Telugu

నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఆ సినిమానే..!!

హీరో నాని మనసులో మాట..!

team ys telugu
14th Sep 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

నాని! పేరుకు తగ్గట్టే పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో. అష్టా చమ్మా, అలా మొదలైంది, ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు, పిల్ల జమిందార్, ఎవడే సుబ్రహ్మణ్యం, భలె భలె మగడావోయ్, జెంటిల్మెన్ వంటి చిత్రాలతో.. తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు నాని. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన ఈ యంగ్‌ హీరో.. వరుస చిత్రాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం మజ్ను సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంలో నానితో యువర్ స్టోరీ ఇండియన్ లాంగ్వేజ్ మేనేజింగ్ ఎడిటర్ అర్వింద్ యాదవ్ తో ముచ్చటించాడు.

అర్వింద్ యాదవ్: హాయ్ నాని! అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారారు? అదెలా జరిగింది?

నాని: నిజానికి నేను స్టార్ కిడ్ కాదు. డబ్బు పెట్టే నిర్మాతలూ నా వెనక లేరు. మూవీలో మెయిన్ లీడ్ చేసే ఫేస్ కూడా కాదు నాది. అందుకే నాకు ఫిల్మి మేకింగే పర్ ఫెక్ట్ అనుకున్నా. పైగా టాలెంట్ ఉంటే ఈజీగా డైరెక్టర్ అయిపోవచ్చన్నది నా ఫీలింగ్. కానీ డెస్టినీ నన్ను హీరోని చేసింది.

అర్వింద్ యాదవ్: హీరోకి కావాల్సిన క్వాలిటీస్ లేవంటున్నారు. మరి ఈ స్టార్ డమ్ ఎలా సాధ్యమైంది?

నిజానికి నేను ఇండస్ట్రీలో ఏదో అయిపోవాలని రాలేదు. సూపర్ స్టార్ కావాలన్న కలలు కూడా పెద్దగా లేవు నాకు. కానీ జనం నన్ను ఆదరించారు. హీరోగా నిలబెట్టారు.

అర్వింద్ యాదవ్: మీ సక్సెస్ మంత్రం ఏంటి?

నాని: సక్సెస్ కంపల్సరీగా ఒక ఎనర్జీ లాంటిదే. కానీ పనిలో దొరికే సంతృప్తే గొప్పదని నా ఫీలింగ్. సక్సెస్ ను ఎప్పుడూ తలకెక్కించుకోను. నాకు తెలిసిందిల్లా పని పని పని. పొద్దున లేస్తే కాల్షీట్లు, సీన్ పేపర్లు, సినిమా. ఇదే నా ప్రపంచం.

image


అర్వింద్ యాదవ్: ఇన్నేళ్ల కెరీర్ లో ఇండస్ట్రీ నుంచి మీరు నేర్చుకున్నదేంటి?

నాని: అసిస్టింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఒక్క ముక్క ఇంగ్లిష్ కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇంగ్లిష్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. స్కూల్ డేస్ లో ఇనీషియల్ (ఇంటిపేరు) అర్థం కూడా తెలీదు నాకు. ఎవరైనా ఇనీషియల్ అడిగితే, యస్ అనే వాడిని. దాంతో అందరూ నా పేరు ఎస్.నవీన్ అనుకునే వాళ్లు. అంత బ్యాడ్ నా ఇంగ్లిష్. కానీ ఇండస్ట్రీనే నాకు అన్నీ నేర్పింది. రకరకాల భాషల్లో సినిమాలు చేశాను. మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నా. అష్టా చెమ్మా మూవీ టైమ్ లో నాది పూర్తిగా బ్లాంక్ మైండ్. ఒక్కో సినిమా నన్ను ఈ స్థాయికి చేర్చింది. పర్టిక్యులర్ గా నేను ఎక్కువగా నేర్చుకుంది ఫెయిల్యూర్స్ నుంచే.

అర్వింద్ యాదవ్: యాక్టర్ గా మీ గ్రేట్ సక్సెస్, ఘోరమైన ఫెయిల్యూర్ ఏంటి?

నాని: ఫ్రాంక్ గా చెప్పాలంటే నా జీవితంలో ఇంకా ఆ రెండూ రాలేదు.

అర్వింద్ యాదవ్: మీరు మరచిపోలేని సంఘటన?

నాని: ఫస్ట్ మూవీ అష్టా చెమ్మా ఎక్స్ పీరియెన్స్. నన్ను చూడటానికి కూడా జనం థియేటర్లకు వస్తారంటే నమ్మలేకపోయా. నాకింకా గుర్తుంది. అష్టా చెమ్మా ఫస్ట్ డే మార్నింగ్ షోకి భ్రమరాంబ థియేటర్ కు వెళ్లాం. థియేటర్ బయట ఒక్కరూ లేరు. ఖాళీ థియేటర్ లోకి వెళ్లాలంటే మనసు ఒప్పలేదు. తీరా లోపలికెళ్లి చేస్తే షాక్. హౌస్ ఫుల్. హాల్ అంతా ఒకటే నవ్వులు. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూసిన ఆ క్షణం ఎప్పటికీ మరిచిపోలేను.

అర్వింద్ యాదవ్: కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకు మీరిచ్చే మెసెజ్?

నాని: సందేశాలిచ్చే అంత స్థాయి కాదు నాది. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను. ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఒక గోల్ ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి అనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు. సక్సెస్ కావాలంటే ఒళ్లు వంచి కష్టపడాలి. అదే నా పాలసీ.

అర్వింద్ యాదవ్: ఫైనల్ గా మజ్ను సినిమా గురించి ఏం చెప్తారు?

నాని: మజ్ను సినిమా ఓ రికార్డులు తిరగరాసేస్తుందని చెప్పను. ఎవరికి ఏ సినిమా నచ్చుతుందన్న లెక్కలు నాకు తెలియవు. అలా ఆలోచించి సినిమాలు తీయడం నాకు రాదు. యాక్టర్ కన్నా ముందు నేనొక ప్రేక్షకుడిని. నాకు నచ్చిన సినిమాలు ప్రేక్షకులకూ నచ్చుతాయని నా గట్టి నమ్మకం. ఒక ప్రేక్షకుడిగా మజ్ను సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ కి కూడా సినిమా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా.

అర్వింద్ యాదవ్: ఓకే నాని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags