ఏం వదినా పనిమనిషి కావాలా..?

21st Feb 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఏ ఇంట్లో అయినా ఉదయం నిద్రలేవగానే.. పనిమనిషి కోసం ఎదురుచూపులు. ఆమె ముంగిట్లో అడుగుపెట్టేంత వరకూ వస్తుందా.. రాదా.. అనే టెన్షన్. ఇక ఇంట్లో ఏదైనా ఫంక్షనో.. లేక పండుగో ఉంటే.. చాలు వాళ్ల గురించి నానా హైరానా పడుతూ ఉంటారు మహిళలు. పనిమనిషులే కాదు.. కుక్స్, బేబీ సిట్టర్స్ వంటి సేవలు తీసుకునే వాళ్లందరూ ఎప్పుడూ ఒకసారి ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఉంటారు. అనుభవం లేకపోవడం, పనుల్లో నాణ్యత వంటి వాటిగురించి ఆలోచించే పనేలేదు.

అందుకే ఎప్పటి నుంచో అండర్ సర్వ్ డ్ గా ఉన్న ఈ మార్కెట్‌పై ఇప్పుడు స్టార్టప్స్ కన్నేశాయి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరించి వ్యాపార మార్గం కనుక్కోవడమే స్టార్టప్స్ పంథా అని మనందరికీ తెలిసిందే.

డొమెస్టిక్ హెల్పర్స్, ట్రైన్డ్ ప్రొఫెషనల్స్‌‌ కు ఉన్న గిరాకీని, ఈ రంగంలో ఉన్న లోటును గుర్తించి, భర్తీ చేసేందుకు జానీ ఝా సిద్ధమయ్యారు. జూన్ 2015లో ముంబైలో మై దీదీ.ఇన్ (mydidi.in)ను మొదలుపెట్టారు. మహిళలను ఎంపిక చేసి వారికి శిక్షణనిచ్చి నిపుణులుగా మార్చి జీవిత ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా మొదలైంది ఈ స్టార్టప్. 27 ఏళ్ల జానీ ఐఐటి ముంబై నుంచి 2012లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. దుబాయిలోని మెకెన్సీలో మూడేళ్ల పాటు పనిచేసి టూరిజం, హెల్త్ కేర్, ఇన్ఫ్రా, ఎడ్యుకేషన్ రంగాలపై పట్టుసాధించారు.

undefined

undefined


సామాజిక సమస్యకు కార్పొరేట్ స్టైల్ పరిష్కారం

1,50,000 డాలర్లతో(సుమారు కోటి రూపాయలు) మైదీదీని ప్రారంభించారు జానీ. నిధులు సమకూరాయి కానీ.. మహిళలను ఒప్పించడమే పెద్ద కష్టంగా ఉండేది. తమ ప్లాట్‌ఫాం ద్వారా శిక్షణ పొంది, ఇలాంటి ఆన్ డిమాండ్ మోడల్‌పై పనిచేసేందుకు మొదట్లో అనేక మంది విముఖత వ్యక్తం చేశారు. ముంబైలో మొదట 'స్పాట్‌లెస్' అనే ప్రోడక్ట్‌ను ఇందుకోసం లాంఛ్ చేశారు. ఇది పనివాళ్లలో ఉన్న అనుమానాలను దూరం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. రెండు నెలల కాలంలో 50 మందికిపైగా దీదీలను శిక్షణ ద్వారా తయారు చేశారు, అదే ఈ మోడల్‌లో విజయానికి తొలిమెట్టు.

''మై దీదీ ఓ ఆన్ డిమాండ్, హైపర్ లోకల్ ప్లాట్‌ఫాం. హై ఫ్రీక్వెన్సీ సేవలపై వాళ్లకు టెకీలు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు మెరుగైన శిక్షణనిస్తారు. మా సంస్థ కో ఫౌండర్స్ సొంత నిధులతో నడుస్తోంది. మెకెన్సీ అల్యుమ్ని అయిన లియో వాంగ్, జోజెప్ బార్డిక్ వంటి వాళ్లు కో ఫౌండర్ల జాబితాలో ఉన్నారు''.

శిక్షణ సాగుతుందిలా

మహిళలను వాళ్లు ఉండే ప్రాంతాన్ని బట్టి గుర్తించి ఓ కమ్యూనిటీలా ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభిస్తారు. ఆటల ద్వారా ట్రైనింగ్ ప్రాసెస్ మొదలై అది అసోసియేటెడ్ లెర్నింగ్ టెక్నిక్స్ స్థాయికి చేరుతుంది. వీటిల్లో ఒక మోడల్ హౌస్ ఏర్పాటు చేసి అందులో ఎలా పనిచేయాలో కూడా వాళ్లకు నేర్పిస్తారు. వాళ్లు పర్ఫెక్ట్ అని ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ గ్రూప్‌ను ప్లాట్‌ఫాంకు లింక్ చేస్తారు. అప్పుడు హైపర్ లోకల్ కస్టమర్లకు.. శిక్షణ పొందిన దీదీలకు మధ్య వారధిగా నిలుస్తారు.

అక్టోబర్‌లో ముంబైలోని మురికివాడల్లో స్పాట్‌లెస్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మేం ఇప్పటికే 1200 ఆర్డర్లు పూర్తిచేస్తే అందులో 2500 పనిగంటలు ఉన్నాయి. 75 శాతం మంది పాత కస్టమర్లే మా సేవలను ఉపయోగించుకుంటున్నారు - జానీ.

దీదీ యాప్ (ప్రస్తుతం ఆండ్రాయిడ్ మాత్రమే ఉంది) ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ గృహ అవసరాల కోసం పనిమనిషిని బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయ్యాక గంటలోగా దీదీ ఇంటికి వస్తుంది. అక్కడి నుంచి గంటకు రూ. 149 చొప్పున ఛార్జ్ చేస్తారు.

ఈ యాప్ ద్వారా దీదీ ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది అనే వివరాలతో పాటు కాంటాక్ట్ సెంటర్‌తో కూడా టచ్‌ లో ఉండొచ్చు. ఇదే సమయంలో వెండర్ ఆండ్రాయిడ్ యాప్ కూడా రూపొందించారు. దీంతో దీదీలు తమ పనిని తాము అంచనా వేసుకోవచ్చు. పనితీరు, కస్టమర్ల ఫీడ్ బ్యాక్, ఎన్ని గంటలు పనిచేశారు, ఎంత డబ్బు జమైంది అనే వివరాలతో పాటు ఆర్డర్లును యాక్సెప్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడ్తుంది.

ప్రస్తుతం 12 మంది ఉద్యోగులు, ఏడుగురు పార్ట్ టైం ఉద్యోగులతో మై దీదీ స్టార్టప్ ముంబైలో మెల్లిగా విస్తరిస్తోంది. చాందివలీ, పొవాయ్, ఘట్కోపర్, అంధేరీ, గోరెగావ్, జుహూ, వర్సోవా ప్రాంతాల్లో ఇప్పుడు సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకూ మై దీదీ యాప్ 800 సార్లు డౌన్ లోడ్ అయింది.

ఆదాయం ఎలా ?

ఆర్డర్ల ద్వారా వచ్చిన మొత్తం డబ్బులో కొంత మొత్తం దీదీల జీతానికి, మరికొంత నిర్వాహణా అవసరాలకు (ఉదా. లాజిస్టిక్స్, కిట్ మెటీరియల్ వంటివి) వెళ్తుంది. ఈ ఖర్చులన్నీ పోగా మిగిలిందే మార్జిన్. ఇప్పుడు స్టార్టప్ నెలకు 800 నుంచి 1000 ఆర్డర్లను అందుకుంటూ నెలకు 50 శాతం వృద్ధితో దూసుకుపోతోంది.

''సేవలకు ఎంత వసూలు చేయాలో మేం నిర్ణయిస్తాం, అందులో అధిక మొత్తం దీదీలకు కమిషన్ రూపంలో వెళ్తుంది. రెండు మోడళ్లలో వేతనం అందుతుంది. కొంతమంది నిర్దిష్ట నెలసరి వేతనంపై పనిచేస్తారు. అప్పుడు వాళ్లు ఇన్ని గంటలు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. మరొకటి వేరియబుల్ మోడల్. ఇక్కడ వాళ్లు ఎంత పనిచేసుకుంటే అంత డబ్బు అందుతుంది'' - జానీ.

2016 నాటికి ఈ స్టార్టప్ 2000-3000 మందికి శిక్షణనిచ్చి ముంబై, బెంగళూరులో (త్వరలో ప్రారంభం కాబోతోంది) విస్తరించాలని చూస్తోంది. గ్రాస్ రెవెన్యూ ఏటా రూ.1.5- 2 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

యువర్ స్టోరీ విశ్లేషణ

శిక్షణ పొందిన పనివాళ్ల కోసం ధనికులు ఎంత మొత్తం చెల్లించేందుకైనా వెనుకాడడం లేదు. ఒకప్పటిలా మహిళలు కేవలం ఇంటికే పరిమితమై ఇంటిపనులు చూసుకునే రోజులు పోయాయి. లైఫ్‌స్టైల్స్ మారడంతో మహిళలూ ఉదయం నుంచి రాత్రివరకూ కష్టపడ్తూనే ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ పనిచేయడంతో ఆదాయం పెరిగింది. దీంతో డొమెస్టిక్ సేవలు కూడా భారమవుతూ వస్తున్నాయి. యూఎస్, యూకె, కెనడా ప్రాంతాల్లో ఇలాంటి రెసిడెన్షియల్ క్లీనింగ్ సర్వీసెస్ అందించే సంస్థలు వేలల్లో ఉన్నాయి. ఇందులోనూ కొత్తదనం తీసుకువచ్చేందుకు ఈ పరిశ్రమ అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తూ వస్తోంది.

భారత్ కూడా ఈ తరహా రంగంలో దూసుకుపోతోంది. అందుకే నానో జాబ్స్, హానెస్ట్ కాలర్స్, బుక్ మై బాయ్, గెట్ డొమెస్టిక్, మెయిడ్ సర్వీసెస్.ఇన్, కమ్లాబాయ్.కామ్, హోమ్‌మెయిడ్.ఇన్ వంటి స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. మెయిడ్స్, బేబీ సిట్టర్స్, కేర్ టేకర్స్ కోరే వాళ్లకు ఈ స్టార్టప్స్ ఒన్ స్టాప్ సొల్యూషన్‌లా మారాయి. 'పే పర్ మినిట్' సర్వీస్ అందిస్తూ తాము అందరికంటే భిన్నంగా ఉన్నామని చెబ్తున్న మై దీదీ, మార్కెటింగ్, ఇన్నోవేషన్ పై మరింత దృష్టిసారించాల్సి ఉంది. అప్పుడే ఎక్కువకాలం మార్కెట్లో నిలదొక్కుకునేందుకు మార్గం దొరుకుతుంది. 

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India