‘ఫిట్ జాప్’ పాస్ ఉంటే ఏ జిమ్‌కైనా ఎంట్రీ లభించినట్లే !

24th Oct 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవసరమో ? ఆ వ్యాయామానికి టైం కూడా అంతే అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా పోతోంది. ఎక్సర్‌సైజ్‌కు టైం చిక్కడం లేదు. అన్ని సమయాల్లో తెరచి ఉండే జిమ్ జాయిన్ అయినప్పటికీ ఏదో అడ్డంకి రావడంతో అది కుదరడం లేదు. దీనికి పరిష్కారం చూపే ప్రయత్నమే చేసింది ఈ హైదరాబాద్ స్టార్టప్ ఫిట్ జాప్(fitzop). ఒక పాస్ తీసుకుంటే ఏ జిమ్‌లో అయినా వర్కవుట్స్ చేసుకునే అవకాశం ఉండడంతో పాటు ఫిట్‌నెస్ , వెల్‌నెస్ సలహాలు అందిస్తోంది.

“నేను జిమ్‌కి రెగ్యులర్ గా వెళ్లే రకం కాదు. కానీ రోజూ రన్నింగ్ చేస్తా. ఎన్నో ఏళ్లుగా నా ఫిట్ నెస్ కాపాడుకుంటూ వస్తున్నా. తామున్న చోటే ఫిట్ నెస్ సెంటర్ కోరుకునే నాలాంటి వారికోసమే ఈ ఫిట్ జాప్” - అలేఖ్య నాదెండ్ల

ఫిట్ నెస్ కమ్యూనిటీ

ఫిట్ జాప్ అంటే ఒక ఫిట్ నెస్ కమ్యూనిటీ అంటారు అలేఖ్య. ఫిట్ నెస్ సెంటర్‌కి వెళ్లాలనుకున్న వారంతా ఈ కమ్యూనిటీ మెంబర్లు. అంటే ఎవరైనా దీనిలో చేరొచ్చన్న మాట. సాధారణంగా మగువలు ఫిట్ నెస్ సెంటర్లపై ఆసక్తి చూపరు. దీనికి పర్సనల్ కారణాలతో పాటు అక్కడుండే పరిస్థితులు ప్రభావితం చూపుతున్నాయి. దీన్ని గుర్తించి ఈ స్టార్టప్ మొదలు పెట్టారు. జిమ్ , జుంబా, యోగా, రన్నింగ్ ఇతర వార్మప్స్ లాంటివాటివి మా ఈ ఫిట్ జాప్ లో అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలైన ఫిట్‌నెస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కనుకనే దీన్ని ఓ కమ్యునిటీ అంటున్నారు అలేఖ్య.

image


ఫిట్ జాప్ పాస్‌ల ప్రత్యేకం

 1. ఫిట్ నెస్ పాస్ తీసుకోవడం వల్ల మీకు నచ్చిన జిమ్ కి , నచ్చిన సమయంలో వెళ్లొచ్చు.
 2. రోజూ జిమ్ అని బోరు కొట్టే జానాలు జిమ్ తో పాటు జుంబా డ్యాన్స్ లకు అటెండ్ కావొచ్చు.
 3. ఫిట్ నెస్ కు సంబంధించి ఎలాంటి యాక్టివిటీకైనా ఈ కార్డుతో ప్రవేశించొచ్చు.
 4. హైదరాబాద్ లో అపోలో ఫిట్ నెస్ తోపాటు సాధారణ జిమ్ ల దాకా దాదాపు 45 జిమ్ లకు ప్రవేశం ఉంది.
 5. నెలకి 3వేలు చెల్లించి 15సెషన్లకు వెళ్లే వెసులుబాటు కలిగిస్తున్నారు.
 6. ట్రెయినర్ గైడ్ లైన్స్ కోసం వెబ్ సైట్ ను ఉపయోగించుకోవచ్చు.
 7. ఫిట్ నెస్ సలహాల కోసం క్వచ్ఛన్ అండ్ ఆన్సర్ ఆఫ్షన్ ఉంది.
image


ఫిట్ జాప్ టీం

ఫిట్ జాబ్ టీం విషయానికొస్తే అలేఖ్య నాదెండ్ల ఫౌండర్. ఐఎస్బి నుంచి ఎంబియే పూర్తి చేసిన అలేఖ్య ఫ్లోరిడాలోని ఓ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అనంతరం ఇండియాలో ఓ బ్రాండ్ ఫ్రాంచైనీ నడిపారు. వ్యాపార నేపధ్య కుటుంబం నుంచి వచ్చిన అలేఖ్య సాధారణ బిజినెస్ లు కాకుండా సరికొత్తగా ఏదైనా చేయాలని ఎప్పుడూ ఆలోచించారు. ఆమె ఆలోచనల కార్యరూపమే ఈ ఫిట్ జాప్. ఆమెతోపాటు ఫిట్ జాప్ లో 10మంది టీం ఉన్నారు.

image


“ఫిట్ జాప్ టీం, నాకున్న బలం” అలేఖ్య

ఫిట్ జాప్ పెర్ఫార్మన్స్, సవాళ్లు

ఓ సాధారణ బ్లాగ్ గా ప్రారంభమైన ఫిట్ జాప్ వెబ్ సైట్ గా మారి 5నెలలుకావొస్తోంది. బ్లాగ్ లో ప్రతి రోజూ 1000 మంది దాకా ఇంట్రాక్ట్ అవుతున్నారు. వెబ్ సైట్ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా ఇదే రకంగా ఉంది. ఒకే వేదికపైకి జిమ్ లన్నింటినీ తీసుకు రావడమనేది ఓ అద్భుతమైన కాన్సప్ట్. కానీ ఫిట్ నెస్ సెంటర్లను తీసుకు రావడం పై కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. ప్రతి రోజూ జిమ్ చేయాలని అనుకునే వారికి జిమ్ బోర్ కొట్టకుండా కొత్త యాక్టివిటీ పరిచయం చేయడమే తమ ఉద్దేశం కనుక, ఈ సమస్యలను అధిగమిస్తామంటున్నారు అలేఖ్య. ఇలాంటి బిజినెస్ మోడల్ లో బెంగళూరు కేంద్రంగా ఓ స్టార్టప్ పనిచేస్తోంది. అయితే అది జిమ్ ప్రవేశానికి మాత్రం ఉపయోగ పడే ఓ టూల్ లా పనిచేస్తుందంటారు అలేఖ్య.

“ఫిట్ జాప్ అనేది ఫిట్ నెస్ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంతో పాటు, దాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తోంది.” అలేఖ్య

భవిష్యత్ ప్రణాళికలు

యాప్ ఫ్లాట్ ఫాంలోకి తీసుకు రావడం మా ముందున్న మొదటి సవాళు. బ్లాగ్ లో ఉన్న యూజర్ బేస్ తో యాప్ ని మరింత ముందుకు వెళ్లాలని చూస్తున్నాం. ఇప్పటికే ఈవెంట్స్ లో యాక్టివ్ గా ఉన్న ఫిట్ జాప్ మరిన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి ఫిట్ నెస్ కమ్యూనిటీ వ్యాప్తికి దోహదపడుతుంది. ఆన్ లైన్ లో ఉన్న వారిందరికీ ఫిట్ నెస్ సలహాలిచ్చే సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

image


“జనాన్ని ఫిట్ గా ఉంచాలనేదే మాతాపత్రయం. దానికోసం టెక్నాలజీని ఉపయోగిచుకుంటున్నట్లు చూస్తున్నామని ముగిచారు అలేఖ్య”
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Our Partner Events

Hustle across India