దశాబ్దాల అనుభవం నుంచి పుట్టిన బడ్జెట్ హోటల్స్ వేదిక 'జిప్ రూమ్స్'
ఆతిధ్య రంగంలో కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం.
రాయల్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, స్ప్రీ హోటల్స్‌తో అనుభవం.
బడ్జెట్ హోటల్ అగ్రిగేటర్‌గా 'జిప్ రూమ్స్'.
కొత్త కాన్సెప్ట్‌తో దూసుకుపోతున్న బల్జీ.
ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణీకులలో అందరి కోరుకొనే వ్యవస్థ ఒకే ఒక్క పదం ఈజీ యాక్సిస్. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రెజంట్ జనరేషన్ అంతా స్మార్ట్ ట్రావెల్ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఈ ధోరణిని గమనించి.. వెంటనే ఏమి చేయాలో ముందే నిర్ణయించుకున్నారు కేశవ్ బల్జీ. ఆయనే రాయల్ ఆర్చిడ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కో ప్రమోటర్, స్ప్రీ హోటల్స్ సిఇవో. 'సాధారణంగా టెకీగా ఉన్న నేను ఎల్లప్పుడూ మంచి ఆతిధ్యం కొరుకుంటాను. వాటితో పాటు సౌకర్యాలను కోరుకుంటాను. దానికి తగ్గట్టుగా రాయల్ ఆర్కిడ్ , స్ప్రీ హోటల్స్‌ను రూపొందించాము. అటు హై క్లాస్, ఇటు మిడిల్ మార్కెట్ వర్గాలకు ప్రాధన్యం ఇచ్చాము. అయితే బడ్జెట్ విభాగంలో కొంత సరళీకరణ ఉండాలని కోరుకున్నామని బల్జీ చెప్పారు. అయితే ఈ రంగంలో చైన్ హోటల్స్ రూపొందించి.. వ్యాపారంలో వేగంగా పెరగడం ఉత్తమమని భావించామని సూచిస్తున్నారు.
ఆతిధ్య రంగంలో రాయల్ ఆర్చిడ్ హోటల్‌కు సమాన స్థాయిలో ఉన్న మిగిలిన హోటల్స్‌తో ఒప్పందం చేసుకున్న బల్జీ తన బ్రెయిన్ చైల్డ్‌కు శ్రీకారం చుట్టారు. అదే జిప్ రూమ్స్.
'జిప్ రూములను అన్ని వర్గాలుకూ అందుబాటులో ఉండే విధంగా తయారు చేశాం. అందుబాటులో ఉండే బడ్జెట్‌తో పాటు యాత్రికులు కోరుకొనే విధంగా సౌకర్యాలు కల్పించడం మా ఆలోచన. కాన్సెప్ట్ నచ్చి దేశవ్యాప్తంగా ఉండే బ్రాండెడ్ హోటల్స్ దాదాపుగా జిప్ రూమ్స్ తో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చాయని' గర్వంగా చెబుతారు కేశవ్.
జిప్ రూములు దాదాపుగా స్థానికంగా ఉండే బ్రాండ్ బడ్జెట్ హోటల్స్‌ను గుర్తిస్తుంది. క్రియేట్, స్టాండర్ట్, యాగ్రిగేట్ అనే రూల్‌కు తగ్గట్టుగా పని చేస్తుంది. సంస్థకు చెందిన ఆడిటర్స్ కొత్త హోటల్‌ను ఎంపిక చేసుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. మేము తయారు చేసుకున్న నిబంధనలకు అనుగుణంగా ఉన్న సౌకర్యాలు, సేవలు అందించే వారికే అర్హత ఇస్తాం. ఓ హోటల్ ఓనర్‌గా సౌకర్యాలపై అవగాహన కల్గిన జిప్ రూమ్స్ .. తమ భాగస్వాముల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తుంది. మాకూ, మాతో జత కట్టేవారికి .. సంయుక్తంగా ప్రయోజనం ఉండాలనేదే ఆలోచన అంటారు బల్జీ.
సరైన వ్యాపార భాగస్వాములు గుర్తించడం కోసం హోటల్స్ చరిత్రను తెలుసుకుంటారు. తగిన పార్ట్నర్ అని భావించిన వెంటనే.. జిప్ రూమ్స్ బ్రాండ్‌కు అనుగుణంగా ఉంటే ప్రక్రియ మొదలవుతుంది. కస్టమర్ల ఆలోచనలకు తగ్గట్టుగా అవసరమైన విధంగా శుభ్రమైన గదులు, ఆహ్లాదకరమైన వాతావరణం, Wi-Fi, వేడి నీళ్లతో షవర్, ఎయిర్ కండిషన్‌తో పాటు తప్పని సరిగా కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ సరిగా ఉండేలా చూసుకుంటాము. ఒకసారి జిప్ రూమ్స్‌తో అవగాహన కుదుర్చుకుంటే.. వెంటనే హోటల్ స్టాఫ్, మేనేజ్మెంట్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ... అవసరమైతే తగిన శిక్షణ ఉంటుంది. అలా అని హోటల్ రోజూవారీ కార్యకలాపాల్లో జిప్ రూమ్స్ ఎలాంటి జోక్యం చేసుకోదు. కానీ దీర్ఘ కాలంలో వ్యాపారాన్ని లాభదాయకంగా చేయడమే లక్ష్యం. మేము మా పార్ట్నర్స్ గదులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఇద్దరికీ ఆదాయంలో ఉండాలి. దీని వల్ల హోటల్స్‌కు అవసరమైన ఖర్చులు నిర్వహించడానికి కావలసిన నిధులు సమకూరుతాయి. అయితే వివిధ మేనేజ్మెంట్ల కింద హోటల్స్ నిరంతర పర్యవేక్షణ అంత ఈజీ పని కాదు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా సేవలు అందించడం చాలా కష్టమైన పని అని అంగీకరిస్తారు. జిప్ రూమ్స్ ఈజీ బుకింగ్స్, ప్రామాణికంగా హోటల్ సేవలను అందించడానికి టెక్నికల్‌గా కామన్ ప్లాట్‌ఫాం తయారు చేస్తున్నాము.
చిన్నప్పటి నుంచే ఇదే వ్యాపారంలోనే
ఫౌండర్ బల్జీ.. అమెరికా బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. వార్టన్, యూపెన్, హైదరాబాద్ ఐఎస్బీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చదువుకొనే రోజుల నుంచి.. ఎప్పుడు ఆతిధ్య రంగానికి వెళ్లాలని అనుకోలేదని చెప్తారు. వెంచర్ క్యాప్టలిస్ట్‌గా ఎదగాలని మొదటి నుంచి భావించేవాడినని నవ్వుతూ వివరిస్తారు. అయితే బల్జీ తండ్రి హాస్పిటాలిటి రంగంలో ఉండడంతో ఆసక్తి పెరిగిందని.. వివరిస్తారు. రాయల్ ఆర్చిడ్ గ్రూప్ ఐపిఓకు వచ్చినప్పుడు మరింత మక్కువ పెరిగిందని చెప్తారు బల్జీ. తన వారసత్వంగా వస్తున్న హోటల్ ఇండస్ట్రీలో డిఫరెంట్ గా ఎదగాలనుకున్నారు. అందుకే ఆయన సొంతంగా జిప్ రూమ్స్‌ను డెవలప్ చేశారు. కుటుంబ పరంగా వస్తున్న వ్యాపారాన్ని సునిశతంగా పరిశీలించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించిన బల్జీ ఇదే రంగంలో సొంతంగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు.
వ్యవస్థాపకుడిగా మీ కొత్త జీవితం ఎలా ఉందని ప్రశ్నిస్తే... బల్జీ ఒక్కటే సమాధానం ఇస్తారు.. ''సొంత వెంచర్ మొదలు పెట్టినప్పుడు కొన్ని లాభాలు, నష్టాలు తప్పనిసరి. ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా మంచి,చెడు ఉంటాయి. అయితే సమాజంలో ఉన్నతంగా ఉన్న కుటుంబం కావడంతో మాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మిగిలిన వారితో పోల్చి పనితీరు అంచనా వేస్తారు. అలాగే నేను చేసిన పనిని ఎప్పటికప్పుడు జడ్జ్ చేసుకుంటాను. ఒక వ్యక్తిగా నా కెరీర్ పై ఎంతో ఒత్తిడి ఉంది. నేను ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం పోరాడడమే తెలిసిందని ''నవ్వుతూ చెబుతారు బల్జీ.
జిప్ రూమ్స్ కాన్సెప్ట్‌ను ఏడాదిన్నర కిందట ప్రారంభించాము. అయితే ఆపరేషన్స్ ప్రారంభించి మూడు నెలలు మాత్రమే అవుతోంది. ప్రస్తుతం 11 నగరాల్లో మా కార్యాకలాపాలు కొనసాగుతున్నాయి. రానున్న ఏడాది కాలంలో మూడు, నాలుగు వందల హోటల్స్‌తో టై అప్ కావాలన్నదే లక్ష్యం. స్ప్రీ హోటల్ టీమ్‌కు ఉన్న 200 మంది సిబ్బంది మాకు అదనపు బలం. సంస్థాగతంగా మార్పులు చేయడానికి జిప్ టీమ్ రకరకాలుగా ప్లాన్ చేస్తోంది. మార్కెట్లో ఉన్న గుడ్ విల్‌తో జిప్ ఇప్పటికే మా ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న 25,000 హోటల్స్ పరిశీలించింది. అయిత బడ్జెట్ హోటల్ విభాగంలో దేశంలో మరో 11 లక్షల హోటల్స్ ఉన్నాయని జిప్ టీమ్ అంచనా.
ఈ రంగంలో మాతో పాటు ఓయో, Zostel, Treebo, Zo రూములును అందించే వేదికలుగా ఉన్నాయి. వాటికి ఈ మధ్య ఫండింగ్ కూడా అందింది. ఆదాయం ఎక్కువగా ఉండడంతో పుట్టగొడుగుల్లా సంస్థలు ఈ రంగంలో పుట్టుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా కొన్ని సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కానీ ఇండియన్ మార్కెట్ మాత్రమే టార్గెట్ చేసుకున్న మేము...ఈ పోటీతో తక్కువ ధరలో సేవలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
జిప్ రూమ్స్ అందించే సేవలో నాణ్యత, లాంగ్ రన్లో లాభాపేక్ష ఉన్న వారినే పార్టనర్స్‌గా ఎన్నుకుంటోంది. ప్రారంభంలో భాగస్వాములతో బలమైన బంధాలు ఏర్పరచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాము. ఇదే భావనను నాన్ బ్రాండెడ్ హొటల్స్‌కు విస్తరింపచేయాలని కోరుకుంటున్నామన్నారు. ఓయో, జిప్ రూమ్స్ మధ్య పోటీ ఉన్నప్పటికి జిప్ రూమ్స్ నెట్వర్క్ ఎక్కువ హోటల్స్ కలిగి ఉండడమే సంస్థకు బలం.