Telugu

వైద్య రంగంలో దోపిడీకి మగ్గురు IIT డ్రాపవుట్ల అడ్డుకట్ట

యాప్ ద్వారా హెల్త్ కేర్ రంగంలో సేవలందిస్తున్న బాంబే ఐఐటీ డ్రౌపౌట్స్మెడ్.ఇన్ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా పేషెంట్లకు సేవలు ఇండోర్‌లోని డయోగ్నస్టిక్స్, హాస్పిటల్స్ వివరాలు అందిస్తున్న సంస్థఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు 20% వరకు డిస్కౌంట్పేషంట్లకు ల్యాబ్స్, మెడిసిన్స్ కొనుగోలులో సాయం కోసం కాల్ సెంటర్ ఏర్పాటుప్రమాణాలు, నాణ్యత కలిగిన ల్యాబ్‌ల వివరాలు అందిస్తున్న మెడ్.ఇన్త్వరలోనే ముంబైకి సంస్థ సేవలు విస్తరణ

GOPAL
31st Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ప్రైవేట్ వైద్య రంగంపై ప్రభుత్వ దృష్టి సారించకపోవడంతో హాస్పిటల్స్, డయోగ్నస్టిక్ సెంటర్లు పేషంట్లను నిలువు దోపిడీ చేస్తున్నాయి. చిన్నపాటి రోగమొచ్చినా వేలకు వేలు గుంజుతున్నాయి. ఈ దోపిడీని అరికట్టేందు ముగ్గురు బాంబే ఐఐటీ డ్రాపౌట్స్, కార్నెగి మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఓ యాప్‌ను రూపొందించారు. యాప్ ద్వారా మధ్యప్రదేశ్‌ రాజధాని ఇండోర్‌లో పేషంట్లకు తక్కువ ధరకే వైద్య సేవలు అందేలా చేస్తున్నారు.

దేశంలో డయోగ్నస్టిక్ టెస్టులు, మెడిసిన్ల ఖర్చు చాలా ఎక్కువ. డయోగ్నస్టిక్ ల్యాబ్స్, హాస్పిటల్స్ గురించి సరైన అవగాహన లేకపోతే, యోగ్యతలేని డాక్టర్లు పేషంట్లకు చక్కలు చూపిస్తారు. కానీ పట్టణాల్లోని హాస్పిటల్స్, ల్యాబ్స్ గురించి పేషంట్లకు మంచి అవగాహనుంటే ? ఎలాంటి సమస్యలు ఉండవు. ఇదే ఆలోచన వచ్చింది ముగ్గురు బాంబే ఐఐటీ డ్రాపౌట్స్‌కు. కార్నెగి మెలన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థితో కలిసి ఆ ముగ్గురు www.medd.in పేరిట మొబైల్ అప్లికేషన్‌, వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇండోర్‌లో ఉన్న హాస్పిటల్స్, ల్యాబ్స్ వివరాలతోపాటు ఆన్‌లైన్‌లో టెస్టుల కోసం స్లాట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్ ఇచ్చే సదుపాయాన్ని కూడా ఈ అప్లికేషన్ ద్వారా కల్పించారు. ఈ మొబైల్ యాప్ పైలెట్ ప్రాజెక్ట్‌ను ఈ నలుగురు ఇటీవలే ఇండోర్‌లో ప్రారంభించారు. త్వరలోనే ఈ సేవలను ముంబైకి కూడా విస్తరించాలనుకుంటున్నారు.

మెడ్.ఇన్ ఫౌండర్లు, కీలక ఉద్యోగులు

మెడ్.ఇన్ ఫౌండర్లు, కీలక ఉద్యోగులు


గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, అవి అందిస్తున్న సేవలే కాదు.. నగరంలోని ఇతర ల్యాబ్‌లలో ఎలాంటి సేవలున్నాయి.. ఈ సంస్థల మధ్య వ్యత్యాసాలను, ధరలలో తేడాలను కూడా మెడ్ యాప్ వివరంగా కస్టమర్లకు అందిస్తున్నది. దేశంలో వైద్య రంగంపై ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేకపోవడంతో రోగులతో వైద్యులు, ఆస్పత్రులు టెస్టుల పేరిట ఆటలాడుకుంటున్నాయి. ఈ యాప్ ద్వారా చక్కటి సేవలను అందుకోవడమే కాదు, రిపోర్ట్‌లను కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా చూసుకునే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ కొనుగోలుపై డిస్కౌంట్ సౌకర్యాన్ని కూడా ఈ యాప్‌లో పొందుపర్చనున్నారు.

ఈ యాప్ ఎలా పనిచేస్తుంది ?

ఈ యాప్ సేవలను పొందాలంటే ముందుగా మెడ్.ఇన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే www.medd.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. రక్త పరీక్షలు, ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్, సోనోగ్రఫీ, ఈసీజీ వంటి టెస్టుల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది మెడ్.ఇన్ కస్టమర్లకు. వెబ్‌సైట్‌లో వివిధ రకాల ఆప్షన్లలో తమకు నచ్చిన ఆప్షన్‌ను కస్టమర్లు ఎంపికచేసుకోవాలి. టెస్టులు, ల్యాబ్స్‌, హాస్పిటల్స్ మధ్య వ్యత్యాసాలు, ధరల్లో తేడాలు, గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, లోకేషన్, యూజర్ రివ్యూస్, ఇతర సౌకర్యాల పేరిట పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ యాప్, వెబ్‌సైటే కాకుండా టెస్టులు, మెడిసిన్ల కొనుగోలులో సాయం కోసం వీరు ఓ కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఫోన్ ద్వారా కూడా వీరు సేవలు అందిస్తున్నారు.

ఇండోర్ పట్టణం మొత్తం కవర్ అయ్యేలా దాదాపు 20 సెంటర్లను వీరు ఎంపిక చేశారు. సెంట్రల్ ల్యాబ్, డాక్టర్ లాల్‌పత్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, ఎక్స్ రే ల్యాబ్స్, మెడాంట, సన్యా డయోగ్నస్టిక్స్, మాల్వా డయోగ్నస్టిక్స్, డాక్టర్ శ్వత నగర్స్ రేడియోలజీ లాంటి సెంటర్లను మెడ్.ఇన్‌లో పొందుపర్చారు.

హోలామెడ్ హెల్త్‌కేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదే ఈ మెడ్.ఇన్. దీన్ని అర్పిత్ కోఠారి, అనురాగ్ ముందాడ, ఆకాశ్ దీప్ సింగాల్... ఇరా ద్వివేదీతో కలిసి ప్రారంభించారు.

విస్తృత పరిశోధన

ఈ రంగంలో ప్రవేశించే ముందు ఈ నలుగురు విస్తృతంగా పరిశోధన చేశారు. లక్ష మంది పేషంట్లకు చెందిన ఆరోగ్య రంగ ఖర్చుల గురించి వివరాలు తెలుసుకున్నారు. వీరి పరిశోధన ఈ ఏడాది జనవరిలో పూర్తి చేశారు. ఆ వివరాలను వరల్డ్ కాంగ్రెస్ ఆన్ పబ్లిక్ హెల్త్, డబ్ల్యుహెచ్‌ఓ, యూఎన్ పబ్లిక్ హెల్త్ కాన్ఫరెన్స్‌లలో ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌ను మార్చిలో రూపొందించారు. ఈ స్టార్టప్‌కు అజిత్ ఖురానా నుంచి ఏప్రిల్‌లో సీడ్ ఫండింగ్ లభించింది. మే నేలలో కంపెనీని రిజిస్టర్ చేయగా, జూన్‌లో ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ఆవిష్కరించారు.

మెడ్‌.ఇన్‌లో మొత్తం ఏడుగురు కీలక ఉద్యోగులున్నారు. వీరంతా రెండు నెలలుగా జీతం తీసుకోకుండా అవిశ్రాంతంగా యాప్‌ను డెవలప్ చేసేందుకు కృషి చేస్తున్నారు. బాంబే ఐఐటీ డ్రాపౌట్స్ ముగ్గురూ తమ పాత ఉద్యోగాలకు రాజీనామా చేసి మొబైల్ యాప్‌ను డెవలప్ చేసేందుకే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు.

‘‘డాక్టర్ అపాయింట్‌మెంట్ బుకింగ్‌లా కాకుండా డయోగ్నస్టిక్స్, మెడిసిన్స్‌లలో ఆదా చేసేందుకు అవకాశముంటుంది. అయితే సరైన గుర్తింపు, ప్రమాణాలు లేని డయోగ్నస్టిక్స్ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఈ ల్యాబ్స్, ఈ ఫార్మసీలు ఎలాంటివో సాధారణ కస్టమర్లు గుర్తించడం అంత సులభం కాదు. భారత్, ఇథియోపియాలలో డయోగ్నస్టిక్స్ సెంటర్లలో కన్సల్టెన్సీ ప్రాజెక్ట్‌లలో పనిచేశాను. ఈ రంగంపై మంచి అనుభవముంది. ఐఐటీ బాంబేలో ఉండగా సీ-యూజ్ కోసం రీసెర్చ్ ప్రారంభించాను. దీన్ని అనురాగ్‌తో కలిసి మరింత ముందుకు తీసుకెళ్లాను. ఇరా, ఆకాష్‌లు ఏప్రిల్‌లో మాతో చేరారు. డాక్టర్ వినితాలాంటి అనుభవం కలిగిన వైద్యులు మాకు ఫెసిలిటేటర్‌గా ఉండటం మాకు కలిసొచ్చే అంశం’’ అని మెడ్.ఇన్ వ్యవస్థాపకుడు అర్పిత్ కొఠారి వివరించారు.

‘‘ఒక నగరంలోనే డయోగ్నస్టిక్స్ ల్యాబ్‌ల ధరలు, సౌకర్యాలలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఓ టెస్ట్‌కు ఓ ప్రామాణిక ధర అంటూ లేకుండా పోయింది. ఉదాహరణకు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో ఓ టెస్ట్‌కు రూ.250 రూపాయలు తీసుకుంటే, సరైన వసతులులేని ల్యాబ్‌లో దానికి రూ.500 చార్జ్ చేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో పేషంట్ల అటు డబ్బును, ఇటు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు’’ అని మరో ఫౌండర్ అనురాగ్ చెప్పారు.

‘మా యాప్ ద్వారా పేషంట్ల కష్టాలు తీరుతాయి. మెడికల్ బిల్స్‌ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది’’ అని ఆకాష్ దీప్ సింగాల్ అన్నారు. సంస్థలో ల్యాబ్‌లను రిజిస్టర్ చేసుకునేందుకు ఎన్‌ఏబీఎల్ లేదా నేషనల్ ల్యాబ్ చైన్స్ సంస్థలు పాటించే ప్రమాణాలను పాటిస్తున్నదీ మెడ్.ఇన్. నాణ్యత, ప్రమాణాలను పాటించే ల్యాబ్‌లకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది.

‘‘మా అప్లికేషన్ ఎంతో వేగంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా సులభంగా యాక్సెస్ ఉంటుంది. ఇతరులతో పోలిస్తే మేం ఉపయోగించిన టెక్నాలజీ చాలా సులభమైనది’’ అని ఇరా ద్వివేది చెప్పారు. ఈ జూన్‌లో ఆవిష్కరించినప్పటికీ తొలి నెలలోనే ఐదువందల మందికిపైగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

‘‘మేం ఇండోర్‌కు చెంది ఉండటంతో మా టెస్టింగ్ ప్రాజెక్ట్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించాం. మా తర్వాతి గమ్యం ముంబై’’ అని అర్పిత్ తెలిపారు.

మరో ఐదేళ్లలో దేశంలో హెల్త్‌కేర్ మార్కెట్ విలువ 280 అమెరికన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ రంగంలో తమ యాప్, వెబ్‌సైట్ చక్కటి ఫలితాలు సాధిస్తుందని ఈ సంస్థ ఫౌండర్లు ఆశిస్తున్నారు. పేదలకు ఉపయోగపడే సేవలు చేస్తున్న ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.

వెబ్‌సైట్: http://www.medd.in/

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags