టెక్స్ టైల్ ప్రాడక్ట్స్ అమ్మకాల్లో ఈ కామర్స్ దిగ్గజాలను ఢీకొడుతున్న హైదరాబాద్ వీవ్స్ మార్ట్

టెక్స్ టైల్ ప్రాడక్ట్స్ అమ్మకాల్లో ఈ కామర్స్ దిగ్గజాలను ఢీకొడుతున్న హైదరాబాద్ వీవ్స్ మార్ట్

Saturday May 13, 2017,

3 min Read

చేనేతకు చేయూత ఇవ్వాలన్న సర్కారు ఆశయానికి అనుగుణంగా మందుకు వచ్చి.. సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది వీవ్స్ మార్ట్ అనే ఈ కామర్స్ ప్లాట్ ఫాం. హైదరాబాదుకి చెందిన ఈ సంస్థ- గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏకైక దక్షిణాది ఈ కామర్స్ సంస్థ. టెక్స్ టైల్ ప్రాడక్ట్స్ అమ్మకాల్లో అమెజాన్, ఈబే వంటి సంస్థలను బీట్ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

image


చితికిపోయిన చేనేతకు పూర్వవైభవం తెచ్చే ప్రయత్నంలో సర్కారు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. చేనేతపై ప్రత్యేక శ్రధ్ద తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే ఈ రంగం అదరణకు నోచుకుంటోంది. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ప్రతి సోమవారం విధిగా అధికారులు , ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు చేనేతలు ధరిస్తున్నారు. దళారుల చేతిలో మోసపోవద్దనే ఉద్దేశంతో -ప్రభుత్వమే చేనేత వస్త్రాలను ఈ కామర్స్ ద్వారా అమ్మేందుకు- అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే చేనేతకు చేయూత ఇవ్వాలన్న సర్కారు ఆశయానికి అనుగుణంగా ముందుకు వచ్చింది వీవ్స్ మార్ట్ అనే ఈ కామర్స్ ప్లాట్ ఫాం. హైదరాబాదుకి చెందిన ఈ సంస్థ-గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏకైక సౌత్ ఇండియా ఈ కామర్స్ ప్లాట్ ఫాం. చేనేతల అమ్మకాల్లో అమెజాన్, ఈబే వంటి దిగ్గజాలను వెనక్కినెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

రెండేళ్ల క్రితం మొదలైన వీవ్స్ మార్ట్ ప్రయాణం ఇంతింతై వటుండింతై అన్నట్టుగా సాగింది. ప్రస్తుతానికి 7 రాష్ట్రాల్లోని చేనేతలు ఈ సంస్థతో కనెక్టయి ఉన్నారు. సుమారు 2వేల మంది రిజస్టర్ అయ్యారు. స్వయంగా వీవ్స్ మార్ట్ ప్రతినిధులే నేతన్నల దగ్గరికి వెళ్లి, మాట్లాడి, టై అప్ పెట్టుకుంటారు. సాధారణంగా తయారు చేసిన మాల్ అమ్ముకోవాలంటే స్థానికంగా ఉండే బట్టల షోరూంలను ఆశ్రయించాలి. లేదంటే మాస్టర్ వీవర్స్ తో కలవాలి. ఎంతకో అంతకు అమ్ముకోవాలనే తాపత్రయంలో చాలాసార్లు ధర విషయంలో రాజీపడతారు. అలాంటి పరిస్థితి రావొద్దనేదే గవర్నమెంటు ఉద్దేశం. వీవ్స్ మార్ట్ సిద్ధాంతం కూడా అదే. ఏ మధ్యవర్తి జోక్యం లేకుండా, ప్రతీ నెలా సుమారు 700 నుంచి 800 ప్రాడక్ట్స్ అమ్ముతారు. నెలకు 1500 ప్రాడక్ట్స్ సైట్లో అప్ లోడ్ చేస్తారు.

వీవ్స్ మార్ట్ మూలంగా చేనేతలకు మంచి భరోసా దొరికిందంటారు ఆ సంస్థ సీఈవో నిశిత. పేమెంట్ వెంటనే జరిగిపోతుంది. దీనివల్ల సాంప్రదాయ అమ్మకాల కంటే 20-30 శాతం అధికంగా ఆదాయం వస్తోంది. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే.. సాధారణంగా చీర ఎక్కడ కొన్నా.. దాన్ని నేసింది ఎవరో తెలియదు. అయితే, ఇక్కడ అలా కాదు.. చీర నేసిన వీవర్ పేరు, అతని ఏరియా, తదితర వివరాలు వెబ్ సైట్లో పొందుపరుస్తారు. అమ్ముడుపోకపోతే ప్రాడక్ట్ రిటర్న్ ఇవ్వడమంటూ ఉండదు. నేతన్నల నుంచి బట్టలు తీసుకున్నామా- వాళ్లకు డబ్బులు ఇచ్చామా అన్నట్టు ఉండదు. 

సోషల్ యాక్టివిటీస్ కూడా చేపడుతున్నారు. మొన్న తమిళనాడు వరద బాధితులకు తమవంతు సాయంగా బట్టలు పంపించారు. తమ సంస్థతో ఎలా ఎన్ రోల్ చేసుకోవాలి.. ప్రాడక్ట్ డిస్ ప్లే ఎలా చేయాలి.. క్వాలిటీ పారామీటర్స్ ఎలా వుండాలి.. వంటి అనేక విషయాల్లో నేతకారుల్లో అవేర్ నెస్ తెస్తున్నారు. పోచంపల్లి, గద్వాల్, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, వరంగల్, బనారస్, కోటా, మహేశ్వరి ఇలా దేశవ్యాప్తంగా పదహారు క్లస్టర్లతో కలిసి పనిచేస్తున్నారు. రెండు మూడేళ్లలో ప్రతీచేనేత ప్రాడక్టుకి మార్కెట్ కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం అంటున్నారు వీవ్స్ మార్ట్ సీఈవో నిశిత. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ప్లాన్ కూడా ఉందంటున్నారామె.

image


వీవ్స్ మార్ట్‌ లో 20 మందితో కూడిన క్వాలిఫైడ్ టీం ఉంది. వాళ్లంతా వీవర్ ని కలిసి, మాట్లాడి, రిజిస్టర్ చేయించుకుని, వాళ్లతో టై అప్ పెట్టుకునే పనిలో నిమగ్నమవుతారు. ఇంకొంత మంది డెలివరీ సర్వీసులో ఉంటారు. ఆర్డర్ వచ్చిన వెంటనే కస్టమర్ కి ఫోన్ చేసి ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత వారం లోపు డెలివరీ చేస్తారు.

కస్టమర్ల అభిరుచినిబట్టి, మారుతున్న కాలంలో డిజైన్స్ ఎలా వుండాలి అనే విషయాల్లో వీవర్స్ కి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్న వీవ్స్ మార్ట్- చేనేతకు పూర్వవైభవం తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తోంది.

వెబ్ సైట్ కోసం ఇక్కడ చూడండి