టెరెన్స్ లూయిస్ నేర్పే డ్యాన్సింగ్ ఏబీసీడీలు

ఏబీసీడీ అంటే ఎనీబడీ కెన్ డ్యాన్స్ మోడర్న్ కాంటెంపరరీ డ్యాన్స్ తో ఉర్రూతలుటీఎల్సీడీసీ(TLCDC) తో టెరెన్స్ విజయ ప్రస్థానంజాతీయ, అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ గా స్టెప్ అప్

17th Jun 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
‘‘నువ్వేరంగాన్ని ఎంచుకున్నావన్నది ముఖ్యం కాదు. విజయతీరాలకు చేరాలంటే... నీ శక్తియుక్తుల్ని అద్భుతంగా, అత్యుత్తమంగా వినియోగించి ఆ పని పూర్తి చెయ్యి. లేదా, దాన్ని ప్రారంభించకముందే పూర్తిగా వదిలెయ్యి...’’ ఇదే తనను అడిగిన ప్రతిఒక్కరికీ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్ చెప్పే చిన్న మాట.

కళ మన ఒక్కరి ఆనందానిక్కాదు. పదిమంది ఆదరించడానికి. నాలుగ్గదుల మధ్య, బెడ్ రూమ్‌లో డ్యాన్సులు చేసే వారి అద్భుతమైన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ప్లాట్ ఫామ్ ‘బూగీ వూగీ ’ డాన్స్ టీవీ షో. ఆ తర్వాత ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’, ‘ నచ్ బలియే’, ‘ ఝలక్ దికలాజా’ లాంటి టీవీ షోలు ఇదే రేంజ్‌లో లక్ష్యాన్ని కొనసాగిస్తూ అభిమానులను అలరించాయి. అంతే కాదు ఎంతోమంది టాలెంట్ వున్న డ్యాన్సర్లను కూడా కళా ప్రపంచానికి అందించాయి. ఈ షోల్లో పాల్గొన్న కళాకారులకే కాదు, న్యాయ నిర్ణేతలకూ పాపులారిటీని తెచ్చిపెట్టాయి. వారిలో టెరెన్స్ లూయిస్ ఒకడు.

టెరెన్స్ లూయిస్, పాపులర్ కొరియోగ్రాఫర్

టెరెన్స్ లూయిస్, పాపులర్ కొరియోగ్రాఫర్


టెరెన్స్ లూయిస్

ఇండియన్ ఫోక్ , కాంటెంపరరీ, నియో క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌లో తనదైన శైలిని ఏర్పరుచుకున్న పాపులర్ కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్. ‘డ్యాన్స్ ఇండియా డాన్స్’, ‘నచ్ బలియే’, ‘హిందుస్థాన్ కే హర్బాజ్’, ‘చక్ ధూమ్ ధూమ్’ లాంటి టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహిరించి ఆ ప్రదర్శనలకే వన్నె తెచ్చిన డ్యాన్సర్ టెరెన్స్. తన స్ఫూర్తివంతమైన జడ్జిమెంట్‌తో ఎందరో పోటీదారుల్లో దాగున్న టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చాడు. డ్యాన్సింగ్ వరల్డ్‌లో చెరిగిపోని ముద్రను వేశాడు. నిజంగా అతడి గతజీవితం .. వర్ధమాన నృత్యకారులకు మార్గదర్శకం.

మైక్రోబయాలజీ చేసి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ అందుకున్న టెరెన్స్ లూయిస్.. తనెంచుకున్న బాటను వదిలేశాడు. తన మనసుకిష్టమైన రంగంవైపు పరుగు పెట్టాడు. అదే డ్యాన్స్. సంప్రదాయ ఉద్యోగాలంటే ఇష్టంలేని టెరెన్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన కుటుంబం దుస్సాహసంగానే భావించింది. అవేమీ టెరెన్స్‌లో నిరుత్సాహాన్ని కలిగించలేదు. పైగా రెట్టించిన పట్టుదలను రేపెట్టాయి. తనపై తనకున్న నమ్మకం , అకుంఠిత దీక్ష, కొత్తదనాన్ని వెతికే నైజం.. ఇవే డ్యాన్సింగ్ వరల్డ్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని టెరెన్స్‌కు కట్టబెట్టాయి. ‘‘నువ్వేదైనా చేయాలనుకుంటే దాన్నెంత అద్భుతంగా, అత్యుత్తమంగా చేయగలవో .. అలా చెయ్యి. లేదా, ఆ పని చేయడమే పూర్తిగా వదిలెయ్యి...’’ ఇదే తనను అడిగిన ప్రతిఒక్కరికీ టెరెన్స్ లూయిస్ చెప్పే మాట.

టెరెన్స్‌ను ‘ది ఎడ్యుటైన్మెంట్ షో ’ ద్వారా కలుసుకుంది యువర్ స్టోరీ. ‘ది ఎడ్యుటైన్మెంట్ షో’ అంటే ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్మెంట్‌ల కలబోతతో రూపొందించిన షో. దీని ద్వారా ఎందరో నిపుణులు, లక్ష్యాలను సాధించిన వాళ్లు, మీడియా, కమ్యూనికేషన్, డిజైన్ రంగాలకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తులు పరిచయమయ్యారు. ఆయా రంగాల్లో అవకాశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, తెలుసుకోవాల్సిన సూచనలను ‘ది ఎడ్యుటైన్మెంట్ షో’ అందరికీ అందించింది.

డ్యాన్స్ వైపు స్టెప్ అప్ 

టెరెన్స్‌కు డ్యాన్స్ అంటే ప్రాణం. కానీ అందులో శిక్షణ తీసుకుంది మాత్రం 14 ఏళ్ల వయసులో. ముంబై ఇంటర్ స్కూల్ డ్యాన్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి మెరిశాడు టెరెన్స్. ఆ కాంపిటీషన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన మిసెస్ పర్వేజ్ శెట్టి .. టెరెన్స్‌లోని స్పార్క్‌ను పసిగట్టింది. పోటీలో ఫస్ట్ ప్రైజ్‌ను టెరెన్స్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు... పర్వేజ్ శెట్టి స్కాలర్ షిప్ కింద జాజ్ అండ్ బ్యాలే క్లాసులకు వెళ్లే అర్హతనూ సంపాదించాడు.

జాజ్ బ్యాలే డ్యాన్సింగ్ క్లాసులకు వెళ్లడం తీపి అనుభూతుల్నిమిగిల్చిందంటాడు టెరెన్స్. అక్కడ నేర్చుకోవడానికొచ్చే స్టూడెంట్ల అద్భుత ప్రతిభ, ఫ్లోర్ అణువణువుపై వాళ్ల విన్యాసాలు చూసి టెరెన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహాన్ని ఉరకలెత్తించాయి. జాజ్ బ్యాలేలోని మూమెంట్స్, ఆత్మవిశ్వాసంతో చేసే ప్రదర్శన... ఇవన్నీ టెరెన్స్‌ను డ్యాన్స్‌కు బానిసను చేసేశాయి. అలా స్టెప్పులతో స్టెప్ బై స్టెప్ ఎదగడం మొదలు పెట్టాడు టెరెన్స్ లూయిస్.

టెరెన్స్ లూయిస్ ఓ అద్భుత నృత్య భంగిమ

టెరెన్స్ లూయిస్ ఓ అద్భుత నృత్య భంగిమ


పర్వేజ్ శెట్టి ఆధ్వర్యంలో శిక్షణ పొందాక.. అమెరికన్ మోడ్రన్ కాంటెంపరరీ డ్యాన్సర్ జాన్ ఫ్రీమ్యాన్ ప్రభావం టెరెన్స్ పై ఎక్కువగా పడింది. 1996-97 లో జాన్ ఫ్రీమ్యాన్ దగ్గర హార్టన్ స్టైల్‌ను నేర్చుకున్నాడు. డ్యాన్స్‌లో ఇలాంటి ఒక స్టైల్ ఉందనే విషయం అప్పటివరకు టెరెన్స్‌కు తెలీదు. జాజ్ అండ్ బ్యాలే ద్వారా తమలోని నృత్య నిపుణత వెల్లివిరుస్తుంది. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది. కానీ ఆధునిక సమకాలీన నృత్యం (మోడర్న్ కాంటెంపరరీ డ్యాన్స్ ) అందుకు విభిన్నం. అందుకే టెరెన్స్ ఆ డ్యాన్స్‌లోని మెళకువల్ని, శైలిని ఆస్వాదించాడు. ఆ కదలికల్ని ఒడిసిపట్టుకున్నాడు. దాన్ని తన బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మలుచుకున్నాడు.

టెరెన్స్ నెక్స్ట్ స్టెప్ న్యూయార్క్‌లో పడింది. అక్కడ అల్విన్ ఐలే స్కూల్‌లో సమ్మర్ ఇంటెన్సివ్ కోర్స్‌కు జాయినయ్యాడు. జర్మనీకి చెందిన సుసాన్నే లింకే, నకుల సోమన లాంటి అంతర్జాతీయ శిక్షకుల సమక్షంలో తన టాలెంట్ కు మెరుగులు దిద్దుకున్నాడు.

టెరెన్స్ డ్యాన్స్ కంపెనీగా..

టెరెన్స్ తన కెరీర్‌ను మెల్లిగా డ్యాన్స్ పాఠాలను నేర్పుతూ మలుచుకున్నాడు. ఫిట్‌నెస్ కోర్స్ చేశాక.. బాలీవుడ్ టాప్ స్టార్లు మాధురీ దీక్షిత్, గౌరీ ఖాన్ లాంటి సెలబ్రిటీలకు శిక్షణనిచ్చాడు. టెరెన్స్ లూయిస్ టాలెంట్ మెల్లగా అందరి నోటా వినబడింది. దీంతో ప్రకటనల రూపకల్పనలో మంచి పేరున్న అలీక్ పదమ్‌సీ నుంచి పిలుపునందుకున్నాడు. అలా ‘ఎవిటా’ యాడ్‌లో అవకాశమొచ్చింది. ఈ యాడ్ కోసం టెరెన్స్ చాలా కాలేజీల చుట్టూ తిరిగాడు. ఇదే తనో డ్యాన్స్ కంపెనీని స్టార్ట్ చేయాలనే ఆలోచనకు బీజం వేసింది. అలా టెరెన్స్ లూయిస్ కాంటెంపరరీ డ్యాన్స్ కంపెనీ (TLCDC) పురుడు పోసుకుంది.

2000 ఏడాదిలో టెరెన్స్ లూయిస్ కాంటెంపరరీ డ్యాన్స్ కంపెనీ (TLCDC)... నృత్య ప్రధానంగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. అంతర్జాతీయంగా డ్యాన్స్ అంటే ఇతర రంగాలకంటే ఎంతో ఉన్నతమైనదనే భావన వుంది. కానీ మన దేశంలో అలా కాదు. ఇప్పటికీ డ్యాన్సర్స్ అంటే చాలా చోట్ల చిన్న చూపే. దాన్ని మార్చాలనేది టెరెన్స్ కోరిక. మన దేశంలోనూ కాంటెంపరరీ డ్యాన్స్ అంటే ఆకట్టుకోగలదని ఇప్పటికే చాలా సార్లు నిరూపించాడు టెరెన్స్ లూయిస్. టీఎల్సీడీసీ (TLCDC) ద్వారా భారత నృత్య రీతుల్ని , సమకాలీన నృత్య శైలిలో కలగలిపి కాంటెంపరరీ డ్యాన్స్ స్టైల్ కు కొత్త జీవాన్ని తీసుకొచ్చాడు టెరెన్స్. అలా ఇండో-కాంటెంపరరీ స్టైల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. చాలా రియాల్టీ టీవీ షోల్లో టెరెన్స్ దగ్గర శిక్షణ పొందిన డ్యాన్సర్లు ఈ కొత్త డ్యాన్స్ స్టైల్ ను దేశవ్యాప్తంగా పరిచయం చేయగలిగారు. అదంతా TLCDC స్థాపించడం వల్లే సాధ్యమయ్యింది.

డ్యాన్స్ ను కెరీర్ గా ఎంచుకుని పేరుతెచ్చుకోవాలని తపించే స్వచ్ఛమైన డ్యాన్సర్లకు టీఎల్సీడీసీ (TLCDC) డోర్లు ఎప్పుడు తెరిచే వుంటాయి. కొరియోగ్రఫీలో పలు రకాల కోర్సులను అందిస్తోందీ కంపెనీ. ‘‘వ్యాపారవేత్తగానూ నేను ఎదగడానికి డ్యాన్స్ భాగస్వామ్యం ఎంతోవుంది. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ .. ప్రత్యేకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూనే కొరియోగ్రాఫర్ గానే కాకుండా వ్యాపారదృక్పథమున్న వ్యక్తిగా నన్ను నేను నిరూపించుకున్నాను. ఎంతోమంది సెలబ్రిటీలకోసం డ్యాన్స్ ను కంపోజ్ చేశాను. కొరియోగ్రాఫర్లను తయారు చేసేందుకు డ్యాన్స్ క్యాంప్ లు, వర్క్ షాపులతో బిజీగా వుంటూనే .. టీవీ డ్యాన్స్ షోల్లో న్యాయనిర్ణేతగా సెలబ్రిటీ హోదానూ సొంతం చేసుకున్నా’’ అంటున్నాడు టెరెన్స్.

టీఎల్సీడీసీ (TLCDC ) ముంబై కేంద్రం పనిచేస్తోంది. రెండు వారాల తక్కువ వ్యవధిగల వర్క్ షాపులను దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తూ వస్తోంది. దీంతో ముంబైలోనే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా డ్యాన్స్ కంపెనీకి పేరు ప్రఖ్యాతులు దక్కుతున్నాయి. ఇంతలా దూసుకెళ్తున్నా... టీఎల్సీడీసీ (TLCDC) కి అనుబంధంగా డ్యాన్స్ అకాడమీలు స్థాపించాలనే ఆలోచనపై ఆసక్తి లేదంటున్నాడు టెరెన్స్. ఇతర నగరాల్లో వర్క్ షాపుల ద్వారా పట్టుదల, నిబద్ధతగల డ్యాన్సింగ్ ప్రొఫెషనల్స్ ను కనిపెట్టడంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది టీఎల్సీడీసీ (TLCDC). కాబట్టి చిన్న చిన్న సిటీల్లో, ఊర్లలో వుండే డ్యాన్సర్లు, శిక్షకులు కూడా ముందు తమను తాము నైపుణ్యంగల నృత్యకారులుగా తీర్చి దిద్దుకోవాలి. ఆ తర్వాత దానికి అనుబంధంగా వ్యాపారాలను ప్రారంభించాలని సూచిస్తున్నాడు టెరెన్స్.

విజయసూత్రాలు

నిబద్ధత, క్రమశిక్షణ గల కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్నప్పటికీ టెరెన్స్‌లో గర్వం అణుమాత్రమైనా కనబడదు. తనను తాను నిత్య విద్యార్థిగా చెప్పుకోవడం కళపై అతడికున్న గౌరవం, గొప్పదనం కూడా. ‘‘నన్ను నేను ప్రతిక్షణం విద్యార్థిగానే భావిస్తుంటా.... ఎప్పుడైతే నేర్చుకోవడం నేను ఆపేస్తానో.. నాలోని కొరియోగ్రాఫర్ ఆరోజే చచ్చిపోయినట్లు లెక్క’’ ఈ ఒక్కమాట టెరెన్స్‌కు డ్యాన్స్ పై వున్న అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. టీఎల్సీడీసీ (TLCDC) కి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి తన టీమ్ మూల స్థంభాలుగా వుంటూ సహాయ సహకారాలందించడమే కారణమని నిర్మొహమాటంగా చెబుతాడు టెరెన్స్. ‘‘నేను కంపెనీలో లేనప్పుడు, బయట ప్రాంతాలకు శిక్షణనివ్వడానికి వెళ్లినా, డ్యాన్స్ లో కొత్త రీతుల్ని నేర్చుకోవడానికి దూరంగా వున్నా.. టీమ్ సభ్యులు టీఎల్సీడీసీ (TLCDC) బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు’’ అని తన టీమ్ సామర్థ్యంపై నమ్మకముంచాడు టెరెన్స్.

టీఎల్సీడీసీ(TLCDC) తో బిజినెస్ మూడుపువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ఫీల్డ్ లో మార్పును స్వాగతించకపోతే వెనకబడిపోతారు. వ్యక్తిగత క్రమశిక్షణ, నిరంతర సాధన వుంటేనే డ్యాన్సింగ్ రంగంలో ముందుకు సాగగలం. ‘‘ నేను గద్దలాగా ఆకాశం పైకి ఎగిరిపోవడానికి , ఎత్తులో వుండటానికే ఇష్టపడతాను’’ అంటా టెరెన్స్.

ఈ ప్రయాణంలో ఎంతో మంది మనుషులు, వాళ్ల మనస్తత్వాలు, అహాన్ని గుర్తెరిగి మసలుకోవడం పెద్ద సవాలు. కొరియోగ్రఫీలో ఒక్కోసారి చిన్న మూమెంట్ రూపొందించాలన్నాచాలా కష్టమవుతుంది. ఒకవేళ తనీ రంగంలోకి రాకుండా వుండుంటే... తన శక్తిసామర్థ్యాలకు, అభిరుచికి తగిన రంగంలో పనిచేస్తూ వుండేవాడినంటాడు టెరెన్స్ లూయిస్. నటుడిగా, క్రియేటివ్ హెడ్ గా సినిమారంగంలో వున్నప్పుడు ఓ సామాజిక, మానవ హక్కుల కార్యకర్తలా నిజాయితీగా పనిచేయాలనేది అతని సూచన.

కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వాళ్లు ముందు మంచి నాయకత్వ లక్షణాలను సాధించాలి. దాంతో పాటు వాణిజ్య విలువల్ని పసిగట్టగలగాలి. ‘‘ స్పష్టమైన ముందు చూపు, కంపెనీని నిలబెట్టగలమనే నమ్మకంతో పాటు.. బలమైన బృందం వెనకాలుండాలి. వాస్తవికతను గుర్తించే నేర్పుతో పాటు పరిణితి, అనుభవం తోడయితే విజేతగా నిలిచేందుకు నికేదీ అడ్డంకి కాదు.. ఆపలేదు’’ అంటూ విజయసూత్రాల్ని చెప్పాడీ గ్రేట్ కొరియోగ్రాఫర్.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Latest

Updates from around the world

Our Partner Events

Hustle across India