పండుటాకుల కోసం బ్యూటీఫుల్ ఇయర్స్

వృద్ధాప్యం శాపంలా ఎందుకు మారాలి..?జీవితం మొత్తం త్యాగం చేసి ఏకాకిలా బ‌త‌కాలా.. ?

19th Dec 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఆధునిక సమాజంలో ఆప్యాయతలు, అనుబంధాలు కనుమరుగైపోతున్నాయి. మాన‌వ సంబంధాల‌న్నీ ఆర్ధిక సంబంధాలే అవుతున్నాయి. క‌ర్మ‌కాలి ఇంట్లో ఎవ‌రైనా పెద్ద‌వాళ్లుంటే వాళ్ల‌ను చాద‌స్తుల కింద జ‌మ‌క‌ట్టేస్తున్నాం. అంతా మ‌న‌కే తెలుసన్న త‌ల‌బిరుసు త‌నంతో ఉంటున్నాం. పొర‌పాటున ఏదైనా చెప్ప‌బోయినా ప‌ట్టించుకోవ‌డం లేదు. నీకేం తెలుసు అని విసుక్కుంటున్నాం. పెద్ద‌ల మాట చ‌ద్ద‌న్నం మూట అన్న మాట క‌నుమ‌రుగై పోతున్న‌ది. ఇంకా కొంద‌రు ముస‌లివాళ్ల ప‌రిస్థితి మ‌రీ ఘోరం. కనీస మర్యాదకు నోచుకోక, అయినవాళ్ళ దగ్గర విలువ కోల్పోయి ఒంట‌రిగా జీవశ్చవంలా బ‌తుకుతున్నారు. అలాంటి వారు ఏ వీధిలో చూసినా కనబడతారు. ఆర్థికంగా చితికిపోయి ప‌దిరూపాయ‌ల ఆస‌రా కూడా లేని వృద్ధులు లక్షలాది మంది వున్నారు.

వృద్ధాప్యం కారాదు శాపం

వృద్ధాప్యం శాపంలా ఎందుకు మారాలి. జీవితం మొత్తం తమవారి కోసం త్యాగం చేసి ఏకాకిలా బ‌త‌కాలా? ఆల‌నాపాల‌నా చూసేవారు లేక, చావుకోసం ఎదురు చూస్తూ ఉండాలా? మ‌లిసంధ్య‌లో జీవితం వేల వ‌ర్ణాలుగా మారాలి. అందుకోసం మేం ఉన్నామంటూ ముందుకు వస్తున్నాయి స్టార్టప్స్. ఓ వైపు సేవ మరోవైపు వ్యాపరంతో వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నాయి. అలాంటి స్టారప్ కంపెనీయే ‘బ్యూటీఫుల్ ఇయర్స్‌’. జీవితంలో ఆఖరి మజిలీ కూడా అందమైనదేనని, దాన్ని ఆస్వాదించేందుకు ఆసరాగా నిలుస్తామంటోంది.

తమ సంస్థ ఉద్యోగులతో వాల్ది

తమ సంస్థ ఉద్యోగులతో వాల్ది


వాళ్లేం చేశారు పాపం

సినిమాలతో పోలిస్తే నిజ జీవితం వేరు. చాలా సినిమాల్లో పెద్ద వయసు వారిని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూపిస్తూ మంచి క్యారెక్టర్లు ఇస్తుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం పండుటాకుల్ని చాలామంది పట్టించుకోరు. ఏ విషయాల్లోనూ వారి అభిప్రాయాలు అడగరు. మాస్ మీడియా నుంచి అడ్వర్టయిజింగ్ నుంచి -వ్యాపారం వ‌ర‌కు ఏ రంగంలోనైనా యువతదే జోరు. పరిస్థితి చూస్తుంటే వృద్ధులకు ఈ ప్రపంచంలో చోటు లేదేమో అనిపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ (యూఎన్ ఎఫ్ పీఏ), హెల్ప్ ఏజ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఇండియాలో వంద మిలియన్ల మంది వృద్ధులు ఉన్నారట. ఈ సంఖ్య 323 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2050 కల్లా మొత్తం జనాభాలో 20% పెరిగే అవకాశాలున్నాయి.

వృద్ధులకు ఆర్ధికంగా ఆసరా

వృద్ధులకు సేవలందించే స్టార్టప్ లు కూడా వచ్చేశాయి. వారి కోసం సోషల్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయడం, ఇతర సేవలను అందించడం వంటివి చేస్తున్నాయి. గుడ్ హ్యాండ్స్, సీనియర్ షెల్ఫ్, ప్రమతీ కేర్, సీనియర్ వరల్డ్, సిల్వర్ టాకీస్ వంటి స్టార్టప్స్ వృద్ధుల అవసరాలను తీరుస్తూ ఆదాయాన్ని గడిస్తున్నాయి. అయితే ఈ స్టార్టప్స్ ను ఏర్పాటు చేస్తున్నది మాత్రం యువకులే. తమ బంధువులకు ఎదురైన సమస్యల నేపథ్యంలో ఇలాంటి స్టార్టప్స్ ను ఏర్పాటు చేసి సక్సెసవుతున్నారు. వృద్ధుల కోసం సేవా వ్యాపారం చేసేందుకు బెంగళూరులో సన్నాహాలు చేస్తున్నారు 51 ఏళ్ల వ్లాదిమిర్ రుప్పొ. వీలైనంత వరకు వృద్ధులకు సాయమందించి, వారికి మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్టార్టప్‌ను నెలకొల్పారు. వృద్ధులకు అవసరమైన పరికరాలు, కొత్త కొత్త వస్తువులను స్టార్టప్ ద్వారా అందించనున్నారు. ట్రిప్ అడ్వయిజర్, జమాటో మాదిరిగా సీనియర్ కేర్ రంగంలో తమ సంస్థ సత్తా చాటుతుందని వ్లాదీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

బ్యూటీఫుల్ ఇయర్స్‌

సీజనల్ సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటివ్ అయిన వ్లాదికి 30 ఏళ్లకుపైగా అంతర్జాతీయ అనుభవముంది. రష్యాలోని సెయింట్ పీటర్‌్ిబర్గ్‌లో పుట్టి పెరిగిన ఆయన 12 ఏళ్లపాటు ఇజ్రాయెల్ జెరుసలెంలో పనిచేశారు. ఆ తర్వాత బెంగళూరుకు వచ్చారు. బ్రిటీష్‌కు చెందిన ఓ సంస్థను భారత్‌లో ఆయన ఒక్కరే ప్రారంభించారు. ఇప్పుడా సంస్థ ఉద్యోగుల సంఖ్య 2,200కి చేరింది. మొదట్లో ఆరు నెలల కాంట్రాక్ట్‌ మాత్రమే. 16 ఏళ్లుగా ఆ కాంట్రాక్టును పెంచుతూనే ఉన్నారు అని వ్లాది చెప్పారు. 2016 జనవరిలో సిస్కోలో వీపీ ఇంజినీరింగ్ బాధ్యతల నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బ్యూటీఫుల్ ఇయర్స్‌పై దృష్టి సారించనున్నారు.

బ్యూటీఫుల్ ఇయర్స్ టీమ్‌తో వ్లాది

బ్యూటీఫుల్ ఇయర్స్ టీమ్‌తో వ్లాది


ఏది అవ‌స‌ర‌మైతే అది

యూజర్లకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కామర్స్ పోర్టల్ లో ప్రత్యేక సెగ్మెంట్ ద్వారా వ్యాపారం చేయాలని ఆయన భావిస్తున్నారు. సీనియర్ కేర్ ప్రాడక్ట్స్ మాగ్నిఫయింగ్ లెన్స్ ఉన్నటువంటి నెయిల్ కట్టర్, బుక్ హోల్డర్, టాబ్లెట్ కటర్, క్రషర్స్, మోటరైజ్డ్ వీల్‌చైర్స్ వంటి ప్రాడక్ట్స్‌తోపాటు రోగులకు సేవలందించే వారి వివరాలు కూడా అందించనున్నారు. స్థానికంగా తయారైన ప్రాడక్ట్స్ మాత్రమే కాకుండా వృద్ధులకు ఉపయోగపడే వస్తువులను విదేశాల నుంచి దిగుమతి కూడా చేయాలని భావిస్తున్నారు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడేవారి కోసం అగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసులను, మధుమేహం వున్నవారి కోసం ప్రత్యేక షూస్, మంచం మీద ఉండే రోగుల కోసం ప్రత్యేక దుస్తులు కూడా విదేశాల నుంచి తెప్పిస్తాం అంటున్నారు వ్లాది. వృద్ధుల కోసం వస్తువులు కొనుగోలు చేసేవారికి, వారికి అవసరమైన ఇతర సేవల వివరాలను కూడా అందిస్తారు. ‘‘రోగులకు సేవ చేసేవారి వివరాలు, ఫిజియోథెరపిస్టులు, హోమ్ డయాగ్నస్టిక్ సర్వీసెస్, వైద్య పరికరాల సరఫరాదారుల వివరాలను కూడా అందిస్తామనిని సంస్థ తరపున ఉచితంగా సేవ చేసేందుకు ముందుకొచ్చిన పవిత్ర రెడ్డి తెలిపారు. పెద్ద పెద్ద ఆస్పత్రులు, బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీల వద్ద ప్రచారం నిర్వహించి, ఆదాయాన్ని సమకూర్చుకోవాలని వ్లాది ఆలోచన.

గొప్ప మనసు

ప్రస్తుతానికైతే.. తమ కథలను చెప్పి, తోడు కోరుకునే వృద్ధులకు ఉపయోగపడే కమ్యునిటీని ఏర్పాటు చేయడంపైనే వ్లాది దృష్టి పెట్టారు. అలాగే వృద్ధులకు సేవ చేయాలనుకుంటున్నవారికి కూడా వ్లాది అవకాశమివ్వనున్నారు. బ్యూటీఫుల్ ఏజీంగ్ పేరుతో వెబ్‌సైట్‌లో ప్రత్యేక సెగ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. వినడానికి కాస్త వెరైటీగా అనిపిస్తున్నా నిజానికి వృద్ధుల జీవిత కథలు ఎంతో అద్భుతంగా ఉంటాయంటారు వ్లాది. ప్రస్తుతం వ్లాదీ మధుర జ్ఞాపకాలను, తమ అనుభవాలను కథలుగా రాస్తున్నారు.

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం

పెద్దవారి పట్ల భారతీయులు కేరింగ్‌గా ఉంటారన్నది నానుడి. అయితే ఆలనా పాలన లేక అనాథల్లా మారి కన్నుమూస్తున్న వృద్ధుల సంఖ్య కూడా పెరిగిపోతున్నదన్న నివేదికలు కలవర పెడుతున్నాయి. గతంలో పెన్షనర్స్ ప్యారడైజ్‌గా పేరొందిన బెంగళూరు ఇప్పుడు ఉరకలెత్తే యువతకు కేరాఫ్ అడ్రస్. ఐటీ, అనురబంధ రంగాలు విస్తరించడంతో బెంగళూరులో యువకుల సంఖ్య పెరిగిపోతున్నది. ముంబై, ఢిల్లీల్లో కూడా ఇదే పరిస్థితి. అయితే రిటైరవుతున్న మిడిల్ క్లాస్ జనాభా సంఖ్య కూడా తక్కువేమీలేదు. సవాళ్లను మా జనరేషన్ కూడా దీటుగా ఎదుర్కొంటుందని ఇప్పటి స్టార్టప్ తరానికి నిరూపించాలన్నదే నా లక్ష్యం అంటారు వ్లాదిమిర్.


వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తున్న సీనియర్ సిటిజన్స్ కు బ్యూటీఫుల్ ఇయర్స్ ఆసరా ఇవ్వాలని, వ్లాదిమిర్ సంకల్పం నెరవేరాలని యువర్ స్టోరీ కోరుకుంటున్నది.

వెబ్ సైట్

Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India