Telugu

ఆఫ్‌లైన్ డీల్స్‌లో అదుర్స్ అనిపిస్తోన్న ‘స్ట్రీట్ స్మార్ట్’

మాల్స్ నుంచి గల్లీ దుకాణాల వరకూ..మార్కెట్లో ఉన్న ఆఫ్‌లైన్ డీల్స్ వీళ్ల టార్గెట్యువతకు చేరువవుతున్న స్ట్రీట్ స్మార్ట్బెంగళూరులో వ్యాపిస్తోన్న యూజర్ బేస్ఫండింగ్ కోసం చూస్తున్న తెలుగు కుర్రాళ్లు

ashok patnaik
11th Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఆన్ లైన్ షాపింగ్ అంతా డీల్స్‌తో దుమ్మురేపుతున్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీలు వీటికి అతీతం కాదు. కానీ ఆఫ్ లైన్ డీల్స్ విషయానికొస్తే వేళ్లలో లెక్కబెట్టుకోవాల్సిందే. ఇదే ఐడియాతో యాప్ ప్లాట్ ఫాం లోకి దూసుకొచ్చింది స్ట్రీట్ స్మార్ట్. బడా బడా షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి గల్లీల్లో ఉన్న చిన్న షాపుల దాకా ఎలాంటి ఆఫర్లున్నాయో చెప్పేసే యాప్ ఇది. షాపింగ్ కి వెళ్లే ముందు తమ యాప్‌ని ఒక సారి విజిట్ చేస్తే చాలంటున్నారు స్ట్రీట్ స్మార్ట్ ఫౌండర్ ప్రభు సరిడే.

image


ఇంత స్మార్టా !

స్ట్రీట్ స్మార్ట్ మొబైల్ టెక్నాలజీ గతేడాది చెన్నై కేంద్రంగా ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది మంది టీంతో మొదలైన బూట్ స్ట్రాప్ స్టార్టప్ ఇది. ప్రస్తుతానికి బెంగళూకు కేంద్రంగా ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. షాపింగ్ మాల్స్, వీధుల్లో ఉన్న షాపులలో ఉండే డీల్స్‌ని ఆన్ లైన్లో అందిస్తోంది. షాపులకు సంబంధించిన పూర్తి డేటా, షాపింగ్ విశ్లేషణతో కస్టమర్లు ఎంతో ఈజీగా వివరాలు అందిస్తుంది. దీంతో దుకాణదారులు వారి వినియోగదారులను మరింత చేరువయ్యే సౌలభ్యం ఉంటుంది. ఆన్ లైన్లో అందుబాటులో లేని వివరాలను ఈ యాప్ ద్వారా అందించడం వీరి ప్రత్యేకత. సాధారణంగా ఆన్ లైన్లో డీల్స్ పెట్టడానికి పెద్ద షాపులే ముందుకొస్తాయి. ఆన్ లైన్ మార్కెట్ భారీగా విస్తరించినప్పటికీ కొన్ని షాపులకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ లభించడం లేదు. వాటి పరిస్థితి అలా ఉంటే చిన్న స్థాయి దుకాణాల వివరాలు దొరకడం అంటే ఇక చెప్పనక్కర్లేదు. దీన్ని టార్గెట్ చేస్తూ స్ట్రీట్ స్మార్ట్ వ్యాపారాన్ని విస్తరించింది.

image


టార్గెట్ కస్టమర్లు

సాధారణంగా ఆన్ లైన్ షాపింగ్ చేసే కస్టమర్లే వీరి టార్గెట్ కస్టమర్లు. అయితే వీరికి ఆన్ లైన్ డీల్స్ తోపాటు ఆఫ్ లైన్ డీల్స్ కోసం వెతికే వారికి ఇది చక్కనైన ఫ్లాట్ ఫాం అంటారు ఫౌండర్ ప్రదీప్. గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్ లాంటి వాటికి సంబంధించిన ఆఫర్ల కోసం వెతికే వారికి స్ట్రీట్ స్మార్ట్.. అనేది అందుబాటులో ఉన్న ఓ పరిష్కార మార్గం. ఇప్పటికే బెంగళూరులోని 200కి పైగా షాపర్లు ఈ సైట్ ద్వారా కస్టమర్లకు చేరువయ్యారు. ఇదంతా ఏడాది ప్రయాణంలో సాధించిన ఘనత. బెంగళూరు ఇంక్యుబేషన్ సెంటర్‌లో బూట్ స్ట్రాప్డ్ కంపెనీగా మొదలైన జర్నీ వేల మంది కస్టమర్లకు చేరువైయ్యే దాకా సాగింది. మరింత మంది కస్టమర్లకు ఆఫ్ లైన్ డీల్స్ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నమని ప్రదీప్ చెప్పుకొచ్చారు.

ఇతర ప్లేయర్లు

నిఫ్లర్, జెర్చ్ లాంటి ఇతర్ ప్లేయర్లు ఇప్పటికే ఈ రంగంలో తమ సత్తా చాటారు. వారి టార్గెట్ కస్టమర్లు కూడా ఆఫ్ లైన్ డీల్స్ కోసం వెతికే కస్టమర్లే. అయితే వీరిని కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి ఇంకా స్ట్రీట్ స్మార్ట్ చేరుకోలేదు కానీ భవిష్యత్‌లో మాత్రం వారితో పోటీ పడుతుందనే దీమాతో ఉన్నారు ప్రభు. తమిచ్చే వివరాల్లో ఎక్కువ శాతం బడా షాపింగ్ మాల్స్ కంటే చిన్న చిన్న దుకాణాలుండమే తమలోని ఉత్సహాన్నిచ్చే విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. తమలాంటి మొడల్ బిజినెస్ కొత్తగా చాలా మందికి ఆకర్షిస్తుంది. కస్టమర్లకు తామిచ్చే సేవలు, సౌకర్యాలు తమని ఎవరికీ కాంపిటీటర్ కాకుండా, ఎవరూ తమని కాంపిటీటర్ చేయకుండా సాగిస్తోందన్నారాయన.

స్ట్రీట్ స్మార్ట్ టీం

ప్రభు ఫౌండర్ గా ఉన్న ఈ స్టార్టప్ ను ఏడాది క్రితం ప్రారంభించారు. చెన్నైలోని వెల్‌టెక్ ఇంజనీరింగ్ కాలేజి నుంచి 2010లో ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. అనంతరం చెన్నై కేంద్రంగా 2012లో ఓ స్టార్టప్ ను ప్రారంభించారు. దానితో సాధించిన డేటా బేస్ తో 2014లో స్ట్రీట్ స్మార్ట్ ని లాంచ్ చేశారు. ఆయనతో పాటు 8మంది ప్రధానంగా దీనికి పనిచేస్తున్నారు. వీర ప్రతాప్ - ఆపరేషన్స్ చూస్తున్నారు. అంతా టెక్, మేనేజ్మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే. ఫండింగ్ వస్తే టీం ని మరింత పెంచాలనే యోచనలో ఉన్నట్లు ప్రభు ప్రకటించారు.

యాప్ ప్రత్యేకతలు

స్ట్రీట్ స్మార్ట్ సాస్ పై పనిచేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చి.. వినూత్నంగా జనం ముందుకొచ్చింది. డెయిలీ రెండు వేల మంది యాక్టివ్ సైనప్ ఉంటున్నారు. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో 7 వేలకు పైగా యాప్ డౌన్‌లోడ్స్ అయ్యాయి. బెంగళూరులోని బ్రిగేడ్, ఎంజీరోడ్ లోని చిన్న చిన్న దుకాణాలతో పాటు బడా మాల్స్ దాకాతమ ఆఫర్లను ఈ యాప్ లో అందుబాటులోకి తెచ్చాయి. సిటీలోని బాటా, హష్ పప్సీస్ లాంటి దాదాపు 200లకు పైగా బ్రాండ్ లు తమ డీల్స్ ను స్ట్రీట్ స్మార్ట్ ద్వారా అందిస్తున్నాయి.

స్ట్రీట్ స్మార్ట్ క్లెయింట్స్

స్ట్రీట్ స్మార్ట్ క్లెయింట్స్


భవిష్యత్ ప్రణాళికలు

“దేశంలో ఆన్ లైన్ యూజర్ల సంఖ్య బాగా పెరిగింది. షాపింగ్ కూడా ఆన్ లైన్ లో చేయడం అలవాటు అవుతోంది. కానీ ఆఫ్ లైన్ షాపర్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దానికున్న మార్కెట్ దానికి ఉంది. షాప్ కు వెళ్లి కొనుక్కునే సాంప్రదాయ కస్టమర్లకోసమే మా స్ట్రీట్ స్మార్ట్” అన్నారు ప్రభు. ప్రస్తుతం రోజుకి రెండు లక్షల యాక్టివ్ సైనప్స్ ఉంటున్నాయి. వీరిని యాక్టివ్ యూజర్లు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాల చేస్తున్నాం. సాధారణ షాప్ లకు ఆన్ లైన్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని. కిరణా షాపు దగ్గరి నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా దుకాణాల్లో దొరికే అన్ని వస్తువులకు సంబంధించిన డీల్స్ అందించడమే తమ లక్ష్యంగా స్ట్రీట్ స్మార్ట్ పనిచేస్తోంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags