ట్రెకింగ్‌లో క్వీన్‌గా ఎదుగుతున్న ఇషానీ సావంత్

ట్రెకింగ్‌లో క్వీన్‌గా ఎదుగుతున్న ఇషానీ సావంత్

Saturday August 29, 2015,

4 min Read

అది లడఖ్ పర్వత ప్రాంతం... ఎదురుగా 22 వేల 54 అడుగుల ఎత్తైన పర్వతం. దాన్ని చూస్తుంటే పర్వతారోహకులకు ఎవ్వరికైనా అధిరోహించాలన్న ఉత్సాహమే కాదు... దమ్ముంటే నన్ను అధిరోహించడని సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తుంది కూడా. చూడ్డానికి దుర్బేధ్యంగా కనిపించే ఆ ఎత్తైన పర్వతాన్ని ఎక్కడానికి ఆ క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కనీసం రెండు రోజులైనా పడుతుంది. అయితే ఆ సాహసాన్ని ఇషాని సావంత్ చేసి చూపించారు. అంతే కాదు. ఆ మార్గంలో పర్వతారోహణ చరిత్రలో సరికొత్త రికార్డులను కూడా సృష్టించారు.

పూణె నుంచి వచ్చిన ఇషానీ... సాహస పర్యటనలు చేయ్యాలనే కుతూహలం ఉన్న వాళ్లకు శిక్షణ ఇస్తుంటారు. వాళ్లకు గైడ్‌గా కూడా పని చేస్తున్నారు. పూణె లా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఇషాని అప్పట్లో వారాంతాల్లో చుట్టూ ఉన్న పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇవాళ తన లాంటి ఎంతో మంది ఔత్సాహికులకు శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు.

ఇషానీ సావంత్, మౌంటెనీర్

ఇషానీ సావంత్, మౌంటెనీర్


13 ఏళ్ల వయసులో హిమాలయ పర్వతాలను చూసేందుకు వెళ్లినప్పుడు తన గమ్యం ఏంటో అర్థమైంది ఇషానీకి. " ఆ సమయంలో అత్యద్భుతమైన హిమాలాయాలను చూసి ముగ్ధురాలైపోయాను. ఆ పర్వతానువుల అందాలన్నింటినీ నా చిన్న కెమెరాలో బంధించాను. తరువాత ఆ ఫోటోలే నాకు సహచరులయ్యాయి. పర్వతాల యొక్క గొప్పదనాన్ని అవి నాకు నిరంతరం గుర్తు చేస్తుండేవి " అంటూ ఆ నాటి మధుర జ్ఞాపకాలను చెబుతారు ఇషానీ.

పర్వాతారోహణమనే క్రీడ గురించి ఇండియాలో ఎప్పుడూ పెద్దగా విని ఉండం. అందులోనూ ఈ రంగంలో మహిళలు కూడా పెద్దగా లేరు. పర్వతారోహణను సీరియస్‌గా తీసుకున్న అతి కొద్ది మంది భారతీయ మహిళల్లో ఇషానీ కూడా ఒకరు. ఒక శిక్షకురాలిగా, గైడ్‌గా బయటి ప్రాంతాలకు వెళ్లడం ఆమె జీవితంలో సర్వసాధారణం. ఇది కేవలం ఆమెకు జీవితాన్నివ్వడమే కాదు . ఈ ప్రపంచంలో అవసరమైనదాని కన్నా ఎక్కువ గుర్తింపునే తీసుకొచ్చింది కూడా.

విజయ దరహాసం

విజయ దరహాసం


పర్వతాలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. కానీ ట్రెకింగ్ మాత్రం మన ధైర్య సాహసాలకు పరీక్షే. ఎక్కే ప్రతిసారీ నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలంటారు ఇషానీ. ప్రకృతి కరుణించి వాతావరణం అనుకూలిస్తే సరే... లేకపోతే ఒక్కోసారి గమ్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం కూడా ఉండదు. పైకి ఎక్కుతున్న కొద్దీ దారి మరింత క్లిష్టంగా మారుతుంది. ఎప్పుడు ఏ అపాయం ముంచుకొస్తుందో ఊహకు కూడా అందదు. చాలా సార్లు మనవల్ల కాదు అనుకుంటాం కానీ మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకెళ్లాలి. కానీ ప్రయాణం పూర్తయిన ప్రతీ సారి అనుభవించే సంతృప్తి, ప్రశాంతత మాటల్లో వర్ణించలేం అంటారు ఇషానీ.

పర్వాతారోహణ అణకువను బోధిస్తుంది, ఏకాగ్రతతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మార్గం మధ్యలో చేసే ఒక్క చిన్న తప్పు కూడా ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు. కనుక ఎక్కే ప్రతి సారి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరావు. పర్వతాల పట్ల గౌరవంతో ప్రతి క్షణం జాగురూకతతో ఉండాలి.

" ఇక్కడ అపాయింట్మెంట్లుడవ్.. చర్చలుండవు. నువ్వు ... నీ ఎదురుగుండా పర్వతం అంతే.." అంటారు ఇషానీ.

మొట్టమొదటి సారి పర్వతారోహణ చెయ్యాలనుకున్పప్పుడు చాలా కష్టమైపోయింది. సాధారణంగా ఓ అమ్మాయి కొండలు , గుట్టలు ఎక్కుతానంటే ఏ కుటుంబం ఒప్పుకోదు. వాళ్లను ఒప్పించడానికి ఎన్నో తిప్పలుపడాల్సి వచ్చింది.

"మొదట్లో ఈ ప్రొఫెషన్‌లో చాలా మంది పురుషులతో కలిసి కొండలెక్కాల్సి వచ్చేది. ట్రెక్కింగ్ చేసే మహిళల సంఖ్యను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. మొదట్లో పురుషులు నేను కూడా కొండలెక్కుతానంటే పెద్దగా నమ్మేవారు కాదు. ఎందుకంటే గతంలో చాలా మంది అమ్మాయిలు నాలాగే మొదట్లో ముందుకొచ్చి మధ్యలోనే వదిలేశారు. నాకు శిక్షణ ఇచ్చే వారికి మాత్రం నాపై నమ్మకం ఉండేది. అమ్మాయినని నాకు ఎలాంటి మినహాయింపులు ఉండేవి కాదు. అబ్బాయిలు 50 గుంజీలు తీస్తే నేను కూడా తీసేదాన్ని " అని ధైర్యంగా చెబుతారు ఇషానీ.

విమర్శలతో సంబంధం లేకుండా ఇషానీ తన ప్రయాణం మొదలు పెట్టారు. ఆమె మొండి పట్టుదలను , నిబద్ధతను చూసిన వాళ్ల నోళ్లు మూతలు పడ్డాయి. పర్వతారోహణ విషయంలో సాంకేతిక నైపుణ్యం పెంచుకునేందు 18 ఏళ్ల వయసులో హిమాలయ అధిరోహణ శిక్షణా సంస్థలో పేరు నమోదు చేసుకున్నారు.

ఇషానీ సావంత్

ఇషానీ సావంత్


కొండలెక్కడంతో పాటు కొన్ని సాహస క్రీడల్లో శిక్షణ కూడా బాగా పనికొచ్చింది. కొన్నేళ్ల తరువాత ఉత్తర భారతంలో చాలా సాహసయాత్రలకు నాయకత్వం వహించారు. స్థానిక బృందాలతో కలిసి సహ్యాద్రి పర్వతాల్లో ట్రెక్కింగ్ క్యాంపులను నిర్వహించారు.

గొప్ప గొప్ప పర్వాతాలన్నీ ఇషాకి గురువులతో సమానమే. ప్రకృతి ఎంత సహనంగా అన్నీ ఇస్తుందో... అంతే భయంకరంగా తీసుకుపోతుంది కూడా. 2014లో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలు ఆ విషయాన్ని బాగా గుర్తు చేస్తాయంటారు ఇషానీ.

ఉత్తరాక్షి పర్వాతారోహణకు తన బృందమంతా సిద్ధమయ్యారు. కానీ అనుకోని పరిస్థితుల్లో వరదల్లో నాలుగు రోజుల పాటు చిక్కుకుపోయారు. నాలుగు రోజుల పాటు ఆగకుండా వర్షం పడింది. ఎటు చూసినా నాశనమే. దారి పొడుగునా శవాల గుట్టలే . "ఉదయాన్నే బ్లాక్ టీ, ఉడికించిన బంగాళ దుంపలు, చపాతీలతోనే గడిపాం. ఎక్కడ చూసినా వరద బీభత్సమే" - ఇదీ ఇషానీ ఉత్తరాక్షి టూర్ అనుభవం.

ఆ సమయంలోవెళ్లే దారులన్నీ నాశనమైపోయాయి. దాంతో వారు కొత్తగా మర్గాన్ని వెత్తుకోవాల్సి వచ్చింది. మార్గ మధ్యంలో ఎన్నో గ్రామాలు కనుమరుగయ్యాయి. కనీసం బాధితులకు షెల్టర్ కూడా లేదు. ప్రభుత్వ పాఠాశాలల తాళాలు పగులగొట్టి రాత్రి వేళల్లో అందులో తలదాచుకొని తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేశారు. " ఆ సమయంలో మా శరీరాలు, మనస్సు, హృదయం అన్నీ అలసి పోయినా, చివరకు షూ సోల్ పూర్తిగా చిరిగిపోయినా మా పయనం మాత్రం ఎక్కడా ఆగలేదు " అంటారు. అప్పటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకుంటూ ఇషానీ.

స్టాక్ కంగ్రీ వద్ద ఇషానీ, ప్రేరణ డంగై

స్టాక్ కంగ్రీ వద్ద ఇషానీ, ప్రేరణ డంగై


"సాధారణంగా అందరూ వెళ్లే లెహ్-మనాలీ, మనాలీ-లెహ్ మార్గంలో ట్రెక్కింగ్ చెయ్యడం అప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అప్పటికే అక్కడ ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్న అర్చిత్‌ను కలిశాం. వాళ్ల టీంతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. టెంటు ,బట్టలు, ఆహార పదార్థాలు, అవసరమైన అన్నింటినీ పట్టుకుని బయల్దేరాం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కేవలం టీ మాత్రమే. రెండు జీడిపప్పులు, రెండు బాదం, రెండు వాల్ నట్స్ అదే మా మధ్యాహ్న భోజనం. రాత్రికి మాత్రం నూడుల్స్ లేదా పాస్తా తీసుకునేవాళ్లం. ఎప్పుడో మూడేళ్ల క్రితం మ్యాపులను పట్టుకొని దారి వెతుక్కుంటూ బయల్దేరాం. కానీ అప్పటికీ ఇప్పటికీ అక్కడ పరిస్థితుల్లో చాలా మార్పొచ్చింది. పర్వతానువులతో పాటు నదీ గమనం కూడా మారిపోయింది. ఎందుకంటే అక్కడ వారానికోసారి కొండచరియలు విరిగిపడుతునే ఉంటాయి. అవి హిమాలయాల్లో అత్యంత పిన్నవయస్కులైన పర్వతాలు . అక్కడ అలాంటివి సర్వసాధారణం. మేం చాలా కొత్త మార్గాలను కనుగొన్నాం. మరి కొన్ని సార్లు పాత మార్గాలను పునరుద్ధరించాం. దారి మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు క్యాంప్ సైట్స్‌ను మేమే సిద్ధం చేసుకున్నాం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ట్రెక్కింగ్ అది " అంటారు ఇషానీ.

image


భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న విషయంలో పెద్దగా పట్టించుకోకపోయినా .. వీలైనంత ఎక్కువ సమయాన్ని బాహ్య ప్రపంచంతోనే గడపాలన్న విషయంలో మాత్రం స్థిరాభిప్రాయంతో ఉంటారు. " పది రోజుల పాటు సుమోరీ లోని ఆల్పైన్ , స్టాక్ కాంగ్రీ వంటి పర్వతాల్లో గడిపిన తరువాత నాకు ఇంకేదీ అసాధ్యమనిపించలేదు. నీపై నీకు నమ్మకం ఉంటే చాలు అంటారు ఇషానీ.

సిక్కిలో జరిగిన రాక్ క్లైంబింగ్ ఓపెన్ నేషనల్స్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. తన సాహస అన్వేషణకు స్పాన్సర్ గా ఎవరొస్తారా.. అని ఎదురు చూస్తున్నారు.