సంకలనాలు
Telugu

పొట్టనిండా తినండి బరువు తగ్గండి అంటున్న ట్రూ వెయిట్

బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారమే మార్గంసూపర్ ఫుడ్స్‌తో దూసుకుపోతోన్న స్టార్టప్ఎదుగుతున్న ఫిట్‌నెస్ మార్కెట్లో తనదైన మార్క్ఫిట్‌నెస్ సెంటర్ నుంచి సూపర్ ఫుడ్స్ దాకాహాట్ టాపిక్ అవుతోన్న ట్రూవెయిట్ ఫుడ్స్

ashok patnaik
26th May 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

గడిచిన ఐదేళ్లుగా ఫిట్‌నెస్, స్లిమ్మింగ్ రంగం అంతకంతకూ పెరుగుతూ హాట్ టాపిక్‌గా మారుతోంది. గతేడాది ఒక్క స్లిమ్మింగ్ సెగ్మెంటే 35-40 శాతం వృద్ధితో దూసుకుపోయిందంటే నమ్ముతారా ? నగర జనాభా స్లిమ్‌తో పాటు ఫిట్‌గా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయం ఇక్కడ సుస్పష్టం. భారతీయ వెయిట్‌లాస్ మార్కెట్ పెరుగుదలను చూస్తే జనాల ఆలోచన సరళిని ఆకళింపు చేసుకోవచ్చు. 

సోనా బెల్ట్‌లు, ఇతర వెయిట్ లాస్ మెషిన్లు, పిల్స్, బెవరేజీలు మార్కెట్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిపై జనం అంతగా ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి. దీనికి ప్రత్యమ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తున్న అంశం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఇలాంటి వెయిట్ లాస్ పద్దతులకు స్వస్థి చెప్పడం ఇప్పటి ట్రెండ్. ప్రపంచ వ్యాప్తంగా హెల్దీఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ కావడం ఓ ట్రెండ్. ఇదే రకమైన పద్ధతికి భారతీయ జనమూ మారిపోతున్నారు. షార్ట్ కట్‌లో వెయిట్ లాస్ అవుదామనే ఆలోచనను పక్కన పెడుతున్నారు.

image


సరైన పౌష్టికాహారం తీసుకొని బరువు తగ్గంచుకొనే ధోరణి నేటితరంలో కనిపిస్తోంది. ఇదే ఐడియాతో ప్రారంభమైందే ట్రూవెయిట్ (Truweight) స్టార్టప్. విష్ణు శరఫ్, మెఘా మోరేలు దీని వ్యవస్థాపకులు. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే. ఎలాంటి అబద్ధాల్లేకుండా నిజాయితీగా బరువు తగ్గించుకోవడం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడం. ఇక్కడ ఎలాంటి బెల్ట్‌లు, మెషిన్ లు, పిల్స్‌కు ఆస్కారం లేనేలేదు.

ట్రూవెయిట్ సీక్రెట్

ట్రూవెయిట్ విషయానికొస్తే, ఈ దంపతులు ఐడింటిటి పేరుతో మగువల కోసం ఓ ఫిట్నెస్ క్లబ్‌ని నడిపేవారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రెయినింగ్‌ను ఇందులో అమలు చేశారు. ఆడవారి కోసం ప్రత్యేక వర్కవుట్ ఉండేది. రెండేళ్లు దీన్ని నడిపిన తర్వాత వీళ్లొక విషయాన్ని గుర్తించారు. జనం ఫిట్‌నెస్ క్లబ్‌కి వచ్చేది ఫిట్‌గా ఉండేందుకు కాదనీ, కేవలం బరువు తగ్గించుకోవడానికేననే విషయాన్ని తెలుసుకున్నారు.

ట్రూవెయిట్ ప్రాడక్టులు

ట్రూవెయిట్ ప్రాడక్టులు


“తొంబై శాతానికంటే ఎక్కువ మంది మగువలు ఐడింటిటి రావడం వెనకున్న కారణం బరువుని తగ్గించుకోవడమే. జిమ్స్ ఎప్పటికీ అంటే ఫిట్నెస్ క్లబ్స్ మాత్రమే కానీ.. వెయిట్ లాస్ సెంటర్లేమీ కావు. వ్యాయామనేది 20శాతం మాత్రమే బరువు తగ్గేందుకు ఉపయోగపడ్తుంది. మరి మిగిలిన 80శాతం మాటేంటి ? దానికి సమాధానం ఫుడ్ మాత్రమే,” అని ట్రూవెయిట్ కో పౌండర్ మేఘ అంటున్నారు. దీంతో మరో రెండడుగులు ముందుకేసి.. ట్రూవెయిట్ ను తెరపైకి తెచ్చారు ఫౌండర్లు. ట్రూవెయిట్‌ను సూపర్ ఫుడ్స్, ఎడిబుల్ ప్రాడక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసారు.

ఇక వ్యవస్థాపకుల విషయానికొస్తే ..విష్ణు ఐఐఎం అహ్మదాబాద్ నుంచి వచ్చారు. చదువు పూర్తయ్యాక మెకెన్సే, డాయిష్ బ్యాంక్‌తోపాటు కొటాక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో పనిచేశారు. భారత్, చైనాలపై ఓ పుస్తకాన్ని కూడా రాసారు. మెక్మిలన్ దీనికి పబ్లిషర్‌గా వ్యవహరించింది. మేఘ ఎండిఐ గుర్గావ్ నుంచి ఎంబియే పూర్తి చేశారు. బ్యాచిలర్ డిగ్రీ దిల్లీలోని ఎల్ఎస్ఆర్ నుంచి పొందారు. స్కూల్లో చదువుకొనే రోజుల్లో మేఘా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ఎంబియే తర్వాత గోల్డ్‌మెన్ శాక్స్, మెకిన్సేలో పనిచేశారు.

విష్ణు షరాఫ్

విష్ణు షరాఫ్


సూపర్ ఫుడ్ అంటే ఏంటి ?

“న్యూట్రిషనింట్ కలిగి ఉన్న ఫుడ్‌ని సూపర్ ఫుడ్స్ అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది. ఎన్నో రకాలైన సూపర్ ఫుడ్స్‌ను మేం గుర్తించాం. ఇవన్నీ మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో సహకరిస్తాయి. కానీ మనం వీటిని గుర్తించలేకపోతున్నాం - విష్ణు ”

నాసా లెక్కల ప్రకారం ఒక గ్రాము స్పైరులినా అనేది ఒక కేజి కాయగూరలకు సమానం. ఈ ఫుడ్ 25 సూపర్ ఫుడ్‌లతో తయారు చేస్తారు. ఇందులో బార్లీ, అల్ఫల్ఫా, అకాసియన్ గమ్, హెర్బ్స్, ఫొక్స్ టెయిల్ మిల్లెట్‌లు ఇందులో ప్రధానమైనవి. సూపర్ ఫుడ్ కిట్‌లో కొన్ని జూసులు, ఫైబర్లు ఇస్తారు. “7-8 రకాలైన ఆరోగ్యకరమైన స్నాక్స్, మూడురకాల సూపులు, ఒక డ్రింక్, రెండు రకాల పిండి పదార్థాలు , 3-4 రకాల బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. చాలా రకాలైన ప్రయోగాలు చేసిన తర్వాత దీన్ని తయారు చేసాం. ఆరోగ్యవంతంగా, సౌకర్యవంతంగా బరువు తగ్గడం అనేది దీని వెనకున్న అసలు ఉద్దేశం,” అనేది ట్రూవెయిట్ లెక్క.

మేఘా మోరె

మేఘా మోరె


ఆకలితో ఉంటే బరువు ఎప్పటికీ తగ్గదు !

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే. ట్రూ వెయిట్ మీకు ఆకలి కడుపుతో ఉండమని చెప్పదు. ఒక గిన్నెడు కార్న్ ఫ్లేక్స్ తినేసి గడపమని సలహా ఇవ్వదు. ప్రతిదాన్నీ తినాలనే కోరుతుంది. అందులో ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలని చెబుతుంది. అలా అని రోజువారీ తినే దోశ మిక్స్ ఇవ్వలేం కదా. యాభైశాతానికి మించిన ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోనేలా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాడక్ట్‌లో ఉన్న పదార్థాలు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలనుంచి తీసుకొచ్చిన వాటితో తయారు చేశారు. 

డిసెంబర్ 2013లో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 18నెలలకే కంపెనీ వెయ్యిమంది యాక్టివ్ క్లెయింట్స్‌ని సంపాదించుకోగలిగింది. ప్రస్తుతం నెలకి 50లక్షల టర్నోవర్ సాధించగలిగింది. వచ్చే 12 నెలల్లో దేశ వ్యాప్తంగా విస్తరించాలనేది ట్రూవెయిట్ ప్రణాళిక.

ప్రొగ్రామ్‌లో చేరిన కస్టమర్లకు 3 వెసులుబాట్లు ఉన్నాయి

 • కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్- వారానికి సరిపోయే రకం
 • సూపర్ కిట్ - నెలకి సరిపోయే 12 నుంచి 20 రకాల ఫుడ్‌లు
 • మెంటరింగ్ – డైటీషియన్లతో ఏం తినాలి, ఏం తినకూడదు లాంటి సలహాలతో కూడిన పద్దతి

తొందరలోనే ట్రూవెయిట్ మొబైల్ యాప్‌ని ప్రారంభించబోతోంది. దీనిలో కస్టమర్ల డైట్ చార్ట్ అందుబాటులో ఉంచుతారు. దీని చార్జీలు నెలకి 9వేలు, 3 నెలలకు 18వేలుగా ఉన్నాయి. ఆరోగ్య రంగంలో ఓ సంస్థాగత మార్పు తీసుకురాగలిగింది ట్రూవెయిట్. భారతీయులకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను నేర్పించే కార్యక్రమాన్ని ఎంచుకున్న ఈ స్టార్టప్ అందరి ప్రశంసలు పొందుతోంది. పాశ్చాత్య జంక్ ఫుడ్‌లకు అలవాటైన ఇండియన్‌లను మన ఆహారం వైపు తిప్పే ప్రయత్నం చేస్తోంది. కచ్చితమైన లాభాలతో పాటు వినియోగదారులు మన్నలను అందుకుంటోంది.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags