ఒక్క ఎస్ఎంఎస్‌తో మీకు కావాల్సిన వివరాలన్నీ చెప్పేసే TXT బ్రౌజర్

ఏ ప్రశ్నకైనా ఒక్క ఎస్సెమ్మెస్ సమాధానం చెబ్తే... అదే టిఎక్స్‌టి బ్రౌజర్ఎస్సెమ్మెస్ ఆధారిత సెర్చ్ ఇంజన్ టిఎక్స్‌టి బ్రౌజర్30కోట్లు దాటిన ఎంక్వైరీలుఇంటర్నెట్ పెరుగుతున్న కొద్దీ ఊపందుకుంటున్న బిజినెస్

ఒక్క ఎస్ఎంఎస్‌తో మీకు కావాల్సిన వివరాలన్నీ చెప్పేసే TXT బ్రౌజర్

Monday June 08, 2015,

2 min Read

మొబైల్ వినియోగం ఎప్పుడైతే ఊపందుకుంటున్నపుడే... ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రశ్న-సమాధానం రంగంలో కూడా మంచి వృద్ధి కనిపిస్తోంది. ఇలాంటి ఎస్సెమ్మెస్ బేస్డ్ సెర్చ్ ఇంజన్ అయిన txtbrowser 30 కోట్ల ఎంక్వైరీల స్థాయిని ఏడాది క్రితమే అధిగమించింది. ఈ కంపెనీ యూజర్లు అడిగే అన్ని ప్రశ్నలకు... సమాధానాలను సాధారణ ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందిస్తుంది. ప్రశ్నలు అడిగివారు వారు ఉపయోగించే సాధారణ పదజాలంతోనే తమ క్వైరీలను పంపచ్చు.

“మన దేశంలో మొబైల్ యూజర్ల సంఖ్య ప్రతీ నెలా గణనీయంగా పెరుగుతోంది. అలాగే స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. వారిలో కొంతమంది ఇప్పటికీ తమ ప్రశ్నలకు ఎస్సెమ్మెస్ రూపంలో సమాధానాలు తెలసుకుంటున్నారు” అంటున్నారు వావియా టెక్నాలజీస్ వ్యవస్థాపకులు & సీఈఓ అలన్ డి సౌజా.


image


సమాచారం తెలుసుకోడానికి ఎస్సెమ్మెస్‌లను ప్రాథమికంగా ఎంచుకుంటున్నవారే ఈ కంపెనీ కస్టమర్లు. ఇలా ఇన్ఫర్మేషన్ కోసం మెసేజింగ్‌ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

“అనేక డొమైన్ల నుంచి సమాచారం అడిగే కస్టమర్లు ఉన్నారు. స్పోర్ట్స్, ఎంటర్టెయిన్మెంట్, న్యూస్, ఇన్ఫర్మేషన్ సెర్చ్, ఆస్ట్రాలజీ.. ఇలా అనేక విభాగాలకు సంబంధించిన సమాచారం కోరుతుంటార”ని చెప్పారు అలన్.

ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి కూడా వెబ్‌సైట్, సెర్చ్, ఇన్ఫర్మేషన్‌లపై సేవలను ఎస్సెమ్మెస్ ద్వారా అందిస్తుంది txtbrowser. అలాగే ఈ బ్రౌజర్‌లో అనేక బిల్టిన్ యాప్స్ ఉంటాయి. లొకేషన్ బేస్డ్ సర్వీసుల నుంచి అనేక రకాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

ప్రతీ నెలా 10 నుంచి 15 శాతం వృద్ధి రేటుతో నిలకడైన అభివృద్ధి సాధిస్తోంది ఈ టిఎక్స్‌టి బ్రౌజర్.

“ ఇది మా ప్రారంభమే. ఇంకా అనేక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు, అలాగే ఇతర భాషల్లోనూ త్వరలో సేవలు అందించబోతున్నాం. అలాగే మేం సర్వీసులు అందించే టెలికాం ఆపరేటర్ల సంఖ్య కూడా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామ”ని చెప్పారు అలన్.

2013 నవంబర్‌లో txtBrowser తన సేవలను ప్రారంభించింది. తమ ప్లాట్‌ఫాంపై డెవలపర్లు సొంత యాప్స్‌ను తయారు చేసుకునే అవకాశం కల్పించింది. డెవలపర్లు వినూత్నమైన యాప్‌లను రూపొందించే ఛాన్స్ ఉండడం, వాటిని వినియోగించుకునే వారితో... ఈ సైట్‌కు యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డెవలపర్లు txtbrowserఅందించిన ప్లాట్‌ఫాంపై యాప్స్ రూపొందించి, వాటిని వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ఉత్సాహం చూపడం ప్రారంభించారు.

30 కోట్ల ప్రశ్నలు, సందేహాలు

“ మాకు ఎస్సెమ్సెస్ చేసేవారికి కేవలం ఓ నాలుగు లింకులు పంపితే సరిపోతుందనే విధానానికి మేం వ్యతిరేకం. వారికి కావాలసిన సమాధానం ఎస్సెమ్మెస్ ద్వారా అందిస్తాం. యూజర్లు తమకు ఓ తక్షణ సమాధానం కోసం ఎస్సెమ్మెస్ చేస్తారు. మేం దాన్ని నిలబెట్టుకుంటాం. అందుకే కస్టమర్లు మాకు ప్రొడక్ట్ ఉపయోగించుకునేందుకు మళ్లీ మళ్లీ వస్తున్నారు” అంటున్నారు అలన్ డి సౌజా.

ఎస్సెమ్మెస్ సెర్చ్ ఇంజన్లకు ఫ్యూచర్ ఉందా ?

“మా కంపెనీ అనుసరించే ఎస్సెమ్మెస్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్... ఆఫ్‌లైన్ ఇంటర్నెట్ లాంటిది. తమంతట తామే ఇంటర్నెట్ వెతుక్కుని సమాధానాలు అన్వేషించుకునే బదులుగా... మాకో ఎస్సెమ్మెస్ పంపితే సరిపోతుంది. ఇది యూజర్లకు వినూత్న అనుభూతిని అందిస్తుంది. అలాగే ఆయా సమాధానాలకు సంబంధించిన లింక్స్ కూడా అందుతాయి. పేజ్ లోడింగ్, ఆ పేజ్‌లో ఉన్న మొత్తం సమాచారాన్ని మొబైల్‌లో చదివి తెలుసుకోవడం కంటే... ఇది చాలా తేలికైన పద్ధతి. ఇక ఇంటర్నెట్ లేనివారికి మా బ్రౌజర్ చాలా ఉపయోగంగా ఉంటుంది.”

“త్వరలో మరిన్ని భాషల్లో లాంఛ్ చేయడంతో పాటు మాకు అందుబాటులో ఉన్న మొబైల్ యాప్స్‌ను OEMలతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దీనితో సమాచారం తెలుసుకోవడం మరింత సులభం కానుంది” అంటున్నరు అలన్.

వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి : http://txtbrowser.com/