మీరు ఏ డ్రెస్ కొనాలో ఈ యాప్ చెప్పేస్తుంది..

3rd May 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


కృత్రిమ మేధస్సు, తనంతట తాను పనిచేసుకునే మెషీన్స్. కొన్ని హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూస్తుంటాం. రజనీకాంత్ రోబో సినిమాలో మరమనిషికి మైండ్ పెడతారు. అది సొంతంగా ఆలోచిస్తుంది. ఇకపై అవన్నీ మన నిత్యజీవితంలో భాగంకానున్నాయి. విజువల్ సెర్చ్, ఇమేజ్ గుర్తింపు విషయంలో ఇది ఇప్పటికే నిజమయ్యింది. మాడ్ స్ట్రీట్ డెన్, స్నాప్ షాపర్ తరహాలోనే స్ట్రీమాయిడ్ టెక్నాలజీస్ వృద్ధిచేసిన యాప్ పిక్విట్ ఫ్యాషన్ షాపింగ్ విషయంలో సహకరిస్తోంది.

2013లో ఏర్పాటైన స్ట్రీమాయిడ్ టెక్నాలజీస్ 2014 నుంచే కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇండియాతోపాటు అమెరికాలోనూ ఇది పనిచేస్తోంది. హ్యూమన్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్ సాయంతో ఫ్యాషన్ రిటైల్ సమస్యలను పరిష్కరిస్తోంది.

ఎక్స్ పర్ట్స్ లాగే పసిగట్టేస్తుంది

పిక్విట్ ఫ్యాషన్… అత్యాధునిక ఫ్యాషన్స్ ను ఫాలో అవుతుంది. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ ను పసిగట్టేస్తుంది. కస్టమర్ బాడీకి ఏ దుస్తులు సూట్ అవుతాయో రికమెండ్ చేస్తుంది. ఫ్యాషన్ రంగంలో ఒక స్టైలిస్టుకు ఉన్నంత నాలెడ్జ్ ఈ యాప్ కు ఉంటుంది. కృత్రిమ మేధస్సును ఇందులో ప్రవేశపెట్టారు.

“ 80 శాతం సమస్యను ఈ యాప్ పరిష్కరిస్తుంది. 20 శాతం ఎవరినైనా ఎక్స్ పర్ట్ ను అడిగితే సరిపోతుంది. యాప్ ద్వారానే మా ఎక్స్ పర్ట్స్ ను కాంటాక్ట్ చేసే వీలుంది”- రాజేశ్ కుమార్ ,స్ట్రీమాయిడ్ టెక్నాలజీస్ సీటీఓ

ఈ స్టార్టప్ ను శ్రీధర్ మంథాని స్థాపించారు. నాస్ డాక్ లో ఐపీఓగా వెళ్లిన S3లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇంటెల్ కంపెనీకి అమ్మేసిన థింక్ ఇట్ ను కూడా ఈయనే స్థాపించారు. ఈ కంపెనీ కోర్ టీంలో పనిచేస్తున్న రాజేశ్ కుమార్ గతంలో యాహూ, ఇన్ మొబీలో పనిచేశారు.

అమ్మాయి అయినా, అబ్బాయైనా ఒక వ్యక్తికి ఎలాంటి డ్రెస్ సరిపోతుందో ఈ యాప్ చెప్పేస్తుంది. డ్రెస్ ఫొటో తీసి పెడితేచాలు… దాన్ని ఎన్ని వెరైటీల్లో ధరించవచ్చో చెబుతుంది. స్టైల్ అండ్ కేటగిరీ అన్నీ వివరిస్తుంది. యాప్ లో చాలా డాటా ఉంటుంది. ఏ డ్రెస్ కొనాలో చెప్పేముందు అన్ని టెక్సిక్స్ ను ఉపయోగిస్తుందీ యాప్.

“మా దగ్గర స్టైలిస్టుల బృందం ఉంది. మా డాటాబేస్ లో దుస్తులకు ఎప్పటికప్పుడు రేటింగ్స్ ఇస్తుంటారు. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ కూడా కోరతాం. మమ్మల్ని మేం మెరుగుపరచుకుంటుంటాం” రాజేశ్
 పిక్విట్ ఫ్యాషన్ టీం

 పిక్విట్ ఫ్యాషన్ టీం


కస్టమర్ల సంతృప్తి

యాపేకాదు వెబ్ సైట్ కూడా ఉంది. యాప్ కావాలంటే మొబైల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని… మన ఫొటో పెడితే చాలు మనం ఎలా ఉంటామో చెప్పేస్తుంది. ట్రయల్ రూమ్స్ అవసరం లేనే లేదు.

ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికైతే ఇది నిజంగా ఒక వరం. ఆన్ లైన్ పిక్ పంపితే చాలు దుస్తుల క్వాలిటీ సైతం చెప్పేస్తుంది. అంతకు ముందు కొన్నవారి అభిప్రాయాన్నికూడా వెల్లడిస్తుంది. అలా రోడ్డుమీద రిటైల్ షాపులో డ్రస్ కనిపించగానే ఒక ఫొటో తీసుకుంటే చాలు అది మనకు సూట్ అవుతుందో లేదో క్షణాల్లో చెప్పేస్తుంది.

ఇందులో ఒక ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంటుంది. రిటైలర్ వెబ్ సైట్ కు లింక్ అయ్యి ఉంటుంది. ఏదైనా ఒక డ్రస్ తీసుకుందామనుకుంటే అలాంటి దుస్తులనే మరికొన్నింటిని చూపిస్తుంది. స్టైల్ టిప్స్ అందిస్తుంది. కస్టమర్ ఆధారిత డిజిటల్ సెటప్ చేశారు. ABOF, ట్రెండిన్ (ఆదిత్య బిర్లా గ్రూప్) , పోతీస్, బిబా, మస్టర్డ్ లాంటి బ్రాండ్స్ తో టై అప్ అయ్యింది పిక్విట్ ఫ్యాషన్స్. విజువల్ సెర్చ్, ఇమేజ్ రికగ్నిషన్ మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

మాతున్న అభిరుచులు

మ్యాడ్ స్ట్రీట్ డెన్, స్నాపప్ షాపర్ లాంటి సంస్థలు ఈ కామర్స్ కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నాయి. పిన్ ట్రెస్ట్ లాంటి అంతర్జాతీయ సంస్థలు రెండేళ్ల నుంచి దిగ్విజయంగా పనిచేస్తున్నాయి. ఈ సంస్థను విజువల్ గ్రాఫ్ కొనుగోలు చేసింది. మార్కెట్స్ అండ్ మార్కెట్స్ సంస్థ సర్వే ప్రకారం 2020 నాటికి ఈ రంగం 29.98 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఏడాదికి 19.1 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. 2015 లో ప్రారంభమైన పిట్ క్విట్ లోకి కొత్త కస్టమర్స్ వస్తునే ఉన్నారు.

 “మా ప్రోడక్ట్ ను ఉపయోగిస్తున్న కస్టమర్లందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేం ఊహించనంత మంచి రెస్పాన్స్ వస్తోంది. మా ఆదాయం కూడా బాగుంది. వృద్ధిరేటు కూడా బాగుంది,”-రాజేశ్
image


విజువల్ సెర్చ్ విషయంలో పిక్విట్ సంస్థ రెండు పేటెంట్లు పొందింది. ఈ సంస్థ సాస్ ఆధారిత రెవెన్యూ మోడల్ ను అనుసరిస్తోంది. సబ్ స్క్రిప్షన్స్ ద్వారా ఆదాయం వస్తోంది. యూఎస్ ఎంజెల్స్ సంస్థ గత ఏడాది 10 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం మొబైల్ యాప్, వెబ్ సైట్ రూపంలో సేవల్ని అందిస్తున్నారు. భారత్, అమెరికాలో సేవలందిస్తున్నప్పటికీ మిగతాదేశాలకూ విస్తరిస్తామని చెబుతున్నారు రాజేశ్.

భవిష్యత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర మరింత పెరుగుతుంది. సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. సో పిక్విట్ లాంటి యాప్స్ కు మంచి భవిష్యత్ ఉంటుందనే చెప్పాలి. 

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close