సంకలనాలు
Telugu

ప్రసవాన్ని పరిశుభ్రంగా మార్చడమే ఈమె లక్ష్యం !

'జన్మ' బర్త్ కిట్‌కు శ్రీకారం చుట్టిన జరీదానాలుగేళ్లలో ఐదు మిలియన్ కిట్స్ తయారీ

sudha achalla
18th Jun 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

కష్టే ఫలి అంటారు జుబాయిదా బాయి. ఆటుపోట్లు ఎన్నొచ్చినా ధైర్యం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే ఏదైనా చేయవచ్చని నిరూపిస్తున్నారు. కృషి, పట్టుదలతో చెన్నై నుంచి భారత్, ఆఫ్రికా దేశాల్లో ' జన్మ' ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.

జుబాయిదా బాయి

జుబాయిదా బాయి


మీరు చూస్తున్న ఈ మహిళ పేరు జుబాయిదా బాయి.. చెన్నై లోని మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన, ఈమె మహిళలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లును అధిగమించారు. చిన్నప్పుడు తల్లి రోజు వారి కష్టపడి పనిచేయడాన్ని గమనించింది. జుబాయిదా బాయికి కుటుంబ సభ్యులతో పాటు కజిన్స్, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి తోడ్పాటు రాకపోవడంతో...ఆమెకు చదువు మధ్యలోనే నిలిచిపోయింది. మరో వైపు కుటుంబపరంగా ఆర్ధిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. అయితే పరిస్థితులను చూసి కుంగిపోకుండా... పట్టువదలని ధైర్యంతో వంటింటి గిన్నెలు పట్టుకోవడం మానేసి, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకోగలిగారు. తర్వాత మెరిట్ స్కాలర్‌షిప్‌తో స్వీడన్ మినాస్ యూనివర్శటీ నుంచి (ఉత్పత్తి అభివృద్ధి ,డిజైన్) ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.

బాయి, 24వ సంవత్సరంలో హబీబ్ అన్వర్‌ను వివాహం చేసుకుని కెనడాకు వెళ్లారు. కానీ అన్వర్ పనిచేసిన కంపెనీ భారత్‌లోని చైన్నైలో యూనిట్ ఏర్పాటు చేయడంతో తిరిగి భారత్‌కు వచ్చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె గ్రామీణ ఆవిష్కరణలు చేస్తున్న రూరల్ ఇన్నోవేషన్స్ నెట్వర్క్ (RIN)తో చేయికలిపారు. రూరల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ లాభాపేక్ష లేని సంస్థ. ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ...వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు Villgro గా పిలిచే ఈ సంస్థ ప్రాజెక్టులు ఆర్ధికంగా ఎంత వరకు సాధ్యమవుతుందో పరిశీలిస్తుంది. RIN సాయంతో తాను అనుకున్నట్లుగా ఎదగవచ్చని భావించిన జరీదా..గ్రామీణ మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకొనే విధంగా కొత్త ఉత్పత్తి ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా భర్త ఆర్ధిక సాయంతో ఉత్పత్తుల ఆవిష్కరణకు తెర తీశారు.

ఇలా అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నప్పుడు.. అన్వర్ తల్లి మరణంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే బోస్టన్‌లో ప్రొఫెసర్‌తో సమావేశం కావాల్సి వచ్చింది. మరో వైపు కొలరాడోలోని విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏలో సోషల్ అండ్ సస్టైనబుల్ ఎంటర్ప్రైజెస్‌లో స్పెషలైజేషన్ చేశారు. ఆమె వ్యాపార ప్రణాళిక లో భాగంగా పలు ఉత్పత్తులను పరీక్షించడానికి ఫీల్డ్ ట్రిప్ చేసేవారు. అయితే ఆమె ప్రసవ సమయంలో ఆసుపత్రిలోని అపరిశుభ్రమైన పరిసరాలు, అన్ స్టెరైల్ పరికరాలు వాడడాన్ని గమనించారు.

స్వానుభవమే ఈ సామాజిక వ్యాపారానికి కారణమైంది

క్రిమిసహిత పరికరాలు ఉపయోగించడంతో బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఇన్ఫెక్షన్‌తో ఎంతో ఇబ్బంది పడ్డారు. పూర్తిగా రికవర్ కావడానికి ఏడాదికి పైగా కాలం పట్టింది. దీంతో ప్రాక్టికల్‌గా సమస్య ఎదుర్కొన్న ఆమె, దీన్నే వ్యాపారంగా ఎందుకు మార్చకోకూడదు అని ప్రశ్నించుకున్నారు. బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రంగంపై దృష్టి సారించాలని భర్తకి సూచించారు.

వెంటనే 2009 లో యూఎస్‌లో 'ఆయిజ్' అనే సంస్థ ఏర్పాటు చేసి...మెటర్నల్ హెల్త్ రంగంలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్‌లో కో ఫౌండర్‌గా భర్త అన్వర్ వ్యవహరిస్తున్నారు. ఈ రంగంపై స్టడీ చేసిన వీరద్దరికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని తెలుసుకున్నారు. అయితే దానిపై ప్రాక్టికల్‌గా పరిశోధన చేసిన వారికి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్ట్, ఆరోగ్యకార్యకర్తలు, గ్రామాల్లో ఉండే పెద్దలతో తమ ఉత్పత్తులపై చర్చించారు. అప్పుడు వాళ్లు గమనించిన నిజం ఏంటంటే పేద ప్రజలు ఖర్చు భరించడం కష్టమని గ్రహించారు. శుభ్రమైన స్టెరిలీటి కొనుగోలుకు అవసరమైన ఆర్ధిక పరిస్థితి లేదని అన్వర్, జరీదా సర్వేలో తేలింది. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసిన జరీదా టీమ్ 'జన్మ' క్లీన్ బర్త్ కిట్‌కు శ్రీకారం చుట్టారు. సురక్షితమైన పరిశుభ్రమైన పరికరాలతో ఉండే ఈ కిట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా తయారైంది. కిట్‌లో పర్యావరణానికి హాని కల్గించని పరికరాలు ఉన్నాయి.

ఇదే క్లీన్ బర్త్ ప్రెగ్నెన్సీ కిట్ 'అయిజ్'

ఇదే క్లీన్ బర్త్ ప్రెగ్నెన్సీ కిట్ 'అయిజ్'


నగలను తాకట్టుపెట్టి మరీ ముందుకు దూకాం

అంత వరకు మేము కష్టపడి అన్వేషించిన ప్రయత్నానికి ఫలితం దక్కిందంటారు జరీదా. వెంటనే అప్పటి వరకు దాచిన సేవింగ్స్‌తో పాటు... నగలన్ని తాకట్టు పెట్టి చెన్నై శివార్లలోని కుడుంబాక్కం గ్రామంలో యూనిట్ ఏర్పాటు చేశారు. మేము JANMA కిట్ తయారీకి స్థానికంగా ఉండే మహిళలకే ఉపాధి అవకాశం కల్పించాము. మార్కెటింగ్ ప్రయత్నాలు పెద్దగా చేయనప్పటికి భారత్‌లోనే ఏకంగా 50 వేలకు పైగా కిట్స్ అమ్మగలిగామని అంటారు. హైతీ, ఆఫ్గనిస్తాన్, ఆఫ్రికాలో అనేక దేశాల్లో కిట్స్‌కు మంచి డిమాండ్ ఉంది. జన్మ కిట్స్‌ను ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థలలతో పాటు వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. జన్మ, Ayzh తో పాటు ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. న్యూ బార్న్ కిట్ జన్మ (ప్రోటోటైపు 1,000 యూనిట్లు విక్రయం), రక్తస్రావం కిట్, మహిళలకు పారిశుధ్యంలో పరిష్కారానికి సంబంధించి (పరిశోధన, డెవలపింగ్ ) స్టేజీలో ఉన్నాయి. గృహ నీటి వడపోత (ప్రోటోటైపు, 100 యూనిట్లు విక్రయాలు) పూర్తి చేశారు.. ఓ వైపు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తూనే మరిన్ని పరిశోధనలు సాగిస్తున్నారు.

2014 ఆగష్టులో సంస్థ నిధుల కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా... Indiegogo సాయంతో, ఉత్పత్తి కోసం 50,000 డాలర్లుసేకరించారు. ఈ నిధులతో తాము చేసిన ఉత్పత్తుల పై విశ్లేషణకు అవకాశం దొరికింది. అంతే కాకుండా గ్రామాల్లో ఉండే ఆరోగ్య కార్యకర్తలకు మొబైల్ ఫోన్లలో వాయిస్ సందేశాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం ప్రారంభించారు. 'Indiegogo' తదితర సంస్థల నుంచి సేకరించిన నిధులతో ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి తోడ్పడింది. మేము రెండు వినూత్న కార్యక్రమాలతో అదనపు $50,000 నిధులు సమకూర్చడానికి నిర్ణయించుకున్నాము. ఇదే సమయంలో ఉత్పత్తి అమ్మకాల డిమాండ్ అనుసరించి... క్లీన్ బర్త్ కిట్ తయారు చేశాము. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అప్ డేట్ టెక్నాలజీతో కొత్త వినియోగదారుల కోసం ఛేంజ్ మేకర్స్ అనే పథకాన్ని తీసుకొచ్చాము. ప్రతీ తల్లి, చిన్నారికి సురక్షితమైన పుట్టుకకు అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో గ్లోబల్ ఉద్యమం ప్రారంభించామంటారు "బాయి.

దేశవిదేశాలకు అయిజ్

2010 లో స్థాపించబడిన అయిజ్ సంస్థలో ఎనిమిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు భారత్, సౌతాఫ్రికా కార్యకలాపాలను అన్వేషిస్తుంటారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా మాతో కలిసి పనిచేయడానికి కొంత మంది ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సేల్స్ పెంచడం, పైలెట్ ప్రాజెక్టుగా కొత్త ఉత్పత్తులు తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించారు. ఇంకా "ప్రతిష్టాత్మక అమ్మకాల లక్ష్యాలను చేరుకోవడానికి, బ్రేక్ఈవెన్ పాయింట్ కోసం భారత్‌తో పాటు ఆఫ్రికాలో ప్రొడక్షన్, పంపిణీల కోసం ప్రాంతీయ కేంద్రాలు ప్రారంభిస్తున్నామంటారు జరీదా. వచ్చే ఐదేళ్లలో మా ప్రాధమిక ఉత్పత్తి పై దృష్టి పెట్టి అమ్మకాలు పెంచాలనుకుంటున్నారు. ఉత్పత్తి, పంపిణీల కోసం ayzh తక్కువ ఆదాయం ఉన్న మహిళా ఉద్యోగులను భాగస్వాములను చేయనుంది. అంతే కాదు ఫ్రాంచైజీ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఉత్పత్తులు తయారు చేసి స్థానిక మహిళలే రీజనల్ మార్కెట్లో వినియోగదారులకు పంపిణీ చేసే విధంగా మార్కెట్‌ను ఆయిజ్ సేల్స్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

జన్మ్ కిట్లతో సిబ్బంది

జన్మ్ కిట్లతో సిబ్బంది


అవగాహన లేకపోవడమే పెద్ద సవాల్

కొత్త సంస్థ ప్రారంభించినప్పుడు కాని, నిధుల గురించి గాని మేము ఎప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, మహిళలకు ఇన్ఫెక్షన్ గురించి తెలియచేయడానికి ఎంతో కష్టపడుతున్నాము. శుభ్రంగా లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో అటు తల్లి, ఇటు శిశువు మరణాలకు కారణమవుతున్నారు. ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసిన ఆశించినంత మార్పు రావడం లేదని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నారు.. అయితే ఆయిజ్ సంస్థ 'జన్మ' ను తక్కువ ఖర్చుతో హై క్వాలిటీ టెక్నాలజీతో తక్కువ ధరలకు అందించడం ద్వారా ప్రచారానికి నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ప్రచారం కొంత వరకు ఉపయోగపడుతుందని జరీదా చెబుతారు.

భారతదేశం లో ప్రతి ఏడాది సుమారు 2 కోట్ల జననాలు జరుగుతున్నాయి. దేశంలో ఇంత పెద్ద మార్కెట్ ఉన్నా.. కంపెనీ ఉత్పత్తులు మాత్రం అనుకున్న స్థాయిలో జరగడం లేదు. మా రూట్ మ్యాప్ సక్సెస్ అయితే ఊహించనంత ఆదాయం ఉంటుంది. రానున్న 5 సంవత్సరాలలో మార్కెట్ లో ఏకంగా ఐదు మిలియన్ ఉత్పత్తులు తీసుకురావడం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2018 నాటికి దేశంలో 2.5 కోట్ల మంది పిల్లలు పుట్టవచ్చని అంచనా. ముఖ్యంగా మహిళలు సేఫ్ బర్త్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు మహిళలు, కుటుంబాలకు శుభ్రత అవసరాన్ని వివరించాలి. ఇంత చేస్తున్నా... చేయాల్సిన పని మా ముందు చాలా ఉందంటారు జరీదా. అంతే కాదు రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పిన విషయాన్ని తన అనుభవం ద్వారా గుర్తు చేస్తుంటారు.

website

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags