చాటింగ్ చేస్తూనే రీచార్జ్ చేసుకోవచ్చు..!

అమెరికన్ తో కల్సి సరికొత్త స్టార్టప్ తెచ్చిన భారతీయ అంట్రపెన్యూర్

29th Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాడు..! చాలా సేపట్నుంచి సీరియస్ గా ఈ చాటింగ్ నడుస్తోంది.

కానీ హఠాత్తుగా డాటా బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంది.. వెంటనే రీచార్జ్ చేసుకోమని అలర్ట్.. !

ప్రదీప్ కి ఏం చేయాలో అర్థం కాలేదు.. ఎందుకంటే తాను రీచార్జ్ చేసుకోవాల్సిన నెట్ వర్క్ కి సంబంధించిన యాప్ తన ఫోన్లో లేదు. ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేద్దామంటే డెడ్ స్లో. ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ మెసెంజరే.

ఆ మెసెంజర్ తోనే క్షణాల్లో రీచార్జ్ చేసేసుకున్నాడు..

ఎలా...? హౌ..?

రీచార్జ్ చేయమని గర్లఫ్రెండ్ కి మెసెజ్ పెట్టాడా..?. అంత సిన్మా లేదు..!

మరి మిత్రులెవరికైనా చెప్పి కూపన్ కొని కోడ్ తెప్పించుకున్నాడా..? దానికీ అంత సమయం లేదు..!

మరేం చేశాడు... ?

"రీచార్జ్ బాట్" వాడాడు...క్షణాల్లో రీచార్జ్ చేయించుకున్నాడు.

"రీచార్జ్ బాట్.." కొత్తగా ఉంది కదా... ప్రత్యేకంగా యాప్ డౌన్ లోడ్ చేసుకునే అవసరం లేకుండానే... మెసెంజర్ తోనే మొబైల్ రీచార్జ్ చేసుకునే సరికొత్త ఆప్షన్ రీచార్జ్ బాట్.

ఏంటీ ఈ రీచార్జ్ బాట్..?

ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసినట్లే చాటింగ్ చేసి మనకు ఎంత కావాలో అంత రీచార్జ్ చేసుకోవచ్చు. చాలా కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్ అప్లికేషన్ విజువలైజేషన్ ఫ్లాట్ మీద నడుస్తుంది. విశేషం ఏమిటంటే మనం ఇందులో చాట్ చేసేది ఏ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తోనేకాదు. అంతా టెక్నాలజీతోనే నడిచిపోతుంది. ప్రత్యేకంగా ఈ ఫ్లాట్ ఫాం మీద వ్యక్తులెవరూ పనిచేయరు. దీని కోసం ఫేస్ బుక్ మెసెంజర్ యాప్ ఉంటే చాలు. మెసెంజర్ లో ఫ్రెండ్స్ పేర్ల కోసం సెర్చ్ చేసే ఆప్షన్ దగ్గర Recharge bot అని టైప్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. ఇందులో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు మిగతా అంతా ఆటోమేటిక్ గా సాగిపోతుంది. మనకు ఎంత మొత్తం రీచార్జ్ చేసుకోవాలి..? డాటానా.. బ్యాలెన్సా.. అనేది ఎంచుకోవాలి. పేయూ ద్వారా మనీ చెల్లించవచ్చు.

మొదటిసారి రీచార్జ్ చేసుకుంటే నెంబర్ ను Recharge bot ఆటోమేటిక్ గా గుర్తు పెట్టుకుంటుంది. బ్యాలెన్స్ తగ్గిపోయినప్పుడు అలర్ట్స్ పంపుతూ ఉంటుంది. ఇదంతా ప్రత్యేకంగా యాప్ ఇన్ స్టాల్ చేసుకోకుండానే యాప్ విర్చువలైజేషన్ టెక్నాలజీ ద్వారా జరిగిపోతుంది. ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారానే అలర్ట్స్ పంపుతున్నాయి. వచ్చే వారం నుంచి ఐడియా, డొకొమో ఈ తరహా అలర్ట్ నోటిఫిషన్స్ పంపేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి.

ఈ పద్దతిలో ఒకటి కన్నా ఎక్కువ నెంబర్లను రీచార్జ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లకు మనం రీచార్జ్ చేయవచ్చు. ఈ తరహా రీచార్జ్ కు ఇప్పుడు అన్నీ నెట్ వర్క్ లు యాక్సెప్ట్ చేస్తున్నాయి.

దీన్ని ఎవరు ప్రారంభించారు..?

శ్రీనివాస్ ఎన్ జయ్. ఓ సీరియల్ అంట్రపెన్యూర్. పేజో పేరుతో క్రాస్ బోర్డర్ మనీ ట్రాన్స్ ఫర్ బిజినెస్ చేస్తున్నారు. సంస్థ పని మీద కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు బ్రూస్ కిమ్ అనే మరో అంట్రపెన్యూర్ పరిచయమయ్యారు. ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్ బిల్లింగ్ కంపెనీ నడుపుతున్న కిమ్.. బడా కంపెనీలకు సంబంధించిన రెండు బిలియన్ డాలర్ల లావాదేవీలను చూస్తున్నారు. వీరిద్దరూ కలిసి కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నారు. అందుకు ఇండియా అయితే బాగుంటుందని ఇద్దరూ అనుకుని బయలుదేరి వచ్చేశారు. 

పేజో పని ప్రారంభించక ముందు శ్రీనివాస్ మైక్రోసాఫ్ట్, అమెరికన్ గేమ్ డెవలపర్ ఎలక్ట్రిక్ ఆర్ట్స్ లో పనిచేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత ఏం చేద్దామని చర్చల్లో ఉండగా.. ఓ రోజు శ్రీనివాస్ తల్లి వాట్సాప్ లో మెసెజ్ పెట్టేందుకు ప్రయత్నించడం చూశారు. పెద్దవాళ్లకు సైతం ఇలాంటి చాటింగ్ యాప్ లు ఈజీగా వాడుతుంటడటం చూసి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. దాని ఫలితంగా ఆవిర్భవించినదే రీచార్జ్ బాట్.

శ్రీనివాస్ ఎన్ జయ్, బ్రూస్ కిమ్, రీచార్జ్ బాట్ ఫౌండర్లు <br>

శ్రీనివాస్ ఎన్ జయ్, బ్రూస్ కిమ్, రీచార్జ్ బాట్ ఫౌండర్లు


అంతా ఆటోమేటిక్..!

ఇండియాలో మొదట్టమొదటి బాట్ ఫ్లాట్ ఫామ్ ఇదే. మెసెంజర్ లాంటి మెసేజింగ్ యాప్స్ లో ఇలాంటి ఫ్లాట్ ఫామ్ ను ప్రత్యేకంగా యాప్ లేకుండా నడిపించేయడం చాలా సులువంటున్నారు. బాట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ దీనికి బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఫేస్ బుక్ మెసెంజర్ తో పాటు వీచాట్, కిక్, టెలిగ్రామ్ లాంటి చాటింగ్ యాప్స్ బాట్ APIలను అందుబాటులోకి తెచ్చాయి. వీటితోనూ టై అప్ కావాలని శ్రీనివాస్, బ్రూస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నేడో రేపో వాట్సాప్ కూడా ఈ బాట్ API ఫ్లాట్ ఫాంను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

రీచార్జ్ చేసుకునేందుకు వినియోగదారులు డబ్బులు చెల్లించేందుకు పేయూ, ఇన్ స్టా మోజోలతో రీచార్జ్ బట్ ఒప్పందానికి వచ్చింది. విదేశాల్లో ఉన్నవారు కూడా రీచార్జ్ చేయవచ్చు. త్వరలో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ మార్కెట్లలోనూ అడుగుపెట్టేందుకు వీరు ఇప్పటికే పని ప్రారంభించారు. రీచార్జ్ బాట్ లో జరిగే చాటింగ్ సహా మొత్తం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.

సరిహద్దులు లేని విజన్

శ్రీని ఈ టెక్నాలజీపై అమిత ఆసక్తిని ప్రదర్శించడాని కారణం ఉంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా విదేశాల్లోనో, మరో ప్రాంతంలోనే ఉంటారు. వీరంతా తల్లిదండ్రులకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ కేర్ తీసుకుంటారు. ఫోన్ బిల్లులు, రీచార్జ్, అలాగే కేబుల్ రీచార్జ్ సహా అన్నీ వారు ఆన్ లైన్ లో చెల్లించేందుకు ఇష్టపడతారు. అలాంటి వారు చాలా సులువుగా దీన్ని ఉపయోగించుకుంటారని శ్రీని అంచనా వేశారు. అలాగే కొత్త తరం జనరేషన్ ఇలాంటి పనులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు సిద్ధపడటం లేదు. ఒక్క స్టెప్ తో కంప్లీట్ అయిపోవాలని అనుకుంటున్నారు. పాతతరం వారికి స్మార్ట్ ఫోన్లు వాడటం పెద్ద సవాలే. కానీ వారికి చాటింగ్ యాప్ లు అలవాటైపోయాయి. వారు కూడా ఈ రీచార్జ్ బాట్ ను సులువుగా ఉపయోగించుకోగలరు.

దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంలో లోకలైజేషన్ వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు లోకల్ లాంగ్వెజెస్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, ఆ భాషలోనూ రీచార్జ్ చేసుకోవడం.. బిల్లులు చెల్లించడం లాంటి అవకాశాల్ని కల్పిస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

రీచార్జ్ బాట్ ను గత ఏప్రిల్ 25నే అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే దీనికి 350 మంది యాక్టివ్ యూజర్స్ జమ అయ్యారు. వీరిలో కొంత మంది యాక్టివ్ టెస్టింగ్ యూజర్లు. ఈ ఫ్లాట్ ఫామ్ ను మరింత విస్తరించేందుకు చాలా పెద్ద పెద్ద ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ-కామర్స్ సైట్లలా హైపర్ లోకల్ ఫ్లామ్ ఫామ్ ను రీచార్జ్ బాట్ టెక్నాలజీపైనే సృష్టించే ఆలోచన చేస్తున్నారు. అయితే వచ్చే నెల కల్లా డీటీహెచ్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు లాంటివి చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.

ప్రస్తుతం రీచార్జ్ బాట్ కు కమిషన్ ఇతర, రీచార్జ్ కంపెనీలకు వస్తున్నంతే వస్తోంది. కొత్త పెట్టుబడులు వచ్చిన తర్వాత కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

మార్కెట్ లో ఉన్న ఇతర బాట్ అసిస్టెంట్స్ తో పోలిస్తే రీచార్జ్ బాట్ కు అప్లికేషన్ విర్చువలైజేషన్ ప్లస్ పాయింట్. దీని వల్ల ప్రత్యేకంగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం వినియోగదారునికి లేకుండా పోతుంది. ఈ రంగంలో ఇతర పోటీదారులకు ఇదే అతి పెద్ద సవాల్ గా ఉంది. చాట్ ఆప్స్ తో అవగాహనకి రావడంతో పాటు లోకలైజేషన్ చేస్తూ మరిన్ని ప్లస్ పాయింట్లను పట్టుకుంటున్నారు. రీచార్జ్ బాట్ వంద శాతం ఆటోమేటెడ్ ఫ్లాట్ ఫామ్. క్యాబ్ బుక్ చేసుకోవడం, గ్రోసరీలను ఆన్ లైన్ లో కొనుగోలు చేసినంత ఈజీ.

రీచార్జులు, బిల్లుల పేమేంట్ రంగంలోని రీచార్జ్ బాట్ రాక.. పోటీని మరింత పెంచుతోంది. ఎవరు వినూత్నంగా, సింపుల్ గా ఉండే సేవలు అందిస్తారో వారికే మార్కెట్ పట్టం కట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో రీచార్జ్ బాట్ కు కొన్ని ప్లస్ పాయింట్లున్నాయి.

వెబ్ సైట్

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India