జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభోత్సవం

జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభోత్సవం

Tuesday June 20, 2017,

1 min Read

జీఎస్టీ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సెలబ్రేషన్స్ కు ఉప రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ప్రధానులు, పలు రాష్ట్రాల సీఎంలు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు హాజరు కానున్నారు.

image


ఇప్పటికే కేరళ, జమ్మూకాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు ఎస్ జీఎస్టీని ఆమోదించాయని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కేరళ ఈ వారంలోనే బిల్లును ఆమోదిస్తుందని, జమ్మూకాశ్మీర్ కోసం ప్రత్యేక చట్టం చేయాల్సి ఉందన్నారు. జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు అరుణ్ జైట్లీ. ఇందుకోసం జూన్ 30న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా జీఎస్టీని ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, ప్రధాని మోడీతో పాటూ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధానులు మన్మోహన్, దేవగౌడ, అన్ని రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, అధికారులు కూడా పాల్గొంటారని జైట్లీ తెలిపారు.

జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్న జైట్లీ.. ఇప్పటికే 81 శాతానికి పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. తొలి రెండు నెలలు ఐటీ రిటర్స్ ఫైల్ చేసే వారికి ఎలాంటి పెనాల్టీలు ఉండబోవన్నారు. అయితే జీఎస్టీ కారణంగా తాత్కాలికంగా కొన్ని సవాళ్లు ఎదురువుతాయన్న విషయాన్ని జైట్లీ ఒప్పుకున్నారు. కానీ క్రమంగా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్నారు. జీఎస్టీ వ‌ల్ల జీడీపీపై పాజిటివ్ ప్రభావం ఉంటుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.