పారిశ్రామికవేత్తలుగా ఎదగకుండా తల్లిదండ్రులే అడ్డుకుంటున్నారా ?

రోజులు మారాయి. ఒక‌ప్పుడు చ‌దువులు పూర్త‌యితే త‌ప్ప ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు కాదు. కాని నేటి త‌రం యువ‌కులు టీనేజ్‌లోనే కంపెనీలు పెడుతున్నారు. చ‌దువు పూర్తికాక‌పోయినా, అంత‌గా అనుభ‌వం లేక‌పోయినా ధైర్యంగా సంస్థ‌ల‌ను ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ ప్ర‌య‌త్నాలు త‌ల్లిదండ్రుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. చ‌దువుకోవాల్సిన వ‌య‌సులో రిస్క్ అవ‌స‌ర‌మా అంటూ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌పై చిన్న‌త‌నంలోనే ఆంట్రప్రెన్యూర్‌గా ఎదిగిన గౌర‌వ్ ముంజాల్ త‌నకు ఎదురైన ఘ‌ట‌న‌ల గురించి వివ‌రించారు.

By r k
18th May 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

''క్వ‌శ్చన్ అండ్ ఆన్స‌ర్ వెబ్‌సైట్ క్వారాలో నాకు ఎదురైన ఓ ప్ర‌శ్న న‌న్ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఈ ప్ర‌శ్న ఓ టీనేజ్ యువ‌కుడి తండ్రి ఆందోళ‌న‌తో రాశారు. త‌న 17 ఏళ్ల కొడుకును వ్యాపారం ప్రారంభించాల‌నే ఆలోచ‌న నుంచి చ‌దుపుపైకి ఎలా దృష్టి మ‌ళ్లించాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్న‌. ఈ ప్ర‌శ్న‌కు నా వ‌ద్ద స‌రైన స‌మాధానం లేదు. కానీ ఈ ప్ర‌శ్న న‌న్ను చాలా ఏళ్ల వెనుక‌్కి తీసుకెళ్లింది. వ్యాపారం వైపుగా అడుగులు వేసిన న‌న్ను మా నాన్నతొలి చెంప‌దెబ్బ కొట్టిన రోజును గుర్తుచేసింది.

image


అది నేను ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న రోజులు. అప్పుడే మేం కొత్త కంప్యూట‌ర్‌, సీడీ రైట‌ర్ కొన్నాం. దీంతో నేను పైరేటెడ్ గేమ్ సీడీల‌ను త‌యారు చేసి నా క్లాస్‌మెట్స్‌కు రూ. 50కి అమ్మ‌డం ప్రారంభించాను. ఒక్కో సీడీపై రూ. 30 లాభం వ‌చ్చేది. ఈ విష‌యం తొంద‌ర‌లోనే నాన్న‌కు తెలిసి చెడామ‌డా తిట్టేశారు. ఒక‌టి రెండు లెంప‌దెబ్బ‌లు కూడా వేశారు. డ‌బ్బు సంపాదించ‌డం ఆపి చ‌దువుపై దృష్టిపెట్టాల‌ని సూచించారు. దీంతో సైడ్ బిజినెస్ ఆపి చ‌దువును కొన‌సాగించాను.

ఎనిమిదో త‌ర‌గ‌తిలో ఓ కొత్త కంప్యూట‌ర్ కావాల‌నుకున్నాను. కానీ నాకు వార్షిక ప‌రీక్ష‌ల్లో 90 శాతం మార్కులు వ‌స్తేనే కొత్త కంప్యూట‌ర్ కొనిస్తాన‌ని నాన్న తెగేసి చెప్పేశారు. దీంతో నాకు అర్థ‌మైంది. కొత్త కంప్యూట‌ర్ కొన‌డం అసాధ్య‌మ‌ని. దీంతో జైపూర్‌లోని మా కాల‌నీలో ఓ మ్యాగ‌జైన్‌ను ప్రారంభించాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. అందులో చిన్న పిల్ల‌ల క‌థ‌లు, ప‌ద్యాలు వంటివి ప్రింట్ చేయాల‌నుకున్నాను. ప్రింటింగ్ ప్రెస్‌తో డీల్ కూడా కుదుర్చుకున్నాను. అలాగే ఇరుగు పొరుగున ఉండే ట్యూష‌న్ టీచ‌ర్లు, కిరాణా షాప్‌ల‌తో యాడ్స్ ఇచ్చేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాను. ఒక్కో మ్యాగ‌జైన్‌ కాపీని రూ. 17కి అమ్మితే మంచి లాభాలు కూడా వ‌స్తాయ‌ని లెక్క‌లు కూడా వేసుకున్నాను. ఈ లాభాల‌తో కంప్యూట‌ర్‌ను కొనుక్కోవ‌చ్చ‌ని ఆశ‌ప‌డ్డాను. నా ఆలోచ‌న‌లు ఎవ‌రితోనైనా పంచుకోవ‌డం నా హాబీ. అలాగే ఈ విష‌యాన్ని కూడా మా అంకుల్‌తో చెప్పాను. ఆ వెంట‌నే ఈ విష‌యం నాన్నకు తెలిసిపోయింది. అంతే నా బెస్ట్ సెల్ల‌ర్ మ్యాగ‌జైన్ డ్రీమ్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. చ‌దువును ప‌క్క‌న‌పెట్టి స‌మ‌యాన్ని వృథా చేస్తున్నాన‌ని ఆ రోజు నాన్న తిట్టిన తిట్లు ఇప్ప‌టికీ నాకు గుర్తున్నాయి. మ్యాగ‌జైన్‌ను ప్రింటింగ్‌కు ఇచ్చే రెండు రోజుల ముందే ఈ డీల్ క్యాన్సిల్ అయింది. ఆ త‌ర్వాత దృష్టంతా చ‌దువుపైకి మ‌ళ్లించి మార్కులు సాధించా.. కానీ కొత్త కంప్యూట‌ర్ కొనేందుకు నాన్న చెప్పినంత ప‌ర్సంటేజ్ రాలేదు.

ఇక టెన్త్ క్లాస్‌లో ఉండ‌గా 30 పేజీల చిన్న ఓ చిన్న న‌వ‌ల‌ను రాశాను. నా క్లాస్‌మేట్స్‌కు ఆ న‌వ‌ల విప‌రీతంగా న‌చ్చింది. ఈ విష‌యం అలా అలా ప్రిన్సిపాల్ వ‌ర‌కు చేరింది. ఆ త‌ర్వాత అమ్మా నాన్న‌కు కూడా. చ‌దువు ప‌క్క‌న పెట్టి మిగ‌తా విష‌యాల‌పై దృష్టిపెడితే చెడామ‌డా తిట్టే నాన్న ఆ రోజు నా పుస్త‌కాన్ని అచ్చేసేందుకు ముందుకు రావ‌డం నాకు సంతోషం క‌లిగించింది. కానీ నేను ప‌ద‌త‌ర‌గ‌తి బోర్డు ఎగ్జామ్స్‌కు కూర్చోవాల్సి ఉండ‌టంతో ఆ ఐడియా కూడా మూల‌కు చేరింది.

ఇక కంప్యూట‌ర్ ఇంజినీరింగ్ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతున్న‌ప్పుడు కాలేజీ నుంచి నాన్న‌కు ఓ లేఖ వ‌చ్చింది. కాలేజీలో నా హాజ‌రు త‌క్కువ‌గా ఉంద‌ని ఆ లేఖ సారంశం. వాస్త‌వానికి ప్ర‌తి రోజు నేను కాలేజికి వెళ్లేవాడిని. కానీ లైబ్ర‌రీలో కూర్చుని కోడింగ్ నేర్చుకుంటుండేవాడిని. అలాగే టాప్ కోడ‌ర్‌లో పార్టిసిపేట్ చేసి కొత్త కొత్త లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాను. ప్ర‌తి సెమిస్ట‌ర్‌లో ఇలాంటి లేఖ‌లు మ‌రో 12 వ‌స్తాయ‌ని త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకాక‌పోవ‌డంపై మా నాన్న అడిగిన ప్ర‌శ్న‌ చెప్ప‌డం నాకు ఇంకా గుర్తుంది. ఆ త‌ర్వాత మా ఇంటికి మ‌రో తొమ్మిది లేఖ‌లు కాలేజీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ మా నాన్న ఎప్పుడూ న‌న్ను ప్ర‌శ్నించ‌లేదు. ఆ త‌ర్వాత ఆ కాలేజీలోనే ఎవ‌రికీ రానంత మంచి ఆఫ‌ర్ నాకు వ‌చ్చింది. ఆరంభంలోనే రూ. 16 ల‌క్ష‌లు ఆఫ‌ర్ చేసిందో కంపెనీ. ఐతే ఆ జాబ్‌లో ఎంతో కాలం కొన‌సాగ‌లేక‌పోయాను. తొమ్మిది నెల‌ల‌కే బ‌య‌ట‌కొచ్చి సొంతంగా ఓ కంపెనీని ఆరంభించాను. అలాంటి జాబ్ నాతో స‌హా ఎవ‌రికైనా డ్రీమ్ జాబే. ఐతే కొంత‌కాలం చేసిన త‌ర్వాత ఆ జాబ్‌లో కొన‌సాగ‌లేక‌పోయాను. కొత్త‌గా ఏదైనా సంస్థ‌ను ఆరంభించాల‌నుకున్నాను. స్నేహితులు, అమ్మా నాన్న అంతా అప్పుడే కంపెనీ పెట్ట‌డం స‌రికాద‌ని స‌ల‌హా ఇచ్చారు. మ‌రికొన్నాళ్లు అనుభ‌వం సంపాదించిన త‌ర్వాత కంపెనీ పెట్టాల‌న్న ఆలోచ‌న చేయ‌మ‌న్నారు. అమ్మ‌యితే మ‌ళ్లీ ఇలాంటి జాబ్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌ని, న‌చ్చ‌చెప్పేందుకు తెగ ప్ర‌య‌త్నించింది. ఐతే వాటిని నేన‌స‌లు ప‌ట్టించుకోలేదు. ఫ్లాట్ డాట్ కాం పేరుతో ఓ సంస్థ‌ను ప్రారంభించాను. ఐతే ఫ్లాట్ డాట్ కామ్ వైఫ‌ల్యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ట్టు నాలుగు నెల‌ల్లోనే తెలిసిపోయింది. ఉద్యోగులుకానీ, పెట్టుబ‌డిదారులు కానీ ఈ సంస్థ‌పై ఎవ‌రూ సంతృప్తిగా లేరు. దీంతో నేను గ‌తంలో వ‌దిలేసిన జాబ్ గురించే అంద‌రూ వేలెత్తి చూప‌డం మొద‌లుపెట్టారు. ఆ స‌మ‌యంలో నా మార్కెట్ వాల్యూ గురించి సూత్ర హెచ్ ఆర్ సంస్థ‌కు చెందిన వ‌కార్ గుర్తు చేయ‌డం కూడా నేను మ‌ర్చిపోలేదు.

స్కూలు నుంచి అవార్డ్ అందుకుంటున్న గౌరవ్, ఎడమ చేతివైపు తన తండ్రి కూడా ఆనందంగా చూస్తున్న తరుణం

స్కూలు నుంచి అవార్డ్ అందుకుంటున్న గౌరవ్, ఎడమ చేతివైపు తన తండ్రి కూడా ఆనందంగా చూస్తున్న తరుణం


ఆ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. ఫ్లాట్ డాట్ కామ్‌లో కామ‌న్ ఫ్లోర్ సంస్థ పెట్టుబ‌డులు పెట్టింది. అది ఇప్ప‌టికీ ప్ర‌త్యేక కంపెనీగా న‌డుస్తున్న‌ది. ఇటీవ‌లే ఫ్లాట్ చాట్ అనే మ‌రో సంస్థ‌ను కూడా ప్రారంభించాం. ఆ విభాగంలో అదో అత్యుత్త‌మ ప్రాడ‌క్ట్‌. నాన్న ఇప్ప‌టికీ నేనే ఏదో ఒక‌రోజు వైఫ‌ల్యం చెందుతానన‌నే అనుకుంటున్నారు. నేనూ అలాగే భావిస్తున్నాను. అయిన‌ప్ప‌టికీ రిస్క్ తీసుకోవ‌డం మాత్రం ఆప‌బోను. నాలోని అత్యుత్త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించేందుకే ప్ర‌య‌త్నిస్తాను. న‌న్ను ఎన్నిసార్లు తిట్టినా, కొట్టినా నాన్నంటే నాకు ఎంతో గౌర‌వం. ఆయ‌నేదీ చేసినా క‌రెక్టే. నాకు సాయం చేసేందుకే ప్ర‌య‌త్నిస్తారు.

మైల్స్ టెల్ల‌ర్‌, జేకే సిమ్మ‌న్స్ న‌టించిన విప్‌లాష్ మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది. నెక్ట్స్ చార్లీ పార్క‌ర్‌ను ఎప్పుడూ డిస్క‌రేజ్ చేయొద్ద‌ని.. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో ఎంట‌ర్‌ప్రెన్యూర్‌లుగా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న పిల్ల‌ల‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్న త‌ల్లిదండ్రుల‌కు ఇదే నా స‌మాధానం. పిల్ల‌ల‌ను ఆంట్రప్రెన్యూర్‌లుగా ఎద‌గాల‌నుకుంటున్న పిల్ల‌ల‌ను స‌ముదాయించండి. కానీ అత‌ను ప‌ట్టుద‌ల మీదుంటే మాత్రం త‌ప్ప‌కుండా అనుకున్న‌ది సాధించి తీరుతాడు. ఎవ‌రూ అత‌డి ఎదుగుద‌ల‌ను అడ్డుకోలేరు''.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

Our Partner Events

Hustle across India