మీ యాప్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసా..?

యాప్‌ని రూపొందించగానే సరిపోదు. అది యూజ‌ర్స్‌కి నచ్చిందా లేదా.. వాళ్లకు తగినట్టుగా పనిచేస్తోందా ? యూజర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ? సహా అనేక అంశాలపై దృష్టిసారిస్తేనే సక్సెస్ సాధ్యపడ్తుంది.

3rd Sep 2015
 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close

కొనోటోర్‌లో మాకు యాప్ ప్ర‌పంచంలో ప‌నిచేసే స్నేహితులు చాలా మంది వుంటారు. కొంద‌రు ప్రోడ‌క్టుల‌తోనూ, మ‌రికొంద‌రు మార్కెటింగ్‌లోనూ ప‌నిచేస్తుంటారు. యాప్స్ రూప‌క‌ల్ప‌న‌లో వాళ్ళు ట్రాక్ చేసే మెట్రిక్స్ గురించే మేం ఎప్పుడూ మాట్లాడుకుంటాం.

image


మీ యాప్ ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకోవాలంటే, ఈ కింద ఇచ్చిన కొన్ని ప్ర‌శ్న‌ల‌ను గ‌మ‌నించండి..

1. కీల‌క‌మైన స‌మాచచారమంతా వ‌స్తోందా..?

అన్ని ప్ర‌శ్న‌ల్లోనూ స‌ర‌ళ‌మైన ప్ర‌శ్న ఇదే.

మీ యాప్ మెట్రిక్స్ అన్నీప‌క్కాగా వున్నాయో లేవో చెక్ చేసుకోవడానికి ఎన్నో గైడ్స్ అందుబాటులో వున్నాయి. ఆన్ లైన్‌లో అందుబాటులో వున్న https://www.swrve.com/resources, http://info.localytics.com/download-beginners-guide-to-app-analytics, https://blog.kissmetrics.com/must-have-mobile-metrics/ లింకుల‌ను చూస్తే, మీ ప‌ని స‌గం అయిపోయిన‌ట్టే. మీ మొత్తం యాప్‌ని కొన్ని బకెట్లుగా (భాగాలుగా) విభ‌జించుకుని ఒక్కో దాంట్లో ఏయే మెట్రిక్స్ క్యాప్చ‌ర్ చేసారో చెక్ చేసుకోండి.

మొబైల్ యాప్స్‌కి సంబంధించినంత‌ వ‌ర‌కూ రిటెన్ష‌న్, ఎంగేజ్‌మెంట్ త‌ర‌హా కొన్ని మెట్రిక్స్ ప్ర‌త్యేకంగా వుంటాయి. మీరు ఏ జాన‌ర్‌లో యాప్ రూపొందిస్తున్నారనే దాన్ని బ‌ట్టి, ఏయే మెట్రిక్స్‌పై దృష్టిపెట్టాల‌న్న‌ది ఆధార‌ప‌డి వుంటుంది. గేమ్ యాప్ అయితే, రిటెన్ష‌న్ డి 7, డి 30 వుండాలి. కామ‌ర్స్ యాప్ మాత్రం క‌న్వ‌ర్ష‌న్ ఫ‌న్నెల్స్‌ను చూసుకుంటే స‌రిపోతుంది. మీరు రూపొందించే యాప్‌కి ఏ మెట్రిక్స్ ముఖ్య‌మో తెలుసుకోవ‌డం చాలా అవ‌స‌రం.

సింగిల్ ప‌ర్ప‌స్ (ఒకే ప్రయోజ‌నం వుండే) యాప్స్ సంఖ్య పెరుగుతోంది. దీంతో కామ‌ర్స్, యుటిలిటీ యాప్స్ ఒక‌విష‌యం చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. యూజ‌ర్... యాప్ ఉప‌యోగించ‌డం మొద‌లుపెట్ట‌గానే ప్ర‌ధానమైన ప‌నిని చేసుకోగ‌లుగుతున్నాడా లేదా అనేది చాలా కీల‌కం. యూజ‌ర్స్‌లో ఎంత శాతం మంది ఈ ప‌ని చేయ‌గ‌లుగుతున్నారో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాలి. అలాగే, యాప్ ఇన్స్టాల్ చేసిన త‌ర్వాత ఎంత త్వ‌ర‌గా అత‌ను దాన్ని వాడుకోగ‌లుగుతున్నాడ‌నేది కూడా ముఖ్య‌మే. విసుగొచ్చి యాప్‌ని అన్ ఇన్స్టాల్ చేయ‌క‌ముందే, అత‌ను మొద‌టి టికెట్ బుకింగ్, మొద‌టి ఇన్వాయిస్ జ‌న‌రేష‌న్, మొద‌టి పేమెంట్ లాంటివి చేసుకోగ‌ల‌గాలి. ఈ విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో మీరు ఏమ‌రుపాటుగా ఉండ‌కండి.

2. క్యాప్చ‌ర్ చేసిన డేటాను అన‌లైజ్ చేయ‌గ‌లుగుతున్నామా ?

వ‌చ్చిన డాటాలో ఏది ముఖ్య‌మైన‌దో తెలుసుకోవ‌డం,ఆ మేర‌కు ప్రాధాన్య‌తా క్ర‌మంలో విభ‌జించుకోవ‌డం చాలా అవ‌స‌రం.

 • కొన్ని యాప్స్ పెయిడ్ యూజ‌ర్ ఎక్విజిష‌న్ పై ఆధార‌ప‌డ‌తాయి. మ‌రికొన్నిటిలోనూ యూజ‌ర్ అక్విజిష‌న్‌కి చాలా సోర్సులు వుంటాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో యాప్ ఇన్స్టాల్ చేసిన సోర్స్ ద్వారానే మీ డాటా మొత్తాన్ని చూడాలి. మీ క్యాంపెయిన్లు తెచ్చేయూజ‌ర్ క్వాలిటీ మీద‌నే మీ రిటెన్ష‌న్ మెట్రిక్స్, ఎల్‌టివి, ఎంగేజ్‌మెంట్, వైరాలిటీ( కె-ఫ్యాక్ట‌ర్, యూజర్ షేరింగ్ ప‌ర్సెంటేజ్‌) లాంటివి ఆధార‌ప‌డి వుంటాయి. మీ డాటాను ఈ విధంగా విభజించుకోవడం వ‌ల్ల మీ చానెల్ ఎలా ప‌నిచేస్తోందో మెరుగ్గా అర్థం చేసుకోగ‌లుగుతారు.
 • గ‌త వెర్ష‌న్ల కంటే, మీ కొత్త యాప్ ఏ విధంగా మెరుగైందో ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తూ వుండాలి. కొత్త యాప్ అంటే, ఎంతో కొంత మెరుగ్గా వుండాల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే, కొత్త ఫీచ‌ర్స్‌ను, స‌ామర్థ్యాల‌ను ప్రాధాన్య‌తా క్ర‌మంలో ఎలా అమ‌ర్చుకుంటామ‌నేది ముఖ్యం. అలాగే ఏ బ‌గ్స్‌ను ముందుగా ఫిక్స్ చేయాలి. అనేది కూడా అంతే కీలకం.
 • సోష‌ల్ రీ టార్గెటింగ్ ద్వారా రీ ఎంగేజ్ అయిన యూజ‌ర్స్ కంటే, పుష్ నోటిఫికేష‌న్ల ద్వారా రీ ఎంగేజ్ అయిన యూజ‌ర్స్ భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారా ? మీ యాప్ విలువ తెలుసుకోవ‌డంలో, మ‌ళ్ళీ మ‌ళ్ళీ మీ యాప్ ద‌గ్గ‌ర‌కు యూజ‌ర్స్‌ను తీసుకురావ‌డంలో ఏ క్యాంపెయిన్ మెరుగ్గా ప‌నిచేస్తోంది ? పుష్ నోటిఫికేష‌న్‌లోని మొద‌టి కొన్ని ప‌దాల‌పైనే మీ యాప్ గురించి యూజ‌ర్ తెలుసుకోవ‌డం ఆధార‌ప‌డి వుండొచ్చు. యాప్ సెష‌న్ సోర్స్‌ను ట్రాక్ చేయ‌డం ద్వారా దీన్ని అంచ‌నా వేయండి.
 • మీ యాప్ ని కొన్ని ప్రాంతాల వాళ్ళు, కొన్ని వ‌య‌సుల వాళ్ళు, మ‌గాళ్ళు,లేదా స్త్రీలు ఎక్కువ‌గా వాడుతున్నారా ? అనేది కూడా చూసుకోవాలి. జ‌నాభా ప‌ర‌మైన ఈ విశ్లేష‌ణ వ‌ల్ల మీ యాప్‌ను మ‌రింత మందికి చేరువ చేయొచ్చు. మీ మార్కెటింగ్ స‌రైన ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర‌కు చేరుతోందా లేదా అనేది కూడా తెలుస్తుంది.
 • మీ యాప్‌ను అతి ఎక్కువ‌గా వాడుతున్న వారికీ, అతి త‌క్కువ‌గా వాడుతున్న వారికీ మ‌ధ్య ప్ర‌వ‌ర్త‌న‌లో ఏమైనా తేడాలున్నాయా.. వుంటే ఎలాంటి తేడాలున్నాయి..ఎక్కువ‌గా వాడుతున్న‌వారి శాతం ఎంత ? అతి త‌క్కువ‌గా వాడుతున్న‌వారి శాతం ఎంత‌ ? అలాంటి వాళ్లను మళ్లీ మనవైపు తిప్పుకునేందుకు ఏ ఏ మార్గాలు ఉప‌యోగ‌ప‌డ్డాయో తెలుసుకోవాడనికి ఓ కన్నేసి ఉంచాలి.

మెట్రిక్స్ సంఖ్య స‌రైన‌దేనా ?

 1. ఫ్లర్రీ, యాప్స్ ఫ్ల‌య‌ర్, లాంటి SDK ప్లేయ‌ర్స్ చెప్పిన దాన్ని బ‌ట్టి కొన్ని ర‌కాల మెట్రిక్స్‌కు కొన్ని బెంచ్ మార్కులున్నాయి. దీన్ని బ‌ట్టీ కొన్ని క్యాట‌గ‌రీల యాప్స్‌కి స‌గ‌టున వుండాల్సిన మెట్రిక్స్‌ను అర్థం చేసుకోవ‌చ్చు.
 2. ఒక గేమింగ్ యాప్‌కి 40 -50 శాతం వ‌ర‌కూ డి1, 20-30శాతం వ‌ర‌కు డి7, 7 నుంచి 15 శాతం వ‌ర‌కు డి 30 మంచి నెంబ‌ర్ అని చెప్పొచ్చు. అయితే, ట్విట‌ర్, స్నాప్ చాట్ లాంటి సోష‌ల్ యాప్స్‌కి, ఇత‌ర లాంచ‌ర్ యాప్స్‌కి ఈ నెంబ‌ర్లు స‌రిపోవు. ప్రొడ‌క్టివిటీ టూల్, లేదా సోష ల్ యాప్స్‌కి డి1 , డి7 లు కొంత త‌క్కువ‌గా వుండాలి.
 3. ఇన్స్టాల్ చేసుకున్న వారంలోగా 50 శాతం మంది అన్ ఇన్స్టాల్ చేసుకోవ‌డం సాధార‌ణంగా జ‌రిగేదే. అయితే, కొత్త‌ యూజ‌ర్స్‌ను రప్పించే ప‌ద్ధ‌తులు ఏమున్నాయ‌నేది కూడా ముఖ్య‌మే.
 4. గేమ్స్, సోష‌ల్ యాప్స్ కు DAU (రోజువారీ యాక్టివ్ యూజ‌ర్స్), MAU(నెల‌వారీ యాక్టివ్ యూజ‌ర్స్) కూడా మెట్రిక్‌గా ప‌నికొస్తుంది. గేమ్స్‌కి అయితే, 20-25% స‌రిపోతుంది. సోష‌ల్ యాప్స్‌కి మాత్రం 60-70 % వుండాలి. యూజ‌ర్ ఎక్విజిష‌న్ ప‌ెరిగే కొద్దీ DAU క్ర‌మంగా పెర‌గడ‌మే మంచిది.
 5. మెట్రిక్స్ ఎంతున్నాయ‌న్న దాని కంటే అవి పెరుగుతున్నాయా.. త‌గ్గుతున్నాయా అనేదే ముఖ్యం. మెట్రిక్స్ పెరుగుతుంటేనే యాప్ స‌క్సెస్ అవుతున్న‌ట్టు లెక్క‌.
 6. అయితే, ఈ నెంబ‌ర్లు ఎలా వున్నా.. యూజ‌ర్ ఆశించిన స్థాయిలో యాప్ పని చేస్తోందా లేదా అనేది అన్నిటికంటే కీల‌కం. ఇదే KPI అంటే కీ ప‌ర్ఫార్మెన్స్ ఇండికేట‌ర్. ఉదాహ‌ర‌ణ‌కు యాప్ వాడుతున్న వారిలో 4 శాతం మంది మాత్ర‌మే యాప్ ఉద్దేశించిన ప‌నిని చేయ‌గ‌లుగుతున్నామ‌ని భావిస్తే, ఎక్క‌డో ఏదో లోపం వుంద‌న్న‌మాటే. వెంట‌నే మీ ఆన్ బోర్డ్ ఫ‌న్నెల్స్‌ని చెక్ చేసుకోండి. యూజ‌ర్ ఎక్విజిష‌న్ చాన‌ల్స్‌ను విడివిడిగా ప‌రిశీలించి అన్నిట్లోనూ యూజ‌ర్ అభిప్రాయం ఒకేలా వుందేమో చూడండి.
 7. ఇన్స్టాల్ సోర్స్, డెమొగ్రాఫిక్స్ ఆధారంగా, ఏ గ్రూప్ యూజ‌ర్స్‌కి యాప్ బాగా న‌చ్చుతోందో గ‌మ‌నించండి. దాన్ని బెంచ్ మార్క్‌గా పెట్టుకోండి. అన్ని గ్రూపుల్లోనూ ఆ నెంబ‌ర్ సాధించ‌డానికి ప్ర‌య‌త్నించండి. (అంద‌రిలోనూ ఇదే స్థాయి నెంబ‌ర్స్ సాధ్యం కాక‌పోవ‌చ్చు. అయితే, ఏ స్థాయి వ‌ర‌కు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చో ఒక అంచ‌నా వుంటుంది.
 8. యావ‌రేజ్ యూజ‌ర్స్ కంటే 50 రెట్లు ఎక్కువ సేపు యాప్ వాడుతున్నారిని బెస్ట్ యూజ‌ర్స్‌గా అనుకోండి. మీ యాప్‌లో వీరికి న‌చ్చిన ఎలిమెంట్స్ ఏంటో గ‌మ‌నించండి.
 9. యూజ‌ర్ అక్విజిష‌న్ చానెల్‌ని బ‌ట్టీ మీ అన్ ఇన్స్టాల్స్, DAU,MAU మారిపోతున్నాయ‌నుకోండి. ఒక్కో చానెల్ ద్వారా యూజ‌ర్ ఎక్విజిష‌న్ కి అయిన ఖ‌ర్చు, లైఫ్ టైమ్ వాల్యూని విడివిడ‌ిగా లెక్కించండి. అన్నిటి కంటే లాభ‌సాటిగా వున్న‌చానెల్‌ను బెంచ్ మార్క్ గా పెట్టుకోండి.
 10. చివ‌రిగా ఒక్క విష‌యం గుర్తుంచుకోండి. ప్ర‌తి యాప్, ప్ర‌తి బిజినెస్ దానికదే ప్ర‌త్యేక‌మైన‌ది. అయినా.. మీ బిజినెస్‌కి అవ‌స‌ర‌మైన మెట్రిక్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మా డాటాను ఎలా విభ‌జించుకోవాలో కూడా మీరు తెలుసుకోవాలి. మీ నెంబ‌ర్స్‌ని బ‌ట్టీ బిజినెస్ ఎలా నడుస్తోందో గ‌మ‌నించండి. బిజినెస్ గ‌మ‌నం మీరు ఆశించిన‌ట్టు వుందోలేదో చూసుకోండి.

మ‌రో ముఖ్య‌విష‌యం.. మెట్రిక్స్ ఒక్క‌టే న‌మ్ముకుంటే స‌రిపోదు. నెల‌కోసారి యూజ‌ర్ ఎక్స్‌పీరియ‌న్స్ సెష‌న్స్ నిర్వ‌హించండి. మీ యాప్ యూజ‌ర్స్‌తో క‌మ్యునికేష‌న్ మెయింటైన్ చేయ‌డం ద్వారా మీప్రోడ‌క్ట్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

 • +0
Share on
close
 • +0
Share on
close
Share on
close