సంకలనాలు
Telugu

ఈ టెకీ బ్రెయిన్స్‌కు షార్ట్ ఫిల్మ్ ఇచ్చే కిక్కే వేరప్పా !

seshu madiraju
8th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఒక పారిశ్రామికవేత్తకి... ఒక సాధారణ వ్యక్తికీ వారి వారి జీవితాలలో ఖచ్చితమైన తేడా ఉంటుంది అని అనుకుంటాం. ఉన్నతమైన ఉద్యోగం, భారీ నెలసరి ఆదాయం, సుఖమైన నిద్ర మొదలైనవి అన్ని త్యాగం చేసిన వారే గొప్పవారని, ప్రతిభావంతులని గుర్తిస్తున్నాం. సంస్థ అధినేతగా విజయవంతంగా ఒక ప్రాజెక్ట్‌ని మొదలుపెట్టినా అనుకున్న లక్ష్యాలను వాటి యొక్క సంపూర్ణ ఫలితాలను సాధించలేక పోయినా, ధైర్యంగా అవోరధాలు ఎదురుకున్న పారిశ్రామికవేత్తలను మనం అభిమానిస్తాం.

రతేష్ కృష్ణన్

రతేష్ కృష్ణన్


కొంత మంది 9-5 ఉద్యోగ విధులకు మరియు నిర్దిష్టమైన జీతభత్యాలకి అనుగుణంగా తమ జీవిన నిర్మాణం చేసుకున్నారు. మనలో చాలా మంది ఈ ప్రపంచానికి వీలైనంత తమ వంతు కృషి చేద్దాం అనే ఉద్దేశం తో వుంటాం. కానీ కలలను సాకారం చేసుకునేంత బలం లేదా అంత ఉత్సుకత వుండవు.

రతేష్ కృష్ణన్ అవి కలిగిన వ్యక్తి. వారం చివరి రోజులో వివిధ అంశాల మీద అతను, అతడి తోటి ఉద్యోగస్తులు కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు. రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిషియన్‌లు ఇలా అందరూ కలసి షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటారు. పేరుకు తగట్టుగా వీటన్నింటినీ techie brain films (TBF) అనే సంస్థ కింద చేస్తుంటారు. 

'మా techie brain సంస్థ ముఖ్య లక్ష్యం చాలా చిన్నది. మేము తీసే ఫిలిమ్స్ స్పూర్తినిచ్చేవిగా ఉండాలి. ఇప్పటిదాకా మేము తొమ్మిది షార్ట్ ఫిలిమ్స్ తీసాం. మా 10 వ ఫిలిం ఫీచర్ కమర్షియల్ ఫిలిం అవ్వాలి అని కోరుకుంటున్నాం' అని చెప్పారు కృష్ణన్.

TBF ని ఆవిష్కరించటానికి కారణం నా ఇష్టాలను ఆలోచనలను నా సహోద్యోగులు కూడా పంచుకోవటం. నేను ఉద్యోగం చేస్తున్న సంస్థలో నాలానే ఉన్న ఒక గ్రూప్‌ని కనిపెట్టా. వారు అందరూ ఇప్పుడు మా టీమ్‌లో వర్క్ చేస్తున్నారు. ఫిలిం మేకింగ్ మమ్మల్ని అందరిని ఒకటి చేసింది. మా అందరికీ కొత్త ఆలోచనలు ఉన్నాయి అందరం మిగతా సాఫ్ట్‌వేర్ బ్యాచ్‌లా కాకుండా విభిన్నంగా ఆలోచించాలి అని కోరుకుంటాం. మేము కనీసం మా స్నేహితులకో,కుటుంబ సభ్యులకో అయినా మా ప్రతిభ చూపాలని అనుకునే వాళ్లం. అందుకోసమే మేము ఒక నిర్ణయానికి వచ్చాం.

image


రతేష్ స్కూల్, కాలేజీ చదివే రోజుల్లో నాటకాలు , మొదలైన కళల మీద మంచి గుర్తింపు పొందాడు. కానీ జీవితం అనుకునట్టుగా సాగలేదు. అందుకే చదువు తరువాత కొన్ని ఇతర కారణాల వల్ల డైరెక్టర్స్‌ని ప్రొడ్యూసర్స్‌ని కలవలేకపోయాడు. అంతటితో ఆ కలను ముగించి ఒక B.E పట్టభద్రుడిగా IT professional గా కెరీర్ ప్రారంభించాడు.

వృత్తిపరంగా నా జీవితం బాగానే సాగుతుంది కాని ఎక్కడో ఒక అసంతృప్తి ఎదో పోగొట్టుకునట్టు. ఇప్పుడు అంతా మారిపోయింది. అని చెప్పారు. ఉద్యోగ రిత్యా EDC కోసం రతేష్ బిజినెస్ డెవలప్‌మెంట్ అధికారిగా ఇండియా, ఖతార్, & యుకెలో ఒప్పందాలు కుదుర్చేవాడు. ఇందులో తన పాత, కొత్త పరిచయాలు వ్యాపారాభివృద్ధికి ఉపకరించాయని చెబుతాడు. ఆఫీస్ సమయం లో TBF కి సంబంధించిన ఎటువంటి వర్క్ చేయకూడదని వాళ్లంతా నిర్ణయించుకున్నారు. మొత్తం ప్లానింగ్, బ్రెయిన్ స్టార్మింగ్‌ సహా నిర్వహణ అంతా వారంతాల్లోనే జరిగేది. ఇంకా ఏదైనా అతి ముఖ్యమైన అర్జెంటు పనులు ఉంటే అవి లంచ్ బ్రేక్స్‌లో ముగించేసే వాళ్లు. ఒక్కోసారి వరుసగా మూడు నిద్ర లేని రోజులు కూడా ఉండేవి. కాని అలసటకు బదులుగా అందరం రెట్టింపు ఉత్సాహంతో పనిచేశామంటారు రతేష్.


బయట నుండి నిధులని TBF టీం ఆశించలేదు. మొదటి షార్ట్ ఫిలిం ప్రాజెక్ట్‌కి అందరూ కలసి ఎలా ఫండ్ చేసుకున్నారో అలాగే అన్ని ప్రాజెక్ట్స్‌కీ సొంత నిధులనే ఖర్చు పెట్టారు. కాని మొదటి ఫిలిం పెద్ద విజయం సాధించిన తరువాత ఫండింగ్ వేరే విధంగా రూపాంతరం చెందింది. మా ప్రాజెక్ట్ ఒక 1000 మంది చూస్తారేమో అనుకున్నాం. కాని అది మేము ఆశించిన దాని కన్నా ఎక్కువ అయింది. 73K కన్నా ఎక్కువ మంది చూసారు. మాకు సహాయం అందించటానికి ప్రొడ్యూసర్ ముందుకు వచ్చారు. ఇప్పుడు మా అన్ని ప్రాజెక్ట్స్ కి ప్రొడ్యూసర్స్ ఫండింగ్ చేస్తున్నారు. అందులో చాలా మంది వివిధ దేశాల్లో వున్న స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు. అని అంటున్నారు రతేష్. (ఇదే ఆ మొదటి షార్ట్ ఫిలిం)


రాబడి బాగా వస్తున్నపటికి, సంపాదన ఒక్కటే తమ TBF సంస్థ ముఖ్య ఉదేశ్యం కాదని వివరించారు రతేష్. మొదటి నుండి డబ్బు మా ప్రధాన ఉద్దేశం కాదు. మా ప్రతిభను బయటి ప్రపంచం, సినీ పరిశ్రమ గుర్తించటానికే TBF ని స్థాపించాం అని చెప్పారు రతేష్.

youtube నుండి thank you thalaiva కి మొదటి ఇన్‌స్టాల్ మెంట్ వచ్చినప్పుడు అందులో సగ భాగం సూపర్ స్టార్ రజినీకాంత్‌కి మనీ ఆర్డర్ ద్వారా పంపాం (రు 1000). ఆయన మీద మాకున్న గౌరవం తప్ప ఆయనకి ఆ 1000 రు అవసరం అని కాదు. మాకున్న ఆ గౌరవం వల్ల ఆ లాభాలను వారితో పంచుకున్నాం. ఇది చాలా చిన్న మొత్తం కావొచ్చు. కాని మేము చేసింది అనూహ్య మైనది. ఈ రోజుల్లో ప్రతీవారూ సూపర్ స్టార్ నుండి నిధుల కోసం ప్రయత్నిస్తుంటే మేము దానికి భిన్న పద్దతిని అవలంబించాం.

thank you thalaiva చాలా చిన్న బడ్జెట్‌లో చేసాం. కానీ దాని మీద రాబడి యు ట్యూబ్ నుండి పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగానే వచ్చింది. దీర్ఘకాలం లో మా ప్రాజెక్ట్స్ తప్పకుండా డబ్బుని తెచ్చిపెడ్తాయని అని నమ్ముతున్నామనేది టెకీ బ్రెయిన్స్ మాట.

image


దీని వల్ల ఆర్ధికంగానే కాక ఎన్నో ప్రయోజనాలు కనపడ్డాయి. అందులో ముఖ్యమైనది సభ్యుల మధ్య అవగాహనా మరింత బలమైంది. వారంతాలు మేము కొత్తగా, భిన్నంగా చేస్తుండడంవల్ల మా రోజు వారి ఉద్యోగ విధులలో కూడా ఎంతో ఉత్సాగందా ఉండగలిగే వాళ్ళం. ప్రతి సభ్యుడి యొక్క బలాలను, వారి ప్రత్యేకతలను మరియు పని తీరును ప్రతి ఒక్కరం బాగా అర్ధం చేసుకోగాలిగేవాళ్ళం. వాటికి మించి మాలో అంతర్గతమైన సృజనాత్మక శక్తి మరింత పెంపొందించడానికి, మా దిన వారి ఉద్యోగ విధి నిర్వహణలో మేము ఉత్సహంగా ఉండటానికి ఇది ఇంకా బాగా సహాయం చేసిందిమ అని చెప్పారు రాతేష్.

ఎన్నో ప్రశంసలు అందినప్పటికీ పనులు సులువుగా జరగలేదు, అన్ని సదుపాయాలూ కలిగినటువంటి స్టూడియోల కొరత సంపూర్ణ నాణ్యత కలిగిన పని అందించాలని మేము చేస్తున్న కృషి అన్వేషణలలో అవరోధం గా ఏర్పడింది. షూటింగ్ మరియు డబ్బింగ్ పరికరాలు అత్యధిక సంఖ్య లో బాడుగకు తీసుకోవాల్సి వచ్చేది, అని చెప్పారు.

TBF లో సభ్యత్వం వల్ల నా జీవితం చాల ప్రభావితం అయ్యింది. అందువల్ల అధిక శ్రమని, అలసట , సరిపోయేంత ధనం మరియు సమయం లేకపోవటం వంటి వాటికి నేను ఎప్పుడు బాధపడలేదు. సినీ పరిశ్రమకు చెందినా వారు మా శ్రమని గుర్తించటం మేము మర్చిపోలేనిది. మా మొదటి వర్క్ THANK YOU THALAIVA బెంగుళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది. గడిచిన నెలలో ఇండియన్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఇండియన్ షార్ట్ ఫిలిం గా బ్యాక్ టు స్కూల్ స్పెషల్ జ్యూరి అవార్డు ని గెలుచుకుంది.

‘కలలను సాకరం చేసుకుని విజయం సాధించడానికి ఏ క్షణమైనా శుభ గడియే’- అని జీవితం లో రెండు పూర్తి విభిన్నమైన వృత్తులు విజయవంతంగా నిర్వహిస్తున్న రాతేష్ ఒక మంచి అర్ధవంతమైన సలహాని పంచుకున్నారు.


 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags