సంకలనాలు
Telugu

లేటెస్ట్ బాలీవుడ్ సినిమాలపై నిజాయితీగా రివ్యూలిచ్చే ఫ్యాన్‌మేంగో

క్రికెట్ అంటే పడి చస్తాంసినిమాలు చూస్తూ బతికేస్తాంఅదీ ఇండియన్స్ అంటే...రివ్యూల్లో ఫ్యాన్ మ్యాంగో రివ్యూల స్పెషాలిటీ... హానెస్టీమనం చూసే సినిమాలపై మనమే రివ్యూ రాసే అవకాశమిస్తున్న మొబైల్ యాప్

Krishnamohan Tangirala
7th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

క్రికెట్ మ్యాచ్‌లపై లైవ్ స్కోర్స్ అందించే మొబైల్ యాప్స్ చాలానే ఉన్నాయి. అయితే లేటెస్ట్ బాలీవుడ్ మూవీలపై రివ్యూలు అందించే యాప్‌లు మాత్రం తక్కువగానే ఉన్నాయి. విదేశాల్లో అయితే ఇండియన్ సినిమాకు పర్యాయపదం బాలీవుడ్. అలాంటి హిందీ సినిమాలపై నిజాయితీగా రివ్యూలు అందిస్తోంది ఫ్యాన్ మేంగో మొబైల్ యాప్.


ఫ్యాన్‌మేంగో

ఫ్యాన్‌మేంగో


“బాలీవుడ్ సినిమాలపై భారత దేశంలో మొదటిసారిగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా, నిజమైన రేటింగ్స్, రివ్యూస్ అందించే మొబైల్ యాప్ ప్రారంభించాం”అని చెబ్తున్నారు అశుతోష్. ప్రజలకు రివ్యూలు రాసే అవకాశమిచ్చిన మొబైల్ యాప్ ఇదే కావడం విశేషం. ప్రేక్షకులే మొదటి విమర్శకులు అంటున్నారు ఫ్యాన్ మాంగో పీపుల్.

ఆండ్రాయిడ్, ఐఓఎస్.. రెండు ప్లాట్‌ఫాంలపైనా అందుబాటులో ఉంది ఫ్యాన్‌మేంగో యాప్. కొత్తగా రిలీజైన సినిమాలు, గతవారం విడుదలైన మూవీలు, వాటి ట్రైలర్లతోపాటు... ఆయా సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియచేస్తుంది ఈ యాప్.

బాలీవుడ్ సినిమాలకు వీరాభిమానులైన అశుతోష్ వలని, వరుణ్ చోప్రాలు ఈ యాప్‌కు రూపకల్పన చేశారు. కాలేజ్ రోజుల్లో సినిమా రిలీజ్ నాడు మొదటి షో చూసేందుకు గానూ... క్లాసులు ఎగ్గొట్టిన రోజులను గుర్తు చేస్తున్నారు ఈ ఇద్దరు మిత్రులు.

బాలీవుడ్ మూవీ అభిమానుల కోసమే ఈ యాప్‌కు రూపకల్పన చేసినా... రివ్యూలు చదివి, రేటింగులు చూసి సినిమాలకు వెళ్లేవారికీ ఈ యాప్ చాలా ఉపయోగపడుతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై సినిమాలకు రేటింగులు ఇచ్చే ప్లాట్‌ఫాం డిజైన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది ఫ్యాన్‌మేంగో.

“ప్రస్తుత రోజుల్లో ప్రజలు అన్నీ జర్నీల్లోనే పూర్తి చేసుకుంటున్నారు. జీవితం-పని... ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగే స్థాయి కూడా దాటిపోతోంది. అప్పుడప్పుడూనో, తరచుగానో సినిమాలు చూసేవారున్నారు. అసలు సినిమా చూడ్డం తప్ప మనకో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు. ఇలాంటి ఎంజాయ్‌మెంట్ టైంలో మనకు నచ్చినది, కావాల్సినది చూసే అవకాశమిచ్చేదే మా యాప్” అంటారు అశుతోష్.

“సినిమా చూశాక మూడు గంటలు వేస్ట్ అయిందని బాధపడ్తూ ఉంటారు చాలా మంది. తమ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్నామని అనుకుంటుంటారు. అలాగే అదే టైంలో వేరే మంచి సినిమాని మిస్ చేసుకున్నామని బాధ పడేవాళ్లు మరికొంతమంది. ఇలాంటివన్నీ ముందే నిర్ణయించుకుని ఇచ్చిన రేటింగ్స్, క్రిటిక్స్ ఆధారంగానే జరుగుతాయ”ని అన్నారు అశుతోష్.

ఫ్యాన్‌మేంగో స్పెషాలిటీ ఏంటి ?

మూవీ క్రిటిక్స్, రివ్యూస్ విభాగంలో ఫ్యాన్‌మేంగో ఓ సంచలనం అంటారు దీన్ని రూపొందించినావరు. పబ్లిక్‌కి రివ్యూలు రాసే అవకాశమిచ్చిన మొదటి మొబైల్ యాప్ ఇదే అని చెబ్తారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న హిందీ సినిమా అభిమానులైనా రివ్యూలు రాసే ఛాన్స్ ఇస్తోంది ఈ యాప్.

“ హిందీ సినిమా రేటింగులకు మా యాప్ ఓ గూగుల్ లాంటిది. నిష్పక్షపాతమైన రివ్యూలు ఇచ్చేది మేమే. అది కూడా ఆ సినిమాల ఫ్యాన్స్ నుంచి నేరుగా అందిస్తున్నాం” అంటున్నారు అశుతోష్.

ఫ్యాన్‌మేంగో యాప్‌ను ఉపయోగించడం చాలా తేలిక. ఫైవ్ స్టార్స్(మేంగోస్) ఉంటాయంతే.(5మేంగోలు అంటే హైయస్ట్ రేటింగ్) “తరచుగా మా యాప్ ఉపయోగించే యూజర్లకు ప్రతీవారం రివార్డులు అందిస్తుంటాం. అలాగే మా నమ్మకమైన మెంబర్లకు సర్‌ప్రైజ్ గిఫ్టులు కూడా ఇస్తాం. ఫ్యాన్‌మేంగో మొబైల్ యాప్ ద్వారా సోషల్ మీడియాతోనూ ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చ”ని చెప్పారు వరుణ్.

సోషల్ మీడియా ద్వారా తమకు ప్రచారం చేసుకుటోంది ఈ స్టార్టప్. మార్కెటింగ్ విషయంలో వినూత్న ఆలోచనలతో వచ్చినవారికి ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది. ఆదాయవనరులపై పూర్తి స్థాయిలో ప్రణాళికలు లేవు వీరి దగ్గర. అయితే యూజర్ల సంతృప్తి, అనుభవాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామంటున్నారు వీరు. తమ యాప్ యూజర్లు సంతృప్తి చెందితే... ఆదాయం దానంతట అదే వస్తుందని చెబ్తున్నారు ఫ్యాన్‌మేంగో టీం.

బాలీవుడ్ సినిమాలు తీసే సంస్థలు, అనుబంధ కంపెనీలకు ఉద్దేశ్యపూర్వకంగానే దూరంగా ఉంటోందీ ఫ్యాన్‌మేంగో. నిజాయితీగా, నిష్పక్షపాతంగా రివ్యూలు ఇవ్వాలంటే... ఇది తప్పని సరి అని చెబ్తున్నారు వరుణ్, అశుతోష్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags