ఆన్‌లైన్ డేటింగ్‌ వ్యాపారంలో ఓ మహిళ దూకుడు

ఎవరో విసిరిన సవాలును అధిగమించడం కంటే, మనల్ని మనమే సవాలు చేసుకోవడం మరింత థ్రిల్లింగ్ గా వుంటుంది. ఆ సవాలును అధిగమించి విజయం సాధించినప్పుడు ఆ ఆనందానికి అవధులుండవు. అలాంటి ఆనందాన్నే కోరుకుంటారు టీనా ఛూలె. అందుకే ఆమె అందరూ నడిచిన దారిలో నడవాలనుకోలేదు. ఓ కొత్త దారిని ఎంచుకుని తనకు తానే ఓ సవాలుగా మారారు. స్త్రీ పురషులకు ఆన్ లైన్ డేటింగ్ కోసం ఒక మొబైల్ డేటింగ్ యాప్ ను రూపొందించి సక్సెస్ చేయడమంటే, అంతకు మించి సవాలు ఇంకోటేముంటుంది..

18th May 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

వాల్ట్జ్ (Waltzz) కంపెనీ సిఇవో టీనా సక్సె స్ స్టోరీ తెలుసుకోవడానికి యువర్ స్టోరీ ఆమెతో మాట్లాడింది.

టీనా తండ్రి 40 యేళ్ళ క్రితమే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి చికాగో వెళ్ళి స్థిరపడ్డారు. టీనా, ఆమె అక్క.. చికాగోలోనే పెరిగి పెద్దయ్యారు. ‘‘చిన్నప్పటి నుంచే సందడిగా, ఉత్సాహాంగా వుండే నాకు క్రియేటివిటీ కూడా ఎక్కువే. దాదాపు ప్రపంచం అంతా తిరిగి .. ఇదిగో ఇప్పుడిలా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా .. బెంగళూరులో స్థిరపడ్డా..’’

18 ఏళ్ళ కు వార్టన్ స్కూల్‌లో జాయన్ అవడానికి ఇంటి నుంచి బయటకొచ్చిన టీనా.. 22 ఏళ్ళకే మేనేజిమెంట్ కన్సెల్టెంట్‌గా మారారు. ఆ వయసులో చాలా మంది అమ్మాయిలు కలలు కనే స్థితికి టీనా చాలా తేలికగా చేరుకున్నారు. అయితే, ఇలా కుదురుగా వుండడం ఆమెకు నచ్చలేదు. రిస్క్ లేకపోతే, లైఫ్‌లో మజా లేదనుకున్నారు. అంతే, తనకున్నదంతా అమ్మేసి 2008 లో న్యూఢిల్లీ లోని ఓ అంతర్జాతీయ సంస్థ ఎండీవర్...లోఉద్యోగం సంపాదించారు. ఈ సంస్థ యువ పారిశ్రామిక వేత్తలకు సలహా, సహాయాలను అందిస్తుంది. ఆ తర్వాత ఆమె సుమింటర్ ఇండియా ఆర్గానిక్స్, సిట్రస్ సిటీ లాంటి సంస్థల్లో కూడా పనిచేసారు.

టీనా ఛూలే, వాల్ట్డ్ సీఈఓ

టీనా ఛూలే, వాల్ట్డ్ సీఈఓ


డేటింగ్ యాప్ ప్రస్థానం

2012 లో మళ్ళీ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ లో ఎంబిఎ చేయడానికి ముంబై విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ డిగ్రీ పూర్తయిన వారానికే మళ్ళీ ఇండియా ఫ్లయిట్ ఎక్కేసారు. తిరిగొచ్చిన వెంటనే సొంత సంస్థ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. తన భర్తతో కలిసి దాదాపు రెండేళ్ళ పాటు చాలా వ్యాపారాల గురించి ఆలోచించారు. ఉబర్ లాంటి ట్రాన్స్‌పోర్ట్ మేనేజెమంట్ సంస్థల దగ్గర నుంచి మొబైల్ గేమింగ్ వరకు చాలా ఆలోచనలొచ్చాయి. చివరికి మొబైల్ డేటింగ్ దగ్గర ఆగారు. ఇందుకు ఆమె కుటుంబంలోని ఘటనలో స్పూర్తిగా నిలిచాయి.

తన సోదరి, కజిన్, ఆమె భర్త కజిన్.. ఇలా కుటుంబలోని వారికే ఈ డేటింగ్ ఆప్ ద్వారా సంబంధాలు కుదరడం టీనా కళ్లారా చూసారు. దీంతో పాటు, ప్రపంచం అంతటా డేటింగ్ సైట్స్‌కు వున్న ఆదరణ, పెరుగుతున్న మొబైల్ ఫోన్ల మార్కెట్, జనాభాలో యువత సంఖ్య పెరగడం లాంటి ఇతర అంశాలు కూడా టీనా డేటింగ్ యాప్ వైపు మొగ్గడానికి దోహదపడ్డాయి. ఫలితంగా వాల్ట్జ్ రూపుదిద్దుకుంది.

తన యాప్ ద్వారా సీరియస్ రిలేషన్‌షిప్స్ జతపడాలని కోరుకున్నారు టీనా. అందుకే ఏదో ఒక్క క్లిక్‌తో ఫేస్ బుక్ లో వున్న ప్రొఫైల్‌నే ఈ యాప్‌లో అపలోడ్ చేసే సంప్రదాయానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. మతం, పుట్టిన రాష్ట్రం లాంటి కొన్ని కచ్చితమైన వివరాలు వుండేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.

అలాగే, ఎలాంటి డేటింగ్ కావాలనుకుంటున్నారో. (క్యాజువల్, సీరియస్, సెమీ సీరియస్) లో ఈ యాప్ ద్వారా ముందే తెలుసుకునే ఏర్పాటుంది.

ఇక మహిళా యూజర్లను ఆకట్టుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను పెట్టారు. ఫోర్ వే ప్రొఫైల్ వెరిఫికేషన్, పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళను బ్లాక్ చేసే వెసులు బాటు.. లాంటి ఫీచర్లు ఈ యాప్ లో వున్నాయి.

టీనా టీమ్ చిన్నదే అయినా. వీళ్ళు దేనికైనా సై అనే రకం. అందుకే మార్కెట్ లో ఎంత పోటీ వున్నా.. దాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. ‘‘ మార్కెట్ లో పోటీ చాలావుంది. డేటింగ్ సెక్టార్‌లో చాలా సంస్థలున్నాయి. అయితే, ఏది ఎందుకు సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టం. అసలు డేటింగ్ అన్న పదం వాడడానికే ఇబ్బంది పడే స్థాయిలో సమాజం వున్నప్పుడు టిండర్ (డేటింగ్ యాప్ సంస్థ) కొంత కష్టపడి.. మార్కెట్ అవగాహన తెచ్చింది. అయితే, వాల్ట్జ్ లాగా టిండర్‌కు స్థానిక మార్కెట్ల మీద పట్టులేదు. పోటీ ఎంత పెరిగితే, మార్కెట్లో అవగాహన కూడా అంత పెరుగుతుంది.’’

మొత్తం మీద వాల్ట్జ్ యాప్ స్త్రీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిందే అయినా.. మగాళ్ళను కూడా దూరం చేసుకునే ఉద్దేశం లేదు. ‘‘తమకు భద్రత వుంటుందనుకునే యాప్‌ను సహజంగానే ఎక్కువ మంది మహిళలు ఆదరిస్తారు. ఆ రకంగా మగాళ్లకు కూడా ఈ యాప్‌లో ఎక్కువ మంది స్త్రీలనుంచి తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం వుంటుంది’’ అని సక్సె స్ సీక్రెట్ ను వివరించారు టీనా.

సవాళ్లు

‘‘ మహిళా వ్యాపార వేత్తను కావడమే నా బలం’’ అంటారు టీనా. స్త్రీని కావడం వల్ల తనకు లాభమే జరిగింది తప్ప నష్టం లేదంటారామె. ‘‘ డేటింగ్ ప్లాట్‌ఫామ్ విషయానికొచ్చేసరికి మహిళలు మరో మహిళను నమ్మినట్టుగా మగాడిని నమ్మరు. మా పోటీ సంస్థను పురుషులు నిర్వహిస్తున్నారు. స్త్రీ పురుష మనస్తత్వాలకు సంబంధించిన ఈ వ్యాపారంలో మహిళను కావడం నాకు చాలా ఉపయోగపడింది.

image


మరో ఆంట్రప్రన్యూర్‌తో జీవితభాగస్వామ్యం

టీనా భర్త..క్వికర్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ సంస్థ సిఇవో ప్రణయ్ ఛూలే. ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి దాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వ్యక్తి తన జీవిత భాగస్వామి కావడం వల్ల టీనా మానసిక స్థైర్యానికి లోటులేదు. ప్రణయ్ ఆమెకు స్ఫూర్తి, ప్రతి కష్టం లోనూ ఆమెకు తోడూ నీడగా వుంటున్నారు.

టీనా, ప్రణయ్ ఒకరి వ్యాపారంలో మరొకరు జోక్యం చేసుకోరు. అయితే, ఒకరి సహకారం మాత్రం మరొకరికి ఎప్పుడూ వుంటుంది. మార్కెటింగ్, ఫండ్ రైజింగ్, ఉద్యోగులను చేర్చుకోవడం వంటి అంశాల్లో ప్రణయ్ అనుభవం టీనాకు ఎప్పుడూ బలమే. అలాగే బిజినెస్ మైండ్ సెట్ వున్న టీనా అభిప్రాయాలు ప్రణయ్ వ్యాపారానికి మరింత సహకరిస్తాయి.

‘‘మా ఇద్దరి బిజినెస్ చర్చలు చాలా పద్ధతిగా సాగుతాయి. వీటికోసం మేం ప్రత్యేకమైన సమయాలను ముందే ఖరారు చేసుకుంటాం. స్టార్ బక్స్‌లో కాఫీ తాగుతూనే, లాంగ్ డ్రైవ్‌లోనో, లేదా ముందే అనుకున్న తేదీలలోనో ఈ చర్చలు జరుపుతాం. మిగిలిన ప్రొఫెషనల్ డిస్కషన్స్‌కు ప్రిపేర్ అయినట్టే మా ఆయనతో డిస్కషన్‌కు కూడా ప్రిపేర్ అవుతాను,’’ అంటారు టీనా.

టెకీలుగా మహిళలు

మహిళల్లో ఐడియాలకు లోటు లేకపోయినా.. టెక్నాలజీ రంగంలో మహిళల సంఖ్య ఎందుకు తక్కువగా వుంటుందో అర్థంకాదంటారు.. టీనా. ‘‘ నా బిజినెస్ ఎక్కువగా మహిళలతోనే ముడిపడివుందని అర్థమయ్యాక విమెన్ డెవలపర్స్ కోసం చాలా వెతికాను. నౌక్రి డాట్ కామ్ వెబ్ సైట్ లో సి.వి.లు అప్ లోడ్ చేసిన చాలా మందితో స్వయంగా నేనే మాట్లాడాను. అయితే, వాళ్ళెవరూ రావడానికి ఇష్టపడలేదు. చాలా మంది అప్పటికే పెద్ద పెద్ద కంపెనీల్లో ఏవో ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. దాన్ని వదులుకుని ఒక కొత్త సవాలు స్వీకరించడానికి వాళ్ళెవరూ సిద్ధంగా లేరు. ఇప్పటికీ నేను విమెన్ డెవలపర్స్ కోసం అన్వేషిస్తూనే వున్ననని.. తన అనుభవాల్ని చెప్పాలరు టీనా.

 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • WhatsApp Icon
 • Share on
  close
  Report an issue
  Authors

  Related Tags