సంకలనాలు
Telugu

ఫేస్ బుక్ గురించి మీకు తెలియని బోలెడు సంగతులు

team ys telugu
5th Feb 2017
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share

ఫేస్ బుక్. పరిచయం అక్కర్లేని సోషల్ నెట్ వర్కింగ్ సైట్. ఇందులో ఎవరి గోడ వారిదే. ఎవరి గోడు వారిదే. రాసుకుంటారో, దుమ్మెత్తి పోసుకుంటారో.. ఎవరిష్టం వారిది. బ్యాంక్ అకౌంటైనా ఉంటుందో లేదోగానీ, ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఉండాల్సిందే. లేకపోతే సమాజం దృష్టిలో వెనుకబడినట్టే లెక్క. సాహిత్యం నుంచి అంతరిక్షం దాకా.. పోర్టికో కబుర్ల నుంచి పొలిటికల్ న్యూస్ దాకా.. నిరంతర భావప్రకటనా స్రవంతి.

ఫేస్ బుక్ యూజర్ ఫ్రెండ్లీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్. తెలుసుకోడానికి పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎన్ని ఔట్ ఫిట్ థీమ్స్ మార్చినా, కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ అయినా, లైవ్ వీడియోల్లాంటివి అందుబాటులోకి వచ్చినా క్షణాల్లో వాటి గురించి జనాలకు రీచ్ అవుతుంది. అయినా సరే మీకు ఫేస్ బుక్ గురించి తెలియని కొన్ని విషయాలున్నాయి. అందులో కొన్ని అంశాల గురించి తెలుసుకోండి.

image


ఫేస్ బుక్ లో ఫస్ట్ ఫేస్ ఎవరిదో తెలుసా?

అల్ పాచినో. తెలుసుగా అమెరికన్ యాక్టర్. అతనిదే ఫేస్ బుక్ లో ఫస్ట్ ఫేస్. అతను యంగ్ గా ఉన్నప్పటి ఫోటో లెఫ్ట్ కార్నర్ లో పెట్టారు. డిజైన్ చేసింది ఎవరో కాదు. ఫేస్ బుక్ కో- ఫౌండర్ ఆండ్ర్యూ మెక్ కల్లమ్. అతను జుకర్ బర్గ్ ఫ్రెండ్. హార్వర్డ్ లో కలిసి చదువుకున్నారు.

ఫస్ట్ ఇన్వెస్టర్ ఎవరంటే..?

పీటర్ థీల్. ఇతనే ఫేస్ బుక్ తొలి ఇన్వెస్టర్. ఒకప్పటి పేపల్ కో ఫౌండర్. 10.2 శాతం స్టేక్ తీసుకున్నాడు.

ఫేస్ బుక్ ఇవ్వమని ఎవరు అడిగారో తెలుసా?

ఇది 2007 మాట. 1 బిలియన్ డాలర్ ఇస్తాం.. ఫేస్ బుక్ హాండోవర్ చేయమని యాహూ కోరింది. కానీ జుకర్ బర్గ్ ఒప్పుకోలేదు. ఇవ్వకుండా మంచిపని చేశాడని స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇంటర్వ్యూలో అన్నాడు.

లైక్ బటన్ కంటే ముందు ఏముండేదంటే..

థమ్సప్ సింబల్ తో కనిపించే లైక్ బటన్ కంటే ముందు ఆసమ్ అనే ఫీచర్ ఉండేది. తర్వాత దాని స్థానంలో లైక్ బటన్ పెట్టారు. ఎందుకంటే లైక్ అనేది యూనివర్సల్ అప్పీల్ అని 2007లో స్వయంగా జుకర్ బర్గే మార్చాడు.

పీటూపీ ఫైల్ షేరింగ్

వెబ్ సైట్ 5 లక్షలకు రీచ్ కాగానే పీటూపీ ఫైల్ షేరింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అప్పట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ . కాలక్రమంలో కాపీరైట్ సమస్యలు తలెత్తడంతో దాన్ని తొలగించారు.

ఎక్సీడింగ్ యాక్సెస్

మరింత మందికి రీచ్ కావాలన్న ఉద్దేశంతో 2013 ఆగస్టులో ఫేస్ బుక్ ఇంటర్నెట్.ఓఆర్జీ లాంఛ్ చేసింది.

ఫేస్ బుక్ బ్లూ కలర్లోనే ఎందుకుందీ అంటే జుకర్ బర్గ్ వర్ణాంధత్వంతో బాధపడేవాడు. అందుకే కళ్లకు హాయిగా ఉంటుందని ఆ రంగుని ఎంచుకున్నాడు.

ప్రస్తుతానికి సెకన్ కు 8 మంది చొప్పున ఫేస్ బుక్ కి కనెక్టవుతున్నారు. ప్రతీ పావుగంటకోసారి 7,246 మంది ఫేస్ బుక్ ఓపెన్ చేస్తున్నారు.

ఇప్పటిదాకా 1.59 బిలియన్ మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఇదే టాప్. అంటే ఇండియా, చైనా జనాభా కంటే ఎక్కువ మందికి ఫేస్ బుక్ అకౌంట్ ఉందన్నమాట.

ఇంత మంది యూజర్లు యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా ఫేస్ బుక్ సర్వర్ డౌన్ అన్నమాటే లేదు. 2014 ఆగస్టులో ఒకసారి 19 నిమిషాల పాటు సైట్ కి అంతరాయం కలిగింది. అప్పుడు వచ్చిన నష్టం ఎంతో తెలుసా? 4,27,000 డాలర్లు. అంటే ఈ లెక్కన సైట్ ఎప్పుడు ఒక్క నిమిషం ఆగిపోయినా వచ్చే నష్టం దాదాపు 24,420 డాలర్లు.

ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 6 లక్షల మంది హాకర్లు ఫేస్ బుక్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు.

ఫేస్ బుక్ యూఆర్ఎల్ చివర్న /4 అని టైప్ చేయగానే ఆటోమేటిగ్గా మార్క్ జుకర్ బర్గ్ వాల్ మీద ప్రత్యక్షమవుతుంది. ఇది జుకర్ బర్గ్ ని కలుసుకోడానికి సులువైన షార్ట్ కట్.

తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 10 నుంచి 11 మధ్యలో పోస్టులు పెడితే, మిగతా టైం కంటే 88 శాతం ఎక్కువ అవి రీచ్ అవుతాయట. సో, ఎక్కువ లైకులు, కామెంట్లు రావాలంటే అదే బెస్ట్ టైం అన్నమాట.

అన్నట్టు ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్. ఫేస్ బుక్ చూసి, లాగవుట్ అయిన తర్వాత కూడా మీరు ఏఏ సైట్లు చూశారో, ఎంత సేపు ఉన్నారో కూడా ట్రాక్ చేస్తారట. ఎందుకంటే మీరు ఏవేం సైట్లు చూశారో దాన్ని బట్టి ఆయా కంపెనీలతో అడ్వర్టయిజింగ్ ప్లాట్ ఫాం క్రియేట్ చేసుకుంటారట.

సో, ఇవన్నమాట ఫేస్ బుక్ గురించి మనకు తెలియని విషయాలు. ఎనీ వేస్ 13 వసంతాలు పూర్తి చేసుకున్న సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం, భవిష్యత్ లో మరిన్ని కలర్ ఫుల్ ఫీచర్లతో విశ్వజనీనమై అలరిస్తుందని ఆశిద్దాం. 

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags