డాక్టర్లకు ఉద్యోగాలు వెతికిపెట్టే ప్లెక్సస్

ఎంబిబిఎస్ చేసి ఐఐఎంలోకి ఎంట్రీఐఐఎంలో కొత్త ఆలోచనలకు బీజంఆంట్రపెన్యూర్లుగా మారిన డాక్టర్లునౌక్రీ డాట్ కామ్‌లా డాక్టర్ల జాబ్ సెర్చ్ ఇంజిన్ ఈ ప్లెక్సస్

20th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆయన మాత్రం డాక్టర్ ఫ్యామిలీలో పుట్టి డాక్టర్ అయ్యాడు. ఎంబీబీఎస్ పట్టా చేతికొచ్చిందో లేదో వెంటనే ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ ఏంటీ... ఎంబీఏలో జాయిన్ కావడమేంటీ... అసలు ఏమైనా సంబంధం ఉందా? అన్న డౌట్ వచ్చిందా? ఆయన్ను చూసిన వాళ్లకి కూడా ఇవే డౌట్స్ వచ్చాయట. ఎంబీఏ పట్టా పుచ్చుకున్న తర్వాత తిరిగి డాక్టర్‌గా స్థిరపడ్డాడా అంటే అదీ లేదు. ఓ కన్సల్టెన్సీలో చేరాడు. ఆ తర్వాత మొదలైంది అసలు ప్రయాణం. డాక్టర్ పట్టాను పుచ్చుకున్న అతను... ఇప్పుడు వందలమంది డాక్టర్లకు ఉద్యోగాలు ఇప్పించే స్థాయికి ఎదిగాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ప్లెక్సస్ ఎండీ సంస్థ వ్యవస్థాపకుడు రోహన్ దేశాయ్‌ని పలకరించాలి.

అలా మొదలైంది...

రోహన్ దేశాయ్... అహ్మదాబాద్ వాసి. అందరి జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇలాంటి టర్నింగ్ పాయింట్ రోహన్ దేశాయ్ లైఫ్‌లో సరిగ్గా 2008లో వచ్చింది. అదే సంవత్సరంలో రోహన్ ఎంబీబీఎస్ పూర్తైంది. డాక్టరయ్యాడు. డాక్టర్ పట్టా పుచ్చుకున్న వాళ్లకు రెండు ఆప్షన్స్ ప్రధానంగా ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్ మొదలు పెట్టడం... లేదా ఎంఎస్ చెయ్యడం. కానీ రోహన్ ఈ రెండింటిలో ఏదీ ఎంచుకోలేదు. ఎవరూ ఊహించని విధంగా ఐఐఎం-అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ చేశాడు. డాక్టర్ చదివి, ఎంబీఏ కోర్సులో చేరడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడని బాధపడ్డవాళ్లూ ఉన్నారు. కానీ రోహన్ గోల్ వేరు.

"నా తల్లిదండ్రులు వైద్యులు. డాక్టర్ల కుటుంబంలో పెరిగిన వాతావరణం నన్ను ఈ ఫీల్డ్ లోకి నడిపించింది. అప్పుడు నాకేమీ పెద్దగా అభ్యంతరం అనిపించలేదు. కానీ... గణితం, విశ్లేషణాత్మక అంశాలంటే నాకు చాలా ఇష్టం"
రోహల్ దేశాయ్, బినాల్ దోషి, కిన్నర్ షా

రోహల్ దేశాయ్, బినాల్ దోషి, కిన్నర్ షా


ఇవీ తన ఇష్టాల గురించి రోహన్ చెప్పే మాటలు. ఇండియాలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ అయిన ఐఐఎం-అహ్మదాబాద్ లో క్యాట్ ద్వారా అడ్మిషన్ పొందాడు. అక్కడే రోహన్‌కు కొత్త కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. డాక్టర్‌గా స్థిరపడటం కాదు... వైద్యరంగంలో కొత్తగా ఇంకేదైనా చెయ్యాలన్న కోరిక ఉంది. ఎంబీఏ తర్వాత రోహన్ కొన్నేళ్లు కన్సల్టెన్సీలో జాబ్ చేశాడు. 2013 చివరి నాటికి కొత్త స్టార్టప్‌పై ఆలోచనలు మొదలయ్యాయి. ఓచేతిలో డాక్టర్ పట్టా... మరో చేతిలో ఎంబీఏ పట్టా రెండూ ఉన్నాయి. ఈ రెండూ కలిపి ఏదైనా చేస్తే..? తన బుర్రలో తట్టిన ఐడియాకు పదును పెట్టాడు రోహన్. అవకాశాల కోసం అన్నీ పరిశీలించడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియా ఉపయోగించే డాక్టర్లపై అధ్యయనం చేశాడు. "ఫేస్ బుక్‌లో డాక్టర్లు చేసే పోస్టింగ్‌లే నా స్టార్టప్‌కు కారణమని చెప్పుకోవాలి. అలాంటి అప్‌డేట్స్ ఇవ్వడానికి ఫేస్ బుక్ సరైన వేదిక కాదనిపించింది" అంటాడు రోహన్. ఇంతకీ ఆ పోస్టింగ్ లు ఏంటో తెలుసా? క్లినిక్‌లల్లో, హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ బేస్డ్, పార్ట్ టైమ్, ఇంటర్న్‌షిప్స్, ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి డాక్టర్లు ఇచ్చిన పోస్టింగ్‌లు. అంటే డాక్టర్లు ఇలా వేర్వేరు మోడల్స్‌ల్లో పనిచేస్తున్నారని రోహన్ కు అర్థమైంది. అయితే ఇలాంటి ఉద్యోగావకాశాలకు సరైన వేదిక లేదని గుర్తించాడు రోహన్. అప్పుడే డాక్టర్ల కోసం naukri.com లాంటి ప్రత్యేక జాబ్ పోర్టల్ ప్రారంభించాలన్న ఐడియా పుట్టుకొచ్చింది.

