికి స్థానికంగా ఉన్న సంస్థలనుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అదొక పాఠం అయింది. ఇప్పుడు అన్ని ముడిపదార్థాలనూ దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలనుంచి ముందుగానే ఆర్డర్ చేసి తెప్పించుకోవటం మొదలైంది. ” చిల్లర వర్తకం ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకునే పాఠమే. ఎప్పుడూ మారుతూ ఉండే వాతావరణంలో వినియోగదారుడికి సేవలందించటంలో ఉత్తమమార్గాన్ని కనుక్కుంటూ ఉండాల్సిందే “ నంటారు నమి

భవిష్యత్ ప్రణాళికలు, కొత్త ఆలోచనలు

ప్రస్తుతం ఆర్గానిక్ కథలో రెండు అధ్యాయాలు సాగుతున్నాయి. ఒకటి డయల్ ఆర్గానిక్ అయితే, రెండోది ఆర్గానిక్ లంచ్ బాక్స్. త్వరలోనే పోషకాహార నిపుణుల సలహాలను కూడా సైట్ లో ప్రవేశపెడతారు.సేంద్రియ ఆహారం ఆస్పత్రులకు చాల ఉపయోగకరమని వ్యవస్థాపకురాలి ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళకోసం ప్రత్యేకంగా మ్యూజిక్ థెరపీ, సామూహిక ఉపశమన విధానాల ద్వారా ఒక సేంద్రియ ఆహార పథకం సిద్ధం చేశారు. కీలకమైన ఆస్పత్రులలో ఇది కచ్చితంగా ఆహార నాణ్యతను, పంపిణీ నాణ్యతను పెంచుతుందంటారు నమిత.అదే విధంగా పిల్లలకు కూడా ప్రణాళికాబద్ధమైన ఆర్గానిక్ ఆహారాన్ని ఆకట్టుకునేలా తయారుచేసి అందిస్తే వాళ్ళకు మంచి అలవాట్లు, ఎదుగుదల ఉంటాయంటారామె. అందుకే ఆర్గానిక్ ఆహారం సరఫరా చేసే విషయమై ప్రముఖ పాఠశాలలను కూడా సంప్రదిస్తున్నారు.మొబైల్ లోనూ, వెబ్ ప్లాట్ ఫామ్ లోనూ వినియోగదారుల జీవన శైలి మెరుగుపడేలా రకరకాల సేవలు అందించటానికి డయల్ ఆర్గానిక్ కృషి చేస్తోంది.

ఆర్డర్ చేయటం : ఆర్గానిక్ లంచ్ బాక్స్ కోసం వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. లేదా ఫోన్ చేయవచ్చు. లంచ బాక్స్ ధర రూ. 150 తో మొదలై డైట్ కన్సల్టేషన్ తో కలిపి నెలకు రూ. 20,000 దాకా ఉంటుంది.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags