ఫోటోగ్రఫీలో 18 ఏళ్లకే వోగ్‌ను వావ్ అనిపించిన సాషా జయరాం

అతిచిన్న వయస్సులో మంచి ఫోటోగ్రాఫర్ గా గుర్తింపువోగ్ మ్యాగ్జైన్ నుంచి వావ్ అనిపించే ఆఫర్ప్రతీ ఫోటో తనకు ప్రత్యేకమే అంటున్న సాషా

ఫోటోగ్రఫీలో 18 ఏళ్లకే  వోగ్‌ను వావ్ అనిపించిన సాషా జయరాం

Thursday April 02, 2015,

2 min Read

అదృష్టం తలుపు తడితే ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణ సాషా జైరాం. ఆ అమ్మాయి 18 ఏళ్ల వయస్సుకే ప్రపంచ ప్రముఖ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ వోగ్‌లో పర్మినెంట్‌ ఉద్యోగాన్ని కొట్టేసింది. బ్రిటన్‌కు చెందిన ఈ ప్రముఖ మ్యాగజైన్‌ ప్రింట్‌ మీడియాలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది. అంతచిన్న వయస్సులో అంత పెద్ద సంస్థను ఎలా ఆకర్షించావంటే.. 'చదువులో భాగంగా నేను ఫొటోగ్రఫినీ ఎంపిక చేసుకున్నాను. అంతే తప్ప దానిపై నాకు ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదు. కానీ క్రమక్రమంగా ఒక మంచి ఫొటోగ్రాఫర్‌గా నన్ను నేను చూసుకోవాలనే ఆసక్తి బలపడింది. అదే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది' అంటుంది. 

ఫొటోగ్రఫీ రంగంలో సాషా జైరాంకు తనకంటూ ఒక స్థానం ఉంది. ఫేస్‌బుక్‌ నుంచి మ్యాగజైన్‌లో ఫొటోల వరకు ఆమె తీయనిదంటూ లేదు. ఒకరోజు తన మెయిల్‌ బాక్స్ చూసుకున్న సాషా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే వోగ్‌ మ్యాగజైన్‌ నుంచి వచ్చిన ఉద్యోగావకాశం చూసి ఎగిరిగంతేసింది. ఫొటోగ్రఫి రంగం నాకు నేర్చుకునే అనుభవంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిందని గర్వంగా చెప్తుంది. చిన్నవయస్సులో వచ్చిన ఈ ఉద్యోగావకాశం నా కాళ్లపై నేను నిలబడటానికి, సంపాదించటానికి ఎంతో ఉపయోగపడుతుందని సాషా ధైర్యంగా అంటుంది. ఫొటోగ్రఫికి సంబంధించి అవసరమైన అన్ని పరికరాలనూ ఆమె సొంత డబ్బులతోనే కొనుగోలు చేసేది. 'ఎవరికి కావాల్సింది వారి కష్టార్జితంతో కొనుక్కుంటే ఉండే ఆనందం అంతా ఇంతాకాదు' అనేది తన మాట. ఈ విషయంలో సాషా సంతోషపడటమే కాదు ఆమె తల్లిదండ్రులూ గర్వించేలా చేసింది. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఫొటోగ్రాఫర్‌ కార్ల్ లాజర్‌ఫెల్డ్ పేరు తెలియని వారుండరు. సాషాకు కార్ల్ అంటే మామూలు అభిమానం కాదు. ప్రతినిత్యం ఆయన ఫొటోల ను చూస్తూ ఏదో ఒక కొత్త కోణం కనుగొంటూ స్ఫూర్తి పొందుతూనే ఉంటుంది. ఫ్యాషన్‌, ఫైన్‌ ఆర్ట్ ఫొటోగ్రఫీలపై కూడా ఆమె దృష్టి కేంద్రీకరించింది. ఆమె పొందిన స్ఫూర్తి ఏ పాటిదనేందుకు ఆమె పనితనమే నిదర్శనం. ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రస్తుతం మునిగితేలుతున్న ఈ యువ ఫొటోగ్రాఫర్‌ వోగ్‌ ఇటాలియా, హార్పర్స్ బజార్‌, ఇతర ఫీచర్లలో పని మొదలుపెట్టింది. 'దేన్ని ఫొటో తీయాలనుకుంటారో దానిని క్లిక్‌ మనిపించండి. ప్రతిక్షణం విలువైనదే. నేను ఎంచుకున్న రంగంలో నాకు వస్తున్న అవకాశాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఈ రంగంలో ఎటువంటి పక్షపాత ధోరణులకు అవకాశం లేదు' అని ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఆమె సూచించారు. చివరగా సాషా తన తల్లి గురించి చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరం. మా అమ్మ అభ్యాసం చేయని ఆర్టిసు. నాకు స్ఫూర్తి కలిగించే వాళ్లలో అత్యంత ముఖ్యమైంది అమ్మేనని సాషా ఆనందంతో చెప్తుంది. ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ కోసం త్వరలో లండన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌కు వెళ్లనున్న యువ ఫొటోగ్రాఫర్‌ మరిన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఈ విభిన్న రంగంలో ఎంతో ఎత్తుకు చేరాలని మనమూ కోరుకుందాం.

సాషా జైరాం ఫోటోగ్రఫీ

సాషా జైరాం ఫోటోగ్రఫీ


సాషా జైరాం

సాషా జైరాం