ఆ తర్వాత..?

జాబ్ పోర్టల్ ఐడియా రాగానే రోహన్ తన డాక్టర్ ఫ్రెండైన బినాల్ దోషిని సంప్రదించాడు. బినాల్ కూడా రోహన్‌లాగే ఎంబీబీఎస్ చేసి తర్వాత ఐఐఎం కోజికోడ్‌లో ఎంబీఏ చేశారు. ఆమెకు ఈ ఐడియా నచ్చడంతో డిస్కషన్ జరిగిన 24 గంటల్లోనే కో-ఫౌండర్‌గా ఉంటానని ఆసక్తి చూపారు. టెక్నాలజీ కోసం కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కిన్నార్ షా సాయం తీసుకున్నాడు రోహన్. ఆల్ ఈవెంట్స్ స్టార్టప్‌లో పనిచేసిన అనుభవం ఉంది కిన్నార్ షాకు. ఈ ముగ్గురూ కలిసి ప్లెక్సస్ ఎండి పేరుతో సంస్థను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌ని, ఆర్గనైజేషన్స్‌ని కలపడమే లక్ష్యంగా ఈ సంస్థ మొదలైంది. కొద్ది సమయంలోనే వీళ్లు నెట్‌వర్క్ ను తయారు చేసుకోగలిగారు. ఇండియాలో 2500+ డాక్టర్ యూజర్స్ వీరికున్నారు. దేశంలోని ప్రముఖ చెయిన్ హాస్పిటల్స్‌లో 250+ ఉద్యోగాలను ఇప్పించగలిగారు. నారాయణ హెల్త్, కొలంబియా ఏసియా, థైరోకేర్, వాసన్ ఐకేర్, సెంటర్ ఫర్ సైట్, స్టెర్లింగ్ హాస్పిటల్స్ వీరి క్లైంట్లు. జాబ్ ఓపెనింగ్స్ మాత్రమే కాదు... కోర్సులు, ఫెలోషిప్ లాంటి వివరాలను కూడా అందిస్తోంది ఈ సంస్థ. రోజుకు 60 నుంచి 70 మంది డాక్టర్లు ఎన్‌రోల్ చేసుకోవడం విశేషం.

ఫ్యూచర్ ప్లాన్ ఏంటీ ?

ప్లెక్సస్ ఎండీ టీమ్‌లో ప్రస్తుతం ఆరుగురున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించింది. వాళ్ల ఫోకస్ అంతా వెబ్ + మొబైల్ పైనే. ఎందుకంటే ఓన్లీ వెబ్ అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు పోటీలో ఉన్నాయి. క్యూరోఫీ అనే స్టార్టప్ డాక్టర్ టు డాక్టర్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ను తయారు చేసింది. ఇక వినియోగదారుల వైపు నుంచి చూస్తే డిజిటల్ హెల్త్ కేర్‌లో ప్రాక్టో బిగ్గెస్ట్ స్టార్టప్. అయితే ప్లెక్సస్ ఎండీ మెయిన్ ఫోకస్ ఉద్యోగాల కల్పన పైనే. ఆ తర్వాతే నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్. ప్రస్తుతం ప్లెక్సస్ ఎండీ సంస్థకు నిధుల అవసరం ఉంది. యూజర్ల సంఖ్యలో టార్గెట్ రీచ్ అయిన తర్వాతే ఆదాయ మార్గాలను అన్వేషించాలనుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న జాబ్స్ పోర్టల్ రెవెన్యూ మోడల్‌ను ఫాలో అవనున్నారు. అడ్వర్టైజ్‌మెంట్లు, ప్రీమీయం లిస్టింగ్‌ల రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలన్నది వీరి ఆలోచన.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close