కుందన్ శ్రీవాత్సవను ధృడంగా మార్చిన కిడ్నాప్

విద్యావ్యవస్థపై పోరాటం చేసి కిడ్నాప్‌కు గురైనా భయపడలేదుతాను చేస్తోంది ఎంత గొప్పపనో అప్పుడు అర్థమైందికుటుంబం కోసం ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.మహిళా సాధికారతపై “బి ఇన్ హ్యుమానిటీ” ఫౌండేషన్ ద్వారా సేవలుదేశంలోనే పిన్న వయస్కుడైన సామాజిక కార్యకర్తగా గుర్తింపు

15th Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

పాతికేళ్లకే శ్రీవాత్సవకు అన్ని అవార్డులు ఎలా వచ్చాయంటే.. తాను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తన కాలికి అయిన గాయాన్ని గుర్తుచేసుకున్నారు. వారం రోజుల పాటు కిడ్నాపర్ల చెరలో బిక్కు బిక్కుమంటూ గడిపిన క్షణాలను మరువలేనంటారు. తనకు అవార్డులు రాకపోయినా ఫర్వాలేదు కానీ.. సమాజంలో మార్ప రావడం ముఖ్యమంటారు. మహిళలపై దాడులకు వ్యతరేకంగా ఓ ఉద్యమాన్నే మొదలు పెట్టారు కుందన్.


కుందన్ శ్రీవాత్సవ

కుందన్ శ్రీవాత్సవ


2004లో జరిగిన ఓ కిడ్నాప్ తన జీవితాన్నే మార్చేసిందన్నారు కుందన్ శ్రీవాత్సవ. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు చూసి తాను చలించిపోయానని అంటారాయన. ఇదే మహిళా సాధికార ఉద్యమానికి అసలు కారణంగా చెప్పుకొచ్చారు. తాను కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకుంది.. బహుశా తానీ ఉద్యమాన్ని నడపడానికేనేమో అని అభిప్రాయపడ్డారు.

ఇంజనీర్ అయిన కుందన్ శ్రీవాత్సవ ..దేశంలోనే అత్యంత పిన్న సామాజిక కార్యకర్తగా పేరొందారు. కుందన్ జన్మించింది చంపరన్ లోని రక్షావుల్ అనేది ఓ చిన్న గ్రామం. తాను చేసిన సామాజిక సేవలకు గానూ కుందన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇందులోయూనివర్సల్ హ్యుమానిటీ అవార్డ్, పితద్దిష్ లు చెప్పుకోదగినవి.

యువర్ స్టోరీతో శ్రీవాత్సవ తన జీవిత విశేషాలను పంచుకున్నారు.

విద్యావ్యవస్థపై బ్యూరోక్రసి, మాఫియాల ప్రభావం చూసి తాను పోరాటం మొదలు పెట్టినప్పుడు..కిడ్నాప్ కి గురయ్యానని కుందన్ గుర్తుచేసుకున్నారు . ఏడురోజల పాటు కిడ్నాపర్ల చెరలో ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. అదే టైంలో తనపై వాళ్లు కురిపించిన ముష్టిఘాతాలు, కాలిపై చేసిన బుల్లెట్ దాడిని తలుచుకుంటే ఒళ్లు జలదరిస్తుందని పదే పదే చెబ్తారు. అయితే అవే తన జీవితాన్ని మలుపు తిప్పాయని, తనలో గూడు కట్టుకుని ఉన్న భయం మొత్తం పటాపంచలైపోయిందని శ్రీవాత్సవ అంటున్నారు.

“ఓ ప్రత్యేక కారణం కోసం పోరాటం చేయడం ఎంత ముఖ్యమో గ్రహించాను. ఆ సంఘటన తర్వాత నాలో పోరాట పటిమకు మరింత బలం చేకూరింది ” కుందన్

ఈ ఘటన తర్వాత కుందన్ తన విద్యాభ్యాసాన్ని కొసాగించారు.ఇంజనీరింగ్ పూర్తి అయిన ఏడాదికి క్యాన్సర్ సోకి కుందన్ తమ్ముడు చనిపోయాడు. ఈ ఘటన కూడా కుందన్‌లో మార్పునకు దోహదపడింది. బాధలను మరిచిపోయేందుకు ఏదో ఒక బలమైన వ్యాపకం ఉండాలనే ఉద్దేశంతో ఫుల్ టైం సామాజికవేత్తగా మారడానికి ప్రయత్నించారు.

గ్రామాల్లో ఉన్న చిన్నారుల విద్యాహక్కుపై తన పోరాటాన్ని కొనసాగించారు. ఇది జరుగుతుండగానే ..ఇంటిలో బాధ్యతలు పెరిగిపోవడంతో ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని ‘91మొబైల్స్’ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కెరియర్ ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్నప్పుడు మహిళలపై దాడులకోసం జరగడాన్ని తెలుసుకొన్నారు. అప్పుడే ‘బి ఇన్ హ్యుమానిటీ’ ఫౌండేషన్‌కి బీజం పడింది. సమాజంలో అన్ని రంగాల్లో మహిళా సాధికారత సాధించడానికి ఈ ఫౌండేషన్ సహాయం చేస్తుంది. ఇది ఒక స్వయం సమృద్ధి సంస్థ . దీని నిర్వాహకులంతా యువకులే. ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా దీనిలో ఉన్న సభ్యులు మాత్రమే సంస్థ అవసరాలను గుర్తించి ఖర్చు చేస్తారు. తమకు వచ్చిన దానిలో కొంత మొత్తాన్ని వెచ్చిస్తారు.

పౌండేషన్ తరుపున మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేయడమే కాదు. లైంగిక దాడులు, యసిడ్ దాడులకు గురైన అమ్మాయిలను పునరావాసం కల్పిస్తారు. కట్నం వేధింపులకు గురైన మహిళలను సైతం చేరదీసి వారికి తగినంత సాయం చేస్తోందీ బీ ఇన్ హ్యుమానిటీ ఫౌండేషన్ . పునరావాస కేంద్రం నుంచి బయటకు వచ్చే మహిళలు తిరిగి సమాజంలో సాధారణ జీవితం గడపడానికి కావల్సిన శక్తియుక్తులతో పాటు సరైన మార్గదర్శకత్వం అందిస్తారు.

image


దీంతోపాటు తమ ఫౌండేషన్ ‘స్క్రీమ్స్ ఆఫ్ సౌల్’ అనే ప్రాజెక్ట్ పై పనిచేస్తోందని వివరించారు. మహిళలపై ఇలాంటి దాడులు జరక్కుండా .. సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రాజెక్ట్ చేస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వక్తలను తీసుకొచ్చి జనం మైండ్ సెట్ మారి వారిలో సామాజిక విలువలు పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు .

ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకాలంటే వాటి మూలాల నుంచి మార్పు తీమసుకురావాలి.యంగర్ జనరేషన్ పై మేం ఫోకస్ పెట్టాం . స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల్లో జండర్ ఈక్వాలిటీ తోపాటు సున్నితత్వాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారాయన.

కుందన్ ఇటీవల ‘టైటిల్ ఈజ్ అన్ టైటిల్డ్’ అనే పుస్తకాన్ని రాసారు. మన సమాజంలో ఉన్న ఉదాసీనపై ఈ పుస్తకంలో వివరించారు .

“విద్యావ్యవస్థ , మహిళాసాధికారత లాంటివి .. సమాజంలో చర్చించుకోనే విషయాలుగా కాకుండా.. నిజమైన పదాలుగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో మార్పు రావల్సిన అవసరం ఉంది,” అని కుందన్ ముగించారు.
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India