మీరు యాప్ డెవలపర్లా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

భారత్ లో యాప్ ల ఫ్యూచర్ పై ట్వీట్టర్ "ఫ్యాబ్రిక్" బృందం విశ్లేషణ

22nd Apr 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


ఇండియాలో ఇప్పుడు 120 కోట్ల జనాభా.. 150 కోట్ల ఫోన్లు. అంతే కాదు వాడుతున్న స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారూ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. పర్సనల్ కంప్యూటర్లలో ఇంటర్నెట్ వాడేవారి కన్నా.. ఫోన్లలో అంతర్జాలంలో విహరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. దేశంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్ లో 70శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే వస్తోంది. ఈ అంశమే కొత్త తరం అంట్రప్రెన్యూర్లకు, మొబైల్ డెవలపర్లకు ఇండియా ఓ ప్రొత్సాహకరమైన ప్రదేశంలా మారింది. ఓ అంచనా ప్రకారం భారత్ లో ఇప్పుడు మూడు లక్షల మంది అప్లికేషన్ డెవలపర్లున్నారు. యాప్ మార్కెట్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్న మార్కెట్ ఇండియాది. అమెరికా తర్వాత రెండో అతి పెద్ద ఆండ్రాయిడ్ డెవలపర్ కమ్యూనిటీ ఉన్నది కూడా మనదేశంలోనే.        

అయితే యాప్ స్టోర్లు పెడుతున్న రకరకాల ఇబ్బందుల వల్ల ఈ యాప్ డెవలపర్లు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎంతో విలువైన సమయాన్ని వారు అనవసరమైన విషయాలపై వెచ్చించాల్సి వస్తోంది. కొద్ది రోజుల కిందట ట్విట్టర్ బృందం "హలో వరల్డ్ డెవలపర్ టూర్" పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ట్విట్టర్ సీనియర్ డైరక్టర్ అరవిందర్ గుజ్రాల్, ట్విట్టర్ ఫ్లాట్ ఫామ్ పార్ట్ నర్ షిప్స్ హెడ్ అలీపార్ యాప్ ప్రపంచంలో వస్తున్న అనేక మార్పులపై చర్చించారు. యాప్ డెవలపర్లకు వస్తున్న, రానున్న ఇబ్బందుల గురించి విశ్లేషించారు.

ట్విట్టర్ ఫ్యాబ్రిక్ బృందం <br>

ట్విట్టర్ ఫ్యాబ్రిక్ బృందం


యాప్ స్టోర్ పెట్టే ఇక్కట్లు

ప్రపంచంలో మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత యాప్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. 2014లో హాలీవుడ్ సినిమాలు మొత్తం జనరేట్ చేసిన రెవిన్యూ కంటే మొబైల్ డెవలపర్లు ఆర్జించిందే ఎక్కువ. అంటే మొబైల్ యాప్ మార్కెట్ హాలీవుడ్ ను రెండేళ్ల కిందటే దాటేసిందన్నమాట. ఇదే అంశం ప్రపంచం వ్యాప్తంగా మొబైల్ యాప్ డెవలపర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందులో భారత్ వాటా కూడా తక్కువేమీ కాదు. యాభై డాలర్ల కన్నా తక్కువ ఉన్న స్మార్టు ఫోన్లు భారత్ లో బోలెడన్ని. అప్లికేషన్ల డౌన్ లోడ్ రేటు కూడా చాలా ఎక్కువే. అయితే ఇదే మైనస్ పాయింట్ కూడా. తక్కువ ధర స్మార్ట్ ఫోన్ల సామర్థ్యం కూడా తక్కువ కావడంతో యాప్ అన్ ఇన్ స్టాల్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. రోజుకు ఓ కొత్త రకం స్మార్ట్ ఫోన్, ట్యాబ్ మార్కెట్ ను ముంచెత్తుతుండటం కూడా యాప్ డెవలపర్లకు పెద్ద సవాల్ గా మారింది. యాప్ ను రెగ్యులర్ ఫోన్ యూజర్లు యాక్టివ్ గా ఉంచేలా చేసుకోవడం వీరికి పెద్ద సవాల్ గా మారింది.

ఇదే కాదు.. అసలు యాప్ ను యాప్ స్టోర్ లో అందుబాటులోకి తెచ్చే విషయంలోనే డెవలపర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు వందరకాల స్టెప్స్ కంప్లీట్ చేస్తే తప్ప.. యాప్ ని స్టోర్ లో అందుబాటులోకి తేలేకపోతున్నారు. వెర్షన్ నెంబర్ అప్ డేటింగ్, రిలీజ్ నోట్స్ యాడ్ చేయడం, స్క్రీన్ షాట్స్ తీసుకోవడం లాంటి చిన్న చిన్న విషయాలే డెవలపర్లకు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. స్క్రీన్ షాట్స్ తీసుకోవడం అనేది చాలా మందికి ఓ పీడకలగా మారింది. ఆపిల్ అయితే ఒక్కో డివైజ్, అలాగే ఒక్కో లాంగ్వేజ్ కు విడివిడిగా స్క్రీన్ షాట్స్ తీసుకోవాలనే నిబంధన పెట్టింది. దీని ప్రకారం ఓ డెవలపర్ వందల కొద్దీ స్క్రీన్స్ షాట్స్ తీసుకోవాలి. ఐఫోన్, ఐపాడ్ లో యాప్ అందుబాటులోకి వచ్చేలా చేయాలంటే రెండువందల నుంచి మూడు వందల వరకు స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి. దీని కోసం ఒక మనిషి రోజంతా పనిచేయాల్సి ఉంటుంది.    

వీటితో పాటు కీలకమైన బగ్స్ , ప్రొవిజనింగ్ ప్రొఫైల్స్, కీస్, అప్ టు డేట్స్, పుషింగ్ఔట్ అప్ డేట్స్ వంటి విషయంలో డెవలపర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ అంశాలన్నింటినీలోనూ సాయం చేయాడనికి ట్విట్టర్ ఫ్యాబ్రిక్ అనే కొత్త ఫ్లాట్ ఫామ్ సేవలు అందిస్తోంది. ఫ్యాబ్రిక్ లోని ఫాస్ట్ లైన్ ద్వారా యాప్ డెవలపర్లకు దాదాపు పది లక్షల గంటల పని సమయాన్ని ఆదా చేస్తున్నది. ఈ ఫాస్ట్ లైన్ టూల్ కిట్ స్క్రీన్ షాట్స్ తీసుకోనే వ్యవహారాన్ని క్షణాల్లో పూర్తి చేస్తుంది. ఇప్పుడు ట్విట్టర్ కి ఈ ఫ్యాబ్రిక్ ఓ వరంలా మారింది. రెండు బిలియన్ల యాక్టివ్ డివైజస్ లో ఫ్యాబ్రిక్ రన్నింగ్ అవుతోంది.

" థర్డ్ పార్టీ కిట్స్ కాన్సెప్ట్ తో గత ఏడాది ఫ్యాబ్రిక్ ను ఇంట్రడ్యూస్ చేశాం. మేము చేయలేకపోయిన బెస్ట్ ఇన్ క్లాస్ ప్రొడక్ట్స్ ఫాస్ట్ లైన్, క్రాషిలిటిక్స్ ద్వారా ఫ్యాబ్రిక్ ఫ్యామిలీలో భాగమయ్యేలా చూస్తున్నాం" అలీ పార్, ఫ్లాట్ ఫామ్ పార్ట్ నర్ షిప్స్ హెడ్ , ట్విట్టర్

image


భారత్ లో మొబైల్ రివల్యూషన్

ట్విట్టర్ బృందం గత ఏడాది మేలో ఒక ఈవెంట్ కండక్ట్ చేసింది. క్రితంసారికి ఈసారికి మొబైల్ అప్లికేషన్లకు సంబంధించి భారతదేశంలో ఎంతో అవగాహన పెరిగిందనే విషయం చాలా సులువుగా అర్థమవుతుందని అరవిందర్ గుజ్రాల్ అంచనా వేస్తున్నారు. అన్ని అంచనాల ప్రకారం గత ఏడాది కాలంలో భారత్ లోని టాప్ -100 లో ఉన్న అప్లికేషన్లలో ఆరవై ఐదు శాతం ట్విట్టర్ కు చెందిన ఫ్యాబ్రిక్ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించుకున్నవే. ప్రత్యేకంగా ప్రచారం చేయనప్పటికి.. యాప్ డెవలర్ల మౌత్ పబ్లిసిటీతో ఈ విజయం సాధ్యమైందంటున్నారు. "ఫ్యాబ్రిక్" ఉపయోగించడం వల్ల పనిని సులువు చేసుకునే యాప్ డెవలపర్లు ఎక్కువగా ఇతరులకు రికమెండ్ చేస్తున్నారు. దీంతో ఫ్యాబ్రిక్ ఏడాదిలోనే మోస్ట్ వాంటెడ్ గా మారింది.

"భారత్ లో ప్రాక్టో, జోమాటో, లుక్ అప్, జెట్ ఎయిర్ వేస్, ఎన్డీటీవీ లాంటి అగ్రస్థానంలో ఉన్న అప్లికేషన్లు అన్నీ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ కింద రూపొందినవే. ఫ్యాబ్రిక్ లో ఉన్న స్పెషల్ కిట్స్, API( అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్ ) సహకారంతో ఈ యాప్ ప్లేయర్స్ అందరూ తమ వినియోగదారులందరితో వేగంగా ఇంటరాక్ట్ కాగలుగుతున్నారు." అరవిందర్ గుజ్రాల్, సీనియర్ డైరక్టర్, ట్విట్టర్

ప్రాక్టో .. హెల్త్ క్వైరీస్ పై రియల్ టైం ఆన్సర్స్ ఇవ్వగలుగుతోంది. జెయిట్ ఎయిర్ వేస్.. విమానాల రాకపోకలపై తక్షణ సమాచారాన్ని అందించగలుగుతోంది. అలాగే తక్కువ ధరం టిక్కెట్ల అవైలబులిటీని తన యాప్ లో జెట్ ఈజీగా చూపిస్తోంది. దీనికి అంతటికి ఫ్యాబ్రిక్ ఫ్లాట్ ఫామే కారణం.

image


మారుతున్న యాప్ గ్లోబల్ ట్రెండ్

చాలా కాలం క్రితం వరకు అమెరికాను ఇన్నోవేషన్ హబ్ గా భావించేవారు. మిగతా ప్రపంచం మొత్తం ఆ ఆవిష్కరణను అనుకరించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. సాఫ్ట్ వేర్ ఇన్నోవేషన్ అమెరికా నుంచి ప్రపంచం మొత్తం విస్తరిస్తోంది. ముఖ్యంగా ఆసియా, యూరప్ లోని కొన్ని ప్రాంతాలు పెద్ద మార్కెట్లుగా అవతరిస్తున్నాయి. ఎందుకంటే ఈ మార్కెట్లకు అధిగమించడానికి చాలా సవాళ్లున్నాయి. ఆ క్రమంలో మార్కెట్ విస్త్రతమవుతోంది. ఉద్యోగ విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాలకు తిరిగినప్పుడు వివిధ మార్కెట్లలో ఉన్న విభిన్న పరిస్థితులను గుర్తించినట్లు పార్ అలీ వివరిస్తున్నారు. పశ్చిమదేశాల్లో పర్సనల్ కంప్యూటర్లను ప్రధమ ప్రాధాన్యంగా గుర్తిస్తారు. వాటితో పాటు మొట్టమొదటగా ఈమెయిల్ ను కమ్యూనికేషన్ కు మొదటి చాయిస్ గా పెట్టుకుంటారు. కానీ మొబైల్ ఫస్ట్ మార్కెట్లలో మాత్రం మొబైల్ నెంబర్ ఈ స్థానంలో ఉంటుంది. ట్విట్టర్ గ్లోబల్ ఎస్సెమ్మెస్ ఫ్లాట్ ఫాంను రెడీ చేసినప్పుడు చాలా సవాళ్లను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్నమైన టెక్నాలజీ ఫ్లాట్ ఫామ్స్ మీద, మల్టీపుల్ నెట్ వర్క్ మీద పని చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ దీన్ని ఫ్యాబ్రిక్ లోని డిజిట్ ఆప్షన్ ఈజీ చేసింది. ఫోన్ నెంబర్ సైన్ ఇన్ ద్వారా డిజిట్ ఈ ప్రాసెస్ అత్యంత తేలిక చేసింది.

" ఇండియాలోని ట్విట్టర్ యూజర్స్ లో మూడింట రెండు వందల మంది మొబైల్ యూజర్సే. యూజర్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక్క డెస్క్ టాప్ యూజర్స్ మాత్రమే కాదు.. ట్విట్టర్ యూజర్స్ అందరూ అటుడెస్క్ టాప్ లోనూ.. ఇటు మొబైల్ లోనూ సైన్ ఇన్ అవుతున్నారు" అలీ పార్, ఫ్లాట్ ఫామ్ పార్టనర్ షిప్స్ హెడ్ , ట్విట్టర్

image


మొబైల్ వీడియోలదే ఫ్యూచర్

ట్విట్టర్ లో వీడియోల భాగస్వామ్యం అంతకంతకూ పెరుగుతోంది. ఇండియాతో పోలిస్తే ఇతర దేశాల్లో ఇది చాలా ఎక్కువ. భారత్ లో మొబైల్ నెట్ వర్క్స్ కు సంబంధించిన విషయాలే అతి పెద్ద సమస్య. ప్రపంచంతో పోలిస్తే ఇండియాలో మొబైల్ వీడియోల పెరుగుదల అంత ఎక్కువగా లేదు. నాన్ ఇంగ్లిష్ యూజర్లకు స్థానిక భాషల వీడియో కంటెంట్ అత్యంత ముఖ్యమైనది. 4జీ సర్వీసులు భారత్ లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరగాలంటే నెట్ వర్క్ కంట్రిబ్యూషనే అత్యంత ముఖ్యం. డాటా ప్లాన్స్ మరింత కాంపిటీటివ్ గా, రీజనబుల్ గా ఉండాలి. అప్పుడే భారత్ లో వినియోగదారులు వీడియో కంటెంట్ ను మరింత ఎక్కువగా వినియోగించే అవకాశం ఉందని అలీ పార్ విశ్లేషించారు.

అయితే ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన అలీ... నెట్ వర్క్ సామర్థ్యంకి సంబంధించి స్టాండర్డ్ డెఫినేషన్ ఏమీ లేదంటున్నారు. విభిన్న నెట్వర్క్ లు విభిన్న ప్రకటనలు చేస్తున్నాయంటున్నారు. టెలికాం సంస్థలే టూజీ, త్రీజీ, ఫోర్ జీ నెట్ వర్క్ ల స్టాండర్డ్స్ పై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలంటున్నారు.

image


సక్సెస్సే కానీ.. ఫెయిల్యూర్ అప్లికేషన్లు

గత ఏడాది స్మార్ట్ ఫోన్ కొత్త ప్రపంచంగా అవతరించింది. ఇది ఎంతో మంది యాప్ డెవలపర్లను క్రియేట్ చేసింది. వాట్సాప్ లాంటి వాటిని క్రియేట్ చేసి సంచలనం సృష్టించాలని ప్రయత్నించని డెవలపర్లు లేరు. అయితే వేలల్లో యాప్ స్టోర్ లోకి చేరుకున్నవాటిలో కేవలం వందల్లోనే మనగలుగుతున్నాయి. మిగిలినవన్నీ కాలగర్భంలో కలసిపోతున్నాయి. వందలు, వేల డౌన్ లోడ్లను యాప్ సాధించినా ఎదుగుబొదుగూ ఉండటంలేదు. అన్ ఇన్ స్టలేషన్ రేటు అధికంగా ఉండటంతో యాప్ కనుమరుగు కావడానికి ఎక్కువ కాలం పట్టడం లేదు. దీనికి ప్రధానకారణం లోఎండ్ స్మార్ట్ ఫోన్లే అర్విందర్ గుజ్రాల్ విశ్లేషిస్తున్నారు. దీన్నే జోంబి ఎఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సక్సెస్- పేషంట్ డెడ్ అన్నట్లు యాప్ ల పరిస్థితి మారిపోతోంది. అదే సమయంలో ఈ అప్లికేషన్లు సేమ్ ఫీచర్స్ తో ఒకే ప్రొడక్ట్ కేటగిరీలో లేకపోయనప్పటికీ... గ్లోబల్ జెయింట్స్ తో పోటీపడాల్సి వస్తుంది.

వచ్చే మూడేళ్లు మహా అవకాశాలే..!

స్టార్టప్ ల ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలు వచ్చే మూడేళ్లలో అప్లికేషన్లకు సరికొత్త మార్కెట్ సృష్టి జరిగే అవకాశం ఉంది. అయితే డెవలపర్లు, టెకీలు ఎప్పటికప్పుడు మున్ముందు రానున్న అవాంతరాలను అంచనా వేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి. ఆగుమెంటెడ్ రియాలిటీ, విర్చువల్ రియాలిటీ, బాట్స్ లాంటివి ఇప్పుడు టెక్నాలజిస్టులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఇవే మెయిన్ స్ట్రీమ్ గా మారే అవకాశం ఉంది.

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding Course, where you also get a chance to pitch your business plan to top investors. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India